తెలంగాణ పోరాటంలో మరో మలుపు


Fri,January 31, 2014 12:30 AM

ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీని మెజారిటీ ప్రవర్తనను గీటురాయిగా తీసుకుంటే, రాజ్యాంగమే కాదు, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు ప్రమాదంలో లేదని కాదు, హిందూ మెజారిటీ పేర మైనారిటీలను వేధిస్తూనే ఉన్నారు. అలాగే వెనకబడిన ప్రాంతం కూడా ఆ వేధింపుల మధ్య బతకవలసి వస్తే, బంతిని ఎంత బలంగా కిందికి కొడితే అంతే బలంగా అది తిరిగి ఎగురుతుందన్న ప్రకతి సూత్రాన్ని మరిచిపోకూడదు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాష్ట్రపతి తమ అభిప్రాయం తెలపమని పంపి న బిల్లును మూజువాణీ ద్వారా తిరస్కరించింది. ఈ నిర్ణయం, లేదా ఈ ప్రక్రి య కొన్ని మౌలికమైన ప్రశ్నలను ముందుకు తెస్తున్నది. ఉదార ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని ప్రతినిధుల ద్వారా వ్యక్తీకరిస్తుంది అనేది ఒక భావన. మెజారిటీ అభిప్రాయమే అందరి అభిప్రాయంగా చెలామణి అవుతుంది. కానీ నిజమైన ప్రజాస్వామ్యమంటే బ్రూట్ మెజారిటీ కాదు. ఆ ప్రజాస్వామ్యం లో మైనారిటీల, వెనుకబడిన ప్రజల లేదా ప్రాంతాల హక్కులు ఎలా కాపాడబడుతున్నవన్నది ప్రమాణం. సజీవమైన ప్రజాస్వామ్యంలో బలహీనుడి గొంతు ఎంత బలంగా వినిపిస్తుంది, ఆ గొంతును బలవంతుడు వింటున్నాడా లేదా అన్నది కూడా ప్రధానమే. రాజ్యాంగంలో మైనారిటీలకు హక్కులుంటాయి. మన రాజ్యాంగంలో మతపర మైనారిటీలకు, దళితులకు, గిరిజనులకు ప్రత్యకమైన హక్కులు కల్పించబడ్డాయి. ముస్లింలు లేదా క్రిష్టియన్ల హక్కులను హిం దువులు కాదంటే, అది మెజారిటీ అభిప్రాయం కావ చ్చు, కానీ అది ప్రజాస్వామ్యం కాదు. ఎల్లవేళలా మెజారిటీ అభిప్రాయమే ప్రజాస్వామ్యమంటే అది ఫాసిజంవైపు దారి తీస్తుంది. అలాంటి దుర్మార్గం నుంచి మైనారిటీలను కాపాడడానికే రాజ్యాంగపర రక్షణలు కల్పించబడ్డాయి.

ఈ ప్రమాణం మీదే రాజ్యాంగంలో ఆర్టికల్3 ను చేర్చారు. ఒక రాష్ట్ర విభజన నిజంగా చాలా కీలకమైన నిర్ణయమే. మరి అలాంటి నిర్ణయ అధికారం అసెంబ్లీకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, ఇప్పు డు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాంటి అసెంబ్లీని, ఆంధ్ర ప్రాంత ప్రతినిధుల అహంకారాన్ని రాజ్యాంగసభ అప్పుడే ఊహించింది. ఇలాంటి సంక్షోభం నుంచి వెనకబడిన లేదా చిన్న ప్రాంత ప్రజల హక్కులను కాపాడడానికి, ప్రజాస్వామ్యంలో వెసులుబాటు ఉం డాలనే దూరదష్టితో ఆర్టికల్3ను చేర్చారు. రాజ్యాంగంలో ఈ వెసులుబాటు లేకుంటే ఈ పాటికి హింసాయుత పోరాటాలు మరిన్ని ముందుకు వచ్చేవి. బలహీనుడు లేదా వెనుకబడిన ప్రాంత ఆకాంక్షలను గౌరవించకపోతే ఆ ప్రాంత ప్రజలు ఏం చేయాలి అనే ప్రశ్నకు జవాబు చెప్పవలసి ఉంటుంది.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవడానికి పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ఎందుకు చేపట్టాడు? అప్పటి మద్రాసు అసెంబ్లీకి తమ రాష్ట్ర విభజన పట్ల సముఖత లేదు. స్వయాన ప్రధానమంత్రికే భాషా ప్రయుక్త రాష్ర్టాల పట్ల సుముఖత లేదు. ఆ అభిప్రాయాన్ని మార్చడానికి ఈ నిరాహారదీక్ష జరిగింది. ఆయన మరణం తర్వాత ఆంధ్ర ప్రాంతంలో విపరీతమైన హింస చెలరేగింది. అంత ఒత్తిడి పెడితే తప్ప ఆంధ్ర రాష్ట్రం సాకారం కాలేదు. అప్పుడు ఆంధ్రులు మెజారిటీ అభిప్రాయాన్ని ఎం దుకు గౌరవించ లేదు! అంటే తాము తమిళుల ఆధిపత్యంలో ఉండడానికి అంగీకరించలేదు. అలాగే సాపేక్షంగా అభివద్ధి చెందిన ఒక పెద్ద ప్రాంతం, ఒక చిన్న ప్రాంతమైన తెలంగాణను కలుపుకున్నప్పుడు కొన్ని షరతులు పెట్టారు. మెజారిటీ అభిప్రాయమే ప్రజాస్వామ్యమైతే హామీలు ఎందుకు? అలాగే ఆ హామీలను తమ మెజారిటీ బలం వల్ల ఉల్లంఘించ డం వల్ల తెలంగాణ ఉద్యమం మళ్లీ రాజుకున్నది.

ఒక అభివద్ధి చెందిన ప్రాంతంలోని పెట్టుబడిదారు లు ఏ హక్కులను ఖాతరు చేయకుండా వెనకబడిన ప్రాంతంలోని వనరులను, నీళ్లను, భూములను అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ఆంధ్ర ప్రాంత ప్రజలందరి మద్దతు ఉందా? ప్రజా ప్రతినిధి తన స్వార్థం కోసం మెజారిటీ అనే మిషను ఉపయోగించుకోవచ్చా? ప్రతినిధులు విపరీతంగా సంపద కూడబెట్టుకుంటూ ఉంటే ప్రజాస్వామ్యం దీన్ని భరించాలా? నిజానికి నిస్వార్థపరులైతే రాజకీయ నాయకులు సమష్టి ప్రయోజనాలకు నిలబడితేనే అతను ప్రతినిధి అనేది సైద్ధాంతిక భావన లేదా భ్రాంతి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రపతి పంపిన బిల్లును తిరస్కరించిందని అంటున్నారు. ఇది నిజమేనా? రాష్ట్రపతి అడిగింది ఇదేనా? లేక అసెంబ్లీ అభిప్రాయమేమిటనా? రాజ్యాంగం ఏం అంటున్నది? అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోండి అంటున్నది. రాష్ట్ర అసెం బ్లీ అభిప్రాయమేమిటి? ఏకాభిప్రాయం లేదు. తీవ్రమైన అభిప్రాయ బేధాలు చర్చ సందర్భంలో స్పష్టం గా బయటపడ్డాయి. అంటే అసెంబ్లీలో తీవ్ర అభిప్రాయబేధాలున్నాయి అని పంపాలే కాని, బిల్లును తిరస్కరించారు అనేది చట్టపరంగా ఒప్పిదం కాదు. అది నిజం కూడా కాదు. దీనికి బ్రూట్ మెజారిటీ అని ప్రజాస్వామ్య సిద్ధాంతం సూత్రీకరణ చేసింది.

ఆంధ్ర ప్రాంత నాయకులు మొదటి నుంచి దేశం ఒకవైపు అయితే వాళ్లొకవైపు. దేశం స్వతంత్ర పోరాటంలో ఉంటే, భాషా రాష్ర్టాల ప్రస్తావన తెచ్చారు. భాషా రాష్ట్రం ఇచ్చాక విశాలాంధ్ర అన్నారు. విశాలాంధ్ర అన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీ కూడా కీలకపాత్ర నిర్వహించింది.అలా నిర్వహించిన పార్టీ దాదాపు నామరూపాలు లేకుండా పోయింది. దాం తో సీమాంధ్ర పాలకులు తమ దోపిడీని కొనసాగించారు. దేశంలో స్వాతంత్య్రం తర్వాత బోలెడన్ని కొత్త రాష్ర్టాలు వెలిశాయి. అవన్నీ కూడా ఏదో కార ణం వల్ల కన్‌సెన్‌సెస్ ద్వారా ఏర్పడ్డాయి. అన్నింటికి భిన్నంగా ఇప్పుడు సమైక్యం ముసుగులో ఆం ధ్ర అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదీ ఒక ప్రత్యేకతే.

సమైక్యత రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయమా? అయి తే రాబోయే కాలంలో ఇదే ఒక ప్రమాణం అయితే ఇక చిన్న ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాలు ఎంత ఆధిపత్యాన్ని అయినా సహించాలి. పెద్ద ప్రాంత దయాదాక్షిణ్యాల మీద బతకాలి. అన్యాయం జరిగినా, దాన్ని ప్రశ్నించినా, మాకు మెజారిటీ ఉంది అని అంటే అది ప్రజాస్వామ్యమేనా? ఈరోజు రాష్ట్ర అసెంబ్లీని మెజారిటీ ప్రవర్తనను గీటురాయిగా తీసుకుంటే, రాజ్యాంగమే కాదు, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు ప్రమాదంలో లేదని కాదు, హిందూ మెజారిటీ పేర మైనారిటీలను వేధిస్తూనే ఉన్నారు. అలాగే వెనకబడిన ప్రాం తం కూడా ఆ వేధింపుల మధ్య బతకవలసి వస్తే, బంతిని ఎంత బలంగా కిందికి కొడితే అంతే బలం గా అది తిరిగి ఎగురుతుందన్న ప్రకతి సూత్రాన్ని మరిచిపోకూడదు.

318

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల