ముఖ్యమంత్రి వాదనలు -వాస్తవాలు


Thu,January 30, 2014 12:32 AM

రాష్ర్టాల్లో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి జరగని పరిస్థితి ఉంటుంది. ఆ రాష్ర్టాలు చీకట్లో మగ్గుతున్నా యా? కేంద్రం కరెంటు ఇవ్వడం లేదా? అయినా మీ పీడ విరగడైనంక విద్యుత్ విషయంలో ఏం చేయాలో ? ఎలా ఉత్పత్తి పెంచుకోవాలో, అవసరాలు ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు. మాకు సమగ్రమైన విద్యుత్ ఉత్పత్తి విధానం అవలంభించే శక్తి, చిత్తశుద్ధి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై ముఖ్యమంత్రి వాదనల్లో విభజనపై వ్యతిరేకత కన్నా, తెలంగాణ ప్రాంతంపై కసి ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమయింది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే ఎక్కువగా నష్టం కలుగుతుందని, సమై క్య రాష్ట్రం ఏర్పడినంకనే తెలంగాణ ప్రాంతంలో సాగుభూమి పెరిగిందని చెప్పుకొచ్చారు. విభజన జరిగితే తెలంగాణలో విద్యుత్, నీటి పారుదల తదితర రంగాల్లో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని వాదించారు. అంకెల గారడీతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చెప్పినవన్నీ అబద్ధాలనీ, నిరాధార వాదనలనీ, ఊహాజనిత ఆందోళనలనీ నిరూపించవచ్చు. నిజానికి ముఖ్యమంత్రి ఇలాంటి తలాతోక లేని వాదనలు చేసినప్పటికీ అది తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకం కాదు. అయినప్పటికీ అటు సీమాంధ్ర ప్రజలకు సీఎం చెప్పినవి అబద్ధాలని తెలియడం కోసం, తెలంగాణ ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వడం కోసం నేను ఈ విషయాలను మీ ముందుంచుతున్నాను.

సింగరేణి బొగ్గు: సింగరేణి బొగ్గును ఒక్క టన్ను కూడా సీమాంధ్రకు తరలించలేదని ముఖ్యమంత్రి వాదించారు. కానీ నిజానికి ప్రతీ ఏటా విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్(వీటీపీఎస్)కు, కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టీపీఎస్)కు లక్షల టన్నుల బొగ్గు సరఫరా అవుతూనే ఉంది. 2012-13 సంవత్సరంలో వీటీపీఎస్‌కు 54లక్షల 61వేల టన్నుల బొగ్గు పోయింది. 2013-14లో అదే వీటీపీఎస్‌కు 39 లక్షల 60 వేల టన్నుల బొగ్గు సరఫరా అయింది. ఇక ఆర్టీపీఎస్‌కు ఒక్క ఈ ఏడాదిలోనే పది లక్షల 73 వేల టన్నుల బొగ్గు పోయింది. ఇలా ప్రతీ ఏడాది సింగరేణి నుంచి సీమాంధ్రకు బొగ్గు సరఫరా అవుతూనే ఉంది. నిజానికి సీమాంధ్ర ప్రాజెక్టులకు సింగరేణి కేటాయింపులు లేవు. వీటీపీఎస్, ఆర్టీపీఎస్‌లకు కావాల్సిన బొగ్గును ఒరిస్సాలోని తాల్చేర్ నుంచి తెచ్చుకోవాలి. వీటీపీఎస్‌కు తాల్చేర్ నుంచి రెండేళ్లలో దాదాపు 152లక్షల టన్ను ల కేటాయింపులున్నప్పటికీ తెచ్చుకున్నది మాత్రం కేవలం 36 లక్షల టన్నులు. కానీ సింగరేణిలో ఒక్క టన్ను కేటాయింపు లేకున్నా దోచుకుపోయింది మాత్రం 94లక్షల టన్నులు.

పంపుసెట్ల వ్యవసాయం అదష్టమా?

సీఎం మాటలు ఎంత వింతగా ఉంటాయంటే దురదష్టాన్ని కూడా అదష్టమని చెప్పే అతి తెలివి ఆయన సొంతం. పంపుసెట్లతోని వ్యవసాయం చేసుకోవడం కూడా అదష్టమేనా? కాలువల ద్వారా సీమాంధ్ర రైతులు రెండుమూడు పంటలు పండించుకుంటరు. అదే తెలంగాణలో ఒక్కపంటను పంపుసెట్ల ద్వారా పండించుకోవాలి. ప్రాజెక్టులు కట్టి, కాల్వలు తవ్వి, కాలు అడ్డం పెడితే ఆగే నీళ్ళు, కాలు తీస్తే పారే నీళ్లు అనే విధంగా మీ వ్యవసాయం సాగుతది. మొత్తం ప్రభుత్వ ఖర్చుతో నిర్మితమైన ప్రాజెక్టుల నీళ్లతో వ్యవసాయం చేసి ఎకరానికి రెండొందలు మాత్రమే మీరు రైతుల నుంచి వసూ లు చేస్తారు. కానీ తెలంగాణలో రైతులు సొంత ఖర్చులతోనే బావులు తవ్వి, బోరువేసి, మోటార్లు పెట్టుకుని ఒక్కొక్కరు దాదాపు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి అర్థరాత్రి, అపరాత్రి అని చూడకుండా మీరిచ్చే రెండు మూడు గంటల కరెంటు కోసం సంసారానికి దూరమై సాగు చేయాలి. మీ లెక్కల ప్రకారమే మా రైతులు నీళ్లకోసం 17 లక్షల మంది తలా రెండు లక్షల చొప్పున 34 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఎన్ని ప్రాజెక్టుల వ్యయానికి సమానమో మీరే లెక్కచెప్పాలి. ఇది తెలంగాణ రైతుల అదష్టమని, తెలంగాణలో సాగు పెరిగిందని, దానికి కారణం మేమే అని చెప్పుకుంటే ఏమనాలి?

తెలంగాణకు విద్యుత్ కొరత ?
బిల్లును సీఎం సరిగా చదివినట్లు లేడు.రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు కరెంటు కష్టాలు వస్తాయని, విద్యుత్ లోటు నలభై నుంచి యాభై శాతం ఉంటుందని చెబుతున్నాడు! ఇది పచ్చి అబద్ధం. విద్యుత్ విషయంలో ప్రస్తుత కేటాయింపులే కొనసాగుతాయని చెప్పారు. అంటే ఏ ప్రాంతంలో ఎంత ఉత్పత్తి జరిగినా, కేటాయింపులు మాత్రం ప్రస్తుతం ఏ డిస్కమ్ పరిధిలో ఎంత ఉన్నాయో అవే కొనసాగుతాయి. విద్యుత్ కేటాయింపులు, సరఫరా అంతా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి రేపు తెలంగాణ ఏర్పడినంక కూడా అలాగే ఉంటుంది. ఈ విషయంలో సీఎం మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం లేదు. మేము భవిష్యత్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీరు, బొగ్గు లాంటి వనరులన్నీ తెలంగాణలో ఉంటే, తెలంగాణలో విద్యుత్ కొరత ఉంటుంది! ఏ వనరూ లేని సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉంటుంది. ఇదెలా సాధ్యం? తెలంగాణలో నీరుంది. సింగరేణి బొగ్గుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి మాత్రం ఎక్కువగా సీమాంధ్రలో జరుగుతున్నది. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడితే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి జరిగేది. అలా కాకుండా సీమాంధ్రలో ఉత్పత్తి కేం ద్రాలు పెట్టడం వల్ల బొగ్గును తెలంగాణ నుంచి తరలించడానికి రవాణా వ్యయం, సీమాంధ్ర నుంచి కరెంటును తెలంగాణకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు, మళ్లీ మధ్యలో సరఫరాలో అయ్యే నష్టం.. ఇలా అన్నీ నష్టాలే. అయినా తెలంగాణలో ప్రాజెక్టు లు పెట్టరు. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు పెడితే, ఇక్కడి యువకులకు ఉపాధి అవకాశాలొస్తాయి. ఇక్కడి గ్రామాలు, పట్టణాలు అభివద్ధి చెందుతాయి. అదే సీమాంధ్ర లో పెట్టుకుంటే అక్కడి వారికి మేలు కలుగుతుంది. ఇదొక్కటే కారణం తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టకపోవడానికి. థర్మల్ పవర్ స్టేషన్ల పరిస్థితి అలా ఉంటే, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల విషయంలో మరో వివక్ష. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 2000 సంవత్సరంలోనే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా నేదుమూరు విద్యుత్ ప్లాంటుకు అన్ని అనుమతులు వచ్చి,

2007లోనే విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమయిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఈ రెండు ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు జరపలేదు. ప్రభుత్వరంగ సంస్థల ప్లాంట్లకు గ్యాస్‌కొరత అని చెప్పే సీమాంధ్ర పాలకులు 2003 నుంచి వచ్చిన ప్రైవేటు గ్యాసు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు మాత్రం గ్యాస్ కేటాయించి జివికె, కోనసీమ, గౌతమి, వేమగిరి లాంటి సీమాంధ్ర ప్రాజెక్టులకు లాభాలు పంచారు. చివరికి 2009లో కూడా సీమాంధ్రలోని మర్చంట్ ప్లాంట్స్‌కు గ్యాస్ కావాలని ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.ల్యాంకో ఎక్స్‌టెన్షన్ ప్లాం టుకు, వేమగిరి ఎక్స్‌టెన్షన్ ప్లాంటుకు గ్యాస్ కోసం ప్రభుత్వమే చొరవ చూపిస్తోంది. కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నది. కానీ తెలంగాణలోని ప్రభు త్వ రంగ సంస్థలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వమే ఉత్పత్తి చేసే అవకాశాలను వదులుకుని ల్యాం కో లాంటి సంస్థల నుంచి పది రూపాయలకు యూనిట్ చొప్పున కొని వాటి యజమానులకు లాభం తెచ్చిపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమైపోయింది. తెలంగాణలో విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నామని చెబుతున్నారు సీఎం. ఇక్కడ పంపుసెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాయితీల భారం సమైక్యాంధ్ర ప్రదేశ్ మోస్తున్నదని కూడా చెబుతున్నాడు. తెలంగాణలో ప్రాజెక్టులు కడితే ఒక్కో యూనిట్‌కు మూడు నాలుగు రూపాయల వ్యయం తగ్గుతుంది. దాని వల్ల సబ్సిడీల భారం కూడా తగ్గుతుంది. అయినా మాకు కాలువల నీళ్లు ఇవ్వమంటే ఇవ్వకుండా, మా ప్రాజెక్టులన్నీ ఎండబెట్టి ముష్టి మూడు గంటల కరెంటు ఇస్తూ సబ్సిడీలు ఇస్తున్నమని చెబుతారా? తెలంగాణ రైతు ఒక్కో పంపుసెట్‌కు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని వ్యవసాయం చేయాల్సిన ఖర్మ ఏందని మేం బాధ పడుతుంటే, మాకు సబ్సిడీలు ఇస్తున్నమని చెబుతారేంటి? మాకు కరెంటు అవసరం లేదు. నీళ్లివ్వండి చాలు.

ఏడు గంటల విద్యుత్ ఏదీ?
మాట్లాడితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటరు. ఎన్ని గంట లు ఇచ్చిండ్లు. లెక్కలు తీయండి. తెలంగాణలో ఒక్క ట్రాన్స్‌ఫారమ్ కింద కూడా ఏడు గంటల కరెంటు రావట్లేదని గత ఏడాది మీ వెబ్‌సైట్లలోనే పెట్టిన లెక్కలు తీసి ఆందోళన చేసినం. అప్పుడు మీరేం చేసిండ్లు. కచ్చితంగా ఏడు గంటలు ఇస్తమని హామీ ఇచ్చిండ్లు. కానీ ఏమి చేసిండ్లు. ఏడు గంటల కరెం టు ఇవ్వలేదు. కరెంటు సరఫరా వివరాలను వెబ్ సైట్లలో పెట్టడం మానేశారు. నేటికీ తెలంగాణలో ఎక్కడా ఏడు గంటల కరెంటు ఇవ్వలేదు. అదే సీమాంధ్రలో 90శాతం ట్రాన్స్‌ఫార్మర్లకు ఏడు గంట ల విద్యుత్ సరఫరా అవుతున్నది. చెప్పండి ఉచిత విద్యుత్ పథకం ఎవరికి ఉపయోగపడుతోంది.? ఎవ రి పేరు చెప్పి ఎవరు బాగుపడుతున్నరు?

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందని, ఇలాంటి పరిస్థితిలో విద్యుత్ ఉత్పత్తి కష్టమని ముఖ్యమంత్రి చెబుతున్నారు. విభజన జరిగితేనే బొగ్గు కొరత ఏర్పడతదా? సమైక్యంగా ఉంటే ఈ సీఎం ఎక్కడి నుంచి బొగ్గును తీసుకొస్తడు. వేరే దేశాలల్ల నుంచి తట్టలల్ల మోసుకొస్తడా? బొగ్గు కొరత మాకెందుకుంటది. దక్షిణ భారతదేశంలోనే బొగ్గు దొరికే ఏకైక ప్రాంతం సింగరేణి. సింగరేణిలో రేపు తెలంగాణ రాష్ర్టానికి 51 శాతం వాటా ఉంటది. దాని ప్రకారం మాకు కేటాయింపులు కోరతం. వనరులున్న రాష్ట్రం కాబట్టి కేం ద్రం దగ్గర పోరాడి మాకు కావాల్సిన విద్యుత్ కేటాయింపులు చేయించుకుంటం. అయినా మా బాధలు మేము పడతం. వనరులే లేని రాష్ర్టాల్లో కూడా విద్యు త్ పుష్కలంగా ఉంటే, వనరులున్న మాకు రంది ఎందుకు? మాపై మీకు కపట ప్రేమ ఎందుకు?

అసలు రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడడానికి, చాలినంత విద్యుత్తును ఇతర రాష్ర్టాల నుంచి పొందలేకపోవడానికి ఇప్పటి వరకు ఏలిన సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణం కాదా? ఉత్తర భారతదేశం నుంచి కారిడార్ నిర్మించుకోవాలనే సోయి ఉందా? అదే సోలాపూర్-రాయచూర్ కారిడార్ నిర్మించుకుని ఆ రాష్ర్టాలు విద్యుత్ పొందతున్నాయి. మరోవైపు తమిళనాడు కూడా కారిడార్ ఏర్పరుచుకున్నది. ఆ ముందు చూపుభశద్ధ పాలకులకు లేకుండా పోయిం ది. ప్రభుత్వం నుంచి వచ్చే విద్యుత్ కోసం ప్రయ త్నం చేయకపోవడం వెనుక ప్రైవేటు ప్లాంట్ల యజమానుల ప్రభావం ఉన్నది. సర్కారు సొమ్మును లగడపాటి లాంటి రాజకీయ నాయకులు నడిపే ల్యాంకో సంస్థలకు దోచి పెట్టడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహిస్తున్నది. కొన్ని ప్రాంతాలు, రాష్ర్టాల్లో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి జరగని పరిస్థితి ఉంటుంది. ఆ రాష్ర్టాలు చీకట్లో మగ్గుతున్నా యా? కేంద్రం కరెంటు ఇవ్వడం లేదా? అయినా మీ పీడ విరగడైనంక విద్యుత్ విషయంలో ఏం చేయా లో ? ఎలా ఉత్పత్తి పెంచుకోవాలో, అవసరాలు ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు. మాకు సమగ్రమైన విద్యుత్ ఉత్పత్తి విధానం అవలంభించే శక్తి, చిత్తశుద్ధి ఉన్నాయి.
(రచయిత: టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉపనేత)
[email protected]

516

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల