ఆదివాసీలపై యుద్ధం ఎందుకు?


Thu,January 2, 2014 01:14 AM

ఖనిజ వనరులను దానం చేయడానికి గిరిజనులను బలిపశువులను చేయడాన్ని ఎవరు క్షమించినా, చరిత్ర క్షమించదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందనుకుంటున్న కాంగ్రెస్, స్వాతంవూత్యాన్ని దానం చేసి తన చరిత్ర ముగింపు వాక్యాలను తానే రాసుకుంటున్నది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకునే కార్యక్షికమంలో సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు నిండిపోయి, 2014లో ఏదో జరగబోతుందని, జరగాలని మధ్యతరగతి కోరిక విస్తృతంగా కనిపించింది. ఇక మన రాష్ట్రం వరకు రెండు ప్రాంతాల మధ్య అగాధాన్ని పెంచే కార్యక్షికమంలో మన రాజకీయ పార్టీలు నిమగ్నమైన వేళ, తెలుగు భాషలో చానళ్లు తక్కువైనట్లు మరో కొత్త చానల్ ప్రారంభం. ప్రారంభ చర్చ లో మీడియా మీద ఉదయమే నిష్కర్ష చర్చలో పాల్గొ ని ఇంటికి వచ్చి ఇంగ్లిషు చానల్స్ తెరుస్తూనే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిషా, బీహార్, మహారాష్ట్ర గిరిజన ప్రాంతాల్లోకి ఒకేసారి 40 వేల పోలీసు బలగాలు దాడి చేయడానికి, నక్సలైట్లను ‘ఏరి పారేయడానికి’ చర్య ప్రారంభమైనట్లుగా వార్త. దీనిమీద ఎన్ని చాన ళ్లు ఉన్నా ఇప్పుడు పెద్ద చర్చ జరపకపోవచ్చు.

ఆ మేరకు హోం మినిస్ట్రీ అలిఖిత ఆదేశాలు ఇచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎందుకు ఇంత అకస్మాత్తుగా బలగాల తరలింపు జరుగుతున్నదో వివరించ డం అవసరం. నాలుగు రోజుల క్రితం నక్సలైట్లంద రూ లొంగిపోవడానికి నాలుగు రోజుల గడువు విధిం చి, గడువు ముగిసిందని ప్రకటించి 2014 నూతన సంవత్సర కానుకగా యుద్ధం ప్రారంభమైనట్లు ప్రకటన.ఈ చర్య ప్రారంభమైన సందర్భం విచివూతమైంది. ఒకవైపు నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. నరేంవూదమోడీ దేశాన్ని రక్షించడానికి అవతార రూపంలో ప్రవేశించాడు. మోడీ లేక రాహు ల్ గాంధీ అనేది ఒక చర్చ. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగాక గెలిచిన అభ్యర్థులు తమ పార్టీ లీడర్‌ను ఎన్నుకుంటే మెజారిటీ పార్టీ లీడర్‌ను రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.

ఇవేవీ పట్టనట్టు ఇది అమెరికా అధ్యక్ష పదవి పోటీలాగా ప్రధాని అభ్యర్థి ప్రకటన జరగడం అర్థరహితం. అయితే అమెరికాను కాపీ కొట్టడం మనకు అలవాటైంది. మన్మోహన్ దాదాపు దశాబ్ద కాలం ప్రధానిగా ఉన్నా ఆయన ఎవరో, ఆయన ఆలోచనలేమిటో సాధారణ ప్రజలకు తెలియదు. ఈ పదేళ్లలో ఆయన ఎక్కడా లక్షలమంది ప్రజలనుద్దేశించి మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రధాని పదవిని నిర్వీర్యం చేసి, ఇప్పుడు ఈ పదవికి ఒక ‘బలీయుడైన’ అభ్యర్థి కావాలని అంటున్నారు. ఆ బలీయుడు నరేంవూదమోడీ అవుతాడు కానీ రాహుల్‌గాంధీ కావడం ఎలా సాధ్యం? నిజానికి ఇప్పుడు బీజేపీ ప్రమాణాలను, చర్చా అంశాలను నిర్దేశించే స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్‌లో ఉంది. మిగతా పార్టీలు ప్రేక్షకులుగా మిగిలారు.
ఇప్పటి రాజకీయ వాతావరణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవేశంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. దేశ భవిష్యత్తు మొత్తంగా ఒక గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు, ఎన్నికలకు కేవలం నాలుగు నెలల గడు వు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అతి బలహీనంగా ఉన్న సందర్భంలో 40 వేల పోలీసు బలగాలను గిరిజన ప్రాంతాలకు తరలించాలనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

బలహీన ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తామేం బలహీనులం కాదని, రేపు మోడీ చేయబోయే పనిని తాము కూడా చేయగలమని, సామ్రాజ్యవాదశక్తులకు అశ్వాసాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం.కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోవడానికి కారణాలను అంతర్గతంగా చర్చించుకున్నప్పుడు నూతన ఆర్థిక విధాన ఛాందసులు, ఆర్థిక సంస్కరణలను వేగవంతంగా చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యామని వాదిస్తే, ఇది నిజమైన కారణం కాద ని, ఆర్థిక సంస్కరణలలో భాగంగా, పెరిగిన పేదరికము, నిరుద్యోగము, ధరల పెరుగుదల ఓటమికి కారణమని ఆలోచించేవాడు కాంగ్రెస్‌లో లేకపోవ డం ఆ పార్టీ విషాదం. లేకుంటే ఎన్నికల్లో ఓడిపోయి న మరునాడే డీజిల్ ధర పెంచడమే కాక మూడునెలల్లో అంటే ఎన్నికలకు వెళ్లే లోపల డీజిల్ మీద ప్రభుత్వ నియంవూతణ రద్దు చేస్తామని మొయిలీ ప్రకటించడం వింతలలో వింత. అయినా ఆత్మహత్య చేసుకుందామనుకున్న పార్టీని ఎవ్వడూ రక్షించలేడు.
ఎన్నికల్లో ఓడిపోవడానికి వృద్ధి రేటు పడిపోవడం అలాగే ద్రవ్యలోటు తగ్గించడం అనే రెండు అతి మూర్ఖ కారణాలను కూడా చూపిస్తున్నారు.

ఇవి రెండు ఆర్థిక వ్యవస్థ ‘భ్రాంతుల’లో భాగం. ఈ రెండు కూడా ప్రజల సంక్షేమం దృష్ట్యా అర్థంలేని ఆలోచనలు. ఈ రెండు ‘సమస్యలను’ ఎదుర్కొనడానికి చిదంబరం గ్రామీణ అభివృద్ధి, ఉన్నత విద్య గ్రాంటులను విపరీతంగా తగ్గించాడు. గ్రామీణాభివృద్ధి మంత్రి కొంచెం మొత్తుకున్నా ఆయన మాట ఎవరూ వినడం లేదు. ఎక్కువగా అల్లరి చేస్తే ఆ శాఖ ను మొయిలీకి ఇచ్చేస్తారు. ఉన్నత విద్యకు గ్రాంట్లు తగ్గించి, యూజీసీ నిధుల నుంచి 25 కోట్ల నిధులు తీసుకొని ‘రాజీవ్ ఉన్నత విద్యా అభియాన్’ లాంటి పథకం పెట్టి విశ్వవిద్యాలయాలకు గ్రాంటులు పెంచబోతున్నాం అని ప్రకటించి మోసం చేస్తున్నారు. ఈ కొత్త పథక నిర్వహణలో ప్రపంచ బ్యాంకు సలహాదారును చేర్చారు. మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఈ గ్రాంటుల గురించి ప్రచారం జరుగుతున్నది.


ఇవన్నీకాక ఇక మిగిలింది ‘సహజ వనరుల దోపి డీ’. ఖనిజ సంపదను సరాసరి బహుళజాతి కంపెనీలకు అమ్ముకుంటే వృద్ధిరేటు పెరుగుతుందని, ద్రవ్యలోటు తగ్గుతుందని భ్రమించి, దీనికి అడ్డంగా నిలబడ్డ గిరిజనులను, వాళ్ల పోరాటాలకు మద్దతు ఇస్తు న్న మావోయిస్టులను ఏరిపారేస్తే తప్ప విలువైన ఖనిజ వనరులను తమకు ఇష్టమైన బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయలేరు. ఈ నిర్ణయంలో భాగంగా, పర్యావరణ నియమాలను గాలికి వదిలి వేయాలని ఎక్కడో జయంతి నటరాజన్ అడ్డం వస్తుందని ఆమెను ఏరిపారేయడానికి పోలీసులను పంపలేదు. కానీ తీసివేశారు. ఇక శిఖండి పాత్ర నిర్వహించడానికి మనకు మొయిలీ అనే మంత్రి ఉన్నా డు. అంబానీ కోరికను తీర్చకపోతే జైపాల్‌డ్డిని తప్పించి మొయిలీకి ఆ బాధ్యత అప్పచెబితే, ఒక నెలరోజుల్లో రిలయన్స్‌కు ఏం కావాలో దాన్ని నిసిగ్గుగా నెరవేర్చాడు. ఇప్పుడు పర్యావరణశాఖను మొయిలీకి అప్పజెప్పారు. అప్పజెప్పిన మరునాడే రెండులక్షల కోట్ల లావాదేవీలను, పర్యావరణ నియమాలను కాదని అనుమతించాడు.

ఎంత సమర్థవంతమైన మంత్రి ఆయన!
చివరికి మిగిలింది ఆదివాసీలు, మావోయిస్టు లు. వీరిద్దరూ కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు. వీరిని తొలగించడానికి సరాసరి పోలీసు బలగాలను, అవసరమైతే సైన్యాన్ని పంపి, అదుపులో పెట్టి బహుళజాతి కంపెనీలను రాచమర్యాదలతో తీసుకెళ్లి, బంగారు పళ్లెంలో దేశ ఖనిజాలను అప్పజెప్పి వాళ్ళు అంగీకరించినందుకు వాళ్ల కాళ్లకు వందనాలు చేయనున్నారు. ఇది మనదేశంలో సంప్రదాయమే. బ్రాహ్మణుడికి అన్నీ సమర్పించుకుని ఆయన వాటిని అంగీకరించినందుకు కృతజ్ఞులుగా ఉండడం ఎంత విచిత్రం! అందుకే హిందూ మత భావవ్యాప్తి జరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తే బహుళజాతి కంపెనీల కల నెరవేరినట్టే. ఖనిజ వనరులను దానం చేయడానికి గిరిజనులను బలిపశువులను చేయడాన్ని ఎవరు క్షమించినా, చరిత్ర క్షమించదు. దేశానికి స్వాతం త్య్రం తెచ్చిందనుకుంటున్న కాంగ్రెస్, స్వాతంవూత్యా న్ని దానం చేసి తన చరిత్ర ముగింపు వాక్యాలను తానే రాసుకుంటున్నది.

270

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల