ఎన్నికల ఫలితాలు: రూపం-సారం


Thu,December 12, 2013 01:05 AM

ఎన్నికకు ఎన్నికకు మధ్య తేడా ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ప్రత్యక్ష చర్య కొనసాగించాలి. తమ జీవితాలు మారడానికి, ఎన్నికల సారాన్ని మార్చడానికి ప్రజల నిరంతర ఉద్యమాలు ఒక్కటే ఇప్పుడున్న ప్రత్యామ్నాయం.

ఉదార ప్రజాస్వామ్యవ్యవస్థకు ఎన్నికలు ప్రాణాధారం. ఎన్నికలే ప్రజాస్వామ్యంగా, ప్రజాస్వామ్యమే ఎన్నికలుగా భావించేలా పాలకులు ప్రజలను నమ్మించగలిగారు. ప్రజల చైతన్యస్థాయి ముందుకు పోకుండా ఎన్నికల పరిమితులు పూర్తిగా అవగాహనకు రావు. ఇప్పుడున్న చైతన్యస్థాయి ప్రజ లు దాటితే ఎన్నికలను ఎలా ఛిద్రం చేయాలో పాలకులు ఆలోచిస్తూనే ఉంటారు. ఎన్నికలలో పాలకులు ఏ ఫలితాలు రావాలంటే, ఆ ఫలితాలను రాబట్టుకోగలుగుతున్నారు. దాదాపు 1980ల నుంచి ఎన్నికల మ్యాజిక్ డబ్బాల్లో నుంచి ఏ ఫలితం కావాలంటే దాదాపు అదే వచ్చింది.

1980లో ఇందిరాగాంధీ రెండవసారి గెలిచిన తర్వాత ఆమె పూర్తిగా సంపన్ను ల (మద్దతు)భాషలో మాట్లాడింది. రాజీవ్‌గాంధీ పూర్తిగా కార్పొరేట్ మనిషయ్యాడు. తర్వాత బీజేపీ ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లింది.ఆ తర్వాత 2004లో తమకు పూర్తి మద్దతు ఇచ్చి తమ ఏజెంట్లుగా ప్రవర్తించే మన్మోహన్‌సింగ్, అహ్లూవాలియా, చిదంబరం, కపిల్‌సిబల్, కమల్‌నాథ్‌లను ఏ స్థానాల్లో కావాలో ఆయా స్థానాల్లో పెట్టించుకోగలిగాడు. వీళ్లల్లో ఎవరికి ప్రజా రాజకీయాల్లో వేళ్లు లేవు. ఎవ్వరూ ప్రజలను సమీకరించగలవారు కారు. వీళ్లు ప్రజాజీవనం నుంచి ఎదగలేదు. వీరు దశాబ్ద కాలం గా ప్రజావ్యతిరేక రాజకీయాలు చేశారు. అంతర్జాతీ య పెట్టుబడి ఏ నిర్ణయం తీసుకోమంటే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నా డీజిల్ ధరలు పెంచమంటే పెంచారు.

ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోలేదు. ద్రవ్యలోటు పేరు మీద ఉన్నత విద్యకు, ఇతర సంక్షేమ కార్యక్షికమాల కు నిధులను తగ్గించారు. మరణశయ్య మీద తమ పార్టీ ఉందని తెలిసికూడా విషపు గుళికలు మింగు తామని అంటున్నారు. ప్రపంచబ్యాంకుపజల మధ్య.. బ్యాంకు మాటలే విన్నారు. ప్రజలు చెంపదెబ్బ కొట్టినా.., ప్రపంచీకరణను ఎంతవేగంగా చేయాలో అంతవేగంగా చెయ్యలేకపోయామని వాపోతున్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీని ఆధునీకరిస్తామని, సాంప్రదాయ ఆలోచనలకు స్వస్తి చెప్తామని అంటున్నారు. కానీ అశేష ప్రజానీకాన్ని, పేదరికాన్ని, పెరుగుతున్న అసమానతలను, పెరుగుతున్న ధరలను, ప్రజల అసంతృప్తి గురించి ఆలోచనే చేయడం లేదు. అసమానతల గురించి మాట్లాడితే, ఎక్కడ ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ శక్తులు తమను తప్పుగా అవగాహన చేసుకుంటాయోననే భయం వీళ్లను ఆవరించింది. నిజానికి కాంగ్రెస్‌పార్టీకి ఈ పరాభావం జరగవలసిందే. పార్టీ ఆత్మహత్య దిశలో పోతున్నది.

కార్పొరేట్ ప్రపంచానికి మన్మోహన్ అవతార లక్ష్యం అయిపోయింది. దేశానికి, దేశ ప్రజలకు ఆయ న ఎంత నష్టం చేయాలో అంత చేయించారు. దేశా న్ని ఎంత తాకట్టు పెట్టాలో అంత పెట్టాడు. ఇక కార్పొరేట్ లాభాలను పెంచడం ఆయన వల్ల కాదని, ఆయన అవతారం ముగించాలని కార్పొరేట్ వ్యవస్థ ఆదేశిస్తున్నది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నా రు. మన్మోహన్ స్థానంలో మరో అవతారాన్ని సృష్టించడానికి కార్పొరేట్ దైవం నిర్ణయించుకున్నది. ఈ అవతార ఆవిర్భావానికి కార్పొరేట్ మీడియా 24 గంటలు అలసట లేకుండా పనిచేస్తున్నది. ఈ అవతారం చాలా భయంకరమైనది. కార్పొరేట్ రక్షణ, ప్రజల శిక్షణార్థం దీన్ని సృష్టిస్తున్నారు. ఈ అవతారా న్ని ఒక ప్రయోగంగా గుజరాత్‌లో ముందుగా చేశా రు.

దయ, కరుణ, ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల అభిమానం ఈ పాత్రకు తెలియదు. ఈ పాత్ర భాష ఉన్మాదభాష. ఈ అవతారం సునాయాసంగా హింస ను ప్రేరేపించగలదు. ఈ అవతారానికి కావలసిన మద్దతు ఇవ్వడానికి సంఘ్ పరివార్, దాని భిన్న గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. కార్పొరేట్ లాభాలను ఇంకా పెంచాలంటే ఈసారి బలవూపయోగం చాలా అవసరం. ప్రజలను శిక్షించడానికి రాజకీయ రంగం లో బలీయమైన నాయకుడు, పౌర సమాజంలో మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టే, విభజించే శక్తి ఉన్న నేత కావాలి. ఒకరి మీద మరొకరు హింసకు పాల్పడడంలో పాల్గొనేవారే, సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రేరేపించే ఆర్థిక వ్యవస్థను కాపాడుతూ.పజల దృష్టిని మరలించి మరింత విధ్వంసాన్ని సునాయాసంగా చేయవచ్చని వాళ్లు భావిస్తున్నారు. సెక్యులర్ భాష మాట్లాడినా,మతోన్మాదాన్ని రెచ్చగొట్టినా, రెండింటి లక్ష్యం కార్పొరేట్ రంగ లాభాలు, సంపన్నులను మరింత సంపన్నులను చేయడమే. రాజ్యం పాత్రను కుదిస్తూ మార్కెట్ విశ్వరూప అభివృద్ధికి దోహదపడడం. ఈ రెండూ భిన్న అవతారాలు, కాని లక్ష్యం ఒక్కటే.

ఈ రెండు అవతారాలను ప్రశ్నిస్తూ మరొక పాత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ పాత్ర రెండు అవతారాల వెనకనున్న కార్పొరేట్ రంగాన్ని కానీ, మొత్తం ఆర్థిక విధానాన్ని కానీ ప్రశ్నించడంలేదు. దీనికి అవతారాల రూపం మీద అభ్యంతరం కాని సారం మీద కాదు. ఆయన పాలనలో అవినీతిని వ్యతిరేకిస్తూ అవినీతికి మూల కారణమైన కార్పొరేట్ రంగాన్ని ప్రశ్నించడం లేదు. అలాగే మతోన్మాదాన్ని మతం పేర జరిగిన హింసను ఎక్కడా పేర్కొనడం లేదు. కేవలం సుపరిపాలన గురించి మాట్లాడుతున్నారు. కార్పొరేట్ ప్రేరి త ఆర్థిక విధానం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల పాలకులను భ్రష్టు పట్టించింది. బహుశా జాతి కంపెనీలు ప్రవేశించిన దేశంలో కూడా అవినీతి రహిత సుపరిపాలన సాధ్యంకాలేదు.

లాటిన్ అమెరికాలో ప్రపంచీకరణకు, బహుళజాతి కంపెనీలతో విసిగిపోయిన ప్రజలు మొత్తం ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ నమూనాకు వ్యతిరేకంగా భిన్న రూపాల్లో నిరసనలు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న 82 దేశాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. ఇవేవీ కాదని కార్పొరేట్ రంగానికి సుపరిపాలన ద్వారా మరింత లాభాలు చేకూర్చడం తప్ప వీటి మూలాలకు వెళ్లడానికి ఈ మూడో శక్తి సాహసం చేయడం లేదు. ప్రపంచీకరణ ద్వారా ప్రయోజనం పొందిన ఎగువ, మధ్యతరగతి మెట్రోపాలిటన్ ఓటర్లు కేజ్రీవాల్‌ను సింహాసనం మీద కూచోబెట్టాలనుకుంటున్నారు. ఢిల్లీలో మురికివాడ ల్లో నివసిస్తున్న ప్రజలు తమ జీవితాలు ఏమైనా బాగుపడతాయోమోనని ఆశపడుతున్నారు. అయితే విచివూతంగా ఎన్నికల్లో గెలిచిన ఏపార్టీ కూడా ఎన్నికల చరివూతలో మొదటిసారి అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు! దీన్ని మరింత లోతుగా విశ్లేషించవలసిన అవసరముంది.

ఈ మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసిన 600 మం ది అభ్యర్థుల సగటు ఆదాయం 13కోట్లు. పోటీచేసిన వారిలో దాదాపు 70శాతం మంది కోటీశ్వరులు. మన దేశంలో నిజాయితీగా పనిచేసే వారెవ్వరూ కోటీశ్వరులు కాలేరు. వక్రమార్గంలో ఆస్తు లు కూడబెట్టుకున్న వారు, ఏపార్టీకి చెందిన వారైనా పేద ప్రజ ల గురించి, ఆర్థిక అసమానతల గురించి ఆలోచిస్తారని ఆశించడం అత్యాశే. ఎన్నికల ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది. ఈ మ్యాజిక్ డబ్బా నుంచి ఏది వచ్చినా వాటిలో గుణాత్మకంగా తేడా ఉండదు. ఎన్నికకు ఎన్నికకు మధ్య తేడా ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ప్రత్యక్ష చర్య కొనసాగించాలి. తమ జీవితాలు మారడానికి, ఎన్నికల సారాన్ని మార్చడానికి ప్రజల నిరంతర ఉద్యమాలు ఒక్కటే ఇప్పుడున్న ప్రత్యామ్నాయం.
ప్రొఫెసర్ జి.హరగోపాల్

408

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల