ఇందిర నుంచి మోడీ దాకా..


Tue,December 26, 2017 10:32 AM

నరేంవూదమోడీ ప్రసంగాలను చాలా దగ్గరగా పరిశీలించవలసిన అగత్యమేర్పడింది. ఆయన భాష, భావము, వేషము కేవలం ఒక వ్యక్తి మాట్లాడుతున్నది కాదు. దాని వెనక ఒక పెద్ద హిందుత్వ బలము, సామ్రాజ్యవాద ప్రయోజనాలున్నాయి. అలాగే ఆయన సదస్సులలో పాల్గొంటున్న లక్షలమంది ‘అమాయకపు’లేదా తమ సమస్యలకు పరిష్కారం వెతుకుతున్న జనం ఉన్నా రు. ఆయన ఇంత వరకు పాలించిన నాయకుల వలె కాక, మొత్తం వ్యవస్థను సమూలంగా ప్రభావితం చేసి దాని పని విధానాన్ని, రాజ్యాంగస్ఫూర్తిని, ఇంత కాలం మనం నమ్ముకున్న విశ్వాసాలను మార్చే దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. సమాజంలో ‘నియంత’ఎలా ఎదుగుతాడు? లేదా ఒక సమాజం నియంతృత్వాన్ని ఎలా పెంచి పోషిస్తుంది! అని అర్థం చేసుకోవడానికి కూడా ఇది చాలా అవసరం. అంతర్జాతీయ పెట్టుబడి తన మీడియా ద్వారా ఒక నాయకుణ్ణి ఎలా సృష్టించి, పెంచుతున్నది అన్న ప్రక్రియను కూడా రాజనీతి శాస్త్ర విద్యార్థులు చాలా సునిశితంగా విశ్లేషించవలసి ఉంటుంది.

ఒక సమాజంలో ‘నియంత’ తనకు తాను వ్యక్తిగా ఎదగడు, నియంతృత్వానికి కావలసిన చారివూతక పరిస్థితులు కూడా ఉంటాయి. క్రిష్టఫర్ కాడ్వెల్ తన ‘ఒక మరణశయ్య మీది నాగరికత’(Essays in Dying Culture) పుస్తకం లో ఫాసిజం ఎట్లా పెరిగిందో రాస్తూ, మనం గౌరవించే చాలామంది మేధావులు, రచయితలు, సామాజిక శాస్త్రజ్ఞులు ఆ ప్రక్రియకు తమకు తెలియకుండానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా దోహదపడ్డారో విశ్లేషించాడు. మోడీ నియంతృత్వాన్ని ఒక నాలుగు దశాబ్దాల వెనక్కి పరిశీలిస్తే.., ఇందిరాగాంధీ బీజరూపంలో ప్రయోగం చేసి, కొంత వరకు విఫలమైన సందర్భం గుర్తుకొస్తుంది. ఇప్పుడు నియంతృత్వం తన పునాదులను కొంచెం లోతుగా గట్టిగా నిర్మించుకునే దిశగా ముందుకు పోతున్నది. ఈ పర్యాయం అది ప్రయోగ రూపంలోకాక ప్రమాద రూపంలో సమాజ గర్భంలో తన బలాన్ని పెంచుకుంటున్నది. ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక తన అధికారాన్ని ప్రశ్నించి, దానికి విఘాతం కలిగినప్పుడు మొత్తం రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకుని విచ్చలవిడి అధికారం ఉపయోగించింది. షా కమిషన్ నివేదిక చదివితే అప్పుడు జరిగిన హింస, అధికార దుర్వినియోగ వికృత రూపం మనకు అర్థమౌతుంది. ఇప్పుడు అదే ప్రయోగం చేస్తే ఆ ప్రయోగానికి కావలసిన వికృత అధికారాన్ని రాజ్యం చాలా అణచివేత చట్టా ల ద్వారా స్థిరపరచుకున్నది. ఇప్పుడు రాజ్యం చేసే నేరాలకు చాలా చట్టబద్ధత కల్పించబడింది. రాజ్యహింసకు మద్దతు పెరిగింది. రాజ్యహింసతో పాటు పౌరసమాజంలో హింస విపరీతంగా పెరిగింది. ముజఫర్‌నగర్, పాట్నాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాబోయే ప్రమాదానికి సూచికలు మాత్రమే.
మావోయిస్టు ‘హింస’ గురించి ఇంతగా భయపడుతున్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ ఒక ముజఫర్‌నగర్ గానో లేదా పాట్నాగానో, లేదా గుజరాత్‌గానో మారకుండా ఏం చర్యలు తీసుకోవాలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మతోన్మాద రాజకీయాలు తెలంగాణలో విధ్వంసాన్ని సృష్టిస్తే తెలంగాణ భవిష్యత్తు ఏమిటి?

నరేంవూదమోడీ ఒక గొప్ప నాయకుడని, గుజరాత్‌ను స్వర్గంగా మార్చాడని భారతదేశం మొత్తాన్ని స్వర్గధామంగా మారుస్తాడని, ఇంకాకొంత కాలం తర్వాత అతను ఒక అవతార పురుషుడని ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు. గుజరాత్ మారణకాండను, అమానుషత్వాన్ని, ఢిల్లీలో 1984లో సిక్కుల మీద జరిగిన ఊచకోతను ఉదహరించి సమాధానపడితే లాభం లేదు. ఢిల్లీ హింసకు ఇందిరాగాంధీ కారణం కాదు. ఎమ్జన్సీలో బీజాలు వేసిన హింస విషఫలం అది కావచ్చు. ఒక నేత ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు మొత్తం చట్టబద్ధ పాలన నిలువునా కూలిపోయినప్పుడు, దానికి నరేంవూదమోడీకి ప్రత్యక్షంగా సంబంధంలేదని, చట్టబద్ధ సంస్థలు ఏవీ తప్పుపట్టలేదని అంటున్నారు. సమస్య అది కాదు.మోడీ ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున మారణకాండ జరిగితే, దాన్ని నియంవూతించడంలో పూర్తిగా విఫలమైన వ్యక్తిని సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని ‘వేనోళ్ల’ పొగడడం ఏమిటి? ఆయన నేతృత్వం హింసను అరికట్టలేకపోయింది కదా, అంటే గోధ్రా సంగతేమిటని అని అడుగుతున్నారు. గోధ్రా దాని తర్వాత జరిగిన మారణకాండ-ండింటిని ఆయన ఆపలేకపోయాడు కదా! ఈ నేపథ్యంలో సామర్థ్యమంటే ఏమిటి అనే ప్రశ్న అడగాలికదా?
నియంతృత్వ రాజకీయాలకు ఏ సిగ్గూలేకుండా మద్దతు ఇస్తున్న మన ఘనమైన జాతీయ మీడియా ‘గుజరాత్ అభివృద్ధి’ నమూనా గురించి మాట్లాడుతున్నది. అలాంటి అభివృద్ధి కోసం ఎంత హింస జరిగినా పర్వాలేదు అని కూడా దాని అర్థం. సామ్రాజ్యవాదం ఇండోనేషియా దేశాన్ని కమ్యూనిస్టు ప్రభావం నుంచి తప్పించడం పేరిట లక్షలమందిని చంపించింది. ఈ విషయం జాన్‌పెర్కిన్స్ తన దళారీ పశ్చాత్తాపం పుస్తకంలో వివరంగా రాసే ఉన్నాడు. ఈ మధ్య మోడీ ఒక ప్రసంగంలో దేశ అభివృద్ధి కోసం ప్రజలు త్యాగాలు చేయాలని అన్నా డు. దేశాన్ని కాపాడడానికి త్యాగాల బదులు అభివృద్ధి కోసం త్యాగాలు ఎందుకు చేయాలో తెలియదు. అంబానీలను ప్రపంచంలోనే అతి సంపన్నులుగా మార్చడానికి ప్రజలు ఎందుకు త్యాగాలు చేయాలో తెలియదు. ‘వెన్నెలరోజు కరెంటు దీపాలు వాడొద్దు’ అని ఒక సలహా కూడా ఇచ్చాడు. గుజరాత్‌లో విద్యుచ్ఛక్తి సమృద్ధిగా ఉంది అని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, వెన్నెల మీద ఆధారపడండి అని అంటే పట్టణాలలో మన అభివృద్ధి పుణ్యమా అని చంద్రుడు కనిపించడు కూడా!

ఇందిరాగాంధీ 1971లో అంటే దాదాపు నాలుగు దశాబ్దాల కిందట పేదరిక నివారణకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఫిక్కీ (FICCI) సంస్థ తన వార్షిక సభలో పేదరికం తగ్గించడానికి అది సందర్భం కాదని, సంపద పెరగకుండా దాన్ని పంచుతామనడమేమిటి? అని ప్రశ్నించినప్పుడు, ఇందిరాగాంధీ సభనుద్దేశించి మాట్లాడుతూ.... ‘భారత దేశ పేద ప్రజలు సహనం కోల్పోయారని, ఇంకా ఎక్కువ కాలం శాంతిభవూదతలు కాపాడలేమని, రాజకీయ సుస్థిరత కోసం పారిక్షిశామికవేత్తలు, సంపన్నులు కొంత త్యాగం చేయవలసి ఉంటుంది’ అని అన్నారు. బిర్లా ఆమె వాదనను సమర్థిస్తూ మాట్లాడాడు. నలభై ఏళ్ల తర్వాత సంపద పెరిగింది. సంపన్నుల సంఖ్య పెరిగింది. కానీ పేదవాళ్ల జీవితాలు మారలేదు. ఇప్పుడు వాళ్లను సహనం పాటించమని చెప్పడం కష్టం. అందుకే వాళ్లను త్యాగాలు చేయండి అని చెబుతున్నాం. వచ్చే నాలుగు దశాబ్దాలు కూడా సంపద పెరగడానికి సహకరిస్తే, ఆ తర్వాత ఎలాంటి సమాజం రాబోతున్నది? మోడీ స్వప్నమేమిటో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం మైనారిటీలకు, ప్రజాస్వామ్యవాదులకు సింహస్వప్నంగానే ఉంది.

మనకు అర్థంకాని అంశం.. ఇంత ప్యూహాత్మకంగా జరుగుతున్న సంఘటనలు ముజఫర్‌నగర్‌లో మత ద్వేషాలు. రెండు లక్షలమంది ముస్లింలు నిరాక్షిశయులు కావడం. మత ద్వేషాల్లో హిందువులు కూడా చనిపోవడం. ఉత్తర ప్రదేశ్‌లో మతద్వేష రాజకీయాలు అధికారంలోకి వచ్చాయి. గుజరాత్ లాంటి అభివృద్ధి అక్కడేం జరగలేదు. క్రమేణా ఆ రాజకీయాల ప్రభావం తగ్గి దళిత, వెనకబడిన తరగతుల ప్రతినిధులు అధికారంలోకి వచ్చారు. ఉత్తరవూపదేశ్‌లో మోడీ రాజకీయాలు బలపడాలంటే, ఒక మతద్వేష వాతావరణం చాలా అవసరం. అయితే ‘టెపూరరిస్టులు’ వాళ్లు ‘ముస్లిం టెర్రరిస్టులే’ అనుకుందాం. వాళ్లు మోడీ రాజకీయాలు ఎదిగే లాగానే ఎందుకు ప్రవర్తిస్తున్నారో మనకు తెలియదు. దీని వెనక సామ్రాజ్యవాద శక్తుల వ్యూహం ఉందేమో మనకు తెలియదు. అలాగే బీహార్‌లో నితీష్‌కుమార్ మోడీని వ్యతిరేకిస్తున్నప్పుడు, పాట్నాలో అంతకుముందు ఎన్నడూలేని టెర్రరిస్టు చర్య లు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ చర్యలు ఎవరివి? వాళ్లు మోడీ సదస్సులో ఇన్ని బాంబులు పెట్టడమేమిటి? శాంతిభవూదతల పేర లక్షల కోట్లు ఖర్చుపెడుతూ అంతర్గత భద్రత ఇంత విచ్ఛిన్నం కావడమేమిటో?రాజ్యం ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ప్రమాద వశాత్తు జరుగుతున్న సంఘటనలు కావు. ఈ సంఘటనలు ఏ కారణం వల్ల జరిగినా ఇవి నియంతృత్వం ఎదగడానికే దోహదపడతాయి. ప్రజాస్వామ్య సంస్కృతి, రాజకీయ అవగాహన లేని కొంచెం సంపదపెరిగిన మధ్యతరగతి ‘ఒక నియంతే ఈ దేశ శాంతిభవూదతలు కాపాడగలడు’ అనే దశకు నెట్టబడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో కొందరు హేమాహేమీ పోలీసు ఆఫీసర్లతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి, హైదరాబాద్‌లో శాంతిభవూదతల గురించి మావోయిస్టు ప్రభావాన్ని గురించి నివేదిక ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం కోరింది. మావోయిస్టు ‘హింస’ గురించి ఇంతగా భయపడుతున్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ ఒక ముజఫర్‌నగర్ గానో లేదా పాట్నాగానో, లేదా గుజరాత్ గానో మారకుండా ఏం చర్యలు తీసుకోవాలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మతోన్మాద రాజకీయాలు తెలంగాణలో విధ్వంసాన్ని సృష్టిస్తే తెలంగాణ భవిష్యత్తు ఏమిటి? అందుకే తెలంగాణ ప్రజలు ఎవరో తమను రక్షిస్తారనే భ్రమలకంటే, తమ సామరస్య రాజకీయాలను గౌరవించి, పట్టణంలోని అన్ని మైనారిటీ వర్గాలకు సంపూర్ణ భద్రత కల్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. మావోయిస్టు రాజకీయాల గురించి కూడా స్వేచ్ఛగా చర్చించవలసిన అవసరం ఉంది. ఆ వాతావరణాన్ని మనం కల్పించాలి. టాస్క్‌ఫోర్స్ మరిచిపోయిన అంశం.. తెలంగాణకు శాంతిచర్చలు జరిపిన అనుభవం ఉంది. మత సామరస్యాన్ని కాపాడే ప్రజాస్వామ్య ఉద్యమాల వారసత్వముంది. మనం అందరం గర్వించదగ్గ ఈ విలువలను కాపాడుకోవాలి. టాస్క్‌ఫోర్స్‌లు ఈ పనిచేయగలిగితే ముజఫర్‌నగర్‌లో విధ్వంసం జరిగేదే కాదు కదా!

పొఫెసర్ జి. హరగోపాల్

297

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles