సమతుల్యం కోల్పోతున్న సమాజం


Tue,December 26, 2017 10:34 AM

నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ శిక్ష వేయడానికి న్యాయవ్యవస్థ చట్టపరిధి దృష్ట్యానే కాక బయటి సమాజం ఒత్తిడిని కూడా పరిగణనలోకి తీసుకుంది. న్యాయం ఒక ఎత్తయితే ఒత్తిడి మరొక ఎత్తు. ఇక మీడియా పాత్ర ఏమని వర్ణించగలం. మన ఘనమైన జాతీయ ఇంగ్లిషు ఛానల్స్‌ను ఎంత వర్ణించినా తక్కువే. అయితే ప్రజాభివూపా యం పేర లేదా ఒత్తిడి మేరకు న్యాయాన్ని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం అన్న ఒక కీలక ప్రశ్న ఈ సందర్భంలో తప్పక అడగాలి. న్యాయశాస్త్రం చదువుకున్న వాళ్లకి, చట్టబద్ధపాలన చరిత్ర తెలిసిన వాళ్లందరికీ న్యాయం నిర్ణయంలో ఆవేశపూరితమైన మనుషుల ఒత్తిడి ఎందుకు లోపభూష్టమైందో తెలుసు.

మనుషుల ప్రవృత్తిలో ఒక నేరం జరిగినప్పుడు నేరస్థుడికి అతి పెద్ద శిక్ష వేయాలని, అలాగే తక్షణమే శిక్ష పడాలనే కోరిక బాధితులకు చాలా బలం గా ఉంటుంది. బస్సులో పిక్‌పాకెట్ జరిగితే, అకస్మాత్తుగా తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులేని వ్యక్తికి, దోషిని ఉరితీయాలని, చంపాలని అనిపిస్తుంది. పిక్‌పాకెట్ నేరానికి మనిషి ప్రాణం తీసుకోవచ్చునా అనే న్యాయభావన ఆ సమయంలో తట్టదు.అలాగే ఒక లారీ డ్రైవర్ ఒక ప్రమాదంలో చిన్న పిల్లను గాయపరిస్తే, పిల్ల వయసులో ఎంత చిన్నదైతే శిక్ష అంత ఎక్కువ ఉండాలి అనిపిస్తుంది. అంటే నేరం జరిగినప్పుడు మనుషులు చాలా సబెక్టు(Subje ctive)గా ఆలోచిస్తారు. అలా ఆవేశంలో వ్యక్తులు న్యాయాన్ని సరిగా నిర్ణయించలేరు. ఆవేశంలో ఉండే మనుసులు మంచి, చెడ్డలను, నేరము-శిక్షను సంయమనంతో చూడలేరు. ఈ ప్రవర్తనా దృష్ట్యా సమాజాలు తాము నింపాదిగా ఆలోచిస్తున్నప్పుడు, అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ నేరానికి ఎంతశిక్ష వేయాలని నిర్ణయించే ప్రక్రియ నుంచి చట్టబద్ధపాలన పుట్టింది. అందుకే నేరస్థులకు శిక్ష విధించే బాధ్యతను సమాజాలు న్యాయవ్యవస్థకు అప్పజెప్పారు. ఇప్పుడు మన సమాజంలో ఈ అవగాహన పూర్తిగా లోపించిం ది. అమ్మాయి మీద యాసిడ్ చల్లినవాణ్ణి పోలీసులు ఏ చట్టపరిమితి లేకుండా, ఏ ట్రయల్ లేకుండా న్యాయవ్యవస్థ ప్రమే యం లేకుండా చంపేస్తే, అలాంటి పోలీసులను అభినందిస్తున్నాం. అలాంటి చర్యలను హర్షిస్తున్నారు. ఆవేశం అలాగే పనిచేస్తుంది.

మానవ చరిత్ర తన సుదీర్ఘ అనుభవం నుంచి వడపోసి తనకు తాను నిర్ణయించుకున్న నాగరికత ప్రమాణాలకు స్వస్తిచెప్పి మన సమాజం ఆటవిక న్యాయం వైపు పరుగుపూత్తుతున్నది. అంటే నిర్భయ కేసులో ఉరిశిక్ష తప్పా అని అడిగితే ఆ ప్రశ్న ఏ విలువలచట్రం నుంచి అడుగుతున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏ విలువలను కాపాడుకోవాలో, ఆ విలువలు నాగరికత వికాసం చెందడానికి ఎంత అవసరమో ఆలోచించాలి. ఈ ప్రమాణాలను, విలువలను కనడానికి సమాజాలు ఎంత ప్రసవ వేదనచెందాయో కూడా ఊహించాలి. ఉరిశిక్ష అనాగరికమని ప్రపంచ వ్యాప్తంగా అంగీకరింపబడుతున్నది. ఉరిశిక్ష రద్దు చేయాలని అంతర్జాతీయ ప్రమాణాలు ఆదేశిస్తున్నవి. దాదాపు నూరు నూట యాభై దేశాల్లో ఉరిశిక్షను రద్దు చేశారు. ఈ దిశలోనే మరెన్నో దేశాలు ఆలోచిస్తున్నాయి. మనదేశంలో కూడా దీనిపై చాలా చర్చ జరిగింది. ఆ దిశలో వెళ్లే క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ శిక్షను ఆ తర్వాత అరుదైన కేసుల్లో మాత్రమే వేయాలనడంలో, ఈ శిక్షను దాదాపు వేయకూడదనే భావన దాంట్లో ఉంది. ఇప్పుడు అవకాశవాద, బాధ్యతారహిత మధ్యతరగతి ప్రతి నేరానికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేసేదాకా దిగజారింది. అవినీతిపరులను ఉరితీయాలి, ఒక్కటి కాదు దేనికంటే దాని ఉరిశిక్ష అడగడంసాధారణమైపోయింది.కొందరైతే షూట్ చెయ్యాలని అంటున్నా రు. ఇలా అడగడం సామాజిక స్పృహ పెరుగుతున్నట్టు కాదు, తగ్గుతున్నట్టు!

ఈ సందర్భంలో ఒక ప్రశ్న సమాజం చాలా సీరియస్‌గా చర్చించవలసి ఉన్నది. ఒక సమాజంలో నేరం ఎందుకు జరుగుతుంది? నేరానికి పునాదులు ఎక్కడ ఉంటాయి? అని అడగాలి. దీనికి కారణాలను రెండు భిన్న దృవాల నుంచి విశ్లేషించవచ్చు. ఒకటి నేరము. నేరం చేసే వ్యక్తి ప్రవృత్తిలోనే ఉంటుం ది అని కొందరు నేరం చెయ్యడానికే పుడుతారు. అలాంటి నేరస్థులు సమాజంలో కొనసాగితే మొత్తం సమాజానికే ప్రమాదం కనుక వాళ్ళను చంపడమొక్కటే నేరం లేని సమాజ నిర్మాణానికి అవసరం అని భావించడం, నేరస్థులను ఉరితీస్తే అలాంటి నేర ప్రవృత్తి (పుట్టుకలోనే సంక్రమించినట్టు) కలిగిన మనుషులందరూ భయపడి తమకు తాము ఆలోచించి ఈ ప్రవృత్తి నుంచి బయటపడతారని. అట్ల సమాజానికి ఒక రిలీఫ్ వస్తుంది అని భావిస్తారు. మనుషులు నేర ప్రవృత్తితోనే పుడతారా అన్న ఒక్క ప్రశ్న అడగకపోతే, ఈ విశ్లేషణ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఒప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఏ శిశువును చూసినా మానవీయంగానే ఉంటుంది. కాళోజీ ‘ఒక సమాజంలో బలవంతులకు నేరం చేసే అవకాశం ఉండకూడదు, బలహీనులకు నేరం చేసే అవసరం ఉండకూడదు’అని అనేవారు.

నేరవూపవృత్తికి వ్యక్తిగతంకాక, పుట్టి పెరిగిన సమాజం , ఆ సమాజం తను సమష్టి అను భావం నుంచి నేర్చుకున్న విలువలు, నాగరికతలు పరిణామక్షిక మం, అసమానతలు, సాంస్కృతిక కార్యరంగం, సినిమాలు, విద్యావిధానం, ప్రభుత్వ పనితీరు, పాలకులు పాటించే ప్రమాణాలు, రాజకీయ సంస్కృతి, ఇలా ఎన్నో కారణాల మీద నేరవూపవృత్తి ఆధారపడి ఉంటుంది. మహిళల మీద ఇంత నేరం ఎందుకు జరుగుతుంది? ఎందుకు నేరాలు పెరుగుతున్నాయి? తండ్రి, కూతురిని, అన్నలు చెల్లెళ్లను చెరిచే దాకా మన సమాజం ఎందుకు దిగజారింది.అన్నా చెల్లెళ్ళ మానవీయ అనుబంధం ఇలా విషపూరితం కావడా నికి కారణాలు వ్యక్తిగత నేర ప్రవృత్తిలో ఉన్నాయా లేక ఈ సమాజం ఎక్క డో దారి తప్పిందా ఆలోచించాలి.

ఇప్పుడున్న సమకాలీన సందర్భంలో సామాజిక స్థితిలో ముఖ్యంగా అప్రజాస్వామిక మీడియా పాత్ర, ప్రభావం పెరుగుతున్న కాలంలో, న్యాయాన్యాయాల గురించి ఆలోచించడానికి అవధే లేదు. సాయంత్రం ఏ ఎలక్ట్రానిక్ ఛానల్‌ను చూసినా (ముఖ్యంగా జాతీయ ఛానళ్లు ) ఏమున్నది గర్వకారణం అనిపిస్తుంది. ఈ ఛానల్స్‌లో ముఖ్యంగా యాంకర్లే న్యాయవాదులు, ఇన్‌వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ట్రయల్ నిర్వహకులు, న్యాయనిర్ణేతలు అన్నీవాళ్లే. ఛానళ్లు చూస్తున్న మధ్యతరగతి (న్యాయమూర్తులతో సహా) మీడియా ప్రభావం నుం చి తమను తాము రక్షించుకోలేకపోతున్నారు.ఛానళ్లు మన ఆలోచన మీద,. మన స్పృహ మీద పెద్దఎత్తు దాడిని ప్రకటించాయి. ఎవ్వవ్వరికి ఉరిశిక్ష వేయాలో ఛానళ్ళే నిర్ణయిస్తున్నాయి. ఇప్పుడు ప్రజాభివూపాయమంటే ఛానళ్ళ అభివూపాయమే! సమాజంలో నేరం ఎందుకు జరుగుతున్నది. వాటికి మూలకారణాలు ఏమిటి అన్న చర్చ జరిపిన పాపానపోలేదు.

వాళ్ళ చర్చంతా దోషికి ఉరిశిక్ష వెయ్యాలా వద్దా? ఎవరైనా ఉరిశిక్ష అనాగరికమంటే, మీ చెల్లెలకే ఇలా అన్యాయం జరిగితే మీరు ఎలా ఫీలవుతారని అమా నవీయంగా ప్రశ్నిస్తున్నారు! నేరానికి సమాజంలో మూలాలు ఉంటాయని అంగీకరిస్తే ప్రతి ఒక్కరం ఆ నేరం జరగడానికి కొంత బాధ్యత వహించవల్పిన ఉంటుంది. ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో మన వైఫల్యాన్ని అంగీకరించవలసి ఉంటుంది. చలం అన్నట్టు మన సుఖమైన, విలాసవంతమైన జీవితాన్ని దాటి ఆలోచించవలసి ఉంటుంది.నేరస్థు ణ్ణి చంపితే అంతా బాగుపడుతుంది. అనడానికి మనమెవ్వరం కష్టపడవలసిన అవసరంలేదు. ప్రతి నేరానికి ఉరిశిక్ష వెయ్యాలనే ఆలోచన సామాజిక స్పృహ కోల్పోతున్న మధ్యతరగతి సంస్కారహీనత తప్పమరేం కాదు.
నిర్భయ కేసులో ఢిల్లీలో చాలామంది మధ్యతరగతివాళ్ళు బాగా స్పందించారు. ధర్నాలు చేశారు. ఊరేగింపులు తీశారు.ఆ స్పందనను చూసి ఫర్వాలే దు ఈదేశ మధ్యతరగతి ఇప్పటికైనా స్పందిస్తుందని కొంత ఆశాజనకంగా అనిపించింది. ఈ అలజడి నేరం చేసినవారికి ఉరిశిక్ష పడాలని ఒత్తిడి పెట్టి అది పడేదాకా కొనసాగింది. అదే మధ్యతరగతి గుజరాత్‌లో 2002లో వందలాది మహిళల మీద జరిగిన అత్యాచారాల మీద, మహిళల నగ్న ఊరేగింపుల మీద, చిన్నపిల్లల అమానుష హత్యల మీద, ముజఫర్‌నగర్‌లో మహిళల మీద జరిగిన దారుణాల మీద అలాగే స్పందిస్తే బాగుండేది. గుజరాత్ అల్లర్ల కాలంలో ముఖ్యమంవూతిగా ఉన్న వ్యక్తిని ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ముజఫర్‌నగర్‌లో మహిళను అడ్డంగా నరికి శవాన్ని హస్పిటల్‌కు పోస్ట్‌మార్టం కోసం తెచ్చారని అలాగే నిలువునా కాల్చిన చిన్న పిల్లల శవాలను తెచ్చారని అది చూసినా డాక్టర్ తాను నిద్రపోలేకపోయానని, తినలేకపోయానన్నాడు. గుజరాత్ అల్లర్లకు, ముజఫర్‌నగర్ అల్లర్లకు స్పందించడం ఎందుకు మరచిపోయాం? సమాజం ఈ ఘటనలకు ఎందుకు అంత పెద్దగా స్పందించడంలేదు.

ఒక్క నిర్భయ విషయంలోనే స్పందించి దోషులకు ఉరిశిక్ష పడిందని సంతృప్తిపడి హాయిగా నిద్రపోతే సరిపోదు. మొత్తం సమాజమే ఒక నేరమయ దశ లో పోతున్నది. నిద్రలేవకపోతే నేరాలు చేసేవాళ్లే అధికారంలోకి వస్తారు. వచ్చా రు కూడా.అప్పుడు మన మీద నేరం జరిగితే అడిగేవాళ్ళుండరు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు నిరంతరంగా స్పందించడం, ఉద్యమించడం కలిగించే ప్రభావం, ఉరిశిక్షలు కలిగించలేవనేది సామాజిక అనుభవం సారాంశం.

పొఫెసర్ జి. హరగోపాల్

153

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles