జయశంకర్ చైతన్యం: తెలంగాణ పోరాటాలు


Fri,September 16, 2011 12:01 AM

సర్వజన సమ్మె జరుగుతున్న చారివూతక సందర్భంలో జయశంకర్ మన మధ్య లేకపోవడం ఒక పెద్దలోటే. ఆయనకుండే వ్యక్తిత్వం వలన వెసులుబాటు వలన, అంతకుమించి వ్యక్తిగత నిబద్ధత, నిజాయితీ వలన ఉద్యమానికి తన మీద తనకు విశ్వాసాన్ని కలిగించడానికి చాలా ఉపయోగపడేది. చాలా మందికి లేని ఒక విశ్వసనీయత జయశంకర్ పట్ల ఉండడానికి ఆయన తన జీవిత కాలానికి తెలంగాణ అనే ఒకే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. దాని పట్ల రాజీలేదు. అనుమానం లేదు. శషభిషలు లేవు. ఇది చాలా మందికి సాధ్యంకాదు. ఆలోచనలు, విశ్వాసాలు బాహ్య ప్రపంచంలో జరిగే ఆటుపోట్లకు గురవుతుంటాయి. మనుషులు, వారి ఆలోచనలు నిరంతరంగా మారుతుంటా యి. నిజానికి వరంగల్‌లో పుట్టి, పెరిగి, ఆ రాజకీయ వాతావరణంలో జీవిస్తూ ‘తెలంగాణ’ గురించే ఆలోచించడం ఆ విశ్వాసాన్ని వదులుకోకపోవడం పరిమితా లేక బలమా అన్న అంశాన్ని అంచనా వేయడం కష్టమే. ఒకవేళ అది బలహీనతే అని అనుకున్నా తెలంగాణ చరిత్ర భిన్న మలుపులు తిరిగి మళ్లీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు చేరుకోవడం వల్ల జయశంకర్ బలహీనత కూడా బలమైనశక్తిగా మారడం వ్యక్తి జీవితంలో జరిగే చాలా అరుదైన సంఘటనలలో ఒకటి.

జయశంకర్ వరంగల్‌లో పుట్టి, అక్కడ చదువుతున్న కాలంలో, ఆ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటంలో ఉంది. వరంగల్‌లోని మధ్యతరగతి దానిచేత చాలా ప్రభావితమైనవాళ్లే. అయితే తెలంగాణ సాయుధ పోరాట విరమణతో తెలంగాణ అస్తిత్వ చైతన్యం రూపొందించడం జరిగింది. సాయుధ పోరాటానికి అగ్రభాగాన ఉన్న నాయకత్వం సైద్ధాంతిక కారణాల వల్ల విశాలాంవూధను బలపరిచారు. అప్పటి కమ్యూనిస్టు పార్టీ సమాజం సమక్షిగంగా మారుతుందని విశ్వసించింది. ఆ సమ సమాజ స్థాపనే అప్పటి వాళ్ల స్వప్నం. ఈ సమ సమాజ నిర్మాణంలో భాగంగా ప్రాంతీయ అసమానతలు, కుల పర అణచివేత, మహిళలపై హింస రద్దె మనుషులంతా మనుషులు గా మలచబడే ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందనేది ఆ ప్రాపంచిక దృక్పథ నమ్మకం. విశాలాంవూధలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తుందని, మౌలిక మార్పులు తీసుకరాగలమనే విశ్వాసం వాళ్లకుండవచ్చు.
Jaya-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఎందుకో తెలంగాణ ప్రాంతంలో అప్పటికే ఆ విశ్వాసం పట్ల అనుమానాలున్నాయి. దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ బలం పుంచుకొని రెండవ సార్వవూతిక ఎన్నికలలో సోషలిస్టు నినాదాలను, భావజాలాన్ని నెత్తికెత్తుకొని కమ్యూనిస్టు పార్టీని వెనక్కి నెట్టగలిగింది. చారివూతకంగా కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల రాజకీయాలలోకి వచ్చినా, సమాంతరంగా ప్రజా ఉద్యమాలను, పోరాటాలను సజీవంగా కొనసాగించి ఉంటే, ఎన్నికలలో ఓడిపోయినా ఉద్యమాలు కొనసాగేవి. అలా చేయకపోవడం వల్ల తామ కలలు కన్న ‘విశాలాంవూధలో ప్రజారాజ్యం’ స్వప్నం చెదిరిపోయింది. తెలంగాణ అస్తిత్వం విశాలాంధ్ర భావనకు భిన్నంగా బలం పుంజుకుంటున్న సందర్భం జయశంకర్ చైతన్యా న్ని ప్రభావితం చేసిందేమో అని అనిపిస్తుంది.
రాష్ట్రంలో 1960వ దశాబ్దంలో ప్రవేశపెట్టబడిన హరిత విప్లవం అన్ని రకాల అసమానతలను ముఖ్యంగా ప్రాంతీయ అసమానతలను పెంచింది.

దీనికి తోడు తెలంగాణలో సాయుధ పోరాటం అపరిష్కారంగా మిగిలించిన భూస్వామ్య సంస్కరణలు కొనసాగడమేకాక, ఏ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయో వాళ్లే భిన్న అవతారాలలో రాజకీయ అధికారం చేజిక్కించుకోవడం వల్ల, ఒకవైపు జగిత్యాల జైత్రయా త్ర మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం దాదాపు కలిసే జరిగాయి. నక్సలైట్ ఉద్యమ ప్రభావం కన్నా ‘తెలంగాణ అస్తిత్వ ఉద్యమ చైతన్యం’ కలిగిన జయశంకర్‌ను ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే ఎక్కువ ప్రభావితం చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు రాజకీయ నాయకుల ద్రోహాలతో విసిగి అడవికి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. అయితే శ్రీకృష్ణ కమిటీ రహస్య చాప్టర్‌లో తెలంగాణ ఇస్తే నక్సలైట్లు బలం పుంజుకుంటారు అనేది ఎంత నిజమో తెలియదు కాని, 1960ల అనుభవాన్ని చూస్తే , ఇవ్వకపోతే ఆ పోరాటాలు బలపడతాయనేది మాత్రం వాస్తవం. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వాలు ప్రజలను పోరాటాలవైపే నెట్టుతాయి. ఈ మాట జయశంకర్ తన సుదీర్ఘ అనుభవం వల్ల, ఒక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని అంగీకరించకపోతే ఇంకొక పోరాట ప్రత్యామ్నాయం ముందుకు వస్తుందని, 1956 అనుభవం వల్ల, 1969 అనుభవ ఆధారంగా మళ్లీ మళ్లీ అనేవాడు.

వరంగల్‌లో రాడికల్ చైతన్యం ఉవ్వెత్తున లేచిన సందర్భంలో జయశంకర్ వరంగల్ సి.కె.యం కాలేజీకి ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. అయితే జయశంకర్‌లో ఒక లక్ష్యానికి పనిచేసే చిత్తశుద్ధి, ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వహించే ప్రతిభ, వ్యక్తిగత నిజాయితీ వరంగల్‌లోని కొందరు రాజకీయ నాయకులకు కంటకంగా తయారయ్యాయి. జయశంకర్ చాలా సౌమ్యుడు. భాషలో అతి జాగ్రత్తలు పాటించేవాడు. సంస్కారం ఉన్నవాడు. ఇవన్ని దిగజారిన రాజకీయ నాయకులను భయపెట్టాయి. వాళ్లు ఆయన రాకను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్లు సాధించలేకపోయారు. రాజకీ య నాయకులకు భయపడడం కాని, వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తడం కాని జయశంకర్ వ్యక్తిత్వంలోనే లేవు. ఆయన చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి. తనను తాను గౌరవించుకోలేని ఏ వ్యక్తి కూడా ఇతరుల గౌరవాన్ని పొందలేడు. ఆయన ముఖ్యమంవూతులతో మాట్లాడినా, ప్రధాన మంత్రులతో మాట్లాడినా, సోనియాగాంధీతో మాట్లాడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా మాట్లాడాడు. బహుశా బలమైన వ్యక్తిగత విశ్వాసాలుండే వ్యక్తులకే అది సాధ్యమవుతుందేమో!

సి.కె.యం కాలేజీ రాజకీయంగా రెండు బలమైన శిబిరాలు కలిగిన అధ్యాపకులు, విద్యార్థులున్న సంస్థ. ఇవి రెండు ధృవాలుగా ఉండేవి. వామపక్ష అధ్యాపకులు, వి.వి., వి.యస్. ప్రసాద్‌తో సహా ఆయన నిజాయితీని, నిబద్ధతను గౌరవించారు. ఇంకొక శిబిరం ఆయన పాలనా పటిమను, పారదర్శకతను తట్టుకోలేకపోయింది. ఈ రెండు శిబిరాల సహకారాన్ని ఆయన పొందగలిగారు. సైద్ధాంతికంగా ఆయన తెలంగాణ వాది కావడం వలన, రాజకీయ సైద్ధాంతిక ఘర్షణను కొంత వరకు బయట ఉంచగలిగాడు. బహుశా ఆ అనుభవం వల్లే తెలంగాణ ఉద్యమంలో ఎవరూ కలిసొచ్చినా ఆర్.ఎస్.యు నుంచి ఆర్. ఎస్. ఎస్ దాకా అని అంటూ ఉండేవాడు. నిజానికి తెలంగాణ చరిత్ర తిరిగిన మలుపులలో ఆ ఉద్యమానికి ఇటు బి.జె.పి అటు మావోయిస్టు పార్టీలు మద్దతు ఇవ్వడం ఒక చారివూతక విచివూతమే. కాని జయశంకర్‌కు ఈ చారివూతక సందర్భం చాలా వెసులుబాటు కల్పించింది. అందుకే ఆయన మరణానికి అన్ని వర్గాల నుంచి ఒక అనూహ్యమైన స్పందన వచ్చింది.

ఇందిరాగాంధీ రాజకీయాలతో ప్రారంభమైన అస్తిత్వ ఆధారిత రాజకీయాలు, 1980వ దశాబ్దం వరకు చాలా బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చాయి. వర్గ రాజకీయాలతో పాటు సమాంతరంగా అస్తిత్వ రాజకీయాలు అభివృద్ధి చెందాయి. వర్గ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు మధ్య సఖ్యత ఉంది. ఘర్షణ ఉంది. ఈ రాజకీయాలు బలం పుంజుకుంటున్న సందర్భంలో 1990వ దశకంలో ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మరోసారి ముందుకు వచ్చింది. ఈ ఉద్యమం ముందుకు వస్తున్న తరుణంలో అప్పటికే పాలనా అనుభవం, ప్రజాదరణ పొందిన జయశంకర్ ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. 1950 ‘ముల్కీ గోబ్యాక్’ ఉద్యమం అప్పుడు ఆయన విద్యార్థి, 1960 ఉద్యమ కాలంలో అధ్యాపకుడు. 1990 ఉద్య మం వరకు ఒక నిర్ణాయకశక్తిగానే కాక సిద్ధాంతకర్త అని భావించే దశకు చేరుకున్నాడు. చరిత్ర కొన్ని రహస్యాల ను, కొన్ని ఆశ్చర్యాలను తన గర్భంలో దాచుకొని ఉం టుంది. అలా దాచుకున్న ఆశ్చర్యాలలో జయశంకర్ జీవి తం, దాని ప్రయోగికత ఒకటి.

జయశంకర్ వ్యక్తిత్వంలో మరొక ఆశ్చర్యాన్ని కలిగించే అంశం: అధ్యాపకుడికి, రాజకీయ సామాజిక ఉద్యమాలకుండే సంబంధం. 1970లలో వరంగల్ ఉపాధ్యాయ, అధ్యాపక వర్గం పోరాట రాజకీయాలతో మిళితమైన సందర్భం. ప్రజా ఉద్యమాలు అధ్యాపక వర్గాన్ని ప్రభావి తం చేస్తూ, అధ్యాపక వర్గం ఉద్యమాలను ప్రభావితం చేసిన సందర్భమిది. నాలాంటి వాళ్లం ఆ సందర్భం వల్ల ప్రభావితమైన వాళ్లమే. కానీ రాను రాను విశ్వవిద్యాలయ అధ్యాపకులు చాలా కారణాల వల్ల ఉద్యమ రాజకీయాలకు దూరం అవుతూ వచ్చారు. ఏదో మన చదువు మనం చెబితే సరిపోతుంది దగ్గర ప్రారంభమై, తమ వ్యక్తిగత కుటుంబ సమస్యలతో కూరుకుపోతున్న సందర్భంలో కుటుంబమే లేని జయశంకర్‌కు తెలంగాణనే ఆయన కుటుంబం. ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వి.సి.గా ఉండే సందర్భంలో కూడా నాకు తెలిసి తెలంగాణమీద సమాచారం సేకరిస్తూనే ఉన్నాడు. ఏ హోదాలో ఉన్నా ఈ తెలంగాణ అంశం మాత్రం ఆయనను వదలలేదు. దాన్ని ఆయన వదలలేదు.

అధ్యాపకులంతా ఒక నిరాశావాదంలో ఉండే దశలో ఆయన తెలంగాణ ఉద్యమం అనివార్యంగా వస్తుందనే విశ్వసించాడు. దాని కొరకు తనను తాను సమాయత్తపరుచుకున్నాడు. అధ్యాపకుల పాత్ర ఉంటుందని, ఉండాలని ఆయన విశ్వసించాడు. అధ్యాపకులు క్లాస్‌రూంకు పరిమితం కాకుండా విశాల సామాజిక తరగతి గదిలో ఒకవైపు విద్యార్థులలాగ ప్రజల నుంచి నేర్చుకుంటూ, ప్రజలకు తమ విజ్ఞానాన్ని అందించాలని బలంగా భావించాడు. అలా భావించినందువల్లే తెలంగాణ అంతా తిరిగాడు. వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. జయశంకర్ ఇచ్చిన వారసత్వం ఉపాధ్యాయ, అధ్యాపక వర్గానికి సదా ఒక స్ఫూర్తిని కలిగించేదే.
ఈ జయశంకర్ స్మారకోపన్యాసం ముగిసిన తర్వాత ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త ప్రొ. సిహెచ్. హనుమంతరావు తన అధ్యక్ష పలుకులతో జయశంకర్ మీద తెలంగాణ సాయుధ పోరాట ప్రభావం ఎందుకు పడలేదనే ఒక సందేహం తనకు ఉండేదని, బహుశా తెలంగాణ అస్తిత్వ సమస్య ఆయన చైతన్యంతో అత్యంత ప్రభావితంగా ఉండబట్టే ఇలా జరిగుండవచ్చు అంటూ, తాను విద్యార్థిగా ఉన్నప్పుడు తెలంగాణ పోరాటానికి ఆకర్షించబడి ఆ ఉద్యమంలోకి ఎలా వెళ్లాడో వివరించారు.

అయితే నాడు తెలంగాణ పోరాటంలో భాగమై తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఎకనామిక్స్‌శాఖలో పనిచేసి, ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, లేబర్ కమిషన్ లాంటి అత్యున్నతమైన విధాన నిర్ణయ సంస్థలలో పనిచేసి అందరి మెప్పులను పొందిన హనుమంతరావు తెలంగాణ అస్తిత్వానికి మద్దతు ఇవ్వడమే కాక, జయశంకర్ మరణం తర్వాత ఆయన రాసిన నివాళి వ్యాసం నిజంగా చాలా గొప్ప నివాళే. రెండు మార్గాల ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ లక్ష్యం పట్ల ఏకీభావం కలిగి ఉండడం జయశంకర్ విశ్వాసానికి గౌరవమే కాక, తెలంగాణ ప్రజానీకానికి ఒక గొప్ప అనుభవమే.

ప్రొ. జి. హరగోపాల్


(ఉస్మానియా విశ్వవిద్యాలయంలో National Academy of Development’ ఆధ్వర్యంలో వ్యాసకర్త 3 సెప్టెంబర్ నాడు ఇచ్చిన జయశంకర్ స్మారకోపన్యాస సంక్షిప్త సారాంశం)

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Published: Thu,September 18, 2014 12:09 AM

సమున్నత మానవత్వమే కవి లక్ష్యం

ప్రజలు తమ జీవితాలు మారాలనే చేసే పోరాటాలు ఉంటాయి. అలాగే వియత్నాం యుద్ధంలాంటి యుద్ధాలుంటాయి. యుద్ధం మీద యుద్ధం చేసే యుద్ధాలు కూడా ఉం

Published: Thu,September 11, 2014 12:33 AM

యుద్ధాలులేని ప్రపంచం కావాలె

భారత దేశంలో అలాగే పాకిస్థాన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్నికూడగట్టుకోవాలి. యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం చేయవలసిన ఒక

Published: Thu,August 28, 2014 12:21 AM

హిండాల్కో శ్రామికుల విజయం

హిండాల్కో పరిశ్రమను కార్మికులు కాపాడుకోగలిగారు. మొత్తం ఉద్యమంలో కార్మికులు ఒక్కతాటి మీద నిలబడ్డారు. కార్మిక నాయకులు కూడా నిజాయితీగ

Published: Thu,August 21, 2014 01:50 AM

ప్రజాస్వామ్య లౌకికస్ఫూర్తి ఖాన్‌సాబ్

తెలంగాణ సుసంపన్నమైన వారసత్వానికి ఒక దీప స్తంభం లాంటివాడు ఎంటీ ఖాన్. సాయుధ పోరాటం నుంచి, నక్సలైట్ ఉద్యమందాకా ఖాన్‌సాబ్ ప్రత్యామ్నాయ

Published: Wed,August 13, 2014 11:25 PM

యుద్ధ ప్రమాద ఘంటికలు

భారత ప్రధాని గత రెండు నెలల్లోనే కశ్మీర్‌కు రెండు పర్యాయాలు వెళ్లడమేకాక, సైన్యాన్ని ఉద్దేశించి ప్ర సంగిస్తూ భారత్‌పై పాకిస్థాన్ ప్ర

Published: Thu,August 7, 2014 04:11 AM

దళిత విద్యార్థుల నిరసన

ఒకవైపు విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా బలీయమౌతున్నప్పుడు..పాములు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఉంట

Published: Thu,July 31, 2014 01:36 AM

దళిత స్కాలర్ల ప్రతిభ

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు తగినన్ని వనరులు కల్పించి, వాటి నాణ్యతను పెంచితే తెలంగాణ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ

Published: Thu,July 24, 2014 03:30 AM

దళిత విద్యార్థులు..కొన్ని అనుభవాలు

వరంగల్ నా చైతన్యాన్ని, సామాజిక స్పృహని చాలా ప్రభావితం చేసింది. దళిత పిల్లలకుండే సామాజిక అనుభవం వల్ల వాళ్లకు రీసెర్చ్ గైడెన్స్ చేస్

Published: Thu,July 17, 2014 01:25 AM

పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుడు

తెలంగాణ పునర్నిర్మాణం మీద అన్ని వర్గాలు ఏదో ఒక స్థాయిలో విస్తృతంగా చర్చిస్తున్నాయి. ఈ కృషి లో అందరికి పాత్ర ఉన్నా ఉపాధ్యాయుల పాత్ర

Published: Wed,July 9, 2014 11:31 PM

రాముడిని ముంచుతున్న అభివృద్ధి

ప్రొఫెసర్ జి. హరగోపాల్: పోలవరం మీద భద్రాచలంలో టి.పి.టి.ఎఫ్ నిర్వహించిన సదస్సులో రాముడికి అభివృద్ధికి మధ్య వైరుధ్యం ఎలా తీవ్రమౌతున

Published: Thu,July 3, 2014 02:06 AM

ఇంకా ఈ దురాచారమా?

దేశం అభివద్ధి దశలో వేగంగా ముందుకు సాగినా, పాకీ పని వారు ఆ పని నుంచి విముక్తి చెంద డం అటుంచి, పంజాబ్, హర్యానా లాంటి అభివద్ధిచెందిన

Published: Thu,June 26, 2014 12:34 AM

ఆశాజనక తెలంగాణం

ప్రొఫెసర్ జి. హరగోపాల్ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి ఒక నెల కూడా కాలేదు. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసి వార

Published: Thu,May 29, 2014 12:09 AM

నెహ్రూ ఉదారవాదం ఆది, అంతం

ప్రొఫెసర్ జి. హరగోపాల్ నిన్నటికి(27-5-2014) నెహ్రూ గారు మరణించి యాభై ఏళ్లు. ఆ సం దర్భంలో కొన్ని పత్రికలలో ఆయన గురించి కొంతచర్చ జ

Published: Thu,May 15, 2014 12:19 AM

నవతరం ఆదర్శవాది

-ప్రొఫెసర్ జి. హరగోపాల్ మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలతో జీవించి, జీవితమంతా పేదల పక్షాన నిలిచి, నిరంతరం పోరాడి, నిరాడంబరంగా జీవించిన సున

Published: Sun,April 27, 2014 01:40 AM

పాలమూరులో పౌరహక్కులు

కనీసం 2019 ఎన్నికల వరకన్నా స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వాతావరణం ఏర్పడాలి. డీఎస్పీ గారి ముందు దోషిగా నిలబడి, అనుమతి కావా

Published: Thu,April 24, 2014 02:00 AM

ఫాసిజం దిశగా దేశం

విశ్వహిందూ పరిషత్ నాయకుడు తొగాడియా ముస్లింలతో ఏ లావాదేవీలు పెట్టుకోవద్దని,వాళ్ళ భూములను కొనాలేకానీ వాళ్ళకు భూములు అమ్మకూడదని అనడంత

Published: Thu,April 17, 2014 02:00 AM

చిదంబరం ఎక్కడ?

కొన్ని సంవత్సరాల కిందట (సంవత్సరం సరిగ్గా గుర్తులేదు) దేశవ్యాప్తంగా పార్ట్ టైం, టెంపరరీగా పనిచేస్తున్న మూడు లక్షలమంది పోస్ట్‌మెన్

Published: Fri,February 28, 2014 12:26 AM

బిల్లులో చిల్లులు

కాంగ్రెస్ పార్టీలోని కొందరు ప్రతినిధులు తెలంగాణ ఉద్యమాన్ని బాహాటంగా వ్యతిరేకించారు. వాళ్ళే ఇప్పుడు తెలంగాణ చాంపియన్స్‌గా పోజు పెడ

Published: Thu,February 20, 2014 12:07 AM

నిద్రలేని రాత్రి

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన చారివూతక సందర్భంలో నేను యాదృచ్ఛికంగా వీవీ ఇంట్లో ఉన్నాను. అప్పటి వరకు రాజకీయాల గురించి, పాలక

Published: Thu,February 13, 2014 01:56 AM

పతనమవుతున్న వ్యవస్థలు

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశంలో మనలేదని, భారతీయులకు తమ దేశాన్ని పరిపాలించుకునే శక్తి లేదని, బ్రిటిష్‌వాళ్లు తిరిగి వచ్చి ఈ దేశా

Published: Thu,February 6, 2014 12:17 AM

విషపూరిత రాజకీయాలు

ఈ మధ్య రాజకీయ పరిభాషలో విషం చాలా ప్రాధాన్యం సంతరించుకున్నది. సోనియాగాంధీ బీజేపీని విమర్శిస్తూ దేశంలో విష బీజాలు నాటారు అని అంటే, మ

Published: Fri,January 31, 2014 12:30 AM

తెలంగాణ పోరాటంలో మరో మలుపు

ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీని మెజారిటీ ప్రవర్తనను గీటురాయిగా తీసుకుంటే, రాజ్యాంగమే కాదు, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు ప్

Published: Thu,January 30, 2014 12:32 AM

ముఖ్యమంత్రి వాదనలు -వాస్తవాలు

రాష్ర్టాల్లో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి జరగని పరిస్థితి ఉంటుంది. ఆ రాష్ర్టాలు చీకట్లో మగ్గుతున్నా యా? కేంద్రం కరెంటు ఇవ్వ

Published: Thu,January 2, 2014 01:14 AM

ఆదివాసీలపై యుద్ధం ఎందుకు?

ఖనిజ వనరులను దానం చేయడానికి గిరిజనులను బలిపశువులను చేయడాన్ని ఎవరు క్షమించినా, చరిత్ర క్షమించదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందనుకు

Published: Sun,December 29, 2013 11:57 PM

మా భూమికి వందనం

జన సభాంతర వేదికపై నిన్ననే కదా నిను విన్నది నిను కన్నది ఇంతలోనే నిను మాయం చేసిందెవరు? ఇంతలోనే మా గుండెలో ఇంత బాధ దింపిందెవరు?

Published: Thu,December 12, 2013 01:05 AM

ఎన్నికల ఫలితాలు: రూపం-సారం

ఎన్నికకు ఎన్నికకు మధ్య తేడా ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ప్రత్యక్ష చర్య కొనసాగించాలి. తమ జీవితాలు మారడానికి, ఎన్నికల సారాన్ని మార్చడా

Published: Thu,November 28, 2013 12:02 AM

మేధావులు ప్రమాదకరం!

కేంద్ర హోంమంత్రిత్వశాఖ తన నివేదికలో ‘మావోయిస్టు పార్టీ సైన్యం కంటే.., దాని సిద్ధాంతకర్తలు, మేధావులు ఎక్కువ ప్రమాదకరం’ అనే ఒక గొప్ప

Published: Thu,November 7, 2013 01:24 AM

ఒపీనియన్ పోల్స్ ప్రజాస్వామ్యమా!

వా రం రోజులుగా జాతీయ ఆంగ్ల చానెల్స్ ఒపీనియన్ పోల్స్ గురించి ఎడతెగకుండా చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చ సందర్భంగా కాం గ్రెస్ పార్టీ

Published: Tue,December 26, 2017 10:32 AM

ఇందిర నుంచి మోడీ దాకా..

నరేంవూదమోడీ ప్రసంగాలను చాలా దగ్గరగా పరిశీలించవలసిన అగత్యమేర్పడింది. ఆయన భాష, భావము, వేషము కేవలం ఒక వ్యక్తి మాట్లాడుతున్నది కాదు. ద

Published: Tue,December 26, 2017 10:33 AM

తెలంగాణ: మావోయిస్టు రాజకీయాలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్ర హోంమంవూతిత్వ శాఖ అంతర్గతంగా మావోయిస్టు ప్రభావాన్ని గురించి తప్పకుండా చర్చిస్తుంటుంది. పెట

Published: Wed,October 9, 2013 12:27 AM

ఇంకో అడుగు

ఇవ్వాల నా తొవ్వలే చూస్తున్నది దేశం వొడిసిన రక్తంతో తడిసిన మట్టిలో వీరయోధుల కలల మొలకలు కాళ్ళు తెగి, కలలు కాలి ఏండ్లసంది వీపు

Published: Tue,December 26, 2017 10:34 AM

జార్జి ఆర్వెల్ 1984 నిజం కానుందా!

ప్రపంచ ప్రజలు సమైక్యంగా మెరికావలంబిస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలను, వాటి వెనుక ఉండే అమెరికా కార్పొరేట్ల ప్రయోజనాలను వ్య

Published: Tue,December 26, 2017 10:34 AM

సమతుల్యం కోల్పోతున్న సమాజం

నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ శిక్ష వేయడానికి న్యాయవ్యవస్థ చట్టపరిధి దృష్ట్యానే కాక బయటి సమాజం ఒత్తిడిని కూడ

Published: Wed,September 4, 2013 11:02 PM

విప్లవము- ప్రతీఘాత విప్లవము

డాక్టర్ అంబేద్కర్ విస్తృత రచనలలో పైన పేర్కొన్న రచన చాలా గొప్ప సూత్రీకరణ. ప్రపంచ చరివూతలో ఏ నాగరికత అయినా ఒక గెంతె ముందుకు వేసిన తర

Published: Thu,August 22, 2013 12:22 AM

మధ్యయుగంలో మనదేశం

మహారాష్ట్రలోని పూనా నగరంలో అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్కరణవాదిని (ఆయన విప్లవకారుడు కాదు) నరేంద్ర దభోల్కర్‌ను, అద

Published: Sun,August 11, 2013 12:18 AM

తెలంగాణలో పౌరహక్కులు

ఈరోజు (11-8-2013)హైదరాబాద్‌లో రెండు సభలు జరుగుతున్నాయి. యాదృచ్ఛికమే కావ చ్చు. ఒకటి- ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం 16 వ మహాసభలు, రెండ

Published: Wed,August 7, 2013 11:17 PM

సమైక్య గానంలో హైదరాబాద్ రాగం

తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఎప్పుడు జరిగినా దానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఏదో ఒక ఉద్యమాలు ప్రతి స్పందనగా ముందుకు వస్తున్నాయి.తెలం

Published: Wed,July 31, 2013 11:11 PM

తెలంగాణ: ఒక చారిత్రక మలుపు

తెలంగాణ రాష్ట్ర ప్రకటన సందర్భంలో నేను, సియాసత్ ఎడిటర్ జహేద్ అలీఖాన్ మహబూబ్‌నగర్‌లో ఇఫ్తార్ పార్టీలో ఉన్నాం. అందుకే ప్రకటన వస్తూనే

Published: Thu,July 25, 2013 12:02 AM

బొటానికల్‌గార్డెన్ విధ్వంస చరిత్ర

మాదాపూర్‌లోని విజయభాస్కర్‌డ్డి బొటానికల్ గార్డెన్ గురించి ‘నమస్తే తెలంగాణ’ పత్రిక చాలా వివరంగా రాయడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. త

Published: Thu,July 18, 2013 12:46 AM

మళ్లీ హత్యలు, బెదిరింపులు

సెప్టెంబర్ 19,2005 మధ్యాహ్నం ఒక అగంతకుడు నాకు ఫోన్ చేసి తాను కోబ్రానని, నేను వాళ్లను విమర్శిస్తున్నానని, వాళ్ల బెదిరింపులను నేను ప

Published: Thu,July 11, 2013 12:09 AM

తెలంగాణ ఇస్తారట!

తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరుతుందని మరోమారు ప్రజలు నమ్ముమన్నారు లేదా పాలకులు నమ్మబలుకుతున్నారు. తెలంగాణను ఇస్తున్నారా, తెలంగాణ త

Published: Thu,July 4, 2013 12:05 AM

లెక్కల్లో చిక్కుకున్న తెలంగాణ

దిగ్విజయ్‌సింగ్ ప్రకటనలు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొదటిసారి వేలాదిమంది ప్రజలను సమీకరించి ప్రజల సమక్షాన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం

Published: Thu,June 27, 2013 05:54 AM

నరేంద్రమోడీ అద్భుతదీపం!

చిన్నప్పుడు అల్లాఉద్దీన్ అద్భుత దీపం సినిమా చూసినప్పుడు అలాంటి దీపం మన దగ్గర ఉంటే ఎంత బావుండేది అనిపించింది. అయితే అల్లాఉద్దీన్ భా

Published: Thu,June 13, 2013 05:33 AM

చల్ చలో అసెంబ్లీ

తెలంగాణ ఉద్యమం మరో పర్యాయం ఉధృతం కావడానికి, ఉద్యమ స్ఫూర్తిని కాపాడుకోవడానికి చలో అసెంబ్లీ పిలుపునిచ్చింది. నిజానికి అసెంబ్లీలో క

Published: Thu,June 6, 2013 12:14 AM

ఆదివాసీలు: అధ్యాపకులు

ఛ త్తీస్‌గఢ్‌లో మార్పులు, మలుపులు చాలా వేగంగా, తీక్షణంగా చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయో, ఎంత ప్రాణనష్టం జరగనున్నద

Published: Thu,May 23, 2013 12:48 AM

పాలమూరు నీళ్లకు ప్రచారయాత్ర

పాలమూరు అధ్యయన వేదిక ఈ జిల్లాకు న్యాయంగా రావలసిన నీళ్ల కోసం ప్రజలను చైతన్యపరచడానికి, చలో అసెంబ్లీకి జనాన్ని సమీకరించడానికి ప్రచార

Published: Thu,May 16, 2013 12:15 AM

కర్ణాటక : ప్రజాస్వామ్య తీరు తెన్నులు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హేమాహేమీలు, బీజేపీ నుంచి అద్వానీ, సుష్మ స్వరాజ్, అరుణ్‌జెట్లీ, వెంకయ్య నాయుడు, భావివూపధానిగా మ

Published: Wed,May 8, 2013 10:05 AM

సామాజిక శాస్త్రజ్ఞులకు గుర్తింపు

సామాజిక శాస్త్రాల జాతీయ మండలి (ఐ.సి.ఎస్.ఎస్.ఆర్) దేశం లో మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో సామాజిక శాస్త్ర అధ్యయనానికి, విజ్ఞానానికి వ

Published: Wed,May 1, 2013 01:43 PM

ఉద్యమంలో కొన్ని మలుపులు

తెలంగాణ ఉద్యమ వయసు దశాబ్ది దాటింది. ఒక ఉద్యమం, ఇంత నిరంతరంగా సాగడం తెలంగాణ ప్రజల ఉద్యమ స్వభావాన్ని, పట్టుదలను చాటుతున్నది. సాధారణం

Published: Wed,April 24, 2013 11:32 PM

మిణుగురులు: అరుదైన ప్రయత్నం

అయోధ్య ఆయన మిత్రులు కళ్యాణ్ లాంటి వారు కలిసి అంధ బాలబాలికల సమస్యలపైన, వాళ్లమీద జరుగుతున్న అన్యాయాల మీద, అత్యాచారాల మీద మిణుగురులు

Published: Sun,April 21, 2013 01:54 AM

తెలంగాణ యువత ‘ఎన్‌కౌంటర్’

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ఎన్‌కౌంటర్’ లో దాదాపు పదిమంది మావోయిస్టులు చనిపోయారు. వీళ్లందరూ ఉత్తర తెలంగాణకు చెందినవారు. నెట్‌లో ‘ఉత్త

Published: Thu,April 11, 2013 05:01 AM

టెర్రరిజం- మీడియా రిపోర్టింగ్

హిందూ దినపత్రిక ఆదివారం (7-4-2013) నాడు పాతనగరంలోని సాలార్‌జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో మీడియా-టెర్రరిజం రిపోర్టింగ్ మీద ఆ పత్రిక ఎడి

Published: Wed,March 27, 2013 10:52 PM

తెలంగాణ ఉద్యమ దశ, దిశ

తెలంగాణ ఉద్యమ దశ, దిశను మళ్లీ మళ్లీ అంచనా వేయవలసి రావడం బాధాకరంగా ఉన్నా, ఏ ఉద్యమానికైనా తన గమ్యాన్నే కాక తన గమనాన్ని విమర్శనాత్మకం

Published: Thu,March 7, 2013 12:03 AM

పాదుకా పట్టాభిషేకం

మూడు నాలుగు సంవత్సరాల క్రితం కన్నాబిరాన్, నేను స్టేట్స్‌మెన్ పత్రిక ‘మావోయిస్టులు మనలో భాగమేనా’ అనే అంశం మీద కలకత్తాలో నిర్వహించిన

Published: Thu,February 28, 2013 01:45 AM

సమాచార హక్కు : సవాళ్లు

ఈ నెల 17,18 తేదీలలో హైదరాబాద్‌లో సమాచార హక్కుపై జాతీయ సదస్సు జరిగింది. ఈ హక్కు కోసం పోరాడుతున్న హక్కుల నేతలు, కార్యకర్తలు దాదాపు అ

Published: Thu,February 14, 2013 01:44 AM

మరణశిక్ష: ఆటవిక న్యాయం!

పన్నుకు పన్ను, కన్నుకు కన్ను అన్న న్యాయం ఆటవికమైనది. ఒక మని షి ఇంకొక మనిషికి హాని చేస్తే, అంతే హాని చేయాలనేది మానవసమాజ ఆవిర్భావ దశ

Published: Wed,January 30, 2013 11:15 PM

లెక్కతప్పిన కాంగ్రెస్

తెలంగాణ సమస్యను గణితాల ద్వారా పరిష్కరించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మీటింగ్‌లు పెట్టినా, ఎన్నిసార్లు లెక్కించినా పరిష్కారం రాద

Published: Wed,January 16, 2013 11:49 PM

పాలకులకు పట్టని పాలమూరు గోస

తెలంగాణ పరిష్కరించడం కోసం ఢిల్లీలో చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమస్య పరిష్కరం అయిపోతుందని ఆశిద్దాం. కానీ ఆంధ్ర పెట్టుబడిద

Published: Thu,January 3, 2013 01:41 PM

నేరము-శిక్ష-రాజ్యము

డల్లీలో జరిగిన అత్యాచారం మీద సమాజంలో చాలామంది ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భంలోనే బాధితురాలు మరణించడం, ఆగ్రహంగా ఉన్న మధ్యతరగతిని మరి

Published: Wed,December 26, 2012 11:45 PM

దేశ రాజధానిలో అరాచకత్వం

గత మూడునాల్గు రోజులుగా ఢిల్లీలో పరిణామాలను గమనిస్తే ఇంతకాలం తర్వాతనైనా ఒక మహిళ మీద జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసన

Published: Wed,December 12, 2012 10:38 PM

విదేశీ పెట్టుబడి: స్వదేశీ రాజకీయాలు

విదేశీ వస్తు బహిష్కరణతో వేడెక్కిన స్వాతంవూతోద్యమం, గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదంతో వికసించిన జాతీయతా భావాల పునాదులు ఎంత బలహీనమో, ఇ

Published: Wed,November 28, 2012 11:29 PM

నగదు బదిలీ: మరో గారడీ

కేంద్ర ప్రభుత్వం తాను అమలు చేస్తున్న 29 సంక్షేమ, అభివృద్ధి పథకాల మీద పెడుతున్న ఖర్చును నేరుగా డబ్బుల రూపంలో ప్రజలకు బదిలీ చేయడానిక

Published: Wed,November 21, 2012 11:28 PM

భారతదేశ పరిణామంలో బాల్‌ఠాక్రే

బాల్‌ఠాక్రే మరణాన్ని దేశంలోని మీడియా ముఖ్యంగా ఇంగ్లిషు మీడియా గంటల తరబడి ప్రసారం చేసింది. ఠాక్రే ఎదిగిన పద్ధతిని ఆయన గుణగణాల్ని సు

Published: Thu,November 15, 2012 12:22 AM

ఒబామా ప్రపంచ అధ్యక్షుడా!

అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన పోటీ మీద భారతదేశ మీడియా చూపిన ఆసక్తి, అది ప్రపంచంలోని 200 దేశాలలో ఒక దేశమైన అమెరికా అధ్యక్షుడి పోటీ

Published: Thu,November 1, 2012 12:03 AM

నిండా ముంచినవాడికి భయమేంటి?

నయా ఆర్థిక విధానాల మీద ‘నిండా మునిగిన వాడికి చలి ఏమిటి’ అనే టైటిల్‌తో ఈ కాలమ్‌లో రాసిన వ్యాసంపై మిత్రుడు పర్‌స్పెక్టివ్ ఆర్‌కే స్ప

Published: Thu,October 18, 2012 06:19 PM

వైవిధ్యం సరే, వైరుధ్యాల సంగతేమిటి?

హైదరాబాద్‌లో రెండు వారాలుగా అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నది. మాబోటి వాళ్లకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఈ సదస్సు కు హైద

Published: Thu,October 11, 2012 12:32 AM

పాలమూరు మీనాంబరం వాగు ఏమైంది?

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు తెలంగాణ డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లారని విని నా బోటి వాడికి చాలా ఆశ్యర్యమేసింది. ఇంత పెద్ద ప్రజ

Published: Thu,September 13, 2012 12:10 AM

నీళ్లులేక పాలమూరు కన్నీళ్లు

పాలమూరు జిల్లా కరువు గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోవడమే తప్ప, సమస్య పరిష్కారం జరగడం లేదు. ఆకలి, దప్పి ఉండే దాకా అలసిపోవడానికి వ

Published: Thu,August 23, 2012 12:30 AM

మళ్లీ నిషేధ రాజకీయాలు

మన రాష్ట్రంలో రెవల్యూషనరీ డెమొక్షికాటిక్ సంస్థ (ఆర్‌డీఎఫ్)ను నిషేధించడం తొందరపాటు చర్యే. రాజకీయ విశ్వాసాలను, ఆ విశ్వాసాలున్న సంస్థ

Published: Thu,August 9, 2012 01:17 AM

పోలీసు కుటుంబాల పోరాటం

‘మా లోని వాడివే, మా వాడివే నీవు పొట్టకూటి కొరకు పోలీసు అయ్యావు’ అని గద్దర్ పాడుతున్నప్పుడు పోలీస్ కానిస్టేబు ల్స్ చాలా ఆసక్తిగా పా

Published: Thu,August 2, 2012 01:37 AM

వెంటాడే విజయ్ జ్ఞాపకాలు

అలెక్స్ పాల్ మీనన్ అపహరణలో కీలకపాత్ర నిర్వహించిన మడకాం విజయ్ మరణించాడన్న వార్త విన్నప్పుడు ఒకేసారి చాలా జ్ఞాపకాలు తరుముకొని వచ్చాయ

Published: Wed,July 25, 2012 11:52 PM

విజయమ్మ దండయాత్ర

విజయమ్మ సిరిసిల్ల ‘సాహస’ యాత్రకు స్పందించడం కొంత వ్యక్తిగత ఇబ్బందితో కూడుకున్న అంశమైనా,ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగవలస

Published: Thu,July 12, 2012 12:14 AM

కిశోర్‌చంద్రదేవ్ పిల్లిమొగ్గ

కేంద్ర గిరిజన మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మారణకాండకు సరైన సమయంలో, సమస్య లోతుల్లోకి వెళ్లి అడిగిన ప్రశ్నలు, సలహాల

Published: Thu,July 5, 2012 01:04 AM

బస్తర్‌లో ఏం జరుగుతోంది?

రెండు నెలల కిందట బస్తర్‌లో జరిగిన కలెక్టర్ అపహరణ సందర్భంలో ఆ ప్రాంతం, అక్కడి ఉద్యమాల గురించి దేశ వ్యాప్తంగా, అలాగే మీడియాలో కూడా చ

Published: Thu,June 21, 2012 12:45 AM

జయశంకర్‌లేని తెలంగాణ

జయశంకర్ మరణించి అప్పుడే ఒక్క సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ

Published: Thu,June 7, 2012 02:19 AM

అడవిలో అందమైన ఆవుదూడ

సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ సందర్భంలో నేను బస్తర్‌కు వెళ్ళానన్నది చాలా మందికి తెలిసిన విషయమే. ఇంతకు ముం దు కూడా 1993లో కొయ్యూరుక

Published: Thu,May 31, 2012 12:28 AM

పాలమూరు - పరకాల-ఎక్కడికి

పాలమూరుకు పరకాలకు చాలాతేడా ఉంది. పాలమూరు జిల్లా చాలా చాలా వెనుకబడినజిల్లా. చైతన్యస్థాయి ఎదగవలసిన జిల్లా. వలస లు, కరువులతో బాధపడుతు

Published: Thu,May 17, 2012 12:06 AM

బి.డి. శర్మ:అరుదైన ఐఏఎస్

‘నమస్తే తెలంగాణ’ కాలమ్‌కు రాయడంలో కొంత గ్యాప్ వచ్చింది. మిగతా కారణాలతో సహా ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీన న్ కిడ్నాప్‌లో

Published: Fri,April 20, 2012 12:01 AM

జార్జి నేటికీ స్ఫూర్తిదాయకం

నలభై ఏళ్ల తర్వాత జార్జిడ్డి జ్ఞాపకాలు ఇంత సజీవంగా ఉండడమంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి జోహార్లు

Published: Sat,April 7, 2012 12:38 AM

ఉద్యమానికి ‘రియల్’ అడ్డంకి

రెండు వారాల క్రితం సంగాడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవానికి కాలేజీ ఆహ్వానం మీద, నేను దేశపతి శ్రీనివాస్ వెళ్ళాం. ప్రభుత్

Published: Thu,March 29, 2012 01:45 AM

ఉద్యమాలు-ఉప ఎన్నికలు

కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. సాధారణంగా ఎన్నికలలో ప్రజలు ఒక పార్టీని

Published: Wed,March 14, 2012 11:30 PM

రాజకీయాలు-మాఫియా

వారం రోజులుగా మధ్యవూపదేశ్ మాఫియా దురాగతాలను మీడియా రిపోర్టు చేస్తున్నది.వ్యాపారాలు దారితప్పి చట్టవ్యతిరేక ‘చీకటి లాభాల’ వేట లో పడ్

Published: Wed,March 7, 2012 11:45 PM

కొత్త కోణాల్లో రాష్ట్రాల పునర్‌విభజన

గత నెల 21,22వ తేదీలలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాష్ట్రాల పున ర్ వ్యవస్థీకరణ మీద ఒక జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో చాలా అంశ

Published: Thu,February 16, 2012 12:15 AM

ప్రపంచీకరణ: ఉన్నత విద్య

ఫిబ్రవరి 16న (నేడు) దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యలో ప్రవేశపెట్టబోతున్న సంస్కరణలను లేదా చాలా ప్రధానమైన మార్పులను వ్యతిరేకిస్తూ ధర్నాల

Published: Wed,February 8, 2012 11:41 PM

విద్య: విలువల చట్రమేమిటి?

విద్యాహక్కు చట్టం పాఠ్యవూపణాళికను పరిశీలించి తగిన మార్పులు చేయాలని ఆశిస్తున్నది. దానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను తమ తమ

Published: Thu,January 19, 2012 12:35 AM

మాతృభాషే వికాస సాధనం

విద్యాహక్కు చట్టంలో మాతృభాషలో బోధన అనే విలువను కాపాడే బదులు, ‘వీలైనంతవరకు మాతృభాషలో’ అని మాత్రమే చేర్చారు. ‘మాతృభాష’, ‘ఇంటి భాష’

Published: Thu,January 12, 2012 12:12 AM

కామన్ స్కూల్ వ్యతిరేక వాదనలు

గత రెండు నెలలుగా బెంగుళూరు లా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యార్థులకు మానవ హక్కుల రాజకీయ ఆర్థిక నేపథ్యాన్ని, అందు లో భాగంగా మన

Published: Wed,January 4, 2012 11:46 PM

కామన్‌స్కూల్: ప్రజాస్వామిక ఆవశ్యకత

పిల్లలందరికి సమాన అవకాశాలుండి నాణ్యమైన విద్య అందుబాటులో కి తేవాలనే భావనను ఇంతకు ముందే ఈ వ్యాస పరంపరలో పేర్కొన్నాను. అందరికి సమానమై

Published: Sat,December 31, 2011 11:32 PM

సకల జనులకు విద్య

విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమంలో ‘అందరికి విద్య’ అన్న అంశానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన ఒక దశాబ్ద కాలం తర

Published: Fri,December 30, 2011 12:43 AM

మరువలేని జ్ఞాపకం

కన్నబిరాన్ మన మధ్య లేక అప్పుడే సంవత్సరం దాటుతున్నది. కాలం గడుస్తున్నా..కాలం నడక మీద ప్రభావం వేసిన మనిషి జ్ఞాపకాలు కొనసాగుతూనే ఉం

Published: Thu,December 22, 2011 12:31 AM

విద్యా హక్కు పరినక్షణ ఉద్యమ పరిణామం

విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమం జాతీయ స్థాయి లో నిర్మించడంలో చాలామంది పాత్ర ఉన్నా ఇందులో అనిల్ సద్‌గోపాల్ పాత్ర చాలా కీలకమైంది. ఆయన జీ

Published: Wed,November 30, 2011 11:49 PM

ప్రజా ఉద్యమాలలో డబ్బు ప్రభావం

మానవ శ్రమ డబ్బుగా మారిన ప్రక్రియకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది. రూపాయలు లేదా కరెన్సీ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే అవుతే, ఇవి ప్రత్యే

Published: Fri,November 25, 2011 11:41 PM

మావోయిస్టులపై అంతటా అదే ‘మమత’

మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ ఎన్‌కౌంటర్‌కు స్పందిస్తూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

Published: Fri,October 28, 2011 10:51 PM

చైతన్యం వెలిగించిన సమ్మె

ప్రపంచీకరణ వ్యాధి భారతదేశాన్ని కూడా కబళించే క్రమంలో జరిగిన నష్టంలో, ట్రేడ్ యూనియన్‌లు కూలిపోవడం ఒక పెద్ద ఊహించలేని పరిణామం. గత శతా

Published: Fri,October 14, 2011 11:09 PM

సకల జనుల సమ్మె-అణచివేత

భారత రాజ్య వ్యవస్థ ప్రజా ఉద్యమాలకు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించడం చాలా కాలం కిందటే మానుకుంది. నాలుగు ఐదు దశాబ్దాలు గా ఎలాంటి ఉద్యమ

Published: Thu,September 29, 2011 11:33 PM

ఇది ప్రజాస్వామ్యమేనా?

మూడు వారాలుగా లక్షలాదిమంది తెలంగాణ పౌరులు, భిన్న రంగాలకు చెందినవాళ్లు-విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రభుత్వోద్యోగులు, రై

Published: Wed,August 31, 2011 11:25 PM

విధ్వంసమైన స్వప్నం

అరుంధతీరాయ్ సాహిత్య ప్రపంచంలోనే కాక, సామాజిక ప్రక్రియలో భాగమేకాక రాజకీయాలను ప్రభావితం చేసే ఒక అపూర్వమైన రచయివూతిగా ఎదిగారు. ఆమె మ

Published: Fri,August 19, 2011 03:10 PM

ప్రజాసంఘాలు: ప్రజాస్వామ్య సంస్కృతి

ప్రొ.హరగోపాల్ మహబూబ్‌నగర్‌లో ఈ నెల ఏడవ తేదీన ఆర్.ఎస్. రావు, పత్తిపాటి వేంక బుర్రా రాములు, మాధవస్వామి, జయశంకర్‌ల సంస్మరణల సభను పాల

Published: Fri,August 5, 2011 08:47 PM

ప్రపంచీకరణ సామాజిక ఉద్యమాలు

సమకాలీన సమాజంలో దేశ వ్యాప్తంగా భిన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏ ఉద్యమాలకైనా ప్రధాన ప్రేరకము - వ్యక్తులు తమ సమస్యలను తాము పరిష్కరించ

Published: Wed,July 20, 2011 11:27 PM

సమైక్యత అంటే ఏమిటి?

పొ.జి హరగోపాల్ సామాజిక శాస్త్రవేత్త పట్టణాల మధ్య పల్లెటూళ్ల మధ్య విపరీతమైన అగాధమేర్పడింది. వ్యవసాయరంగంలోని అదనపు సంపత్తిని హ

Published: Sun,July 17, 2011 05:48 AM

పత్రికా స్వేచ్చ

పొ.జి. హరగోపాల్ పత్రికలు నిష్పక్షపాతంగా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ నా దృష్టిలో అది సాధ్యం కాదు. అది అభిలషణీయం కూడా కాదు.