మధ్యయుగంలో మనదేశం


Thu,August 22, 2013 12:22 AM

మహారాష్ట్రలోని పూనా నగరంలో అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్కరణవాదిని (ఆయన విప్లవకారుడు కాదు) నరేంద్ర దభోల్కర్‌ను, అది కూడా ఉదయం నడకకు వెళ్లిన ఒంటరి మనిషిని ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు గంటి ప్రసాదం హత్యకు కొన్ని పోలికలున్నాయి. రెండు హత్యల్లో నడి వీధుల్లో వాహనాలలో వచ్చి ఇతర మనుషులు చూస్తుండగానే హత్య చేయడం. హంతకులు దొరకకపోవడం. ధబోల్కర్ హత్యలో హంతకులు పట్టుబడతారేమో తెలియదు. కానీ గంటి ప్రసాదం విషయంలో హంతకులను పట్టుకోరనేది అందరికి తెలిసిన విషయమే. ఈ ఇద్దరు విశ్వాలున్నవారు. సమాజాన్ని మార్చాలనుకున్నవారు. సర్వస్వం కాదని ఇతరుల కోసం జీవించినవాళ్లు. నిజాయితీపరులు. అన్నాహజారే అంటున్న అవినీతికి వీళ్లు అతీతులు. అయితే ఒకరిది విప్లవ విశ్వాసాలు, మరొకరది సంస్కరణ బాట. విప్లవ రాజకీయాల గురించి ప్రసంగించినప్పుడల్లా, విప్లవకారులు ప్రధాన స్రవంతిలో ఉంటూ సమాజాన్ని మార్చొచ్చు కదా అనే ప్రశ్న అడుగుతుంటారు. మనది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది. ఇంత ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదు అని పాలకులు మళ్లీ మళ్లీ అంటుంటారు.

ఈ వాదనలోని కొన్ని అంశాలను మనం అంగీకరిస్తే, మరి నరేంద్ర దభోల్కర్‌ను ఎందుకు హత్య చేసినట్లు? ఆయన రాజ్యం మీద పరిపూర్ణ విశ్వాసమున్నవాడు. వైద్యవృత్తిలో లక్షలు సంపాదించగలిగి, తన వృత్తిని వదిలి శాంతియుత సామాజిక మార్పు కోసం, రాజ్యాంగ విలువల కోసం కృషి చేస్తున్నవాడు.మన రాజ్యాంగంలో పౌరుడి విధుల్లో, సమాజంలో శాస్త్రీయ దృక్పథా న్ని పెంచడం ఒక విధి. ఆ విధిని నిర్వహిస్తున్నవాడు. సమాజంలో పెరిగిపోతు న్న మూఢవిశ్వాసాలు, మతం పేర జరుగుతున్న వ్యాపారం, భూ ఆక్రమణలు, మోసా లు, హింసా రాజకీయాలు వీటికి ప్రధాన కారణం. మావోయిజం ఈ ధోరణులకు వ్యతిరేక పోరాటమని మావోయిస్టులు వాదిస్తుంటారు. మావోయిస్టులను దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ప్రమాదంగా పేర్కొన్న ప్రధాని, పూనా లో లేదా గుజరాత్ లో జరిగిన మారణకాండ గురించి ఏం అంటారు? ఆ మాటకు 1984లో ఢిల్లీలో జరిగిన మారణకాండను ఏం అంటారు? మత ద్వేషాలు రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తున్న వాళ్లు అంతర్గత భద్రతకు ముప్పుకాదా? ఏ మనిషి కూడా బయట తిరగలేని పరిస్థితి వేగం గా పెరుగుతున్నది.

నియో లిబరల్ మాడల్ ప్రవేశపెట్టి దేశాన్ని తాకట్టు పెడుతున్న క్రమంలో మతద్వేష రాజకీయాలు పుంజుకున్నాయి. ఈ హింసా రాజకీయాలను వ్యవస్థ, రాజ్యం పనికట్టుకొని ప్రోత్సహిస్తున్నది. వీటికి తోడుగా అన్ని రాజకీయ పార్టీలు మాఫియాను పెంచి పోషిస్తున్నాయి. ఈ మాఫియా పని రాజకీయ నాయకులకు అడ్డం వచ్చిన వాళ్లను, లేదా ప్రశ్నించే వాళ్లను భయపెట్టడం, మరీ ఇబ్బందిగా మారితే హత్య చేయడం వీళ్లు ఎవరినీ లెక్కచేయరు. పోలీసు అధికారులను కూడా హత్యచేస్తున్నా రు. పూనాలోని హంతకులు ఈ సామాజిక నేపథ్యం నుంచి పుట్టుక వచ్చినవాళ్లే.
డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యను చాలా తీవ్రంగా పరిగణించవలసి ఉంటుంది. ఈ దేశం పెట్టుబడిదారీ సమాజంగా మారాలన్నా, అంధ విశ్వాసాలు అలాంటి అభివృద్ధికి కూడా ఆటంకమే.

భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ పుడుతున్నప్పుడు శాస్త్రీయ విజ్ఞానము శాస్త్రజ్ఞులు మూఢ మత విశ్వాసాలతో పొందవలసి వచ్చింది. గెలీలియో, కోపర్నికస్‌బూనో లాంటి శాస్త్రజ్ఞులు ఇలాం టి శక్తులతో పోరాడే క్రమంలో విపరీతమైన హింసను చవిచూశారు. ఆర్కమెడిస్ సమువూదపు ఒడ్డున లెక్కలు చేస్తుంటే సైనికులు ఆయనను కాల్చి చంపారు. ఇది దాదాపు మధ్యయుగాల చరిత్ర. ఆ శాస్త్రజ్ఞుల త్యాగాల నుంచి ఆధునిక సమాజం ఆవిర్భవించింది. పెట్టుబడిదారీ సమాజాలు మతాన్ని ప్రజాజీవనం నుంచి తప్పించి అదొక వ్యక్తిగత విశ్వాసం అనే స్థాయికి కుదించారు. మనదేశంలో పెట్టుబడిదారీ నమూనాను అంగీకరించినది మొదలు మూఢ విశ్వాసాలు, మత ద్వేషాలు పెంచుతున్నారు. మూఢ విశ్వాసాలను పెంచే దేశంలో శాస్త్రీయ విజ్ఞానం పెరగడం సాధ్యం కాదు. అటు ప్రజలకు ఉపయోగపడకుండా ఉండే విజ్ఞాన సృష్టి జరగదు. అలాగే అత్యం త సృజనాత్మకమైన సైన్స్ కూడా పెరగదు. సైన్స్‌లో నోబెల్ బహుమతులు సాధించడం దాదాపు అసాధ్యం. శాస్త్రీయ సామాజిక సందర్భం లేకుండా మన శాస్త్రజ్ఞులు ముందుకు వెళ్లలేరు. అలాంటి సామాజిక వాతావరణం కల్పించడం కోసం శాస్త్రజ్ఞులు పనిచేయడం లేదు. అలా ఆలోచిస్తే పూనా దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడడమే కాక దభేల్కర్ మృతి పట్ల స్పందించాలి. సైన్స్ ప్రయోగశాలలను ఒకరోజు మూసివేయాలి. ఇది శాస్త్రజ్ఞుల అవసరం.

మనదేశంలో గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో మత ప్రాధాన్యాన్ని చాలా పెంచారు. దాంతోపాటు బాబాలు, స్వా ములు, మఠాలు చాలా చాలా పెరిగాయి. ఒక సెక్షన్ యువత ఈ రాజకీయాల పట్ల ఆకర్షితులవుతున్నాయి. ఇంత వృత్తి విద్య ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసేవారు, ఎన్నారైలు ఈ రాజకీయాలకు పెద్ద మద్దతుగా తయారయ్యారు. విషపూరితమైన మత ద్వేష రాజకీయాలను ఎక్కించి మనుషులను భయవూబాంతులను చేసే సామాజిక శస్తులను పెంచారు. ఈ సామాజిక శక్తుల పాత్ర రానురాను పెరుగుతున్నది. ఈ సామాజి క అస్థిరత, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, చట్టబద్ధపాలన పూర్తిగా విచ్ఛిన్నమవ్వడం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో విశ్వా సం దెబ్బతినడం భవిష్యత్తు అంధకారం గా కనిపించడం ఇది ఫాసిజానికి సరైన పరిస్థితులు. నరేంవూదమోడీ పాపులారిటీకి ఇవన్నీ దోహదపడుతున్నాయి. ఈ పరిస్థి తి ఇలాగే కొనసాగితే మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నాం అనే ‘భావన’ కూడా త్వరలోనే మాయమవ్వ చ్చు. ఫాసిజం అటు రాజ్యాన్ని ఇటు సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకుం చాలామంది దభేల్కర్‌లు పుట్టుకవస్తారు.పుట్టుక రావాలి. మనుషులు పూర్తి గా అమానవీయమైన, అభవూదతతో కూడి న సమాజంలో జీవించడానికి ఇష్టపడరు.అందుకే పోరాటాలు చేస్తుంటారు.

ఈ మొత్తం కలుషిత వాతావరణం నుంచి తెలంగాణ యువత, తెలంగాణ సమాజం తనను తాను రక్షించుకోవాలి. ఈ ప్రాంతానికి పోరాట చరిత్ర ఉన్నది. మానవీయంగాపజాస్వామ్యంగా, సహసంగా ఆలోచించే వారి సంఖ్య దేశంలో ని ఇతర అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ. కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు గణనీయమైన సంఖ్యలో ఉండడం ఈ ప్రాంత విశేషం అనేది చాలా సందర్భాల్లో నేను రాశాను. రాజకీయాలు ఎలా ఉన్నా, అవి ఎంత దిగజారినా ప్రజాస్వామ్యస్ఫూర్తిని మధ్యయుగాల ఆటవికత నుంచి పౌర సమాజం కాపాడుకోవాలి. దేశంలో ఫాసిజం పూర్తి అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో దాని వ్యతిరేక పోరాటం ఈ ప్రాంతమే నుంచే కొనసాగించాలి.

పొఫెసర్ జి. హరగోపాల్

261

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles