సమైక్య గానంలో హైదరాబాద్ రాగం


Wed,August 7, 2013 11:17 PM

తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఎప్పుడు జరిగినా దానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఏదో ఒక ఉద్యమాలు ప్రతి స్పందనగా ముందుకు వస్తున్నాయి.తెలంగాణ ఉద్యమం ఉధృతంగా లేనప్పుడు ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంటూ వచ్చింది. నిజానికి ఉద్యమ వేడి లేనప్పుడు, మనుషులు కొంచెం నింపాదిగా ఆలోచిస్తున్నప్పుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలేమిటి, వాటికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించ డం మానేశారు. ‘మీరు ఉద్యమం చేస్తే మేం ఉద్యమం చేస్తాం’ అన్న పద్ధతి లో ఉద్యమాలు నడుస్తున్నాయి. అది కూడా మీరు వేరుపడతాం అని అంటే తాము సమైక్యంగా ఉందాం అంటున్నారు. సమైక్యతకు భూమిక ఏమిటి? అభివృద్ధి చెందిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి నీళ్ళలో వాటా ఎక్కువ ఇస్తారా, లేదా వాళ్లకు న్యాయంగా రావలసిన నీళ్ళను వాళ్లకు కేటాయించం డి అని అడుగుతారా? వెనుకబడిన ఈ ప్రాంతం బాగుపడడానికి ఏం ఏం చేయాలి అని ఏమైనా సూచనలు చేస్తున్నారా? ఏప్రాతిపదిక మీద కలిసి ఉండడం సాధ్యం అనే అంశం ఎక్కడ ఉద్యమ చర్చలో లేదు.


రెండు ప్రాంతాలు కలిసినప్పుడు ‘పెద్ద మనుషుల’ (వాళ్లేం అంత పెద్ద మనుసున్న వాళ్ళు కాదు) ఒప్పందం, మరోసారి ఉద్యమానికి ఆరుసూవూతాల పథకం,మరో సందర్భంలో 610 జీవో ఏవో కొన్ని రాయితీలు సూత్ర రీత్యా అంగీకరించారు. ఈసారి తెలంగాణ ఉద్యమానికి ఏ రాయితీ కూడా ప్రకటించడానికి సిద్ధంగా లేరు. అన్యాయం జరిగింది అని అంటే సమైక్యవాదాన్ని యుద్ధ స్థాయిలో ఎత్తుకున్న పరకాల ప్రభాకర్ లాంటి పెద్దమనుషులు అసలు అన్యాయమే జరగలేదని, తెలంగాణవాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలని ఒక పుస్తకమే రాసి, వాదించిన ప్రతివారితో తగాదాలు పెట్టుకొని ‘మనం కలిసుందాం’ అని బెదిరించే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇది ఏం సమైక్యవాదం? తెలంగాణలో ఆలోచించే వాళ్లందరికి, కలిసుంటే బావుండేది అనే మా బోటి వాళ్లకు అబద్ధాలు చెప్పే అవసరం ఏం ఉంది? పాలమూరు ప్రజల దీనగాథను విని ఈసడించుకునే వాళ్లతో ఏం చేయగలం? ఎందుకో ఈ పర్యాయం ఆ ప్రాంతం పాలకులు మాతో కలిసి పడి ఉంటే పడి ఉండండి అనే ధోరణి తప్ప కొంత న్యాయపూరితంగా మాట్లాడడానికి కూడా సిద్ధంగాలేరు. ఇప్పుడు వాదన కోసం వాదన, కాని మనసులో విడిపోతే విడిపోదాం అనే ధోరణే ఎక్కువుంది.


సమైక్యత అనేది ఉన్నతమైన ఆశయమని నేను ఎన్నో సందర్భాల్లో రాశా ను, మాట్లాడాను. సమైక్యతకు ఇతర మనుషుల పట్ల ప్రేమ, వాళ్ల సమస్యల పట్ల వేదన, విడిపోకుండా ఉండడానికి కొంత త్యాగం, సంయమనం, వాళ్ల భాష పట్ల, సంస్కృతి పట్ల లోతైన గౌరవం, మాట్లాడే పద్ధతిలో ఒక అవగాహన కనిపించాలి. వీళ్లతో కలిసి ఉంటే మన సంస్కృతి ఇంకా సుసంపన్నమౌతుందన్న విశ్వాసం కలగాలి. ఈసారి ఉద్యమంలో వీటి వాసనలు కూడా కనిపించడం లేదు. సమైక్యత గానంలో సమైక్య రాగం లేదు. ఇంతకాలం సమైక్యంగా ఉండాలని అన్నవాళ్లే విగ్రహాలను విధ్వంసం చేసి, కేసీఆర్‌ను ‘పిచ్చికుక్క’ అని కడపలో పోస్టర్లు వేసిన వాళ్లకు కలిసి ఉండాలి అన్న కోరిక వీసమంతైనా ఉందా? అందుకే సమైక్య ఉద్యమం సారం లేని రూపం. కేసీఆర్ ఒక ఉద్యమ నేత. సమైక్యంగా ఉండాలంటే అలాంటి వాళ్లతో మాట్లాడవలసి ఉంటుంది. అలాంటి వాళ్లను ఒప్పించవలసి ఉంటుంది. అయినా సమైక్య ఉద్యమం విచిత్రం కాకపోతే తెలంగాణ ప్రజలు మాతో కలిసి ఉం డాలని అని ఆంధ్ర ప్రాంతంలో విధ్వంసం చేస్తే ఏం లాభం? నిజంగా తెలంగాణ వాళ్లు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉంటే ఏం అయ్యుండే ది? ఇవి ఏవీ కూడా సమైక్యతకు సంకేతాలు కావు.

అంతిమంగా కేంద్ర ప్రభుత్వంతో, సోనియాగాంధీతో ఆంధ్ర ప్రాంత నాయకులు చేసిన డిమాండ్ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమని. ఇంగ్లిషులో పిల్లి బయటపడింది. క్యాట్ ఈజ్ ఔట్ అంటారు. అంటే సమైక్య నినాదంలో హైదరాబాద్ నగరం మీద ఆధిపత్యం చాలా బలంగా ఉందని అర్థం. నిజానికి హైదరాబాద్‌లో ఉంటున్న ఇరవై ముప్ఫై లక్షల మంది ఆ ప్రాంతం వాళ్లు నా దృష్టిలో హైదరాబాద్ వాళ్లే. అంటే తెలంగాణ వాళ్లే. ఇళ్లు కొనుక్కొని పిల్లలు చదువుకుంటూ స్థిరపడిన వాళ్లను వెళ్లమని ఎవరూ అనరు. అనకూడదు కూడా.ఆ విషయం తెలంగాణ ఉద్య మం పదే పదే చెపుతూ వచ్చింది. ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, మిలియన్ మార్చ్ సందర్భంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అభవూదత అన్నది హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతం వాళ్లకే కాదు, పేద తెలంగాణ జనానికి, మురికి వాడల్లో నివసిస్తున్న వాళ్లకి, పౌరహక్కుల వాళ్లకి అందరికీ ఒక అభవూదతా భావమే ఉంది. హైదరాబాద్‌లో ఎంతమంది తెలంగాణ మహిళలకు, ఎంతమంది దళితులకు, ఎంతమంది కార్మికులకు, యువతకు భద్రత ఉంది? నరేంవూదమోడీ హైదరాబాద్‌కు వస్తున్నాడంటే, ఆయనను నాయకుడిగా ప్రేమిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని చూసి హైదరాబాద్ ముస్లింలు ఎంత అభవూదతకు గురౌతున్నారో ఊహించడం చాలా కష్టం.

వేలమందిని ఊచకోత కోస్తుంటే చూస్తూ ఊరుకున్న ఒక ముఖ్యమంత్రి దేశ ప్రధాని అంటే ఎంత భయంకరం. గుజరాత్ అభివృద్ధి నమూనా అంటే మనుషుల శవాలపై నిర్మించిన అద్దాల మేడ. ఈ భయానికి ఎవరు కారణం. దీనికి ఏం పరిష్కారముంటుంది. ముస్లింలు ఇంత పెద్దసంఖ్యలో ఉన్న నగరానికి ఇప్పుడు ఆయనను ఎం దుకు ఆహ్వానించారు? ఆయనకంటే మెరుగైన నాయకులు బీజేపీలో లేరా? భయపెట్టాలనే తీసుకువస్తున్నారేమో! మొత్తంగా దుర్మార్గమైన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా దేశదేశాలనే అభవూదతా భావానికి గురి చేసింది. ఒక నిలకడ గలిగిన ఉద్యోగం లేకపోవడం, చేతినిండా పనిలేకపోవడం, చీలిపోయిన సమాజంలో జీవిస్తున్న అందరికి అభవూదతా భావం ఉంది. అసలే అభవూదతా భావానికి గురైన ఆ ప్రాంతం వాళ్లకు తెలంగాణ ఉద్యమం కూడా కొంత భయాన్ని కలిగించవచ్చు. కానీ తెలంగాణయే అభవూదతకు మూలకారణం కాదు.అభవూదతకు గురైన ప్రజలను సంపన్నులు, భూములు ఆక్రమించుకున్న వాళ్లు, నిజాం ప్యాలెస్ అలాంటి భవనాలు నిర్మించుకున్న వారు, ఇంకా దోచుకుందామనుకునే వారు ఆ భయాన్ని ఉపయోగించుకుంటున్నారన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మనమంతా కలిసికట్టుగా అభవూదతకు గురిచేసిన ఆర్థిక మూలాలని ఎదుర్కొవచ్చు.

ఆ సమష్టి పోరాటంలో హైదరాబాద్‌లో సమైక్యత దానంతట అదే వస్తుంది. రోజువారీ జీవితంలో కొందరు తెలంగాణ వారు కొన్ని పరుషమైన మాటలు మాట్లాడవచ్చు. ఆ కోపం కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ల మీద కాకపోవచ్చు. అలా మాట్లాడే తెలంగాణ వాళ్లు దానిని పూర్తిగా అర్థంచేసుకొని మాట్లాడకపోవచ్చు. కానీ సామాజిక సంబంధాలను ఉన్నతీకరించడానికి హైదరాబాద్ పౌర సమాజం, తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, మనిషిని మనిషిగా చూసేవారంతా శ్రమించవలసి ఉంటుంది.

ఇక ఉద్యోగుల విషయం కూడా కొంత చర్చించాలి. కేసీఆర్ ఆ ప్రాంత ఉద్యోగులు కొత్త రాష్ట్రానికి వెళ్లవలసి ఉంటుంది అని అన్నాడు. బహుశా ఆయన ఈ విషయాన్ని అంత సున్నితంగా చెప్పకపోవచ్చు. రాజకీయాల్లో సున్నితంగా మాట్లాడడం మానేసి చాలా కాలమయ్యింది? ఒకవేళ ఆయన మాటలు ఇతర ప్రాంత ఉద్యోగులను భయాందోళనకు గురిచేసి ఉండవచ్చు. ఆయన ప్రెస్‌మీట్‌లో చాలా స్పష్టంగానే ఆ ప్రాంత ఉద్యోగులకు ఆశ్వాసాన్నిచ్చాడు. హెచ్‌ఎం టీవీ నిర్వహించిన దశదిశలో చాలామంది ఆ ప్రాంత ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడారు. జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టమైన హామీ ఇచ్చారు. అయినా అప్రజాస్వామిక మీడియా చెప్పిన మాటనే చెప్పి, ఉన్నదాన్ని వక్రీకరించి, సంయమనం కోల్పోయి విషయాలను భూతద్దంలో చూపిస్తున్నాయి. నిజానికి మనమందరం మీడియాకు భయపడే కాలమొచ్చింది. సాధ్యమైనంత వరకు టీవీ చానళ్లలో వచ్చే సమాచారాన్ని శంకించడం అవసరం. మనుషుల మధ్యన సంఘీభావం పెంచవలసిన మీడి యా సామాజిక సంబంధాల విచ్ఛిన్నానికి కారణం కావడం ప్రజాస్వా మ్య విషాదం. ఒక్క విషయం ఉద్యోగులు గుర్తించవలసి ఉంటుంది. రాష్ట్రాలను విభజించినప్పుడు ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు చాలా సంఖ్యలో ఉండడం వల్ల కొత్త రాష్ట్రానికి వెళ్లాలనుకున్న వాళ్లు వెళ్తారు. వెళ్లడానికి ఇష్టం లేనివారు ఉద్యోగాలలో కొనసాగుతారు. వెళ్లిపొమ్మని చెప్పే అధికారం కేవ లం ‘క్యాట్’ లాంటి సంస్థలకే ఉంటుంది.

అసలు సమస్యలు ఇవేవీ కావు. హైదరాబాద్‌లో విపరీతంగా అక్రమంగా ఆస్తులను సంపాదించినవారు, ముఖ్యంగా లక్షలాది ఎకరాలను కబ్జా చేసిన వారికి విపరీతంగా అభవూదతా భావం ఉంది, ఉంటుంది కూడా. ఆస్తే అభవూతకు ఒక మూల కారణం. అక్రమ ఆస్తులు తప్పకుండా ఆ భయాన్ని కలిగిస్తాయి. భూమిని చాపలా చుట్టి తీసుకపోగలిగే గుణమే విశ్వంలో ఉంటే ఇన్ని సమస్యలుండేవి కావేమో. హైదరాబాద్‌లోని భూమిని తరలించడం సాధ్యంకాదు. అదే కేంద్ర సమస్య. అందుకే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చమంటున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అంటే యాభై లక్షల తెలంగాణ వాళ్లు, ఇరవై ముప్ఫై లక్షల ఆంధ్ర ప్రాంతం వాళ్లు, లక్షల ఎకరాల భూమి, కేవలం 30 లక్షలమంది ఆంధ్రప్రాంత ప్రజల రక్షణకు కేంద్ర పాలిత ప్రాంతమని కోరితే ఇంతకాలంగా మాట్లాడిన ‘సమైక్యత’ ఏమైనట్టు? సమైక్యత సాధ్యం కాకపోతే హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతానికి దక్కకుండా చేయడం సామరస్య పరిష్కారమెలా అవుతుంది?
హైదరాబాద్ పౌర సమాజం ఇవ్వలేని భద్రత కేంద్రపాలిత పాలన ఎలా ఇవ్వగలుగుతుంది? కేంద్ర ప్రాంత పోలీసులు రక్షణ ఇవ్వగలరా? తెలంగాణ తమకు దక్కకుండా చేశారన్న భావన యాభై లక్షల మంది తెలంగాణ వాళ్లను బాధిస్తే, ఇరవై లక్షలమంది ఆంధ్ర వారితో స్నేహపూరితంగా ఎలా ఉండగలరు? నిజానికి హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రాంతం వారు ఇది ఎవ్వరికీ దక్కకూడదనే ప్రతిపాదనను తిరస్కరించాలి. మేం కలిసే ఉంటాం, ఈ పట్టణం మా అందరిదీ అనడం ఎంత స్నేహ భావనను, ఆత్మీయతను పెంచుతుందో ఆలోచించాలి.

కేంద్ర పాలిత పాలన ప్రజలకు భద్రత ఇవ్వడం ఒక భ్రాంతే. ఆపాలన చేయగలిగిందల్లా ఎక్కువకు ఎక్కువ లక్షలాది అక్రమ ఆస్తులను కాపాడవచ్చు. రాజ్యానికి ఆస్తులను కాపాడేంత ఉత్సా హం మనుషులను కాపాడడంలో లేదు. మన స్వేచ్ఛను, మన అధికారాన్ని, మన అస్తిత్వాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారుల చేతిలో పెట్టడమే తప్ప మరేంకాదు. ఇది తెలంగాణ జిల్లాలలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతం వాళ్లకు ఎలా రక్షణ కల్పించగలదు? రూపంలో సమైక్యత సారంలో హైదరాబాద్ భూములు ఇప్పుడు పాలకులు నడుపుతున్న ఉద్యమానికి కేంద్ర బిందువు.

మనుషుల విజ్ఞత సంక్షోభంలో ఉన్నప్పుడే పనిచేయాలి. మనిషి ఏ ప్రాం తానికి వెళ్లినా తన చుట్టూ ఉండే మనుషులను ప్రేమించడం అనేది మానవ ప్రవృత్తి కావాలి. నమూనా అంతరాలను పెంచుతున్నప్పుడు, ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నప్పుడు మా రాష్ట్రం మాకు కావాలి అనే నినాదం ముందుకు వస్తుంది. అది చారివూతక పరిణామ క్రమంలో గతంలో చేసిన తప్పుల వల్ల, పాలించిన వారికి దీర్ఘకాలిక విజన్ లేకపోవడం వలన ఇలాం టి పరిష్కారాలతో ముందుకు వస్తుంటాయి. ఇలాంటి ఉద్యమాలు ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని పెంపొందిస్తాయా లేదా తెలియదు. ప్రజల బలమైన ఆకాంక్షలను న్యాయ భావనతో చూడాలి. సమైక్యత చాలా బలమైన ప్రజల ఆకాంక్ష అయి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడున్న వైరుధ్యాలకు తెలంగాణ ఉద్యమం ఒక పరిష్కారంగా చూడడం ఇప్ప టి అవసరం. గానం రాగం కలవని ఒక సందర్భమిది.

పొఫెసర్ జి. హరగోపాల్

159

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles