తెలంగాణ: ఒక చారిత్రక మలుపు


Wed,July 31, 2013 11:11 PM

తెలంగాణ రాష్ట్ర ప్రకటన సందర్భంలో నేను, సియాసత్ ఎడిటర్ జహేద్ అలీఖాన్ మహబూబ్‌నగర్‌లో ఇఫ్తార్ పార్టీలో ఉన్నాం. అందుకే ప్రకటన వస్తూనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల స్థానమేమిటి? ముస్లిం, హిందూ మతపర సంబంధాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండాలి అనే అంశం మీద మాట్లాడవలసి వచ్చింది. మా గ్రామంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చాలాకాలం పీర్ల పండగ ముస్లింల పండగ అని మాకు తెలియదు. మా నాన్న గారు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. ఆయన ఉర్దూలో చాలా ధారళంగా మాట్లాడేవాడు. ఉర్దూ ఇతర మతాల భాష లేదా ఒక విశ్వాసానికి చెందిన వారిది అని మేమెవ్వరమూ అనుకోలేదు. నేను పుట్టి పెరిగిన సందర్భం, అప్పుడే హైదరాబాద్ మీద సైనిక చర్య జరగడం, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో కల్పడం చకచకా జరిగిపోయాయి. ఈ మొత్తం ప్రక్రియలో చాలా హింసే జరిగింది. రజాకార్ల దుర్మార్గ చర్యలు, కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయభావాల మధ్య మేం పెరిగాం. మా అమ్మ ఎక్కువ అల్లరి చేసే కొడుకుని రజాకార్ అని అనేది.అప్పుడప్పుడే రజాకార్లు అదుపులోకి వచ్చారు.

కానీ ఆ జ్ఞాపకాలు ఎక్కడా మా గ్రామంలోని ముస్లిం, హిందువుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు నాకు తెలియదు. రెండు మతాల వాళ్లు సామరస్యంగానూ, స్నేహపూరితంగానే ఉన్నారు. ఈ గ్రామీణ మత సామరస్యము తెలంగాణ సంస్కృతి పునాదులుగా అర్థం చేసుకుంటే, తర్వాత కాలంలో జరిగిన మతద్వేషాలు, మత ద్వేష రాజకీయాలకు తెలంగాణ చరివూతలో పునాదులు లేవు.
ఇంతకు ముందు ఈ కాలమ్‌లో రాసినట్టు మేం ఎంఏ చదువుతున్న రోజుల్లో సామాజిక శాస్త్రాల అధిపతులు చాలామంది ముస్లింలే. అలాగే దివాకర్ల వెంకటావధాని, బహెబ్ కృష్ణమూర్తి లాంటి చాలామంది అధ్యాపకులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే. వాళ్లు ఆంధ్ర ప్రాంతం వాళ్లనే చర్చ గాని, అలాంటి భావాలు కానీ ఎక్కువగా లేవు. ఇది కూడా తెలంగాణ సంస్కృతిలో భాగమే. బాగా బోధించే అధ్యాపకులందరినీ విద్యార్థులు అభిమానించే వారు. ప్రేమించేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు చాలామందే ఉన్నారు. మానవ సంబంధాలు అస్తిత్వాల మీద ఇంకా ఏర్పడని సందర్భమది.

రాను రాను రాజకీయాలు, రాజకీయ నాయకులు ప్రజ ల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందడం ఒకవైపు ప్రజల చైతన్యం పెరిగి ఆకాంక్షలు వ్యక్తీకరణ పెరుగుతున్న పరిస్థితి మరోవైపు సామాజిక సంబంధాలను ప్రభావితం చేయడంతో పెరుగుతున్న చైతన్యాన్ని వ్యవస్థీకరించకుండా ప్రజలను తప్పు దారి పట్టించి, తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనడం వల్ల సామాజిక సంబంధాల విధ్వంసం ప్రారంభమైంది. దీనితో వ్యవస్థను మౌలికంగా మార్చి ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్యమాల స్థానంలో తాత్కాలిక సమస్యల పరిష్కారాల కోసం వెతకడంతో, అవకాశాలు తగ్గిపోతున్న వ్యవస్థ సామాజిక సంబంధాల పునాదులకు ప్రజాస్వామ్యీకరించే బదులు వాటిని విచ్ఛిన్నం చేయడంతో, నూతన సామాజిక ఉద్యమాలు ముందుకు వచ్చాయి. అలా ముందుకు వచ్చిన ఉద్యమాలలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రధానంగా పేర్కొనాలి. ఈ ఉద్యమంలో, అధికారాన్ని, అహంకారాన్ని ప్రశ్నించే తిరుగుబాటుతత్వంతో బాటు అసమానతలను అణచివేతకు వ్యతిరేకంగా ఎదురుతిరగడం ఒక అవసరంగా ముందకు వచ్చింది.

అందుకే ఈ ఉద్యమానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి; ఒక ప్రజాస్వామ్య స్వభావముంది, సమస్యల పరిష్కార ప్రయత్నం ఉంది. కానీ రెండవ కోణం; తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారాలేమైన వస్తాయా లేక ఈ మలుపు కేవలం ఒక రాష్ట్ర ప్రకటనగా, లేదా రాష్ట్ర ఆవిర్భావంతో ఆగిపోతాయా అన్నది తెలంగాణ ప్రజలను తెలిసో తెలియకో వేధిస్తున్నది.
తెలంగాణ ప్రకటన తర్వాత మహబూబ్‌నగర్‌లోనే ఎలాంటి తెలంగాణ, తెలంగాణ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏం జరగబోతుంది అన్న ప్రశ్నలు చాలామంది నోటి నుంచి వచ్చాయి. మహబూబ్‌నగర్ నుంచి నేరుగా రాత్రి పదిగంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లాం. పట్టరాని ఆనందంతో ఉన్నవాళ్లను చాలామందిని కలిసాం. నాలాంటి వాడికి చాలా గౌరవం ఇచ్చారు.

కొందరు కాళ్లు మొక్కారు. కొందరు గట్టిగా కౌగిలించుకున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్లు నిర్వహించినది చాలా పరిమిత పాత్ర, నిజానికి విమర్శక పాత్ర. బహుశా ఆ గౌరవం భవిష్యత్తు మీద విశ్వాసం కావచ్చు. లేదా మా లాంటివాళ్ల నుంచి వాళ్లు ఆశిస్తున్న పాత్ర కావచ్చు. అక్కడి సమూహంలో చాలామంది ముస్లింలు ఉన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలున్నారు. ఉద్యమకారులున్నారు. విప్లవ రాజకీయాలను అభిమానించే వాళ్లున్నారు. అందరూ ఆనందగానే ఉన్నారు. కానీ తెలంగాణ వస్తే ఎట్ల ఉంటది సార్ అని అడిగిన వాళ్లున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండబోతున్నదన్న ప్రశ్న కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ప్రజలు ఒక కార్యాచరణలో ఉన్నప్పుడు ‘కోమలి’ అనే పేర గంటి ప్రసాదం మీటింగ్‌లలో మాట్లాడితే మీ అంతుచూస్తాం అనే బెదిరింపు ఉత్తరం. చాలా విచిత్రం. ఈ బెదిరింపు ఉత్తరాలు రాస్తున్నవారు (పోలీసుల్లో ఒక భాగం) ఉద్యమం జరుగుతుందని కాని, ఇలాంటి ఉత్తరాలు రాసే అవకాశముందని కాని, తెలంగాణలో అధికారానికి వచ్చే వాళ్లు వీటిని సహించరని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుతారని వాళ్లకు అనిపించడం లేదు. బహుశా తమకు మరింత పెద్ద పాత్ర ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో తెలియదు. తెలంగాణ ఒక అద్భుతమైన ప్రాంతం. ఇతరుల జీవితాలు బాగుపడాలని, మనుషులంతా సుఖంగా, మనిషి మనిషిలాగా బతకాలానే స్వప్నం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు బహుశా మరే ఇతర ప్రాంతంలో లేరు. పౌరహక్కుల కోసం ప్రాణాలిచ్చిన డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు బహుశా ఏ ప్రాంతంలో కూడా లేరు.

వీళ్లందరీ త్యాగం తెలంగాణ సమష్టి చైతన్యంలో ఉంది. తెలంగాణలో వెల్లివిరిసిన రచయితలు, కవులు, కళాకారులు, గాయకులు, జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, విద్యావంతులు, మేధావుల సంఖ్య చాలా పెద్దది. వీళ్లలో నిజాయితీ కలిగి ప్రజల పక్షాన సమస్యలను చూసే వాళ్లు చాలామంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమాలు వీళ్లను సృష్టించాయా లేక వీళ్లు ఉద్యమానికి బాసటగా నిలిచి వాటిని ముందుకు తీసుకెళ్లారా చెప్పడం కష్టం. నిజానికి జయశంకర్, ఆతర్వాత కోదండ రాం తెలంగాణ ఉద్యమ చిహ్నాలుగా మారడంతో ఈ ఉద్యమ చైతన్యం, ఈ నిజాయితీ దోహదపడింది. దిగజారుతున్న రాజకీయ సంస్కృతికి భిన్నంగా విద్యా రంగం నుంచి వచ్చిన వీళ్లమీద నాయకత్వ బాధ్యత పెట్ట డం తెలంగాణ ప్రజల, ప్రజా ఉద్యమాల ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రంలో పౌరహక్కులు విలసిల్లుతాయని, మత సామరస్యం పెంపొందుతుందని, సమష్టితత్వం ముందుకుపోతుందని, హత్య లు, ఎన్‌కౌంటర్లు ఉండవని, వైద్యం, విద్య సామాజిక రంగంలోనే అభివృద్ధి అవుతామని, విశ్వవిద్యాలయాలకు, హాస్పిటల్స్‌కు పూర్వ వైభవం వస్తాయని ఆశించడం అత్యాశ కాదు. ఇవి ఏవి కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చేస్తాయనే నమ్మకం నాకు లేదు. కానీ ఇది సాధించబడతాయనే ఒక విశ్వాసం ఉంది. ఇంతమంది నిజాయితీపరులుండి, త్యా గాలు చేసే యువత ఉండి, చైతన్యవంతులైన ప్రజలుండి, బలవంతులైన ఆంధ్ర పెట్టుబడిదారుల మూలాలనే తాకగలిగి, వాళ్ల అధికార పరిమితులేమిటో చూపించగలిగిన తెలంగాణ ప్రజలు ఒక నూతన తెలంగాణను నిర్మించుకుంటారనే ఒక నమ్మకం అది నిర్మించుకోలేకపోతే చరివూతలో అదొక విశాదఘట్టంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

పొఫెసర్ జి. హరగోపాల్

303

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల