బొటానికల్‌గార్డెన్ విధ్వంస చరిత్ర


Thu,July 25, 2013 12:02 AM

మాదాపూర్‌లోని విజయభాస్కర్‌డ్డి బొటానికల్ గార్డెన్ గురించి ‘నమస్తే తెలంగాణ’ పత్రిక చాలా వివరంగా రాయడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. తెలంగాణ ఉద్యమం ఒకవైపు ఉధృతంగా జరుగుతూ ఉంటే, మన కళ్లముందే ఒక అందమైన పార్కు అదీ హైద్రాబాదు నగర ప్రజలకు ‘ఊపిరి తిత్తులు’ గా పనిచేస్తున్న పార్కును పార్కులోని వందల చెట్లను మా ముందే హృదయాన్ని కదలించేలా నరికారు. పచ్చటి చెట్లను కొట్టేప్పుడు మనసు బాధపడకపోవడం విచిత్రం. ఒక అమానుష ‘అభివృద్ధి’ కి హైదరాబాద్ నగరం గత రెండు మూడు దశాబ్దాలుగా ముఖ్యపట్టణమయ్యింది. మేం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే కాలంలో ఎండాకాలంలో కూడా ఉష్ణోక్షిగత 32, 33 డిగ్రీలు దాటేది కాదు. నగరం చాలా అందంగా ఉండేది. ఈ నగరాన్ని ఉద్ధరించామని, ఇప్పుడు ఈ నగరం అందరికి చెందిందని అనేవాళ్లు ఈ నగరం అందానికి, ఇక్కడి వాతావరణానికి, ఇక్కడి అద్భుతమైన గుట్టలను, శిల్పి చెక్కిన లేదా అమర్చినట్లుగా కనిపించే బండలను చూసి బయటికి వచ్చిన వాళ్లు చాలా వింతగా ఆశ్చరంగా చూసేవారు. జస్టిస్ సుదర్శన్‌డ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఇక్కడి లక్షల ఎకరాల భూమి, 440 కుంటలు, చెరువులు ఎక్కడపోయాయి అనే ప్రశ్న అడగడం ప్రారంభించారు.

దీన్నంతా అభివృద్ధి అని భావించమంటున్నారు. ఈ విధ్వంసంలో భాగమే ఈ పార్కు ఆక్రమణ. ఆక్రమణను నగర అభివృద్ధికి సంకేతంగా చూడమంటున్నారు.ఈ పార్కును సామాజిక అడవిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సామాజిక అడవులు అనే భావన పర్యావరణ పరిరక్షణ ప్రమాణాల నుంచి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ఒక ఆందోళన ప్రారంభమయ్యింది. వాతావరణాన్ని కాపాడాలనే అంతర్జాతీయ ప్రమాణాలు కాపాడతామని మన ప్రభుత్వం ప్రమాణం చేసింది. దాంట్లో భాగంగా ఈ బొటానికల్ గార్డెన్‌ని సామాజిక అడవిగా ప్రకటించారు. నూతన ఆర్థిక విధ్వంసం ప్రారంభమయ్యా క ఆ అభివృద్ధి రథచక్షికాల కిందపడి ఈ పార్కులోని జీవరాసులు ముఖ్యంగా అందంగా అడుకునే నెమళ్లు విలవిలకొట్టుకుంటున్నా యి. ఈ అభివృద్ధి నమూనా టూరిజాన్ని కూడా ఒక భావజాలంగా ముందుకు తీసుకవచ్చింది. చంద్రబాబు ఒక దశలో కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు ఇప్పుడున్నది టూరిజమే అని అనే సాహసాన్ని కూడా చేశాడు. టూరిజానికి ఎందుకు ఇంత ప్రాధాన్యం అని అప్పుడు అనుకున్నా, టూరిజం పేర రిజార్ట్స్, స్విమ్మింగ్ ఫూల్స్, హాలిడే హోంలు, ఇలా పేరు ఏది చెప్పినా దీని మతలబు భూములను ఆక్రమించుకోవడమే. ఈ బొటానికల్ గార్డెన్‌ని టూరిజం ముసుగున ‘ఇకో టూరిజం’ అనే ముద్దుపేరుతో చెట్లను నరికారు.

ఈ ఇకో టూరిజంలోభాగంగా ఇక్క డ పర్యావరణ రక్షణకు కావలసిన కార్యక్షికమాలు నిర్వహించబడతాయని, పర్యావరణానికి సంబంధించిన సినిమాలు చూపిస్తామని, ఇక్కడ పర్ణశాలలు కడతామని బుకాయించి, ఒక మల్టిప్లెక్స్ కట్టడం ప్రారంభించారు. ఈ మొత్తం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ శాఖ ముఖ్యంగా జైరాం రమేష్ మొత్తం అనుమతిని రద్దు చేశాడు. పర్యవసానంగా మంత్రిత్వశాఖ మంత్రిని మార్చా రు. ఈ పార్కును విధ్వంసం చేస్తున్నట్టే దేశం నిండా ఇదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్న చాలామంది ఉన్నారు. నిజానికి అధికారం ఇవాళ్ళ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నది. వీళ్ళకు బాసటగా అంతర్జాతీయ శక్తులున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కనుసన్నల్లో కాదు వాళ్ళు కన్నెపూరజేస్తే అధినేతలు కిందా మీదా అయిపోతున్నారు. మంత్రివర్యులు మారుతూనే పర్యావరణ శాఖ విధ్వంసకుల అధ్యాయంలోకి పోవడంతో, వీళ్ళ అనుమతిని పునరుద్ధరిస్తూ, ఇది చాలామంచి ప్రాజెక్టు అని, అయితే పర్యావరణాన్ని కాపాడడానికి వెలసిన మల్టిప్లెక్స్ ఖర్చు ఉంటుంది కాబట్టి కొంచెం వ్యాపారీకరణ తప్పదని, వాళ్ళ ప్రయోజనాలను కూడా చూడాలని నిస్సిగ్గుగా ఒక బ్యూరోక్షికాట్ రాసిన నోటు చూస్తే మన బ్యూరోక్షికాట్స్ ఎంత దిగజారిపోయారనిపిస్తుంది.

ఈ మొత్తం విధ్వంసాన్ని రోజూ గమనిస్తున్న వాకర్స్, అలానే దీనిచుట్టూ ఈ పార్కును నమ్ముకొని కొంచెం ఎక్కువ ధరైనా పర్వాలేద ని ఇళ్ళు కొనుక్కున్నవాళ్ళు ఈ విధ్వంసాన్ని అడ్డుకోవాలని నిర్ణయిం చి, ఒక చట్టపర పోరాటాన్ని చేస్తున్నారు. ఇప్పుడు బంతి న్యాయశాఖ కోర్టులో ఉంది.అంతిమంగా వాళ్ళేమి చేస్తారో చూడాలి. నర్మదా బచావ్ ఉద్యమకారులు తమ కేసును సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత పర్యావరణ ఉద్యమకారులు కోర్టులకు వెళ్ళడానికి భయపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దిశగా రాజకీయాలు నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ పార్కు భవిష్యత్తు ఎలా నిర్ణయింపబడుతుందో దాన్ని బట్టే కొత్త రాష్ట్ర దిశ తెలుస్తుంది. ఇది తెలంగాణ పాలక వర్గానికి ఒక సవాలు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే ఇక ఇప్పుడున్న మంత్రులు, ఉప ముఖ్యమంవూతులు కొనసాగుతారు. మరి వాళ్ళకు జ్ఞానోదయమై హైదరాబాద్‌ను, దాని పర్యావరణాన్ని పట్టించుకుంటారా? లేక హైదరాబాద్‌ను అమ్ముకుంటారా మనం చాలా సునిశితంగా పరిశీలించవలసి, పర్యవేక్షించవలసి ఉం ది. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగంగా, నూతన స్వ తంత్ర వాయువులు వీస్తాయా లేక మూసీనదిలో నుం చి వస్తున్న మురికి వాసన మరింత బలంగా వీస్తుందా చూడాలి. అంటే మూసీ ప్రక్షాళన రాజకీయ ప్రక్షాళన అనేవి తెలంగాణ ప్రజలకు సవాళ్ళే.
తెలంగాణ అభివృద్ధిని రాజకీ య నాయకులకు వదిలివేయడాని కి వీలులేదు.

నిజానికి తెలంగాణ ఉద్యమం చేసిన గొప్ప ప్రయోగం రాజకీయాలకు బయట జేఏసీలు ఏర్పడడం. జేఏసీ అనే భావన తెలంగాణ ఉద్యమం ప్రజలకు అందించిన కానుక. అన్ని జేఏసీ లు రాష్ట్రం కోసం నిజాయితీగా పనిచేస్తాయని ఘంటా పథంగా చెప్పడం కష్టం. కానీ దీంట్లో నుం చి చాలామంది నిజాయితీపరులు ఎదిగారు. మొత్తం అవగాహన పెరిగింది. ప్రజా చైతన్యం పెరిగిం ది. నిజాయితీగా పనిచేసే జేఏసీలు, పెరిగిన చైతన్యం వ్యవస్థీకృతమై రాజకీయ నాయకులను, రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కాలుష్యమయం కాకుండా కాపాడుకోవాలి. దాంట్లో భాగంగా ‘నమస్తే తెలంగాణ’ లాంటి పత్రికలు ప్రజా ఉద్యమాలతో నిలబడాలి. అప్పుడే మాదాపూర్ బొటానికల్ గార్డెన్ తన పాత అందాన్ని పొందుతూ కూల్చిన చెట్లు మళ్లీ చిగురించి భావితరాలకు బ్రహ్మాండమైన వృక్షాలను మనం ఇవ్వగలం. ఇవ్వగలగాలి.

పొఫెసర్ జి. హరగోపాల్

90

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల