మళ్లీ హత్యలు, బెదిరింపులు


Thu,July 18, 2013 12:46 AM

సెప్టెంబర్ 19,2005 మధ్యాహ్నం ఒక అగంతకుడు నాకు ఫోన్ చేసి తాను కోబ్రానని, నేను వాళ్లను విమర్శిస్తున్నానని, వాళ్ల బెదిరింపులను నేను ప్రమోషన్‌గా భావించినట్లు మీడియాలో వచ్చిందని, వాటన్నింటికి తాము తీవ్ర అభ్యంతరం చెబుతున్నామని అంటూ’ మీరు మావోయిస్టు పార్టీని సమర్థిస్తున్నారని, మావోయిస్టు పార్టీ గురించి చాలా అసభ్యమైన భాష లో మాట్లాడాడు. దాదాపు అరగంట జరిగిన ఈ సంభాషణలో తమను ఎక్క డా విమర్శించవద్దని, తాము మావోయిస్టు ఒక్కడిని కూడా బతకనివ్వమని అన్నారు. మరి మావోయిస్టులతో పోరాడుతామంటున్న మీరు బయటి ప్రజాజీవనంలో నిరాయుధంగా పనిచేస్తున్న వాళ్లను చంపడం, చంపుతామని బెదిరించడం ఎట్ల సమర్థించుకుంటారు అని అంటే, వీరందరూ మావోయిస్టు ముసుగులో పనిచేస్తున్నవారే అన్నారు. మావోయిస్టులు పొరపాట్లు చేస్తే మేం వాళ్లని కూడా విమర్శిస్తున్నాం కదా అంటే, సంభాషణ అక్కడ ఆపి మీరు మాపై విమర్శలు ఆపాలి అని ఫోన్ పెట్టేశాడు. ఆ సమయంలో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. ఈ మొత్తం బెదిరింపుల గురించి ప్రధాని, సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లాం. చివరిగా ప్రొఫెసర్ శేషయ్య నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డిని కలిసి చాలా విపులంగానే చర్చించాం. మారిన పరిస్థితి వల్లో లేక రాజశేఖర్‌డ్డి తీసుకున్న నిర్ణయం వల్లో 2005 అక్టోబర్‌లో ఆగిన బెదిరింపులు, మళ్లీ 2013 అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రారంభం కావడం దేనికి సంకేతమో తెలియదు.

ఇది తెలంగాణ ఉద్యమకారులను బెదిరించడానికి ఒక ఆరంభమేమో కూడా తెలియదు. అయితే బెదిరించేవాడు మొత్తంగా తమ ‘వృత్తి’ని ప్రవృత్తిని మానేయలేదు. ఒడిషాలో కలెక్ట ర్ అపహరణ సందర్భంలో మావోయిస్టు పార్టీ, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు నేను మధ్యవర్తిగా వెళ్లాలా, మా డాక్టర్ సోమరాజు గారు ఒప్పుకుంటా రా అని ఆలోచిస్తున్నప్పుడు ఫోన్‌లో కొంచెం అసభ్యకరంగానే ‘నీవు అంత పెద్దవాడివై పోయావా’ అంటూ కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో మధ్యవర్తిగా వెళ్లాలని నిశ్చయించుకున్నాను. లేకపోతే బెదిరించినవాడు ఈ పని కొనసాగించడానికి ప్రోత్సాహమేర్పడుతుందని వెళ్లవలసి వచ్చిం ది. ఛత్తీస్‌గఢ్ మధ్యవర్తిత్వం అప్పుడు కూడా ఇద్ద రు మావోయిస్టు ల బెయిల్ విషయంలో ఆదిలాబాద్‌లో ఒక గిరిజన కుటుంబంతో మాట్లాడుతున్న సందర్భంలో మధ్యలో కలుగజేసుకుని పకపక నవ్వులు వినిపించాయి. ఇది మన రాష్ట్ర అగంతకు ల పనే అని వేరే చెప్పనవసరంలేదు. ఈ అగంతకు లు ఎవరో, వీరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో తెలు గు ప్రజలకు బాగా తెలుసు.

భిన్న కారణాలవల్ల మావోయిస్టు పార్టీ కార్యకర్తలు మనరాష్ట్రం నుంచి మరింత వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు వెళ్లిపోవడంవల్ల దీన్ని పోలీసులు, ప్రభుత్వం తమ విజయంగా దేశవ్యాప్తంగా ప్రచా రం చేసుకుంటున్నారు.

శాంతి చర్చలు జరపడానికి పౌర స్పం దన వేదిక కృషి, వార్త లాంటి దిన పత్రి క మద్దతు, విస్తృత ప్రజా స్పందన గురించి ప్రస్తావించకుండా ప్రభుత్వం శాంతి చర్చలు దేశానికే నమూనా అని వాళ్లే చేసినట్లుగా ప్రచారం చేసుకున్నా రు.ఆంధ్రవూపదేశ్‌లో బెదిరింపుల దగ్గర నుంచి శాంతి చర్చల నుంచి, ప్రజాసంఘాల నాయకుల హత్యల నుంచి ఏది జరిగినా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం అలవాటు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా హోం మినిస్ట్రీ మన పోలీసులకు కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడంతో వీళ్ల నమూనా మీద వీళ్లకు ఎక్కడాలేని గురి కుదిరింది. ఆంధ్రవూపదేశ్ నమూనాను మెచ్చుకోవడంతో ఇక తాము చేసే పనులను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చునని భావిస్తున్నారు. ఆ కొనసాగింపే గతనెల రోజులుగా జరుగుతున్న పరిణామం. గంటి ప్రసాదం హత్య, హత్యను ఖండిస్తే బెదిరింపు లేఖలు. ఇది చాలా పాత పద్ధతే. అయితే ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం ఆంధ్రవూపదేశ్‌లో అంత బలంగా లేదు. ప్రభు త్వం ఈ మాట పదేపదే చెప్పి ప్రశంసలు పొందుతూనే ఉన్నది. మరి మళ్లీ ఈ ప్రయోగానికి ఎందుకు తెరలేపారోఅంత స్పష్టంగా తెలియడం లేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణ ప్రతిధ్వని ఆంధ్రవూపదేశ్‌లో ఎందు కో తెలియడం లేదు. ఒక్కమాట మాత్రం నిజం.ఛత్తీస్‌గఢ్ మొదలు పోరాటా లు జరుగుతున్న అన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్య సంస్కృతిలేదు.

మాట్లాడగలిగిన మధ్యతరగతి లేదు. ఒక పౌర సమాజమంటూ లేదు. ఉన్నా అది చాలా స్తబ్ధంగా ఉంది. అక్కడి బయట పనిచేసే వారు కానీ విశ్వాసాల కోసం నిలబడే వాళ్లుకాని లేకపోవడం ఆ రాష్ట్రాల విషాదం. ఇది అక్కడి పోలీసుల దురదృష్టం. మనరాష్ట్రంలో పౌర సమాజం రాజ్యం మీద ఎంత ఒత్తిడి పెట్టిందో అంతే ఒత్తిడి నక్సలైట్ ఉద్యమాల మీద కూడా పెట్టింది. పోలీసులను నిలదీసినట్లే, మావోయిస్టులను ప్రశ్నించారు.మావోయిస్టుపార్టీకి బాలగోపాల్ కు మధ్య ఒక ప్రజాస్వామ్య చర్చే జరిగింది. ఆయన చేసిన విమర్శకు అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ సమాధానంగా ఒక పుస్తకమే రాశారు. మొత్తం చర్చా సంస్కృతిని ఆంధ్రవూపదేశ్ పౌర సమాజం అభివృద్ధి చేసింది. పౌర స్పందన వేదిక అద్భుత ప్రయోగం అందుకే సాధ్యమయ్యింది.పౌరస్పందన వేదికకు పీపుల్స్‌వార్ పార్టీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, చర్చలు మూడు సంపుటాలు వచ్చాయి. ఈ మొత్తం ప్రక్రియను ఎక్కడా ప్రస్తావించకుండా పోలీసు లు, ముఖ్యమంవూతులు మార్కులు కొట్టేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు పొందుతున్నారు.

గంటి ప్రసాదం హత్య తర్వాత పరిణామాలు చూస్తుంటే 2005 తిరిగి వస్తున్నదా? వస్తే అది రావడానికి ఏం కారణాలై ఉంటాయి అని కూడా ఆలోచించాలి. నక్సలిజం పూర్తిగా సమసిపోయింది అని చెప్పుకుంటున్న ప్రభుత్వమే తెలంగాణ ఇస్తే నక్సలిజం ప్రబలుతుంది అని అంటున్నారు. అది ప్రబలుతుం ది అనడానికి ప్రసాదం హత్య తర్వాత బెదిరింపులు హైదరాబాద్ నుంచి ‘ఛత్తీస్‌గఢ్ పులులు’ అనే పేర వస్తున్నాయి. బాధ్యత కలిగిన తెలంగాణ పోలీసు అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు.

పోలీసు అధికారుల సంఘం మాత్రం ప్రెస్ కాన్ఫన్స్ పెట్టి పౌర హక్కుల సంఘాల మీద విరుచుకుపడ్డారు. ఇది కొత్తేం కాదు. కొంచెం రాజ్యాంగ స్పృహ ఉన్న ఏ పోలీసుకైనా ఒక హత్య జరిగితే ఆ హత్య రాజ్యానికి వ్యతిరేకంగా క్రైం అగేనెస్ట్ స్టేట్ అంటారు. హత్య చేయబడిన వ్యక్తి కుటుంబం లాయర్‌ను కూడా పెట్టుకునే అవకాశం చట్టంలో లేదు. దానికి ప్రధాన కారణం బాధితుడికి రక్షణ రాజ్యమే కల్పిస్తుందన్న సూత్రం దీని వెనుక ఉంది. పోలీసు అధికారుల సంఘంతో మేం డిమాండ్ చేస్తున్నది ‘మీరే చేశారని కాదు’ మీ ప్రమేయం లేదని రుజువు కావాలంటే హంతకులను పట్టుకోవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది, హంతకు లు ఎవరో చెప్పవలసి ఉంటుంది. రాష్ట్రంలో ఏడు, ఎనిమిది మంది పౌరహక్కుల నాయకులు హత్య కు గురైతే ఒక్క హత్యకేసులో కూడా హంతకులు పట్టుబడలేదంటే రాజ్యం చెప్పే జవాబు ఏంటి? గంటి ప్రసాదం ఎలాంటి మనిషో నేను ఇంకొక వ్యాసంలో రాశాను. అంత మహనీయమైన వ్యక్తికి శత్రువులు ఎవరుంటారు? శత్రువులు ఉన్నారంటే వాళ్లెవరో చెప్పాలి. ఈ మాటే అంటే బెదిరింపు ఉత్తరాలు ఎందుకు? కనీసం ఈ బెదిరిస్తున్నవారి లేఖ ఉంది కదా, దాని ఆధారంగా ఈ క్రిమినల్స్‌ని పట్టుకోలేదా?

రాజ్యం ఒక నాగరిక సమాజ నిర్మాణ క్రమం లో పుట్టిన వ్యవస్థగా ఉదారవాద సిద్ధాంతం వాదిస్తుంది. నిష్ఫక్షపాతంగా, చట్టబద్ధంగా, ఏ వ్యక్తిగ త ద్వేషం లేకుండా పనిచేస్తుందని కూడా ఆ సిద్ధాం తం ఉంటుంది. వ్యక్తులను బెదిరించడం, బెదిరించిన వారెవరో కూడా తెలుసుకోకపోతే ఎలా? రాజ్యం ఇలాంటిఅధికార దుర్వినియోగానికి పాల్పడవచ్చని అమెరికాలో పౌరులు సొంత ఆయుధాలను కలిగి ఉండే ప్రాథమిక హక్కును పొందారు. మన సమాజంలో పౌరులందరూ తమ ఆయుధాలను రాజ్యానికి సమర్పించి, రాజ్యం మీద విశ్వాసాన్ని చాటుకున్నారు. పౌరులు విశ్వాసంతో ఇచ్చిన ఆయుధాలను వారికే వ్యతిరేకంగా ఉపయోగించడం విశ్వాసరాహిత్యం.

ఇక తెలంగాణ ఉద్యమానికి ఒక హెచ్చరిక. తెలంగాణ ఉద్యమ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తిస్తుందో చూశారు, అనుభవించారు. తెలంగాణ వస్తుంది అన్న సందర్భంలో 2005 అప్రజాస్వామిక, అమానవీయ సంస్కృతి పునరుద్ధరింపబడుతున్నది. ఆంధ్రవూపాంత పెట్టుబడిదారులు తెలంగాణ నాయకులను హోంమంవూతులుగా పెట్టి చాలా దుర్మార్గపు పనులు చేశారు, చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇదే వాతావరణం కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి అర్థం ఉండదు. మనకు హత్యలు, ఎన్‌కౌంటర్లు, బెదిరింపు లేఖలు లేని తెలంగాణ కావాలి. విస్తృత ప్రజాస్వామ్య సంస్కృతి ఒక్కటే మావోయిస్టు ఉద్యమానికి పరిష్కారం. ఈ మధ్య కాలంలో ఈ హత్యలను, బెదిరింపు లేఖలను తెలంగాణ ఉద్యమకారుల సమస్యగా భావించాలి. ముక్తకం ఈ విష సంస్కృతిని వ్యతిరేకించాలి.

పొఫెసర్ జి. హరగోపాల్

228

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల