లెక్కల్లో చిక్కుకున్న తెలంగాణ


Thu,July 4, 2013 12:05 AM

దిగ్విజయ్‌సింగ్ ప్రకటనలు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొదటిసారి వేలాదిమంది ప్రజలను సమీకరించి ప్రజల సమక్షాన తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం తామందరం రాజీ లేకుండా పోరాటం చేస్తామన్నారు. ఒకరితో ఒకరు పోటీపడి ప్రసంగించడంతో, తెలంగాణ ఆకాంక్ష తొందరలోనే నెరవేరే అవకాశం ఉన్నదేమోనని నా బోటివాడిక్కూడా అనిపించింది. పత్రికలు, టీవీ చానళ్లు ఆ దిశగానే ప్రచారాన్ని చేశాయి. మీడియా ను అంత త్వరగా నమ్మడానికి వీల్లేదు. అయితే ‘ది హిందూ’ దిన పత్రిక కూడా వస్తున్న మార్పులను ఆ కోణం నుంచే ప్రచురించింది. సమస్య పరిష్కారమవుతుందేమో అని అనుకుంటున్న దశలో మళ్ళీ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ సమస్య చాలా జటిలమైందని, రెండు ప్రాంతాల డిమాండ్లను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంవూతులకు సమైక్యరాష్ట్రంగా ఉంచాలా, లేక తెలంగాణ ఇవ్వాలా అనే రెండు డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని రోడ్ మ్యాప్ తయారుచేయమని అడిగానని మరో ప్రకటన చేశాడు.

సమస్యకు పరిష్కారం ఒకటే ఉంటుంది. అంటే ఒకే లక్ష్యానికి చేరుకోవాలని ఉన్నప్పుడు రెండు రోడ్లు ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రెండు రోడ్లు సమాంతరంగా ఉన్నాయి. సమాంతర రేఖలు ఎక్కడో కలువకపోతాయా అని గణితశాస్త్ర లేదా తాత్విక భావన రాజకీయాల్లో పనికిరాదు. ఒక సదస్సులో వి.బి.రాజు మాట్లాడుతూ గణితంలో రెండు బిందువుల మధ్యన సరళరేఖ అతి చిన్నది కానీ రాజకీయాలలో సరళరేఖ నాయకులను సంక్షోభంలో పడేస్తుందని, వక్రరేఖ రాజకీయ నాయకులను అతి త్వరగా తమ లక్ష్యానికి చేరుస్తుంది అని ఒక సూత్రీకరణ చేశారు.
దిగ్విజయ్‌సింగ్ బెంగళూరులో మాట్లాడుతూ ఒక సత్యాన్ని కూడా మా ట్లాడాడు. అదేమిమిటంటే దక్షిణ భారతంలో పార్లమెంటుకు కనీసం యాభై సీట్లను గెలవాలని మూడో పర్యాయం కూడా కేంద్రంలో కాంగ్రెసే అధికారంలోకి రావాలని తన మనసులోని మాటచెపుతూ దాంట్లో భాగం గా తెలంగాణ అంశాన్ని పరిశీలిస్తున్నామ ని అన్నట్లుగా వార్తా పత్రికల్లో వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు మ్యాప్ ద్వారా కనీసం 15 సీట్లనైనా సాధించే లక్ష్యం చేరుకోవాలి. ఒకవేళ రాయలసీమలోని కొన్ని జిల్లాలను తెలంగాణలో కలిపితే మరో ఐదు, ఆరు సీట్లు గెలవవ చ్చు అని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ ఆంధ్ర ప్రాంతంలో ఇరవై ఐదు సీట్లు గెలుస్తామని ఆ ప్రాంత నాయకులు హామీ ఇస్తే తెలంగాణ ప్రకటించకున్నా నష్టం లేదు. ఎందు కో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినా ఆ ప్రాంతం లో గెలవడం కష్టమని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అంటే సమైక్య భావనకు ఆ ప్రాంతంలో అంత ప్రజా బలం లేదనా లేక వైఎస్‌ఆర్‌సీపీ చాలా బలంగా ఉందనా, ఏ కారణం వల్లో ఆ ప్రాంతం ఓటర్ల మీద కాంగ్రెస్‌కు అంత నమ్మకం కుదరడం లేదు. తెలంగాణ, సమైక్య రాష్ట్రం అనే రెండు డిమాండ్లు ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రాంతం లో వైఎస్‌ఆర్‌సీపీ ‘హవా’ ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు. నేను ఆ ప్రాంతం వెళ్లినప్పుడు ఎవరిని కదిలించినా వైఎస్‌ఆర్ పార్టీకి ప్రజల్లో చాలా మద్దతు ఉన్నట్లు అందరూ అంటున్నారు. రాజశేఖర్‌డ్డి హయాంలో ఆయన చేపిట్టిన సంక్షేమ కార్యక్షికమాల ద్వారా ఏర్పడిన ‘గుడ్ విల్’ చాలా లోతుగా ఉన్నదని చాలామంది అభివూపాయం.

ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంలోని ప్రజలు సంక్షేమానికి అంత పెద్ద పీట వేస్తే, తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు వైఎస్‌ఆర్ పార్టీని కాని, రాజశేఖర్‌డ్డి సంక్షేమాన్ని దాటి, తెలంగాణ అస్తిత్వం చాలా బలంగా పనిచేస్తున్నది. ఈ అస్తిత్వం వెనకబాటుతనం నుంచే వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రమేర్పడితే రాజశేఖర్‌డ్డి సంక్షేమ పరిధిలను దాటి తమ సమస్యలకు మరింత సమక్షిగమైన పరిష్కారాలు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. అంటే తెలంగాణ రాజకీయ నాయకుల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజలు నిలబడగలిగిన, జీవితం మెరుగుపడే పరిష్కారాలను ప్రజలు స్పష్టంగానో, అస్పష్టంగానో ఆశిస్తున్నారు. అంటే తెలంగాణ సాధించకపోతే చాలామంది రాజకీయ నాయకుల అడ్రస్‌గల్లంతు కావచ్చు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు జరిగితే తెలంగాణ ప్రజల పోరాట, ఉద్యమ చైతన్యం నుంచి ముందుకు వచ్చే సవాళ్ళు అంతే బలంగా ఉంటాయి.

లెక్కలు, సంఖ్యలో మనుషుల ఆకాంక్షలని, చరిత్ర నిర్మాణాన్ని నిర్దేశించవు. మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలని 2014 లేదా 2013లో వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుస్తామనే ఒక సంకుచితమైన ఎన్నికల రాజకీయాలకు కుదించడమన్నది మన రాజకీయ పార్టీల చారివూతక అవగాహ న ఎంత వక్రీకరించిందో తెలుపుతుంది. మానవ ప్రవృత్తిని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మొత్తం గణితశాస్త్ర విజ్ఞానంలో మూడు శాతం మాత్ర మే ఉపయోగపడతాయని, మిగతా గణితశాస్త్రం, గణిత శాస్త్రజ్ఞుల విజ్ఞాన పిపాసకు, వాళ్ల ఆనందానికి సంబంధించింది అని బాలగోపాల్ అనేవాడు. అంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక సంక్లిష్టతను మూడు శాతానికి కుదించడానికి ప్రయత్నించడం వాళ్ళ ‘విజ్ఞతకు’ వాళ్ళ దృష్టి లోపానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర నిర్మాణమనేది కనీసం రెండున్నర శతాబ్దాల చరివూతకు సంబంధించింది.(1776 నుంచి నేటి వరకు) ఇది వందల సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. చిన్న రాష్ట్రాల డిమాండ్ తెలంగాణతో ప్రారంభం కాలేదు. తెలంగాణతో అంతం కాదు. ఒక వక్ర అభివృద్ధి నమూనాను అవలంబించిన పాలకులు ఇది తమకు తాము తెచ్చిపెట్టుకున్న సమస్య. ఈ చిదంబరం అభివృద్ధి నమూనాలో మనుషులు లేరు కానీ లెక్కలు చాలా ఉన్నాయి.

వృద్ధిరేటు, జీడీపీ, జీఎన్‌పీ, విదేశీ పెట్టుబడి, మిలియన్లు, బిలియన్లు. అబ్బో ఇవి ఎడతెగని లెక్కలు. దేశం అతి వేగంగా అంటే అంటే తొమ్మిది శాతం అభివృద్ధి రేటు చేరుకుంటే, వందల ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షలమంది యువత పోటీపడడమేమిటి? ఉన్న ఉద్యోగ భద్రత ఊడగొట్టడమేమిటి? తుమ్మితే ఊడిపోయే ఉద్యోగమేమిటి? రైతుల ఆత్మహత్యలు ఏమిటి? తెలంగాణ రాదే మో అని అనిపిస్తే పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడమేమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు ఏమిటి అని ఆంధ్ర ప్రాంత యువత ఆందోళన ఏమిటి? దేశ అభివృద్ధి 2.5 శాతం ఉన్నప్పుడు ఏర్పడిన లక్షలాది ఉద్యోగాలను తొమ్మిది శాతం వృద్ధిరేటు మింగేయడమేమిటి? వృద్ధిరేటు అకస్మాత్తుగా పడిపోవడమేమిటి? పడిపోయిన వృద్ధిరేటు అకస్మాత్తుగా పడిపోవడమేమిటి? పడిపోయిన వృద్ధిరేటను పునరుద్ధరించడానికి విదేశీ పెట్టుబడికి కిటికీలు, తలుపు లు, గేట్లు బార్ల తెరవడం దేనికి? చిన్న వ్యాపారుల పొట్టలు కొట్టడమేమిటి? గిరిజన ప్రాం తాల్లో ఇంత ప్రాణనష్టమేమిటి? గ్రేహౌండ్స్ ఏమిటి? గ్రీన్‌హంట్ ఏమిటి? అణచివేత చట్టా లు ఎందుకు? మనుషులకు గౌరవవూపదమైన, భద్రత కలిగినవని చేతినిండా కల్పిస్తే తమ బతుకులు తాము బతుకుతారు కదా! ఈ కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడమేమిటి? మన్‌మోహన్‌సింగ్, అహ్లువాలియా, కపిల్‌సిబాల్, చిదంబరం, కమల్‌నాథ్, ఒక్కడు కాదు అందరికి అందరూ అందరు లెక్కలు వేసేవాళ్లే. డాల రు మహిమ ఉంటుంది. ఈ అభివృద్ధి నమూనాలో అసమానతలు పెరగడమన్నది అనివార్యం. అసమానతలు పెరుగుతున్న కొద్దీ అసంతృప్తి పెరగడం తప్పదు. అసంతృప్తిలో నుంచి ఉద్యమాలు రాక తప్పదు. తెలంగాణ ఆ లెక్కల్లో నుంచే పుట్టుక వచ్చింది. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా చారివూతకంగా అనివార్యమైన ఒక అసంతృప్తి వ్యక్తీకరణే తెలంగాణ.

ఆంధ్ర ప్రాంతంలో కూడా వెనుకబడిన ప్రాంతాలున్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా తమ రాష్ట్రం తమకు కావాలని అని ఇప్పుడైనా మరోసారైనా అడుగుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అసమానతలు పెరిగితే దళితులు, గిరిజనులు, మహిళలు, వెనుకబడిన తరగతులు, ఉద్యోగాలు దొరకని ఉన్నత కులాల పిల్లలు అందరూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. లెక్కలు చేస్తూ ప్రజలను లెక్క చెయ్యని వారిని ప్రజలు కూడా లెక్కపెట్టరు అన్న ఒక వాస్తవాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి. దారి తప్పిన ఒక నమూ నా ఎన్ని మైలురాళ్లు లెక్కపెడుతూ పోయినా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, రాహుల్‌గాంధీ ప్రధాని అయినా కొన్ని మైలురాళ్లు దాటవచ్చు. కానీ ఎక్కడికి పోతున్నామో, గమ్యమేమిటో తెలువకపోతే 2014 మైలురాయి పాలమూరు జిల్లా లేదా తెలంగాణలో ప్రాజెక్టుల కోసం వేసిన శిలాఫలకం లాంటిదే. కానీ ప్రజల సుఖమయ, అర్థమయ జీవనానికి సంకేతాలు కావు.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల