నరేంద్రమోడీ అద్భుతదీపం!


Thu,June 27, 2013 05:54 AM

చిన్నప్పుడు అల్లాఉద్దీన్ అద్భుత దీపం సినిమా చూసినప్పుడు అలాంటి దీపం మన దగ్గర ఉంటే ఎంత బావుండేది అనిపించింది. అయితే అల్లాఉద్దీన్ భార్య ఆ దీపాన్ని పాత సామానులు కొనేవాడికి అమ్మినప్పుడు, అంత అద్భుత దీపాన్ని ఎందుకు అంత అజాక్షిగత్తగా పెట్టాడు అని అల్లాఉద్దీన్ మీద కోపం కూడా వచ్చింది. సమకాలీన రాజకీయాల్లో కూడా ఈ అద్భుత దీపం కొందరు రాజకీయ నాయకుల దగ్గర ఉందని మన పత్రికలు, కొన్ని చానళ్లు ప్రచారం చేస్తూ ఉంటాయి. అమాయకమైన ప్రజలు, ఐటీ ప్రొఫెషనల్స్, పట్టణ ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాలున్న వారు ఇలాంటి కథలను నమ్ముతుంటారు. ఇలాంటి కథ ఒకటి ఉత్తరాఖండ్ బీభత్సంలో ప్రచారానికి వచ్చింది. విపరీతమైన ప్రాణ నష్టం జరిగి చావు బతుకుల మధ్య మనుషులు పోరాటం చేస్తుంటే, భారత సైన్యం చాలా సాహసంగానే బాధితులను కాపాడడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నది.

హెలీకాప్టర్ ప్రమాదంలో సైన్యానికి చెందిన 20 మందిని కోల్పోయి కూడా తమ బాధ్యతను నిర్వరిస్తున్నారు. ప్రకృతి బీభత్సం చూస్తే తాము ప్రకృతిని జయించామని విర్రవీగుతున్న మనుషులకు తాము ప్రకృతి ముందు ఎంత అసహాయులో మరోసారి గుర్తు చేయబడింది. ఇది కేవలం ప్రకృతి బీభత్సమే కాదు సంపన్నులు ప్రకృతిని దోచుకునే అభివృద్ధి నమూనా కారణమని, హిమాలయ పర్వతాల సున్నిత ప్రాంతాలలో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము దీనికి కారణమని భిన్నమైన విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. ఏ కారణమైనా మనుషులను తరలించడానికి అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో అందరినీ ఆశ్చర్యపరచిన కథ పదిహేనువేల మంది గుజరాతీలని నరేంవూదమోడీ సునాయాసంగా బయటికి తీసుకవచ్చాడని! ఈ వార్త చూసినప్పుడు, విన్నప్పుడు నాకు అల్లాఉద్దీన్ సినిమా గుర్తుకు వచ్చింది.

ఇంతమంది గుజరాతీలను తరలించగలిగిన మోడీ అందరినీ రక్షిస్తే పోయేదికదా! అది ఆయన ప్రధాని అయితేనే సాధ్యం అని కొన్ని పత్రికలు రాశాయి కూడా. శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ లో మోడీ ఒక్క గుజరాతీలనే ఎందుకు రక్షించాడు? అంటే మహారాష్ట్రీయులను ఎందుకు తరలించలేదని వాళ్ల కోపం. ఇక చంద్రబాబు మన ముఖ్యమంత్రి నరేంవూదమోడీని చూసి బుద్ధి తెచ్చుకోవాలని కూడా సలహా ఇచ్చాడు. నిజానికి ఆయనే ముఖ్యమంవూతిగా ఉంటే, నరేంవూదమోడీలా మొత్తం తెలుగువాళ్లను కాపాడగలిగే వాడని ఆయన వాదన. మరీ వెనకబడిపోకుండా తనవంతు పాత్రను తాను నిర్వహించాడని కొన్ని తెలుగు పత్రికలు ఫ్రంట్ పేజీలోనే ప్రచురించాయి. కొందరు బాధితులు ఆయనను దేవుడని ప్రస్తుతిస్తున్నారు. ప్రకృతి కల్పించిన విషాదానికి రాజకీయ నాయకులు స్పందించే పద్ధతి చూస్తుంటే మనుషుల ప్రాణాలకన్నా అధికార కాంక్ష ఎంత బలంగా పనిచేస్తుందోనని ఆశ్చర్యం వేస్తుంది. ఈ మొత్తం సంఘటనపై నిన్న ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపవూతిక ఎడిట్‌పేజీలో అభాక్ బర్మన్ రాసిన ఒక మంచి వ్యాసంలోని కొన్ని వివరాలను ‘నమస్తే తెలంగాణ’ పాఠకులు తెలుసుకోవడం చాలా అవసరం.

హిమాలయన్ విచిత్రం అనే శీర్షికతో రాసిన వ్యాసం లో ఆయన నరేంవూదమోడీ అద్భుతాన్ని గురించి జరిగిన ప్రచారం మీద కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేయడమే కాక, ఈప్రచార ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే అంశాన్ని కూడా వివరించాడు. మొత్తం భారత సైన్యం పదిరోజుల్లో నలభై వేలమందిని మాత్రమే తరలించగలిగినప్పుడు, నరేంవూదమోడీ 15 వేలమందిని ఒక్కరోజులో ఎలా రక్షించగలిగాడు అనేది మొదటి ప్రశ్న. దీన్ని సాధించడానికి ఆయన 80 ఇన్నోవా వాహనాలను వాడాడని ప్రచారం. అసలు రోడ్లన్ని ధ్వంసం అయినప్పుడు ఈ వాహనాలు కేదార్‌నాథ్‌కు ఎలా వెళ్లగలిగాయి? సైన్యం పదిరోజుల్లో చేసిన కృషి కంటే శుక్రవారం డెహ్రడూన్ చేరుకున్న మోడీ ఆదివారం లోపల పదిహేనువేల మందిని ఎలా తరలించగలిగాడు అనేది మరో సందేహం. ఒకవేళ ఇది నిజమని మనం నమ్మినా ఒక్క ఇన్నోవా వాహనంలో ఒక్కసారి తొమ్మిది మందిని మాత్రమే తేగలరు.

80 వాహనాలు 720 మందినే తరలించగలవు. ఈ లెక్కన వాహనం ఒక్కరోజు 221 కిలోమీటర్ల దూరాన్ని 21 పర్యాయాలు పోయివస్తే కాని సాధ్యం కాదు. ఒక్కరోజు ఒక వాహనం అంత దూర ప్రయాణాన్ని, అన్ని పర్యాయాలు ఎలా చేయగలదు? కాని ఈ అద్భుతాన్ని మోడీ ఒక్క రోజులో చేయగలిగాడని ప్రచారం.
నిజానికి మోడీ స్వయాన తాను పదిహేనువేల మందిని తరలించానని ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఆయన ప్రతినెలా 25 వేల డాలర్లు చెల్లిస్తున్న ఆప్‌కో వరల్డ్ వైడ్ అనే సంస్థ ఆయన తరఫున ఈ ప్రచారం చేస్తుంది. ప్రచార సమాచారాన్ని ప్రచారమాధ్యమాలకు అందించి, వాటి ద్వారా వ్యక్తుల, సంస్థల ‘కీర్తి’ ని పెంచడానికి పని చేస్తుంది. సెన్‌సేషనలిజానికి అలవాటు పడ్డ మీడియా, వచ్చిన సమాచార సాధ్యసాధ్యాలను పరిశీలించకుండా వాటికి విపరీతమైన ప్రచారం కల్పించింది.

ఉత్తరాఖండ్ బీభత్సంలో మోడీకి కల్పించిన ఈ ప్రచారం మొదటిదికాదు, చివరిది కాదు. ఇలాంటి కథలు భవిష్యత్తులో మనం చాలా వినవలసి ఉంటుంది. ఈ సంస్థకు నెల నెలా డబ్బులు అందినంత కాలం ఈ కార్యక్షికమాన్ని కొనసాగిస్తుంది. ఇదే సంస్థ అంతకు ముందు విభ్రాంత గుజరాత్ పేరిట విపరీత ప్రచారాన్ని కల్పించింది. అలాగే కృష్ణా బేసిన్‌లో గుజరాత్ కంపెనీ విపరీతమైన గ్యాస్ నిక్షేపాలను కనుకున్నట్లు జరిగిన ప్రచారం కూడా నిజం కాదు. గుజరాత్ కంపెనీలు మన రాష్ట్రంలో అంత గ్యాస్‌ను కనుక్కుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే చర్చ మొదలైంది. టీవీ చానళ్లు కూడా ఈ చర్చ జరపడం వల్ల మోడీకి మన రాష్ట్రంలో కొంత మద్దతు పెరిగి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అంత గ్యాస్ నిక్షేపా లు ఉన్నాయా, ఇది శాస్త్రీయంగా వాస్తవమేనా అనే ప్రశ్నలు అడిగే అలవాటు మీడియాకు లేకపోవడం వల్ల, ఆప్‌కో ప్రచారం కంపెనీ తమ ప్రచార వ్యాపారాన్ని ఇంత సులువుగా చేసుకోగలుగుతున్నది. ఈ కంపెనీయే కజకిస్తాన్, తుర్కమినిస్థాన్ నైజీరియా నియంతల ఇమేజ్‌ను పెంచడానికి చాలా దోహదపడింది.

కొంతకాలంగా సంఘ్ పరివార్, ప్రచార సాధనాలు నరేంవూదమోడీని దేశ నాయకుడిగా, ఇక ఆయనకు ప్రత్యామ్నాయం లేనట్టుగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. దాంతో ఆయన బీజేపీలో అద్వానీ కంటే మించిన నాయకుడిగా పరిగణింపబడుతున్నాడు. బీజేపీ వాళ్లను ఎవ్వరిని అడిగినా మోడీకి ప్రజల్లో విపరీతమైన మద్దతు ఉన్నద ని, యువత అలాంటి నాయకుడ్నే కోరుకుంటున్నది అంటున్నారు. ఇంకా ఆ స్థాయి దాటి దేశ ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారని అని కూడా అంటున్నారు. పట్టణ ప్రాం తాల్లో ఉండే ప్రొఫెషనల్స్, లంపెన్ యువత తప్పించి, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ఆవాసాలలో నివసించే జనం నరేంవూదమోడీని అభిమానిస్తున్నారా? ఆయన ప్రసంగాల లో ఎక్కడైనా భూసంస్కరణలు, పేదరిక నివారణ, దళితుల పట్ల విచక్షణ, పెరుగుతున్న అసమానతల గురించి కనీసం మాట మాత్రానికైనా ఉన్నదా? పేద ప్రజలు ఆయన చెప్పే ఏ మాటల చేత ఆకర్షితులవుతున్నారు? గుజరాత్ అభివృద్ధి నమూనా ‘సమర్థవంతుడైన నాయకుడు’ అంటే ఏమిటి అర్థం.

మనుషులను అమానుషంగా చంపుతుంటే మాట్లాడకపోవడమా? కనీస నైతిక బాధ్యతకూడా వహించకపోవడమా? నిశితంగా ఆలోచించేయువత తగ్గిపోవడం వల్లే ప్రచారఆర్భాటాలకు కొట్టుకుపోయే వారు ఉండడం వల్లే ప్రచార కంపెనీలు ఈ మోసం చేయగలుగుతున్నాయి. మనం వింటున్న, చూస్తున్న, చదువుతున్న ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా చూడడం నేర్చుకోవాలి. వాస్తవాలు పూర్తిగా తెలియనప్పుడు వాటిని ప్రశ్నార్థకంగానే ఉంచాలి. కానీ ప్రతి పుకారును నమ్మడం చాలా ప్రమాదకరం.
నరేంవూదమోడీ ఈ అద్భుత దీపం వ్యాసం ఉద్దేశం కేవ లం ఆయనను విమర్శించడానికే కాదు. ప్రచారం, పుకార్ల బారిన పడ్డ సమాజం, చాలా సునాయాసంగా ఫాసిజంలోకి జారుకుంటుంది. ఇది వ్యక్తికి ఉన్న లక్షణాలను వేయి రెట్లు పెంచి చూపుతుంది. నిత్య జీవిత సమస్యలతో పోరా టం చేసే వారికి, ఎవ్వరైనా సహాయపడితే బావుండు అనే కోరిక బలంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎవరో అవతార పురుషుడు వస్తే బావుండు అని కూడా ఉంటుం ది. అలాంటి సందర్భాల్లోనే సాధారణ మనిషి పరిమితులను దాచి అసాధారణ మనుషులుగా చిత్రీకరిస్తారు. పదిహేను వేలమంది గుజరాతీలను నరేంవూదమోడీ రక్షించడం అలాంటి చిత్రీకరణలో భాగం.

నరేంద్రమోడీ జూలై 27న హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్‌లో ఉపన్యసించబోతున్నాడు. ఆయన అద్భుత దీపం నుంచి తెలంగాణ సృష్టిస్తానంటే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా పరిశీలించవల్సి ఉంటుంది. తెలంగాణ ఇస్తానంటే ఎలాంటి తెలంగాణ అనే ప్రశ్న కూడా అడగవల్సి ఉంటుంది. తెలంగాణలో ముస్లింలకు సమాన హక్కులు ఉంటాయని,వాళ్లు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించటానికి తెలంగాణ ప్రజలు కృషి చేయవల్సి ఉంటుంది. తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పోరాట వారసత్వం ఉండడంవల్ల నీళ్లను పాలను వేరు చేసి చూసే హంసతత్వం కొంత ఉంది.

దీనికి పెద్ద ఉదాహరణ చంద్రబాబే. ప్రపంచ బ్యాంకు పనికొట్టుకొని ఆయనకు విపరీత ప్రచారం కల్పించింది. దేశమంతా మధ్యతరగతి ఆయన గుణగణాలను గురించి ప్రశసిస్తూ వచ్చా రు. ఈ ప్రచారాన్ని ఆయన కూడా నమ్మడం మొదలుపెట్టాడు. మాబోటి వాళ్లం కొన్ని సందర్భాల్లో ఆ విషయం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. ప్రచార మహాత్యం అలాంటిది. తెలుగుదేశం పార్టీ 2004లో ఓడిపోయినప్పుడు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు నిర్ఘాంతపోయారు. ఎన్నికల ఫలితాలను నమ్మడానికి కూడా ఇష్టపడలేదు. తెలుగు ప్రజ లు ప్రపంచ బ్యాంకుకు చాలా మంచి గుణపాఠం నేర్పారు. అందుకే నరేంవూదమోడీ గురించిన ప్రచారాన్ని కూడా అంత సులభంగా నమ్ముతారని నేననుకోవడం లేదు. నమ్మినా వాస్తవాలను తెలుసుకునే వ్యక్తులను నమ్మాలి. కానీ ఎవ్వరి దగ్గరో అద్భుత దీపం ఉందని నమ్మితే అది అమాయకత్వం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది మంచిది కాదు.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles