ఆదివాసీలు: అధ్యాపకులు


Thu,June 6, 2013 12:14 AM

ఛ త్తీస్‌గఢ్‌లో మార్పులు, మలుపులు చాలా వేగంగా, తీక్షణంగా చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయో, ఎంత ప్రాణనష్టం జరగనున్నదో ఇప్పుడు ఊహించడం కొంతవరకు సాధ్యమే. మావోయిస్టు పార్టీ మహేంద్ర కర్మ మీద దాడి చేసే ఘటనలో కొందరు కాంగ్రెస్ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. మహేంద్ర కర్మ, ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు పటేల్‌పై తప్పించి మిగతా వారి మరణం పట్ల మావోయిస్టు పార్టీ తన విచారాన్ని కూడా వ్యక్తం చేసింది. పౌర స్పందన వేదిక మావోయిస్టు పార్టీతో మాట్లాడినప్పుడు కాని, లేదా వాళ్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినప్పుడు కాని ప్రాణనష్టం గురించి తన ఆందోళనను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ విషయంలో అమాయకులు బలికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పార్టీ విశ్వాసం ఇస్తూ వచ్చింది. ఈ విషయం ఉద్యమం గుర్తుంచుకుంటుందనే భావిద్దాం. ఈ మొత్తం ఘటనలో మహేంవూదకర్మ తన మరణాన్ని తానే కొనితెచ్చుకున్నాడని దేశవ్యాప్తంగా భిన్న వర్గాల నుంచి అభివూపాయం వ్యక్తమవుతున్నది. అతను అతని ముఠా తోటి ఆదివాసీల మీద చేసిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అంతా ఇంతా కాదు. అవి నమ్మశక్యం కానివి. ఒక మనిషి ఆయన నిర్మించిన సల్వాజుడుం అంత అమానుషంగా తోటి ఆదివాసీల పట్ల ఎలా ప్రవర్తించారు అనేది ఒక ప్రశ్న అయితే, చట్టబద్ధంగా ఏర్పడినదని చెప్పుకోబడుతున్న రాజ్యం ఇంత దారుణాన్ని ఎలా ప్రోత్సహించింది అనేది మరో ప్రశ్న. సోనియాగాంధీతో పాటు చాలామంది చిన్న పెద్ద నాయకులందరూ ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య ప్రమాణాలు మావోయిస్టులకే వర్తిస్తాయా లేక మహేంద్రకర్మ చేత దాడులు చేయించిన రాజ్యానికి కూడా వర్తిస్తాయా లేదా అనే అంశం మీద సమాజంలో చాలా లోతైన చర్చ జరగాలి.


మహేంద్ర కర్మ మీద దాడి జరిగే ముందు గత సంవత్సరంగా అమాయకులైన ఆదివాసీల మీద, ఒక పండగ జరుపుకుంటున్న ఆదివాసీల మీద, తమ సమస్యలు చర్చించుకుంటున్న ఆదివాసీల మీద ఏకారణం లేకుండా నలు దిశల నుంచి పోలీసు బలగాలు చేసిన దాడులలో పూజారితో సహా చిన్న పిల్లలు కూడా చనిపోయారు. వీళ్ల మీద జరిగిన హింస ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా రాజకీయ నాయకులు ఎవ్వరూ అన్నట్లు లేదు. చాలాకాలంగా పాలకులు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని అంటూ వచ్చారు. ఈ మధ్యకాలంలో మావోయిస్టు హింసకు తావులేదు అంటున్నారు.అంటే మాఫియా ముఠాల హింస, రాజ్య హింస, మహిళలపై జరుగుతున్న హింస, గుజరాత్‌లో జరిగిన హింస అంత ప్రమాదకరం కాదు అని భావిస్తున్నట్టు ఉన్నది. కానీ వ్యవస్థీకృత హింసకు ఆదివాసీలు చేస్తున్న పోరాటాలకున్న సంబంధాన్ని, పరస్పర వైరుధ్యాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనం ఎందుకు ఇంత హింస మధ్య బతకవలసి వస్తున్నదో అర్థంకాదు.


మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలకు సామ్రాజ్యవాదానికి, దాని ప్రయోజనాలకు ఒక సం బంధముంది. సామ్రాజ్యవాద పెట్టుబడి మనదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మించాలని అనుకోవడం లేదు. అది దాని అవసరం కూడా కాదు. ఈ దేశ వనరులను ముఖ్యంగా ఖనిజ వనరులను దోచుకోవడమే దాని వ్యూహం. ఈ వ్యూహానికి తగినట్లుగా ఒక రాజకీయ వాతావరణాన్ని తన మీడియా ద్వారా సృష్టిస్తున్నది. ఈ దోపిడీ ముద్దుపేరు ‘వృద్ధి రేటు’, ‘అభివృద్ధి’,‘అక్షిగరాజ్యం’. ఇవి పైకి బాగానే కనిపిస్తున్నా అభివృద్ధి అంటే ఏమిటి? ఈ అభివృద్ధి ఎవరి కోసం? అనే ప్రశ్నలుండనే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులను దేశ పారిక్షిశామిక అభివృద్ధి కోసమే వినియోగిస్తారా అంటే, అదీ లేదు. వనరులను అమ్ముకోవడం తప్ప దీంట్లో వేరే ప్రయోజనమేమీ లేదు. వనరులను అమ్ముకొని వృద్ధిరేటు పెంచుకుంటున్నామని భ్రమించడం, సొంత ఇల్లు అమ్ముకొని, ఎండలో పడుకొని తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని పాస్‌బుక్‌ను చూసుకుని మురిసిపోవడం వంటిది అని నేను మరో సందర్భంలో పేర్కొన్నాను. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడిదారీ పూర్వ దశ పరిణామం. దీన్ని ప్రిమిట్యు అక్యుములేషన్’ అని అంటారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇప్పటి బహుళజాతి కంపెనీలకు పెద్ద తేడా లేదు. బ్రిటిష్ వలసకు వ్యతిరేకంగా స్వాతంవూతోద్యమం ఎందుకు జరిగిందో, భగత్‌సింగ్ లాంటి వాళ్లు ఎందుకు త్యాగాలు చేశారో, మహాత్మాగాంధీ ఎందుకు జీవిత కాలం ఉద్యమం చేశారో ఇప్పుడు అడగవలసిన తరుణం వచ్చింది. ఈ ప్రశ్నలు అడగడానికి ఎవ్వరూ మావోయిస్టులు కావలసిన అవసరం లేదు. ఈ దేశం పట్ల బాధ్యత కలిగి, భవిష్యత్తు గురించి ఆలోచించే ఎవ్వరైనా అడగవలసిన ప్రశ్న. అడిగిన ప్రతి మనిషి మీద మావోయిస్టు ముద్ర వేసి, వీళ్లు చేసిన ప్రతి చర్యకు ప్రశ్న అడిగిన వాళ్లను బాధ్యులు చేయడం రాజ్యానికి బాలా అలవాటైంది.


ఆదివాసీ ప్రాంతాలలో అమలవుతున్న అణచివేత అక్కడితో ఆగుతుందని, పట్టణాలలో బతుకుతున్న చాలామంది మధ్యతరగతి వాళ్లు భావిస్తున్నారు. ఇది ఎంత భ్రమాజనితమో, ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఘటనలతో తేలిపోతున్నది.సామ్రాజ్యవాదం ఆక్టోపస్‌లాంటిది. ఒకవైపు ముఖ్యమంవూతులు ఏం చేయాలో తీవ్రంగా ఆలోచిస్తున్న సందర్భంలోనే, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులను, అధ్యాపకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అధ్యాపకులు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బలవంతంగా ప్రవేశపెడుతున్న ప్రమాదకరమైన మార్పులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తే, సమస్య గురించి ఆలోచించే బదులు, వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలు, ఢిల్లీ అధ్యాపకులు రాజ్య నిర్బంధానికి ఒకేసారి గురికావడం యాధృచ్ఛికమేమీ కాదు. ఇది సామ్రాజ్యవాద విశ్వరూపం లేక విషరూపం.


ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వైఎస్ చాన్స్‌లర్‌గా ఏ ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం లేని ఒక నియంతను నియమించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ విద్యలో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నది. దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది.అయితే ఇప్పుడు కొఠారి కమిషన్ ప్రతిపాదించిన 10+ 2+3 విద్యా ప్రణాళిక అమలులో ఉన్నది. ఈ విద్యావిధానం మీద ఏ చర్చ లేకుండా ఆకస్మాత్తుగా ఈ మొత్తం విధానాన్ని మారుస్తూ కొత్తగా 10+2+4 ను అమలు చేస్తున్నారు. ఈ మూడేళ్ళ విద్యను నాలుగేళ్లుగా మార్చడం, ఎవ్వరు డిమాండ్ చేశారో తెలియదు. విద్యార్థులు, అధ్యాపకులు, తలిదంవూడులు, ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి ఇది ఎప్పుడూ చర్చించబడలేదు.అధ్యాపకులు ప్రతిఘటిస్తున్నా,దానిని పట్టించుకోకుండా అమలు చేస్తున్నారు. మరి దీని ఏశక్తులు పనిచేస్తున్నాయి అని ఆలోచిస్తే, ఈ విద్యావూపణాళిక ఇప్పుడు అమెరికాలో అమలులో ఉంది. విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశానికి ఒక బిల్లు పార్లమెంటు ముందు ఉంది. ఇది కొంతకాలం గా వివాదాస్పదంగా ఉన్నా, దీనిని ఎలాగైన పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలు చేయాలని ప్రభుత్వం చాలా మొండిగా, మూర్ఖంగా ఉంది. ఈ బిల్లు పాస్ అయితే, అమెరికా విశ్వవిద్యాలయాలు మనదేశంలోకి చొరబడితే ఇక్కడి మూడేళ్ల కోర్సు కు, వాళ్ల దేశంలో అమలులో ఉన్న నాలుగేళ్లకు పొంతన కుదరడంలేదు. అందుకు అమెరికా మన ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంతో ఒక నియంతకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఆయన ఎవ్వరినీ కలువకుండా, చర్చకు అంగీకరించకుండా, తనకు అనుకూలమైన అవకాశవాద అధ్యాపకుల సహకారంతో అమలుకు సిద్ధమయ్యాడు. ఈ విద్యా ప్రణాళిక ఇవ్వాళ్ల అంటే 6-6-2013 నుంచి అమలులోకి వస్తున్నది. దీనిని ప్రతిఘటించిన వాళ్లను అరెస్టు చేశారు.


ఈనెల మూడవ తేదీన విశ్వవిద్యాలయ ఆధ్యాపకులు విద్యార్థులు నిర్వహించిన రౌండ్ మీటింగ్‌లో ప్రఖ్యాత మేధావి యశ్‌పాల్, జయతిఘోష్, అరుంధతీరాయ్, పూర్వ వైస్ చాన్సలర్లు, మేమందరమూ పాల్గొ న్నాం. మేమేకాక శరద్‌యాదవ్, సీతారాం ఏచూరి, లాం టి రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. అందరూ ముక్తకం ఈ నియంతృత్వాన్ని ఖండించారు. ఈ మీటింగ్‌లో చాలా ఆశాజనకంగా కనిపించిన అంశం- దళిత, వెనుకబడిన, ముస్లిం విద్యార్థులు, అలాగే అన్ని వామపక్ష సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడ్డాయి. వామపక్ష విద్యార్థి సంఘాలకు ఇతర కులాల, వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య చాలా కాలంగా సఖ్యత కుదరడంలేదు. వీళ్ళందరు కలవడానికి ఒక వాతావరణం ఏర్పరచని ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ పాత్ర గతి తర్కంలో భాగంగా చూడవచ్చు. ఈ సంఘటన పోరాటం సామ్రాజ్యవాద వ్యూహన్ని సరిగ్గా అంచనా వేస్తుందని ఆశిద్దాం.

విద్యారంగంలో నాలుగు దశాబ్దాలకు పైబడి పనిచేసిన మాలాంటి వాళ్ళం ఎప్పుడూ ఇంత నియంతృత్వాన్ని చూడలేదు. అలాగే ఆదివాసీల మీద సైన్యాన్నే ప్రయోగించాలనే పరిస్థితిని కూడా చూడలేదు. మనదేశ పాలకులు ఎంత నిర్వీర్యమైపోయారో, మన వ్యవస్థ ఎంత బలహీనంగా మారిందో, విదేశీ శక్తులకు మనం ఎంత దాసోహమంటున్నామో ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది. ఆశ్చర్యం కూడా వేస్తుంది. అయితే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ పోరాటానికి, హస్తినలోని అధ్యాపకుల పోరాటానికి అంతర్లీనంగా ఏర్పడుతున్న బంధం రాబోయే కాలంలో ఒక ప్రజాస్వామ్య పోరాటానికి, అంతిమంగా సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటనకు దారి వేస్తున్నదని అనిపిస్తున్నది.

పొఫెసర్. జి. హరగోపాల్


35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles