కర్ణాటక : ప్రజాస్వామ్య తీరు తెన్నులు


Thu,May 16, 2013 12:15 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హేమాహేమీలు, బీజేపీ నుంచి అద్వానీ, సుష్మ స్వరాజ్, అరుణ్‌జెట్లీ, వెంకయ్య నాయుడు, భావివూపధానిగా మీడియా ఊదరకొడుతున్న నరేంవూదమోడీ, అలాగే కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రధానమంత్రి, ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎలాగు గెలుస్తామనే ధీమాతో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు మునిగిపోతున్న పడవను లేదా వాడిపోతున్న కమలాన్ని ఏమైనా కాపాడగలమా అని అందరూ కృషి చేశారు. వీళ్లల్లో ఎవ్వరి ప్రభావమున్నది అని అడిగితే ఎవ్వరి ప్రభావం కూడా నిర్ణయాత్మకమైందిగా లేకపోవచ్చు. అయితే కాంగ్రెస్ కొంత క్రెడిట్ రాహుల్‌గాంధీకి ఇచ్చింది, కానీ బీజేపీ నరేంద్ర మోడీ, ఆకర్షణ మీడియా ప్రచారం చేసినట్లు లేదని తేలిపోయింది. మోడీ సభలకు ఇతర బీజేపీ నాయకుల కంటే ఎక్కువ జనమే వచ్చారు. మీడియా జనాన్ని మీటింగ్ దాకా లాక్కొచ్చింది కాని వాళ్ల చేత ఓట్లు వేయించలేకపోయింది. జాతీ య ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయో లేదో తెలియదు.

బీజేపీకి అలాగే జాతీయ మీడియాకి అర్థం కావలసింది ప్రజలు ఏం కోరుకుంటున్నారని, గుజరాత్ అభివృద్ధి నమూనా అంటే ఏమిటి? అందులో సామాజిక న్యాయం,పేదరికం, అసమానతలు, సంక్షేమం,భద్రత లాంటి అంశాలున్నా యా? నరేంద్రమోడీ చైనా, పాకిస్థాన్‌ల దురాక్షికమణ గురించి ప్రస్తావించాడు. మన ఇద్దరు సైనికులను చంపిన దుర్మార్గాన్ని ప్రస్తావించాడు.పాకిస్థాన్‌లో భారత దేశ ఖైదీని చంపితే,ఇండియాలో పాకిస్థాన్ ఖైదీని చంపడంలో ఆఒక్క సమస్య బీజేపీ వరకు పరిష్కారమైనట్లే. పాకిస్థాన్‌లో ఎన్నికైన కొత్త అధ్యక్షుడు భారత ప్రధానిని తమ దేశానికి ఆహ్వానించాడు.

చైనా ఏకారణాల వల్లనో కొన్ని స్థావరాల నుంచి వెనుక్కి తగ్గింది. దీంతో ఆ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు వచ్చినట్లే. దేశానికి బలమైన ప్రధానమంత్రి కావాలి. అనే మరో నినాదానికి అంత ప్రాచుర్యమేమీలేదు. బలమైన అంటే అర్థమేమిటి? గుజరాత్ నమూనా బలమేనా లేక ప్రజల సమస్యలు తీర్చడంలో సంపన్నుల పట్ల సంపద పట్ల కొంత కఠిన వైఖరి అవలంబించి, పంపిణీలో న్యాయం జరిగేట్లు చూడడమా ఇప్పుడున్న వాతావరణంలో బలమైన అంటే నూతన ఆర్థిక విధానానికి అడ్డం వచ్చిన వాళ్ళని నయానా, భయానా తొలగించడం, ప్రజలకు ఈ విష యం కొంచెం కొంచెం అర్థమవుతున్నట్లు కర్ణాటక ఎన్నికలు సూచిస్తున్నాయి.

కర్ణాటకలో బీజేపీ కనీస నైతిక విలువలను కాపాడుకోలేకపోయింది. ఏ పద్ధతుల ద్వారా అయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి, అధికారంలో కొనసాగాలనే ఆకాంక్షను, అవినీతి బలమైన పార్టీ పునాదుల ను పెకలించివేసింది. ఈ మాట స్వయాన అద్వానీయే అన్నాడు. ఆయన ఒక అడుగు ముందుకేసి బీజేపీ గెలిస్తే తాను ఆశ్చర్యపోయేవాడిని అని అనడం సాధారణ విషయమేమీకాదు. కర్ణాటక ప్రజలు మాఫియా రాజకీయాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు రాజశేఖర్‌డ్డి అనుసరించిన వ్యూహాన్ని అనుసరించింది. వాళ్లు పేదల సంక్షేమ కార్యక్షికమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒకవిధంగా కాంగ్రెస్ పార్టీ విజయం.. సంక్షేమ విజయం. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మొదటి పత్రికా సమావేశంలో దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు పేదల సంక్షేమ కార్యక్షికమాలకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

రైతాంగానికి చాలా రాయితీలు ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు ఎంత వద్దన్నా ఎన్నికల రాజకీయాలున్నంత వరకు సంక్షేమ భావన తప్పదు. మనరాష్ట్రంలో చంద్రబాబునాయుడు సంక్షేమ కార్యక్షికమాలన్నీ ప్రపం చ బ్యాంకు ఒత్తిడి మేరకు రద్దు చేసిన సందర్భంలో, ప్రపంచ బ్యాంకు ఏజంటు కళానిధి సుబ్బారావును చంద్రబాబుకు సలహాదారుడుగా పంపించారు. ఆయన ఆర్థికసంస్కరణల కార్యక్షికమాన్ని మరింత ముందుకు తీసుకపోవడానికి తాను వత్తిడి పెడుతున్నట్లు ఒక వ్యక్తిగత సంభాషణలో నాతో అన్నప్పుడు మీరు ఇలాం టి సలహాలే ఆయన నెత్తిమీద రుద్దుతే వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతాడు అని నేనంటే, అయితే ప్రపంచీకరణకు నూతన ఆర్థిక విధానానికి ప్రజాస్వామ్యం ఒక సవాలే అని అన్నాడు.అదే ఆంధ్రవూపదేశ్‌లో జరిగింది. కర్ణాటకలో జరిగింది. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. ప్రపంచ బ్యాంకుకు ఎన్నికలు ఒక తలనొప్పయ్యాయి.

చరిత్ర, విచివూతమైన మలుపులు తీసుకుంటున్నది. జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీని ప్రధానమంవూతిగా ముందుకు తీసుకవచ్చిన సందర్భంలో మనకు ప్రజల కనీస అవసరాల మీద, ప్రజల నాడి మీద ఏమైనా అవగాహన ఉందా? మనకు తెలియదు. బీజేపీ నుంచి నరేంవూదమోడీ కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాంధీ దొందు దొందే. ఇద్దరికి నూతన ఆర్థిక విధానం మీద, సామ్రాజ్యవాదం పట్ల ఒకే రకమైన దృక్పథం ఉన్నది. పెట్టుబడిదారీ పంథా మీద ఏమీ తేడాలు లేవు. గుజరాత్ వెళ్లి రాహుల్‌గాంధీ, మహాత్మాగాంధీ గురించి ప్రస్తావించే బదులు, శ్యాంపెవూటోడా ఘనతను ప్రస్తావించాడు. పెవూటోడా నూతన ఆర్థిక విధానానికి ప్రపంచ ఆర్థిక సంస్థల ఏజెంట్. రాహుల్‌గాంధీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి భిన్నంగా సిద్ధరామయ్య సోషలిస్టు భావాలతో ప్రేరణ పొందినవాడు.

నంజుండస్వామి నాయకత్వంలో నడిచిన రైతాంగ ఉద్యమంలో కెంటెకే చికన్ దాడిలో పాల్గొన్నవాడు. ప్రపంచీకరణ దాడి నుంచి వ్యవసాయరంగాన్ని కాపాడాలని పోరాడిన వారిలో ఆయన ఒకడు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతాన్ని మరచిపోవడమనేది మనదేశ రాజకీయ సంస్కృతిలో భాగం.మన్‌మోహన్‌సింగ్ సౌత్ సౌత్ కమిషన్ చైర్మన్‌గా ప్రపంచీకరణను,అంతర్జాతీయ క్యాపిటలిస్టు దాడి ని వ్యతిరేకించినవాడే. కాని అధికారంలోకి వస్తూనే సామ్రాజ్యవాద ప్రతినిధిగా రూపాంతరం చెందాడు. సిద్ధరామయ్య అలా మారడని గ్యారంటీ ఏమీలేదు. అయితే చిదంబరం,ఎస్.ఎం కృష్ణను ముఖ్యమంత్రి చేయాలని కోరినా పాపం ఆయన కోరిక ఫలించలేదు. చిదంబరానికి స్పష్టమైన అవగాహన ఉన్నది. నిజానికి ప్రపంచ ఆర్థికశక్తులు ఆయననే ప్రధానమంవూతిగా చూడాలని ఊవిళ్ళూరుతున్నాయి. చిదంబరానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావడం ఇష్టంలేకపోవడం సహజమే. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య నాయకత్వాన్ని ఆసక్తిగా గమనించవలసిందే. ఆయన సంక్షేమ ప్రాధాన్యతలను కొనసాగించగలరా లేక ప్రపంచీకరణ సునామీలో కొట్టుకుపోతారా తప్పకుండా దగ్గరగా పరిశీలించవలసిందే.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర,కర్ణాటక అనుభవాలనుంచి నేర్చుకోవలసింది చాలా ఉన్నది.ఆంధ్రవూపదేశ్‌లో చంద్రబాబు నాయుడు నమూనాకు వ్యతిరేకంగా రాజశేఖర్‌డ్డి ప్రచారం చేయడమేకాక, అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేశాడు. ప్రపంచ బ్యాంకును ఖాతరు చేయకపోవడం వల్ల ఆయనకు చాలా ప్రాచుర్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు తన తప్పులను గ్రహించి తాను మారానని ఎంత ప్రచా రం చేసుకున్నా, ఎంత దూరం నడిచినా రాజశేఖర్‌డ్డి సంక్షేమ హవాను ఎదుర్కోలేకపోతున్నాడు. జగన్‌మోహన్‌డ్డి జైలులో ఉన్నా, తండ్రి చేపట్టిన సం క్షేమ కార్యక్షికమాలను కొంతవరకు హర్షించిన ప్రజలు ఆ క్రెడిట్‌ను జగన్‌మోహన్‌డ్డికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇది జగన్‌మోహన్‌డ్డి పాపులారిటీ కాదు, ఇది సంక్షేమ కార్యక్షికమాల పట్ల ప్రజలకున్న అవగాహన. ఇక్కడ కర్ణాటక రాజకీయాలకు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర రాజకీయాలకున్న సారూప్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

తెలంగాణ ఉద్యమం ఈ ధోరణుల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. నిజానికి తెలంగాణ ప్రజ లు తమ సమస్యలకు తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో పరిష్కారాలు వెతుకుతున్నారు. ఈ దేవులాటలో సం క్షేమం చాలా బలంగా పనిచేస్తున్నది. తెరాసకు ఈ విషయం అర్థం అయ్యిందో లేదో తెలియదు. భౌగోళిక తెలంగాణ ఒక ఆకాంక్ష మాత్రమే కాని తమ సమస్యల పరిష్కారమే నిజమైన డిమాండ్.
బీజేపీ తెలంగాణలో బలపడాలని చాలా ప్రయత్నం చేస్తున్నది. ఒక రాజకీయ పార్టీ తాను బలపడాలనుకోవడం సహజమే కావచ్చు. కానీ కర్ణాటక నుంచి నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. రజాకార్ల గురించి, నరేంవూదమోడీ గురించి, మతద్వేష భాషను మరచి తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి, అవసరాల గురించి మాట్లాడాలి.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల సమస్యల గురించి, పాలమూరు కరువు గురించి,ఆదిలాబాద్ గిరిజనుల భూమి సమస్య గురించి, నల్గొండ ఫ్లోరోసిస్ గురించి, కరీంనగర్ ఖనిజాల తరలింపు గురించి హైదరాబాద్, రంగాడ్డి జిల్లాలో ఆక్రమించుకున్న భూముల గురించి కూడా బీజేపీ పట్టించుకోవాలి. విశ్వవిద్యాలయాల పునరుద్ధరణ, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సరఫరా ఇం కా ఎన్నెన్నో ప్రజలను వేధిస్తున్న సమస్యల మీద మాట్లాడితే ప్రజలు కొంతైనా ఆ పార్టీని నమ్మవచ్చు. దేవుడు, మతము వ్యక్తిగత విశ్వాసమే కానీ నిత్యజీవిత సమస్యకాదు. మతద్వేష రాజకీయాలను,మాఫియా సంస్కృతిని,అవినీతిని, అక్రమ ఖనిజ తరలింపును, అక్రమ సంపదను కర్ణాటక ప్రజలు వ్యతిరేకించారు. తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమనిర్మాణంలో ఉన్నవారు ఇది గ్రహిస్తే పార్టీలకు మంచి ది. తెలంగాణ ప్రజలకు మరింత మంచిది.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల