సామాజిక శాస్త్రజ్ఞులకు గుర్తింపు


Wed,May 8, 2013 10:05 AM

సామాజిక శాస్త్రాల జాతీయ మండలి (ఐ.సి.ఎస్.ఎస్.ఆర్) దేశం లో మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో సామాజిక శాస్త్ర అధ్యయనానికి, విజ్ఞానానికి విలువైన కంట్రిబూషన్ చేసిన శాస్త్రజ్ఞులకు అవార్డులు ప్రకటించింది. ఈనెల ఆరవ తేదీన ఢిల్లీలో ఒక జాతీయ సమావేశం ఏర్పరచి ఈ అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డులకు ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ పేర ఇస్తున్నారు. మొదటిసారి ఆరుమంది శాస్త్రవేత్తలకు ఆర్థికశాస్త్రంలో వకుళాభరణం వంశీచరణ్, రాజనీతిశాస్త్రంలో ప్రతాప్ భాను మెహతా, న్యాయశాస్త్రంలో కల్పనా కన్నబీరాన్, భౌగోళికశాస్త్రంలో అనుకపూర్, ఎడ్యుకేషన్‌లో సుధాంశు భూషణ్, సోషియాలజీలో సురేందర్ జోడ్కాలకు ఈ అవార్డులు ఇచ్చారు. ఈ అరుగురిలో ముగ్గురికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సంబంధముంది. సురేందర్ జోడ్కా సోషియాలజీలో అధ్యాపకుడుగా కొంతకాలం పనిచేశాడు. కల్పనా కన్నాబరాన్ కొంతకాలం తన పరిశోధనను ఈ విశ్వవిద్యాలయంలో చేశారు. వంశీచరణ్ ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

వీరి పరిశోధనా అంశాలు వీరికి అవార్డులు ఇవ్వడానికి ఎంపిక కమిటీ పేర్కొన్న కారణాలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. వంశీచరణ్ అధ్యయనం చేసిన వ్యవసాయ సంక్షోభం, తెలంగాణలో వ్యవసాయక సంబంధాల మీద, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల మీద చేసిన పరిశోధనను ప్రస్తావించారు. ఈ సంక్షోభాన్ని ‘అభివృద్ధిని పేదరీకరించడం’ (Immiserising growth) అనే సూత్రీకరణ చాలా విలువైనదిగా పేర్కొన్నారు. అలాగే పొలిటికల్ ఎకానమీ పరిశోధన పద్ధతిని అవలంబించి, భారత్, చైనా, జపాన్ దేశాలలో పెరుగుతున్న వ్యవస్థీకృత అసమానతల మీదే కాక అంతర్గత ప్రక్రియ మీద చేసిన పరిశోధనను కూడా విలువైనదిగా పేర్కొన్నారు.వంశీచరణ్ వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేసి, బాలగోపాల్ ప్రభావంతో వ్యవసాయక సంబంధాల మీద ఆసక్తి పెంచుకుని ప్రొఫెసర్ డి. నర్సింహాడ్డి పర్యవేక్షణలో ఈ అధ్యయనాలు చేశారు.

అలాగే కల్పనా కన్నబీరాన్ సోషియాలజీ, న్యాయశాస్త్రాన్ని సమ్మిళితం చేసి సామాజిక వివ క్ష, క్రిమినల్ చట్టాల మీద చేసిన పరిశోధనను చాలా విలువైన అధ్యయనంగా పేర్కొన్నారు. దీనిలో సామాజిక ఉద్యమాలు, మహిళా అధ్యయనాలు, వికలాంగుల పట్ల అవలంబిస్తున్న వివక్షను ప్రత్యేకంగా ప్రశంసించారు. సోషియాలజీ, న్యాయశాస్త్రాల దృష్టిలో బలహీనుల, ఆదివాసీల, దళితులపై చేసిన అధ్యయనాలకు ఈ అవార్డు ఇచ్చినట్లు ప్రకటించారు. ఆమె పరిశోధనా క్రమంలో అభివృద్ధి చేసిన రీసెర్చ్ పద్ధతులలో న్యాయాన్ని, వివక్షను, స్వేచ్ఛను అధ్యయనం చేయడానికి కావలసిన సైద్ధాంతిక ఛట్రం చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు, అలాగే తెలంగాణ వారికి కల్పనా కన్నాబిరాన్ చిరపరిచితులు. ఆమె కొందరు సహచరులతో కలిసి ఎకానామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో తెలంగాణ ఉద్యమానికున్న సామాజిక పునాది గురించి, భిన్న వర్గాలు అనుభవిస్తున్న సంక్షోభాన్ని గురించి మంచి వ్యాసం రాశారు.

ఇక సురేంద్ర జోడ్కా గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పుల మీద అభివృద్ధి మీదే కాక గ్రామీణ సామాజిక అంచలంచల నిర్మాణంపై చేసిన పరిశోధనను విలువైనదిగా పేర్కొన్నారు.ఆయన పరిశోధనలో ప్రత్యేకం గా మైనారిటీస్ జీవన స్థితిగతుల మీద చేసిన విశ్లేషణను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ క్రమంలో గ్రామీణ సమాజంలోని అసమానతల మీ ద వివక్ష మీద చేసిన అధ్యయనాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆయన గ్రామీణ అభివృద్ధిలో కులపర అసమానతలు ఎలా పునరుత్పత్తి అవుతున్నావన్న పరిశోధనను కూడా పేర్కొన్నారు. జోడ్కా మంచి సామాజిక శాస్త్రవేత్తే కాక, సమాజం పట్ల బాధ్యతగా, సున్నితంగా ఆలోచించే వ్యక్తి.

ప్రతాప్ భాను మెహతా పొలిటికల్ ఫిలాసపీ, భారత రాజకీయాల మీద చేసిన పరిశోధనలో భారత సామాజిక తత్వం, రాజకీయ ఆలోచనా స్రవంతి మీద వేసిన ప్రభావాన్ని విశ్లేషించిన పద్ధతిని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆయన ఎంచుకున్న విశ్లేషణ పద్ధతి చాలా విశాలంగాను, దీర్ఘకాలిక మార్పులను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉందని పేర్కొన్నారు.ఆయన విశ్వవిద్యాలయాలకు పరిమితమయ్యే కాక వార్తపవూతికల ద్వారా సమకాలీన సమస్యలను విశ్లేషిస్తున్న పబ్లిక్ ఇంటపూక్చువల్‌గా పేర్కొన్నారు.
సుధాంశు భూషణ్ విద్యారంగంపై ప్రపంచీకరణ ప్రభావాలను విశ్లేషిస్తూ ప్రపంచీకరణ ధోరణులను ఎత్తిచూపారు. అయితే ప్రపంచీకరణ ప్రభావాలు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మీద భిన్నమైన ప్రభావాలు కలిగిస్తావని, అన్ని దేశాలను ఒకే గాటన కట్టకూడదని ఆయన చేసిన సూచనలు ప్రభుత్వ విధాన నిర్ణయంపై ప్రభావం వేశావని ప్రస్తావించారు. అలాగే విద్యా రంగంలో ముస్లింల పరిస్థితి మీద చేసిన మంచి విశ్లేషణను కూడా ప్రశంసించారు. విద్యారంగంలో పబ్లిక్ రంగమే ప్రధానమైన పాత్ర నిర్వహించాలని వాదిస్తూ పబ్లిక్ రంగంలోని ఉన్నత విద్య మనకు కనిపించని పద్ధతులలో ప్రైవేటీకరణకు ఎలా గురౌతుందో కూడా ఆయన విశ్లేషించారు. మొత్తంగా ఆయన పరిశోధన, వాదనలు ప్రజాపక్షంలో ఉన్న మొత్తం విద్యా సంస్కరణలను మౌలికంగా ప్రశ్నించినట్లు కనిపించదు. కానీ విద్యారంగ సంస్కరణల మీద లోతైన చర్చను చేసినవాడుగా ఆయనకు గుర్తింపు వచ్చింది.

ఇక భౌగోళిక శాస్త్ర పరిశోధకులు అనుకపూర్, భౌగోళిక శాస్త్రాన్ని పర్యావరణ దృక్పథం నుంచి పరిశీలించి, భారతదేశ భౌగోళిక సమస్యల మీద పరిశోధన చేయడమే కాక, ప్రకృతి బీభత్సాల మీద ఆమె చేసిన పరిశోధనను చాలా విలువైందిగా ఎన్నిక కమిటీ పేర్కొంది. అలాగే ఆమె భౌగోళి క శాస్త్ర అధ్యయన సంక్షోభాన్ని, ఈ శాస్త్రం పట్ల నిరాసక్తత చాలా లోతైన విశ్లేషణ చేశారు. అంతేకాక ప్రకృతి సంక్షోభాలు సహజమైనవి కావని, ఈ సంక్షోభాలకు ప్రభుత్వ విధానాలు అమానవీయ దృక్పథాలు కారణమనీ చేసిన విశ్లేషణ చాలా లోతైనదిగా పేర్కొన్నారు.

‘ నమస్తే తెలంగాణ’ పాఠకులు ఇప్పటికే విసిగిపోయింటారు. ఈ శోష అంతా ఎందు కు అని. ఇది ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు పెట్టుబడికి, సామ్రాజ్యవాదానికి ఊడిగం చేయడానికి చాలా సంసిద్ధంగా ఉన్నప్పుడు, ఈ సామాజిక శాస్త్రవేత్తలు, ప్రపంచీకరణ ప్రభావాలకు, ప్రలోభాలకు గురి కాకుండా మన సామాజిక ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల ను ప్రజల పక్షాన విశ్లేషిస్తున్నా అని తెలపడానికే ఈ వ్యాసం. వీళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన సెలక్షన్ కమిటీ సభ్యులను కూడా ప్రశంసించవలసిందే. ఇంకా ఈ దేశం లో సామాజికశాస్త్రాలలో ఒక అతి చిన్న వర్గం ప్రజల పక్షాన నిలవడం నాలాంటి వాడికి ఆనందాన్ని కలిగించే సంఘటనే.

ఇక ఈ అవార్డుల సమావేశ పరాకాష్ట మన జాతీయ మీడియా పాత్ర. మొత్తం సదస్సును మీడియా విస్మరించింది. ది హిందూ లాంటి పత్రిక కూడా ఎక్కడా దీని గురించి కనీసం ప్రస్తావించలేదు కూడా. శాస్త్ర,సాంకేతిక రంగాలలో ప్రకటించే భాట్నానగర్ అవార్డులకు విపరీతమైన ప్రచారాన్ని ఇస్తారు. ఆ శాస్త్రాలు మనిషి సౌఖ్యానికి దోహదం చేస్తావని వాళ్ల భావన. ఈ ఆరుగురు సామాజిక శాస్త్రవేత్తలు చేసిన పరిశీలనలు మొత్తం అభివృద్ధి నమూనాను, ప్రభుత్వ విధానాలను, ప్రపంచీకరణను, పెట్టుబడి ప్రాధాన్యాన్ని సామ్రాజ్యవాదాన్ని భిన్న స్థాయిల్లో ప్రశ్నిస్తున్నాయి. అందుకే పాలకుల కుట్ర. తమను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న విజ్ఞానాన్ని పెంపొందించడానికి సంస్కారం, చారివూతక స్పహ, ప్రజాస్వామ్య విలువలు కావాలి. ఈ విలువలను పాలకుల నుంచి ఇప్పుడు ఆశించడం అత్యాశే. అంతర్జాతీయ పెట్టుబడికి అమ్ముడు పోయిన జాతీయ మీడి యా సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యం, ప్రచారం ఇవ్వకపోవడం యాదృచ్ఛికమేమీకాదు. ఇక మీడి యా సామాజిక ఆరోగ్యానికి, ప్రజాస్వామ్యానికి దోహదపడుతుందన్నది భ్రమే. అయితే ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించని మీడియా అతి త్వరలోనే తన స్వేచ్ఛను కోల్పోతుందన్న వాస్తవాన్ని గుర్తిస్తే మీడియాకే కొంత ప్రయోజనం. ప్రజా ప్రయోజనం ఎలా గూ పట్టదు. కానీ తమ ప్రయోజనాన్ని కాపాడుకునే కనీస స్వార్థమన్న మీడియాకు కావాలి.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Featured Articles