మిణుగురులు: అరుదైన ప్రయత్నం


Wed,April 24, 2013 11:32 PM

అయోధ్య ఆయన మిత్రులు కళ్యాణ్ లాంటి వారు కలిసి అంధ బాలబాలికల సమస్యలపైన, వాళ్లమీద జరుగుతున్న అన్యాయాల మీద, అత్యాచారాల మీద మిణుగురులు అనే ఒక అరుదైన ఫీచర్ ఫిల్మ్‌ను చాలా శ్రమపడి తీశారు. ప్రపంచీకరణ, నయా ఆర్థిక విధానం, పాశ్చాత్య వికృత సాంస్కృతిక ప్రభావాల సునామీలో మన సినిమా రంగం కొట్టుకుపోతున్న తరుణంలో, వికలాంగుల వాస్తవ సమస్యలను వస్తువుగా తీసుకోవడమే కాక అంధ బాల బాలికలే హీరోలుగా, హీరోయిన్‌లుగా నటించిన గొప్ప చిత్రమది. వికలాంగుల సమస్యను కొంతకాలంగా చూసినవాడిగా, వాళ్ల సమస్యల మీద ప్రభుత్వంతో చర్చించి కొన్ని హక్కులకు ప్రయత్నం చేసే క్రమంలో ప్రత్యక్షంగా వాళ్ల వసతి గృహాలను, ఆ గృహాలలో జరిగే అకృత్యాలను, అమానుషత్వాన్ని చూసిన వాడిగా ఈ చిత్రం నన్ను చాలా కదిలించింది. మళ్లీ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవలసి వచ్చింది.

అయోధ్య అమెరికాలో పనిచేసి దేశానికి తిరిగివచ్చి అంధ బాలబాలికల సమస్య మీద ఒక ఫీచర్ ఫిల్మ్ తీయడాన్ని మనం అభినందించవలసిందే. ఒక్కసారి దేశాన్ని వదిలితే, మళ్లీ దేశానికి తిరిగి రాలేక, వచ్చినా ఈ వ్యవస్థలో ఇమడలేక, ఇమిడినా నిరంతరంగా మన సమాజాన్ని అమెరికాతో పోలుస్తూ నిస్తేజంగా జీవించే వైఖరి నుంచి బయటపడి, మనం సంపూర్ణంగా విస్మరించిన ఒక సమూహం మీద సునిశితంగా స్పందించి జీవితంతో ఒకవైపు, సమాజంతో మరోవైపు చేస్తున్న అంధ బాల బాలిక అనుభవాన్ని చూపించడానికి చేసిన ప్రయత్నం అరుదైన ప్రయత్నం. ఎన్‌ఆర్‌ఐలు ఆకాశంలో విహరిస్తూ చుక్కల మధ్యన తిరుగుతున్నామని భ్రమపడే దశలో, కళ్లు కనిపించని వాళ్ళు, కళ్లకు కనిపించడం అరుదైన స్పందనే.

వికలాంగుల సమస్య చరివూతలో చాలా మలుపులు తిరిగింది. ఆదిమ కాలంలో పిల్లలు వికలాంగులుగా పుడితే వాళ్లు పూర్వ జన్మలో చేసుకున్న పాపం వల్ల దేవుడు వాళ్లను శిక్షించడానికి అలా పుట్టించాడు అని భావించేవారు. వారిని శ్రద్ధగా చూడ డం కాని, పెంచడం కాని దేవుని సృష్టికి వ్యతిరేకం అని నమ్మి ఒక గుట్ట మీదికో లేదా నది దగ్గరకు తీసుకొని విసిరివేసేవారు.వైకల్యం ఏ కారణం వల్ల వచ్చిందో తెలువని కాలంలో ఈ పని చేశారు. తర్వా త కాలంలో కొన్ని మతాలు దయదాక్షిణ్యం అనే కొన్ని విలువలను బోధించే క్రమంలో వికలాంగులుగా పుడితే చంపడానికి బదులు, వాళ్లను వాళ్ల మానానికి వదిలేసేవారు. మన సాహిత్యంలో శ్రవ ణ కుమారుడి కథలో అంధులైన తల్లిదంవూడులను చూసుకున్న పద్ధతి పిల్లలకు బోధించడం లాంటి కొన్ని మానవీయ ప్రయత్నాలు జరిగాయి. కానీ మహాభారతంలో ధృతరాష్ట్రుడు అంధుడే. కాని ఆయన నిర్వహించిన పాత్ర ఆయన పట్ల సానుభూతిని కలిగించదు. క్రిష్టియానిటీ జాలిని, దయను బోధిస్తుంది. జీసెస్ పాపాలు చేసిన మనుషుల పట్ల జాలి చూపాలని బోధించాడు.కాని ఇవన్నీ ఏవీ కూడా రాజ్య వ్యవస్థ పాత్రను విశ్లేషించడం కాని, వాళ్ల అభివృద్ధికి దోహదపడే విధానాలు రూపొందిం చే ప్రయత్నం కాని చేయలేదు.

వికలాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ దీనిపట్ల ప్రభుత్వ విధానాలు ప్రపంచ యుద్ధాల తర్వాత మారి వాళ్ల సమస్యలు సంక్షేమ భావనలో భాగమయ్యాయి. ప్రపంచ యుద్ధాలలో గాయపడిన వారు వివిధ రకా ల వైకల్యానికి గురయ్యారు.కాళ్లు, చేతులు కోల్పోయిన వాళ్లు, కళ్లు కోల్పోయిన వాళ్లు, వినికిడి కోల్పోయిన వాళ్లు చికిత్సాలయాలలో కోలుకుంటున్న క్రమంలో, వైకల్యం దేవుడి సృష్టికి లేదా ప్రకృతి వైఫల్యానికి సంబంధించిన అంశం కాదని, అది పాలకుల వైఫల్యం నుంచి ఆధునిక సాంకేతిక విధ్వంసం నుంచి కూడా కలుగుతుందన్న అవగాహన ఏర్పడిన తర్వాత వికలాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, వాటికి అనుగుణమైన విధాన రూపకల్పన ప్రారంభమయింది.

వికలాంగులకు ఒక అవయవం సరిగా పనిచేయకపోతే వాళ్లకు ఇతరత్రా చాలా ప్రతిభ ఉంటున్నదన్నది మన అవగాహనలోకి వచ్చింది. వికలాంగులు గాయకులుగా, పరిశోధకులు గా, తత్వవేత్తలుగా, పరిపాలనాదక్షులుగా, రాజకీయ నాయకులుగా, ఉపాధ్యాయులుగా, అభ్యాసకులుగా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. దక్షిణావూఫికాలో జస్టిస్ యాకూబ్ అంధత్వమున్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొప్ప పాత్ర నిర్వహిస్తున్నాడు. కొత్త సాంకేతిక ఆవిష్కరణల వల్ల వికలాంగులు సామాజిక అభివృద్ధిలో ఇతరులతో సరిసమానమైన పాత్రను నిర్వహించడం మనం చూస్తున్నాం. మన మధ్యే జీవిస్తూ అద్భుత ఆలోచనలు చేస్తూ నూతన విజ్ఞానాన్ని సృష్టిస్తున్న హాకింగ్ ప్రకృతి అద్భుతాలలో ఒక అద్భుతం. అవయవాలేవి పనిచేయకున్నా ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో ఆయన మేధస్సు చాలా చురుకుగా పనిచేస్తున్నది. ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కులలో, అలాగే జాతీయ మానవహక్కుల ప్రమాణాలలో వికలాంగులకు చాలా హక్కులు కల్పించబడ్డాయి.

ఇంకా ఈ హక్కు ల పరిధి, ప్రమాణం పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా వికలాంగుల హక్కులకు ప్రత్యేక చట్టం వచ్చింది. కాని ఇవి ఏవీ ఆచరణలో లేవు. ఈ మధ్య మా స్నేహితుడి నడవలేని స్థితిలోనున్న కూతురు ఒక నెలరోజులు బ్రిటన్‌లో తన చెల్లెలి దగ్గర గడిపి వచ్చింది. తర్వాత తనకు వైకల్యమున్నదన్న విషయం దాదాపు తాను మరిచిపోయానని అన్నది. వాళ్ల కట్టడాలు, బస్సులు, రోడ్లు, రైళ్లు, దుకాణాలు అన్నీ వికలాంగుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించడం వల్ల తనకు ఎక్కువ ఇబ్బంది కలగలేదని అన్నది.

మనదేశ పాలకులు అంతర్జాతీయ ప్రమాణాలు అంగీకరించడానికి అతి ఉత్సా హం చూపిస్తుంటారు. అంతర్జాతీయంగా ఏ కొత్త అంగీకారం జరిగినా మొదట సంతకం చేసేది మన దేశమే. ఎన్ని అంతర్జాతీయ చట్టాలను మనం అంగీకరించాం. అన్నీ ఒక్కసారి ఆలోచిస్తే- చట్టాన్ని పెద్దగా అమలు చేయవలసి ఉంటుందని, మనం అంగీకరించిన ప్రమాణాలు మన నిత్య సామాజిక అనుభవంలో ఆచరణలో భాగం చేయాలని వారు భావించడం లేదు. ఏ అదనపు ప్రయత్నం పాలకులు చేయవలసిన అవసరం లేదని వాళ్లు భావించడం వల్లే, ప్రమాణాలు పెరిగి ఆచరణ దిగజారిన అనుభవం మనది. ప్రమాణాలు అంగీకరించడమే మన గొప్ప. అదే చాలు అని భావిస్తారు మన పాలకులు. మన దేశంలో హక్కుల అమలు ఎలా ఉందో ఈ మిణుగురులు చిత్రం ఎత్తి చూపింది.

ఈ చిత్రంలో ప్రధానంగా ప్రభుత్వ సహాయంతో నడిచే ఒక అంధుల వసతి గృహం ఎంత అమానుషంగా నడుపబడుతుందో చిత్రీకరించారు. ఈ వసతి గృహం ఒక రాజకీ య నాయకుడి ఆధ్వర్యంలో, ఒక మాఫియా నాయకుడు నడుపుతుంటాడు. అతనికి ఈ అంధ బాలికల పట్ల జాలి,దయ, శ్రద్ధ లేకపోవడమే కాక వాళ్ల పట్ల ఏహ్య భావం కూడా ఉంటుంది. తన అకృత్యాలన్నిటికి వసతి గృహాన్ని కేంద్రంగా మార్చుకుంటాడు. అసహాయులైన పిల్లలకు తిండి పెట్టకుండా, ఏ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల, వాళ్లు చైతన్యవంతులౌతూ తమ హక్కుల గురించి ప్రశ్నిస్తూ, తిరగబడుతూ ఏదో రూపంలో ఉద్యమం చేస్తూనే ఉంటారు. ఉద్యమాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారనుకున్న వారి మీద విపరీతమైన హింసను ఉపయోగిస్తుంటారు. గొడ్లను బాదినట్లుగా బాదుతుంటారు. తమ అనుభవం మీద పిల్లలు పోరాట రూపాలు మారుస్తూ ఉంటారు. తమ వసతి గృహంలో జరిగే అకృత్యాలను ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకరావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు.

అంతిమంగా జిల్లా కలెక్టర్‌కు తమ సమస్యల గురించి లేఖ రాస్తే, ఆమె చాలా యాంత్రికంగా వసతి గృహం మీద రిపోర్టు ఇవ్వవలసిందిగా కింది అధికారులను ఆదేశిస్తుంది. మాఫియా నాయకుడు ఆ ఇన్‌స్పెక్టర్‌ను మేనేజ్ చేసే పద్ధతిని గొప్పగా చిత్రీకరించారు. మన పాలనా యంత్రాంగం ఎంత అమానవీయంగా తయారైందో అగుపిస్తుంది. అంతిమ పోరాటంగా తమ వసతి గృహంలో జరుగుతున్న అన్యాయాలను తమకుండే ప్రతిభతో ఒక కెమెరాలో బంధిస్తారు. కలెక్టర్ దృష్టికి తమ సమస్యలు తీసుకపోవడానికి పోరాటం చేస్తుంటారు. చివరికి కలెక్టర్ దృష్టికి తమ సమస్యలు తేవడానికి ఒక టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటించిన తర్వాత కాని కలెక్టర్ కదలరు. ఈ పోరాటాన్ని చిత్రీకరించిన పద్ధతిచాలా ఆలోచింపచేసేదిలా ఉంది.మొత్తంగా సమాజంలోని ఒక విస్మరించబడ్డ సమస్య మీద మనసు పెట్టి తీసిన చిత్రం.

ఈ చిత్రాన్ని తీయనైతే తీశారు. కాని తీసిన తర్వాత దీనిని ప్రజల దగ్గరకు తీసుకపోవడానికి వాళ్ళు దారు లు వెతుకుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రభుత్వం ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్టేషన్’ ముస్సోరిలో, అబ్బాయి లు, అమ్మాయిలకు ఐఏఎస్‌లో శిక్షణలో భాగంగా చూపించవచ్చు. అలాగే భిన్న స్థాయిల్లోని అధికారులకు చూపించవచ్చు.అయితే ఈ నిర్ణయం తీసుకునే వాళ్లే కరువయ్యారు. మనదేశంలో పాలనా వ్యవస్థ నూతన ఆర్థిక విధాన ప్రభావంలో సంక్షేమ భావననే వెనక్కి నెట్టేసింది. సంక్షేమ భావన బీజరూపంలో కమ్యూనిస్టు వ్యవస్థే అనే ఒక సూత్రీకరణ కూడా నయా ఉదారవాదులు చేశారు. రాజ్యం కేవలం పెట్టుబడికి, మార్కెట్‌కు ఊడిగం చేయాలే తప్ప ప్రజల గురించి పట్టించుకుంటే తాము చేసుకునే అక్రమ లాభాలు సాధ్యంకావని, పెట్టుబడిలో కొంతభాగమైనా ప్రజలలో పంచుకోవడానికి ససేమిరా సిద్ధంగా లేని పరిణామ దశ ఇది. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి చిత్రానికి ఆదరణ లేకపోవడం సహజమే.

సమాజమైనా తను తాను నాగరిక సమాజంగా పిలుచుకోవాలంటే లేదా నాగరిక సమాజంగా పరిణామం చెందాలంటే తమలో భాగమై చాలా అన్యాయానికి గురవుతున్న వాళ్ల గురించి నిరంతరంగా ఆలోచించాలి, స్పందించాలి. స్పందించే లక్షణం కోల్పోయిన సమాజాలు మానవత్వాన్ని కూడా కోల్పోతాయి. అమానవీయమైన మనుషుల మధ్య మనం బతకవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు సమాజం తనకు తెలియకుండానే అనుభవిస్తున్నది. చిన్న పిల్లలపై అమానుషమైన అత్యాచారాలు, రోజూ జరిగే దారుణమైన హత్యలు, ఈ వాతావరణం మధ్య బతకలేక ఆత్మహత్యలు, విచ్ఛిన్నమౌతున్న అన్ని సామాజిక సంబంధాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం.మాట్లాడితే చంపండి, ఉరితీయండి, నరకండి అనే స్పందన కూడా అమానుషమే.

ఇవి ఎందుకు జరుగుతున్నాయి? వీటికి మూలాలు ఎక్కడున్నాయ్ అని ఆలోచించడానికి సమాజం భయపడుతున్నది. మీడియా సరేసరి. వాళ్ళు సాయం త్రం పూట చేసే పనికిరాని చర్చలో, గంటల తరబడి ప్రజా సమయం నిరుపయోగం తప్పించి, ఒక ఆలోచిస్తున్న సమాజంగా, మూలాలల్లోకి వెళ్ళి సమస్యల పరిష్కారాలు వెతికే ప్రయత్నం అసలులేదు. అలా చేస్తే మీడియా పునాదిలో ఉండే కార్పొరేటు వ్యవస్థ మూలాలు కదులుతాయనే భయం చాలా ఉంది. మీడియా యాం కర్లు సినిమా పాత్రల మరో రూపంలా కనిపిస్తున్నారే తప్ప, ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిపి సమాజం తన అనుభవాన్ని లోతుగా అర్థం చేసుకునే ఉత్ప్రేరకాలుగా పనిచేయడంలేదు.అందుకే ఈ చిత్రం పేరు ‘మిణుగురులు’ అన్నారు. అంటే చీక ట్లో ఇంకా మిణుకు మిణుకుమని వెలుగుతున్న మట్టి దివ్వెలుగా అంధ బాలబాలికలు మనకు కనిపిస్తారు.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles