టెర్రరిజం- మీడియా రిపోర్టింగ్


Thu,April 11, 2013 05:01 AM

tearerహిందూ దినపత్రిక ఆదివారం (7-4-2013) నాడు పాతనగరంలోని సాలార్‌జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో మీడియా-టెర్రరిజం రిపోర్టింగ్ మీద ఆ పత్రిక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ అధ్యక్షతన ఒక సింపోసి యం నిర్వహించింది. దీంట్లో ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు, మాజీ సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ కట్జూ, నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ముస్త ఫా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, నేను పాల్గొన్నాం. అంతకుముందు రోజే కట్జూ తెలంగాణ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు కొన్ని తెలుగు దిన పత్రికలలో పతాక శీర్షికలుగా ప్రకటించడం వల్ల పెద్ద దుమారం చెలరేగింది. మరునాడే సదస్సు జరగడం వల్ల నా ప్రసంగంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావించాను.

పత్రికలు రిపోర్టు చేసిన పద్ధతిని వివరిస్తూ, ఆయన వ్యాఖ్యలను మీడియా ఎలా భూతద్దంలో చూపిందో ప్రస్తావిస్తూ.. ఆయనకు తన అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉందని,అయితే ఒక ప్రజా ఉద్యమం కేవలం ఆయన వ్యాఖ్యల వల్ల, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆగడము జరగదని అన్నాను. నా తర్వాత మాట్లాడిన కట్జూ ఎందుకో నా వ్యాఖ్యల మీద తాను మాట్లాడడని అం టూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కట్జూ వ్యాఖ్యలు చదివి కొంద రు ఆవేదన చెందారు. కొందరు ఆందోళన చెందారు. కొందరు ఆవేశపడ్డారు. ఆ స్పందనలు చూస్తే ఇంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని చూస్తున్న వాళ్లు, దాని నిర్మాణంలో భాగమైనవారు అంత ఆందోళనపడడం నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వాళ్లు, ప్రజల మీద విశ్వాసం ఉన్నవాళ్లు ఒక పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలకు కుంగిపోవడం జరగకూడదు.

తర్వాత ప్రసంగంలో టెర్రరిజం మీద మాట్లాడిన కట్జూ చాలా లోతైన విశ్లేష ణ చేశాడు. పేదరికమూ, నిరుద్యోగమూ, అసమానతలు, వివక్ష ఉన్నంత కాలం టెర్రరిజం ఉంటుందని, దాన్ని పోలీసుల లేదా సైన్యం ద్వారా అణచివేయడం సాధ్యం కాదని అంటూ, ఒక నిరుద్యోగ యువకుడికి రెండే ప్ర త్యామ్నాయాలు మిగిలాయని, ఒకటి టెర్రరి స్టు కావడమో లేదా ఆత్మహత్య చేసుకోవడమో. ప్రభుత్వాలు, పాలకులు టెర్రరిజం వేళ్లలోకి వెళ్లలేకపోవడం, వాటి మూలాలు పరిష్కరించకపోవడం వల్ల ఈ పర్యవసానం ఎదుర్కొవలసి వస్తు న్నదని అన్నాడు. ఈ అవగాహన ఉన్న కట్జూ తెలంగాణ ఉద్యమాన్ని ఆ దృక్పథంలో ఎందుకు చూడలేకపోయాడన్నది పెద్ద ప్రశ్న. బహుశా ఎం త మంచి ఉద్దేశాలున్న వాళ్లకైనా ఒక సమగ్ర ప్రాపంచిక దృక్పథం లేకపోతే వాళ్ల ఆలోచనల్లో, ప్రకటనల్లో వైరుధ్యాలుంటాయి. అయితే టెర్రరిజాన్ని మీడియా వక్రీకరించడం వల్ల మొత్తం టెర్రరిజాన్ని ఒక మతానికి అంటగట్టి చాలా పొరపాటు చేస్తున్నారని, ఒక సంఘటన జరిగినప్పు డు దానికి ఎవరు బాధ్యులో ఊహాగానాల మీద నిర్ణయించడం చాలా ప్రమాదమని పేర్కొన్నా డు. ఇలా బాధ్యతారహితంగా రాయడం వల్ల మతకల్లోలాకు కారణమవుతున్నాయని, మతతత్వ రాజకీయాలకు ఆజ్యంపోసినట్లు అవుతున్నాయని కూడా అన్నాడు. మనదేశం జీరో మతతత్వం దగ్గర ప్రారంభమై ఈ రోజు 80 శాతం హిందువులు, 80 శాతం ముస్లింలు మతద్వేష రాజకీయాలలో భాగమైపోతున్నారని వాపోయాడు.

తర్వాత మాట్లాడిన నల్సార్ వైస్ చాన్స్‌లర్ టెర్రరిజాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమై, ఆ సంఘటనల పట్ల ప్రేక్షకపాత్ర నిర్వహించి, మనకు తెలియకుండానే దానికి మనం మద్దతుదారులం అవుతున్నామని పేర్కొన్నాడు. టెర్రరిజం కేవలం ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన అంశమే కాదని, అది మొత్తం సమాజంలో భయోత్పాన్ని సృష్టించి మనిషి మానసికస్థితి మీద దెబ్బకొడుతుందన్నాడు. మీడియా ఈ విషయంలో తన రిపోర్టింగ్‌లో సంయమనం పాటించకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోవడానికి కారణమైందని అన్నాడు. దీనివల్ల టెర్రరిజం బాధితులకు ఎలాంటి ప్రయోజనం సమకూరదని విశ్లేషించాడు. ఈ అంశంమీద మాట్లాడిన సైబరాబాద్ కమిషనర్ మీడియా ఒత్తిడి వల్ల పోలీసులు ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలకు రాలేకపోవచ్చు అని, ఎవరు టెర్రరిస్టు చర్యకు పాల్పడ్డారని మరీ మరీ అడగడం వల్ల సరైన ఇన్ జరపడానికి కాని, సరైన దోషులను గుర్తించడానికి కానీ వీలుకాదు. ఒకవైపు మీడియా పబ్లిక్ ఒపీనియన్‌ను ప్రభావితం చేయడం వల్ల కొందరు అనుమానితులను కస్టడీలోకి తీసుకోవలసి వస్తుందని, అలా జరగకూడదని అంటే పోలీసులకు సమయం ఇవ్వవలసి ఉంటుందని, ఎక్కువ ఒత్తిడి పెట్టడం మంచిది కాదన్నాడు. అలాగే పోలీసులు సమయానికే సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెడితే దాన్ని మీడి యా కవర్ చేస్తే ప్రజల్లో కొంత విశ్వాసం కలుగుతుంది అన్నాడు.

ఈ చర్చలో భాగంగా టెర్రరిజం అంటే ఏమిటి అనే దగ్గర ప్రారంభం కావాలని, ఏది టెర్రరిజం, ఏది టెర్రరిజం కాదో ఎట్ల తేల్చాలి అనే ప్రశ్న కూడా ఉంది. టెర్రరిజం అంటే ఏమిటో అర్థం చేసుకొని అవగాహనతో మాట్లాడాలి. ఒక వారం పది రోజుల క్రితమే కేంద్ర మావోయిస్టు అగ్రనాయకుల పేర్లను టెర్రరిస్టు లిస్టులో చేర్చారు. ఇంతకాలం ‘వామపక్ష తీవ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించిన హోంమంత్రిత్వ శాఖ ‘తీవూవ వాదాన్ని’ ‘టెపూరరిజం’గా మార్చివేసింది. కొంతకాలంగా విప్లవ ఉద్యమాన్ని మీడియా టెర్రరిస్టుగానే చిత్రీకరిస్తూ వస్తున్నది. విప్లవ ఉద్యమానికి లక్ష్యాలున్నాయని, రాజకీయాలున్నాయని, విచ్చలవిడి హింస ఉపయోగించి జనావాసాలలో బాంబులు పెట్టి, మొత్తం జనాన్ని భయవూభాంతులకు గురిచేసిన సంఘటనలు చాలా తక్కువ.

వాళ్లు రాజ్య వ్యవస్థను, ఆర్థిక విధానాలను ప్రశ్నిస్తున్నారు. దీన్ని కేవలం ఉన్మాదంతో చేసే చర్యలతో పోల్చడం, దాంట్లో భాగంగా పరిగణించడం చారివూతక తప్పిదం అవుతుంది. విప్లవపార్టీలు పొరపాట్లు చేసి ఉండవచ్చు.వాళ్ల చర్యలలో అమాయకులు కొందరు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీన్ని ప్రజాస్వామికవాదులు ఎప్పటికప్పుడు ఉద్యమాలకు గుర్తుచేస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. విమర్శనా పూర్వక వ్యాసాలు రాస్తున్నా రు. ఉద్యమాలు సమీక్ష చేసుకొని తమ వల్ల తప్పులు జరిగాయని, క్షమాపణలు కోరిన సంఘటనలు చాలా ఉన్నాయి. నిజానికి మాఫియా చర్యలు టెర్రరిజానికి దగ్గరగా ఉంటాయి. కానీ మాఫియాను టెర్రరిస్టులు అని మీడియా ఎక్కడా ప్రస్తావించినట్లు నాకు తెలియదు. వాళ్లు పాలకుల బంట్లు కావడం వల్ల అలా ప్రస్తావించటంలేదు. గుజరాత్‌లో జరిగిన మానవహనాన్ని టెర్రరిస్టు చర్యగా ఏ మీడి యా పేర్కొనలేదు. నిజానికి ఎవరు టెర్రరిస్టో, ఎవరు విప్లవకారులో, ఎవరు తీవ్రవాదులో,ఎవరు తిరుగుబాటుదారులో ప్రజలు నిర్ణయించడంలేదు. ఇది అంతర్జాతీయ మీడియా, సీఐఏ నిర్ణయిస్తున్నది.

నోమ్ చామ్‌స్కీ దీని గురించి రాస్తూ ఒక దేశంలోని తిరుగుబాటును విధ్వంసకమని, రక్తదాహమని అనే అమెరికా, ఆదేశ పాలకులు ఏ కారణం వల్ల అయినా ఆ దేశ ఆదేశాలను ఖాతరు చేయకపోతే, అదే తిరుగుబాటు ప్రజాస్వామ్య పోరాటం గా చిత్రీకరించిన సంఘటనలు చాలా ఉన్నాయి. టెర్రరిజం పరిభాషను భిన్నభిన్న పద్ధతుల్లో అమెరికా ఉపయోగిస్తున్నది. నిర్మాణాత్మక టెర్రరిజం, కరుణాత్మక టెర్రరిజం లాంటి పదాలను భాషలో కి తీసుకవచ్చారు. భాషను సామ్రాజ్యవాదం ఖూ నీ చేయడం, అత్యంత వక్రీకరించి ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు మావోయిస్టు విష పురుగులుగా, ఆ ప్రాంతాలను పురుగులు వ్యాప్తి చెందిన ప్రాంతంగా ప్రస్తావిస్తుంటారు. ప్రపంచ బ్యాంకు భాషా శాస్త్రవేత్తలను నియమిం చి మంచిని చెడుగా, చెడును మంచిగా విషాన్ని చక్కర గుళికలుగా మార్చి దానికి ఉపయోగించుకుంటున్నారు. నిజానికి భాషకు భావానికి మధ్య లెంకెను పూర్తిగా ధ్వంసం చేసిన చరిత్ర ప్రపంచీకరణ ప్రయోగానిది.

టెర్రరిజాన్ని అణచివేసే పేరు మీద అమెరికా ఇరాక్‌లో, అఫ్ఘనిస్తాన్‌లో, లాటిన్ అమెరికాలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వైద్యశాలల మీద, చిన్న పిల్లల బడుల మీద,అమాయకమైన వృద్ధులు, మహిళల మీద బాంబు దాడులు చేశారు. చారివూతక కట్టడాలను, గ్రంథాలయాలను విధ్వంసం చేశారు. మనదేశంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోని గిరిజన ప్రాంతా ల్లో కూడా మనం చూస్తున్నాం. అంటే టెర్రరిజం అణచివేత పేర రాజ్యం చేసే టెర్రరిజాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. టెర్రరిజం అంటే లక్ష్యం లేకుండా, విచ్చలవిడిగా మొత్తం సమాజాన్ని భయకంపితం చేయడం అని నిర్వచిస్తే, రాజ్యాలు చేసే విధ్వంసం ఎంత పెద్ద టెర్రరిజమో అర్థమౌతుంది. టెర్రరిజం మీద చర్చ చాలా సంయమనంతో, ప్రజాస్వామ్య విలువలతో, సామాజిక విలువల ఛట్రంలో, సామాజిక సంబంధాల మూలాల్లోకి వెళ్లి చర్చ జరగవలసి ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో ఇంగ్లిషు ఎలక్ట్రానిక్ మీడియా టెర్రరి జం గురించి ప్రసారాలు చేస్తూ, మీడియా టెర్రరిజాన్ని ప్రవేశపెట్టారు. టెర్రరిజం మీద చర్చ ఈ మీడియా టెర్రరిజంతో ప్రారంభం కావాలి.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Featured Articles