పాదుకా పట్టాభిషేకం


Thu,March 7, 2013 12:03 AM

rajufమూడు నాలుగు సంవత్సరాల క్రితం కన్నాబిరాన్, నేను స్టేట్స్‌మెన్ పత్రిక ‘మావోయిస్టులు మనలో భాగమేనా’ అనే అంశం మీద కలకత్తాలో నిర్వహించిన సదస్సుకు, పత్రిక ఆహ్వానం మీద వెళ్లినప్పు డు మాకు కలకత్తా క్లబ్‌లో బస ఏర్పాటు చేశారు. మేం మధ్యాహ్నం భోజనానికి డ్రైనింగ్ హాల్‌కు వెళ్లితే మాకు సూటు లేదని అనుమతి నిరాకరించారు.

మేం ఇద్దరం క్లబ్‌లో అతిథులుగా ఉన్నామని, మా దగ్గర సూట్ లేద ని చెపితే బయట ఎక్కడైనా వెళ్లి భోజనం చేయండి అని సలహా ఇచ్చారు. మూడు దశాబ్దాల మార్క్సిస్టు పార్టీ పాలనలో ఉన్న బెంగాల్‌లో ఈ పాశ్చా త్య, వలసవాద సంస్కృతి కొనసాగడం గురించి చర్చించుకున్నాం. ‘అంతా మారిందన్నారు ఏం మారింది’ అని అందుకే మన వాళ్లు నినాదం ఇస్తుంటారు అని కన్నాబిరాన్ గుర్తు చేసుకున్నారు. ఆరోజు సాయంత్రం సదస్సు లో కన్నాబిరాన్ గారు తన ప్రసంగాన్ని ఈ అనుభవంతో ప్రారంభించి మనం స్వతంత్ర దేశంలో ఉన్నామా? మూడు దశాబ్దాల పాలనలో ఈ వలస సంస్కృతిని మార్చాలని క్లబ్బులు కూడా ప్రజాస్వామీకరించబడాలని కనీసం మార్క్సిస్టు పార్టీయైన ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. అర్ధవలస సమాజం అనే సూత్రీకరణకు దీన్ని కూడా ఒక సాక్ష్యాధారంగా భావించవలసి ఉంటుందేమో? బహుశా చైనా విప్లవం తర్వాత ఇలాంటి అవశేషాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవం రావలసి వచ్చింది. మనం ఆ స్థితికి ఇంకా చాలా దూరంగా ఉన్నాం.

ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిన పిర్లమర్ల చంద్రశేఖర్ అనే స్నేహితు డు తన పాత స్నేహితులను, ఇద్దరు రైతుల ను సికింవూదాబాద్‌కు క్లబ్‌కు ఆహ్వానించా డు. ఒక కార్యక్షికమానికి వెళ్లి అక్కడి నుంచి క్లబ్ కు వెళితే కలకత్తాలోని అనుభవమే ఎదురైం ది. బూట్లు లేనిది క్లబ్‌లోకి అనుమతి లేదం నాకు కొంత ఆశ్చర్యం వేసింది. ఇది క్లబ్ నియమావళి అని, ఎవరికీ మినహాయింపు లేదని సెక్యూరిటీ వాదించాడు. అయితే మనం అలాంటి క్లబ్‌లకు వెళ్లకూడదని, అవి సంపన్నుల కోసం లేదా శ్రేష్ఠులవర్గం (Elite) కోసమే అని అన్నా, ఈ బూట్లు, సూటు, టై ఎక్కడి సాంప్రదాయం! వలస పాలనకు వ్యతిరేకంగా మనం చేసిన పోరాట సారమేమిటి? కోట్లాదిమంది ప్రజలకు కాళ్ల కు చెప్పులు లేని దేశం కదా! ఎంత పెద్ద వాళ్ల క్లబ్ అయినా, దానికీ సామాజిక జీవనానికి కొంతైనా సంబంధముండాలి కదా! మన దేశంలో సంపన్న వర్గాలు ప్రజా జీవనం నుంచి విడదీయబడి ఎలా బతుకుతున్నా యో చూస్తే ఈ వర్గాలకు ఎప్పుడైనా ఈ ప్రశ్న తట్టిందో లేదో, అది చూడడానికి వాళ్ల రెండు కళ్లను ఉపయోగించారో లేదో తెలియదు. రాను రాను ఇలాంటి వాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మనం రెండు ధృవాల మధ్య జీవిస్తున్నాం.

ఒక దేశంలో ప్రజల వేషభాషలు ఆ దేశ పు చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితి, అక్కడి వాతవరణాన్ని బట్టి ఉంటాయి. శీతల దేశాలైన పాశ్చాత్య దేశాల్లో కాళ్ల నుంచి కంఠం దాకా దుస్తులు వేసుకోవలసి ఉంటుంది. మంచు మీద కూడా నడవవలసి ఉంటుంది. కనుక కాళ్లను పూర్తిగా కవర్ చేసుకోవడాని కి బూట్లు తప్పనిసరి. అయితే గాంధీజీ రౌండ్ సమావేశానికి వెళ్లినప్పుడు అర్థనగ్నంగా కాళ్లకు బూట్లు లేకుండానే ఇంగ్లాండు వెళ్లాడు. అయితే గాంధీజీ మన దేశానికే చెందినవాడని, స్వాతంవూతోద్యమంలో కీలకపాత్ర వహించాడని కలకత్తా క్లబ్, సికింవూదాబాద్ క్లబ్ సభ్యులకు చాలామందికి తెలవక పోవచ్చు. ఈ మధ్య పత్రికల వాళ్లు నిర్వహించే జనరల్‌నాపూడ్జ్ ఇంటర్వూలలో కొందరు సికింవూదాబాద్ క్లబ్ సభ్యుల లాంటి పెద్దమనుషుల పిల్ల లు గాంధీజీ పేరు వినలేదనీ కొందరు, కొందరేమో ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రి అని జవాబు చెప్పా రు. ఇవి విన్నప్పుడు పాపం పెద్దవాళ్ల పిల్లల మీద అలాగే గాంధీజీ మీద జాలి వేస్తోంది. ఒక ఆరు దశాబ్దాల కాలంలో ‘జాతిపిత’ అని పిలవబడిన గాంధీని గుర్తు కూడా పట్టకపోవడం చూస్తే స్వాతంత్య్ర ఫలాలను బాగా అనుభవిస్తున్న ఒక వర్గం ‘జ్ఞాపకశక్తి’ అలాగే వాళ్ల జాతీయతా మూలాలు ఎంత బలహీనమో ఊహిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
స్వాతంవూత్యోద్యమం వలసపాలనకు వ్యతిరేకంగా జరిగినా, అది ‘పూర్ణస్వరాజ్యం’ కోసం జరిగిన సంపూర్ణ ఉద్యమం కాదు అనేది తెలుస్తూనే ఉంది.

మన దేశంలో వలస పాలన వేళ్లు భూస్వామ్య వ్యవస్థలో ఉన్నాయి. గాంధీజీ నాయకత్వం వహించిన వలస వ్యతిరేక ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం కాకపోవడం వల్ల, వలస పాలకులు-దేశాన్ని వదిలిపెట్టినా భూస్వామ్యంలో వేళ్లూనుకున్న వలస సంస్కృతి అలాగే కొనసాగుతున్నది. భూస్వామ్య వ్యవస్థ పునాది మీద మతతత్వం నిలబడి, ఇప్పుడు సంపూర్ణ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తీవ్ర కృషి చేస్తున్నది. వీళ్లు వలస సంస్కృతిని వ్యతిరేకిస్తున్నట్టు అనిపించినా, వాలెంటైన్ డే ను వ్యతిరేకించే దగ్గరే మునిగి, దేశంలోని మైనారిటీలను, ఉద్యమకారులను, ముఖ్యంగా విప్లవకారులను ద్వేషించే దగ్గరే తేలుతారు. బీజేపీ జాతీయతావాదాన్ని ఎంత బలపరిచినా అది భూస్వామ్య వ్యవస్థలో భాగం కాబట్టి దానికి వలస సంస్కృతిని వ్యతిరేకించే శక్తి లేదు. అందుకే సంఘ్ పరివారానికి విదేశీ పెట్టుబడిని వ్యతిరేకించే ఆలోచనే లేదు.

బూట్ల దగ్గరికి మళ్లీ వస్తే, బూట్లు కాదు కాని గ్రామీణ ప్రాంతంలో లక్షలాది మంది బాల బాలికలు చెప్పులు, చివరకు స్లిప్పర్స్ కూడా లేకుండా బడికి వెళ్లుతుంటారు. హైస్కూల్ చదువుదాకా మాకు చెప్పులుండేవి కావు. ఇంగ్లిష్ మీడియం, ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న పిల్లలు మాత్రం బూట్లు, యూనిఫాం, టై వేసుకొని వెళ్తున్నారు. పిల్లల డ్రెస్‌ను చూసి వాళ్లు పైకి వస్తున్నారని మురిసే తల్లిదంవూడులు చాలామందే ఉన్నారు. ఈమధ్య హెచ్‌ఎంటీవీ విద్య మీద నిర్వహించిన కార్యక్షికమంలో కొంతమంది గ్రామీణ విద్యార్థులు, ప్రైవేట్ స్కూళ్లకు వెళుతున్న పిల్లల డ్రెస్‌ను చూసి తమలో ఒకరకమైన న్యూనతాభావం ఏర్పడిందని అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ స్కూళ్ల మధ్య ఏర్పడ్డ రెండు భిన్న సంస్కృతులను, రెండు వర్గ సంస్కృతులుగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ కారణం వల్లే వెనిజులాలో చావేజ్ అధికారంలోకి వచ్చాక మొదట తీసుకున్న నిర్ణయాలలో . స్కూళ్లల్లో యూనిఫాం, బూట్లు, టైని రద్దు చేయడం ఒకటి. ‘పిల్లలకు నాణ్యమైన చదువు కావాలని, ఈ వేషాలు అనవసరమని, తాను పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు చెప్పులుండేవి కావని’ పేర్కొన్నాడు. దీనికి భిన్నంగా మన చదువు అంతిమంగా కన్యాశుల్కంలోని వెంక స్థాయికి చేరుకున్నాయి. వెంక బూట్లు ఉండేవో కావో నాటకంలో ఎక్కడా ప్రస్తావన లేదు.

ఆరు దశాబ్దాల తర్వాత మన్‌మోహన్‌సిం గ్, అహ్లువాలియా,చిదంబరం ప్రతినిధులుగా భిన్న రాజకీయ పార్టీల వాళ్లను మద్దతుదారులుగా మార్చిన ఘనత అంతర్జాతీయ పెట్టుబడికి ఇవ్వవలసిందే. దానికి తోడుగా ఇంగ్లిషు భాషా వ్యామోహం, అమెరికా లేదా బహుళజాతి కంపెనీలలో ఉద్యోగం చేయాలనే కోరిక పై వర్గాలకి, అలాగే అట్టడుగు వర్గాల నుంచి వచ్చి రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్ల ఉన్నత విద్య పూర్తి చేసిన వారి స్వప్నం కూడా భిన్నంగా లేకపోవడం వల్ల, మీ పిల్లలే ఇంగ్లిషులో చదవాలని మీ పిల్లలే అమెరికా పోవాలా? అనే ప్రశ్నలు అడుగుతున్నారు. సామాజిక న్యాయం, గ్రామీణ పేదల జీవితాలు మారడం, భూ సంస్కరణలు, అసమానతలు తగ్గించడం అనే చారివూతక సమస్యలు వెనక్కినెట్టబడ్డాయి.

గ్రామీ ణ ప్రాంతాల నుంచి పైకి వచ్చినవారు, నూతన ఆర్థిక విధానం గురించి విమర్శనాత్మకంగా ఆలోచించకపోవడం, దీర్ఘకాలం లో ఆర్థిక విధానం పేదల జీవితాలను, రైతాంగాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తుందో ఆలోచించకపోవడం ఇప్పటి విషా దం. ఇలాంటి స్థితిలో సికింవూదాబాద్ క్లబ్‌లో కొనసాగుతున్న బూట్ల సంస్కృతి చర్చించడమే హాస్యాస్పందంగా అనిపించవచ్చు. కానీ ఎంత లోతైన చర్చ అయినా నిత్యజీవితంలోని సాధారణ అనుభవాల నుంచే రావాలి. అనుభవం చిన్నదే కావ చ్చు కానీ అసందర్భం కాదు. సామ్రాజ్యవాద సంస్కృతి ఏ రంగాన్ని కూడా వదలదని, ‘రవి అస్తమించని’ అనే నానుడి అర్థం ప్రపంచంలో ఏ రంగాన్ని కూడా అది తన ప్రభావం నుంచి బయటకు పోనీయదని. దాంతో మొత్తం విధ్వంసం ఒక సహజమైన పరిణామంగా తీసుకుని ప్రారంభమై, సంఘటనలకు స్పందించడం మానే స్తాం. ప్రశ్నించే మనస్తత్వాన్ని కోల్పోతాం. అదే ఇప్పుడు జరుగుతున్నది.

ఇప్పటి పరిస్థితి ఇంకా కొంత కాలం కొనసాగితే బూటు పాత్ర మారవచ్చు. రాజ్యం పోలీసులతో ప్రజలను బూట్లతో తన్నిస్తుంటే ప్రజలు పాలకుల మీద బూట్లు విసురుతున్నారు. ‘పాదుకలకు పట్టాభిషేకం’ చేసిన సంస్కృతి మనది. పాదుకలను చేసిన వారిని అంటరానివారుగా పరిగణిం చి వేల సంవత్సరాలు వాళ్లను గ్రామాల నుంచి బయటికి నెట్టిన ‘ఆచరణ’ మనది. అందుకే బూటు వేసుకున్న వాళ్లను గౌరవించి, బూటు వేసిన వాణ్ణి అగౌరవపరిచిన సాంప్రదాయం మనది. ఇది బ్రిటిష్‌వాడి క్లబ్‌ల సంస్కృతికి బాగా సరిపోయింది. ఇక రాబోయే కాలంలో ప్రపంచీకరణ మరింత ఉధృతమైతే, విదేశీ బూట్లు వేసుకుం క్లబ్‌లలోకి అనుమతి అనే కాలం రానున్నదేమో!
(బూటు మీద ఈ వ్యాసమేమిటి అనే మిత్రులకు క్షమాపణలతో...)

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles