సమాచార హక్కు : సవాళ్లు


Thu,February 28, 2013 01:45 AM

informationఈ నెల 17,18 తేదీలలో హైదరాబాద్‌లో సమాచార హక్కుపై జాతీయ సదస్సు జరిగింది. ఈ హక్కు కోసం పోరాడుతున్న హక్కుల నేతలు, కార్యకర్తలు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకు హజరయ్యారు. సమాచార హక్కు ఉద్యమ అనుభవాలను కథల రూపం లో పంచుకున్నారు. ముఖ్యంగా కాశ్మీర్, మణిపూర్ నుంచి చాలా ప్రయోగాత్మకమైన కథలు వివరించబడ్డాయి. మొత్తంగా ఈ ఉద్యమం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని స్పష్టంగా కనిపించింది. సమాచార హక్కు భావన బీజవూపాయంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మొదటి మీటింగ్‌లో మాట్లాడిన ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని ఎందుకు విస్తృతంగా ఇవ్వకూడదో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెబుతూ ఈ హక్కుకు వ్యతిరేకంగా వాదించారు. ఇది వలసవాద మనసత్తం.

వలస పాలకులు ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఎప్పుడూ భావించలేదు. ప్రభుత్వ పాలనలో సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చాలా అవసరం అని వాళ్లు భావించారు. ప్రజలను వారు పౌరులుగా భావించనప్పుడు, ప్రభుత్వాలు సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యతను గుర్తించవు. ఇది ప్రజల హక్కు అని గుర్తించబడదు. కాని స్వాతంవూతోద్యమం తర్వాత ‘ఈదేశ ప్రజలమైన మేము మాకు మేము ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలో వ్రాసిన తర్వాత ప్రజలకు సర్వహక్కులు ఉండాలి. కాని రాజ్యాంగ స్ఫూర్తి కరువై స్వాతంవూత్యానంతరం కూడా ప్రభు త్వం సమాచారాన్ని రహస్యంగా ఉంచడమేకాక రహస్యంగా ఎందుకు ఉంచాలో వాదిస్తున్నది.

రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కులు సంక్రమించినప్పుడు, ఈ హక్కులు ప్రజలు పోరాడి సాధించుకున్నప్పుడు హక్కుల పరిధి చాలా విస్తృతంగా ఉండాలి.కాని మనదేశంలో స్వాతంత్య్రం మన పాలనలో అంతే గుణాత్మకమైన మార్పులను తేలేదు. రాజ్యాంగసభలో పాలన యంత్రాంగం గురించీ, పాత ఐసిఎస్ అధికారుల కొనసాగింపు మీద జరిగిన చర్చలో ఇద్దరు మాత్ర మే పాల్గొన్నారు. ఎనిమిది నిమిషాల చర్చ తర్వాత సర్దార్ పటేల్ కోరిక మేరకు వలసపాలనా యంత్రాంగం యధాతథంగా కొనసాగించాలని నిశ్చయించారు. ఎ.ఆర్ త్యాగీ వలస పాలనా యంత్రాంగాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి ది కాదని స్వాతంవూత్యోద్యమాన్ని అణచివేయడానికి తోడ్పడ్డ అధికారులు కొత్త విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించరని వాదించినా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ యంత్రాంగాన్ని కొంత మార్చాలని పాలనా సంస్కరణల సంఘాన్ని 1964లో నియమించినా వాళ్లు ఇచ్చిన 900 సంస్కరణలో 10 శాతం అంగీకరించి, వాటిని కూడా అమలు పరచలేదు. ఈ సలహాలలో లోక్‌పాల్, లోకాయుక్త కూడా ఉన్నది. ఆ సంస్థల కోసం ఐదు దశాబ్దాల తర్వాత అన్నా హజారే పోరాడడం వింతగా కనిపిస్తుంది. సమూల మార్పులు చేయకపోవడం వలన వలస సంస్కృతి వలస వారసత్వం పాలనా యంత్రాంగంలో నిండుగా ఉన్నాయి.

ఆరు దశాబ్దాలలో హక్కుల కోసం జరిగిన పోరాటాలలో సమాచార హక్కు ఒకటి. దీనికి ప్రధాన సంధాన కర్తగా అరుణా రాయ్ పనిచేశారు. ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన అరుణారాయ్ పాలనాయంవూతాంగం ద్వారా ప్రజలకు మేలు చేయడం సాధ్యం కాదని తన పదవికి రాజీనామా చేసి సమాచార హక్కు కొరకు తాను వేరే రాష్ట్రానికి చెందినదైనా రాజస్థాన్‌లో ఉద్యమ నిర్మాణం చేసింది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలను సమీకరించారు. మా పైసలు- మా లెక్క (హమారా పైసా- హమారా హిసాబ్) అనే నినాదంతో గ్రామ పంచాయితీలో , గ్రామీణ పాలనా అధికారులు ప్రజలకు బాధ్యత వహించి, తమ గ్రామానికి ఎంత బడ్జెట్ మంజూరు అయ్యిందో, ఆ పైసలను ఎలా ఖర్చు పెట్టారో, వాటి ద్వారా ఏ పనులు పూర్తయ్యాయో ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలనే దగ్గర ప్రారంభమై తర్వాత తర్వాత తన పరిధిని విస్తరించుతూ ముందుకు నడిచింది.

సమాచార హక్కు అంత ప్రమాదకరమైన హక్కేమీ కాదు. దేశ భద్రతకు ముప్పేమీ లేదు. ఐనా చాలా పోరాటం తర్వాత భారత ప్రభుత్వం సమాచార హక్కును ఒక హక్కుగా గుర్తించి దీనికి ఒక చట్టాన్ని చేసింది. ఈ చట్టం అమలులో ఉంది. చట్టం కొరకు పోరాడిన వాళ్లు ఇది పేద ప్రజలకు, నోరులేని వాళ్లకు చాల ప్రయోజనంగా ఉంటుందని భావించినా, చట్టం అమలు తర్వాత దాదాపు 80 శాతం డిమాండ్లు పాలనా యంత్రాంగంలో పనిచేస్తున్న వాళ్లు లేదా మధ్యతరగతి వ్యక్తులో తమ వ్యక్తిగతమైన సమస్యలకే ఉపయోగించుకున్నారు. ఐతే పాలనాయంవూతాంగం కొంత జాగ్రత్తగా ప్రవర్తించడం చూడవచ్చు. నిర్ణయాలు తీసుకునేప్పుడు సమాచార హక్కు ప్రస్తావన అనివార్యంగా వస్తున్నది. ప్రభుత్వం నుంచి సమాచారం అడిగినంత కాలం కొద్దో గొప్పో ప్రయోజనమున్నా, కార్పొరేటు సంస్థలు, ఖనిజవనరులు, ప్రైవేటు కంట్రాక్టుల గురించి సమాచారం అడగడంతో ఇప్పటి వరకు దాదాపు 20 మంది కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. హత్యలు ప్రారంభమయ్యాక కానీ ఈ హక్కు శక్తి పూర్తిగా అర్థం కాలేదు. ఈ చంపబడ్డ వాళ్లు మావోయిస్టులు కాదు, సాయుధ పోరాటం లో లేరు.

ప్రతిహింసలో విశ్వాసమున్న వాళ్లు కాదు. ఐనా హత్యలకు గురయ్యారు. అంటే మార్కెట్, కార్పొరేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ప్రాణత్యాగాలకు సిద్ధం కావలసిందే. ఇప్పుడు ఈ కార్యకర్తలను రక్షించుకోవడం ఎట్లా అనే సమస్య ముం దుకు వచ్చింది. ఈ సదస్సులో కార్యకర్తల భద్రత గురించి తగు చర్యలు తీసుకోవాలని, వీటి మీద ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేయడమే కాక, ఈ అమరులు అడిగిన సమాచారాన్ని ఏ ఆల స్యం లేకుండా ప్రజల ముందు పెట్టడం ఒక విరుగుడుగా పని చేస్తుందని సదస్సు భావించింది.

ఈ హక్కును మరింత విస్తృత పరచాలని, అంతర్జాతీయ ఒడంబడికలను, బహుళజాతి కంపెనీల ఒప్పందాలను పూర్తిగా ప్రజల ముందు ఉంచాలని కూడా తీర్మానించారు. ప్రజల సమ్మతి లేకుండా ఏ అంతర్జాతీయ ఒప్పందం చేసుకోకూడదని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సదస్సులో సమాచార హక్కు ప్రకారం సరియైన సమాచారం కొరకు పోరాడే క్రమంలో, తప్పుడు ప్రచారాలని, విష ప్రచారాలని ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది.

ముఖ్యంగా ఉద్యమాల గురించి, ప్రభు త్వం చెప్పే అబద్దాల గురించి, లేని కథలను కల్పించే ధోరణిని ఏం చేయాలనే సవాలు కూడా వచ్చింది. దీనికి తోడు మీడియా ప్రైవేటీకరణ తర్వాత కార్పొరేటు రంగంతో మిలాఖతై విపరీతంగా దుష్ప్రచారం చేయడం, ఒకే అభివూపాయాన్ని ప్రచారం చేయడం, వాస్తవాలని కప్పి పుచ్చడానికి వ్యతిరేకంగా సమాచార హక్కు ఉద్యమం పనిచేయాలనే అంశాలపై చర్చ జరిగింది. మీడియా తప్పుడు ప్రచారం చేస్తే దానికి విరుగుడు ఏమిటని, మీడియా మీద సమాచారహక్కు ఉద్యమం నిరంతరం వత్తిడి పెట్టాలని, దాని సామాజిక బాధ్యత గుర్తించేలా ప్రజాభివూపాయాన్ని కూడగట్టాలని కూడా సదస్సు భావించింది. కచ్చితమైన సమాచారం కోసం ప్రారంభమైన ఉద్యమం, ఇప్పుడు తప్పుడు సమాచార వైరస్‌ను ఎదుర్కోవడం ఎలా అనే కొత్త సవాలును ఎదుర్కొంటున్నది.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల