మరణశిక్ష: ఆటవిక న్యాయం!


Thu,February 14, 2013 01:44 AM

Afzal-Guruపన్నుకు పన్ను, కన్నుకు కన్ను అన్న న్యాయం ఆటవికమైనది. ఒక మని షి ఇంకొక మనిషికి హాని చేస్తే, అంతే హాని చేయాలనేది మానవసమాజ ఆవిర్భావ దశలో లేదా నాగరికత ప్రారంభ దశలో ఉండి ఉండేదనే ఒక ఊహ ఉంది. మన పురాణాలలో, ప్రాచీన జ్ఞాపకాలలో పశ్చాత్తాపం, క్షమించడం అనే విలువలున్నాయి. క్రైస్తవ మతంలో జీసస్ హాని చేసిన వారిని క్షమించడమనేది ఒక సమున్నతమైన మత విశ్వాసంగా ఆచరించాలని బోధించాడు. అయితే అమెరికా పేరుకు మాత్రమే క్రిష్టియానిటీని నమ్ముతున్నామని చెప్పి నా వాళ్లది ఆటవిక న్యాయమే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచమంతా రక్తపు ప్రవహించడానికి దేశపు కార్పొరేటు వ్యవస్థ కారణమని నోమ్ చామ్‌స్కీ తన రచనల్లో నిర్దందంగా రాశాడు.

వీళ్లకు ‘సన్నిహితులైన’ అన్ని దేశాల్లో దుర్మార్గాన్ని పెంచుతున్నారు. మనదేశం అహింసకు నిలయమ ని పాటల్లో, మాటల్లో బుద్ధుడు, గాంధీని మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ హింసాపూరితమైన రక్తదాహం పట్ల పరుగులు తీస్తున్నది. గత మూడు నాలుగు నెలలోపే ఇద్దరిని ఉరి తీశారు. సరే వాళ్లు నేరాన్ని చేశారు కాబట్టి వాళ్లకి ఆ శిక్ష పడింది అని ఒకవేళ ఎవరైనా వాదించినా, వాదన వినవచ్చు, వాదించవచ్చు. కానీ మనిషిని ఉరితీస్తే స్వీట్లు పంచుకోవడమేమిటి? ఇది ఏ అహింసా సంస్కతికి నిదర్శనం.

‘ది హిందూ’ దిన పత్రిక అఫ్జల్‌గురు ఉరికి చాలా బాధ్యతాయుతంగా, కొన్ని మానవీయ విలువల ఛట్రంలో ఈ శిక్షను విశ్లేషించింది. ప్రజాస్వామ్య చర్చను ప్రోత్సహించింది. ఈ శిక్షను విశ్లేషిస్తూ మారుతున్న రాజ్య స్వభావాన్ని అలాగే ‘పౌర సమాజం’లో వస్తున్న మార్పుల గురించి రాస్తూ ఇరవై సంవత్సరాల క్రితం రాజీవ్‌గాంధీ హంతకులకు ఉరిశిక్ష వేసినప్పుడు, లేదా ఇతర మరణశిక్షలను అమలు చేస్తున్నప్పుడు చట్టబద్ధంగా వాటిని ప్రకటించి, కుటుంబ సభ్యులు కలిసేలా వెసులుబాటు కల్పిం చి, నేరస్థులని పిలవబడే వాళ్లకు కల్పించవలసిన మానవ గౌరవాన్ని కల్పించి, శిక్ష అమలు చేశారు. గత రెండు రెండున్నర దశాబ్దాలుగా పరిస్థితి చాలా మారింది. ఈ మధ్య అమలు చేసిన రెండు ఉరిశిక్షలను రహస్యంగా చేయడమేకాక, కుటుంబ సభ్యులకు శిక్ష అమలు చేసిన తర్వాత చెప్పడం ఎంత అమానవీయం? ఎంత చట్టరాహిత్యం? ఇలా మాట్లాడితే బాధితుల గురించి ఆలోచించాలని, ఆ బాధిత కుటుంబ సభ్యుల మనోభావాలు అర్థం చేసుకోవాలని వాదిస్తున్నారు. ఈ వాదనలోని హింసను మనం చూడాలి.

నేరం చేసిన వాళ్లు సమాజాన్ని నేరమయం చేస్తున్నారంటే, నేరానికి శిక్ష మరణమే అని వాదిస్తే నేరస్థుడికి, సభ్య సమాజానికి, చట్టబద్ధ రాజ్యానికి ఏం తేడా? నేరస్థుడు ప్రాణాలు తీసుకున్నందుకు నేరస్థుడి ప్రాణాలు తీసుకోవలనడం నేరాన్ని నేరంతోనే ఎదుర్కొవాలని అనడం కాదా? ఒక మనిషి ప్రాణాన్ని అసహజం గా తీయడమనేది, అసహజంగా ప్రాణం తీసుకోవడం సూత్ర రీత్యా తప్పుకాదని అంగీకరించినట్టే. సమాజం ఇలాగే ఆలోచిస్తూ పోతే మానవీయ సమాజాన్ని ఎలా సృష్టిస్తుంది. ఒక సంవత్సరం వందమంది మనుషులు నేరస్థుల చేతిలో చనిపోతే, ఈ వందమంది నేరస్థులను ఉరితీస్తే మొత్తం రెండువందల మంది అసహజ మరణాలకు గురైతే, ఏ ఉన్నతమైన విలువలను సాధించినట్టు? నేరస్థుడు చేసిన నేరాన్నే రాజ్యం చేసి మనిషిని అసహజంగా చంపడం తప్పుకాదు అని భావిస్తే, మౌలికంగా ఒకరి ప్రాణం ఏ కారణాల వల్లైనా తీయ డం సమర్థనీయమే అని అంటే, హత్య చేసిన వాడికి వాడి కారణాలు వాడికి ఉండవచ్చు. మన దేశంలో మొదట నేరం చేసినవాడు రాక్షసుడని, దానికి ప్రతీకారంగా అదే పనిచేసిన వాడు దైవం అనే భావన బలంగా ఉంది. ఈ భావజాలం నుంచి బయటపడాలి.

మరణశిక్ష మీద ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో తేలిన అంశం, ఈ శిక్ష వల్ల సమాజంలో నేరం ఎక్కడా తగ్గినట్టు సాక్ష్యాధారాలు లేవు. మరణశిక్ష రద్దు చేసిన కొన్ని సమాజాలలో గత మూడు నాలుగు దశాబ్దాలుగా ఒక్క హత్య కూడా జరగలేదు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది ప్రశ్న. ప్రతి నేరానికి ఉరిశిక్ష వేయండి అని అడిగే సమాజం, ఎక్కడో తన మానవత్వాన్ని కోల్పోతున్నది. ఈ మానవత్వ దృక్పథం వల్ల దేశంలో గత రెండు మూడు దశాబ్దాలుగా చాలా మారింది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. కానీ రెండు కారణాలు కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఒకటి; నూతన ఆర్థి క విధానం. రెండు; ఫాసిస్టు శక్తుల బలం పెరగడం. ఫాసిజానికి నూతన ఆర్థిక విధానానికి ఎక్కడో ఒక అవినాభావ సంబంధం ఉన్నది. మొదటిది అసమానతలను పెంచితే, రెండవది ఆ అసమానతలకు మద్దతుగా నిలుస్తుంది. గత మూడు దశాబ్దాలుగా నూతన ఆర్థిక నమూనా అమలవుతున్న క్రమంలో మతతత్వ శక్తులు పెట్రేగిపోతున్నాయి. ఇది యూరప్‌లో వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థకు భిన్నంగా ఉంది.

శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతున్న క్రమంలో మతానికి సైన్స్‌కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మతం దాదాపు ఓడిపోయి, అది కేవలం వ్యక్తిగత విశ్వాసంగా మిగిలింది. మన దేశం పెట్టుబడిదారీ మార్గం అవలంబించిన క్షణం నుంచి మతతత్వ శక్తులు చాలా బలపడి, పౌర సమాజాన్ని భయకంపితం చేస్తున్నాయి. వ్యక్తులపై, వ్యవస్థలపై దాడి చేయడం, నిరసన చేస్తున్న వాళ్ల ముఖాలకు రంగు పూయడం, బెదిరించడం వాళ్ల నిత్యకృత్యాలయ్యాయి. వీళ్లకు ధీటుగా జవాబిచ్చే మిలిటెంట్ శక్తులు సమాజంలో లేకపోవడం వల్ల వాళ్లు ఆడిందే ఆటగా, పాడిందే ఆపటగా సాగుతున్నది. పోలీసు వ్యవస్థ ఈ చర్యలను నేరంగా పరిగణించడం లేదు. వ్యవస్థను వ్యవస్థలోపలి నేరాలను బలపరుస్తూ, వ్యవస్థను మార్చాలనే వాళ్లందరినీ నేరస్థులుగా పరిగణించడం ఒక పరిపాటయ్యింది. ఈ వ్యవస్థ ఇలాగే ఉన్నదున్నట్లుగా కొనసాగించాలంటే మతతత్వశక్తులను, మత ద్వేషాలను, ఘర్షణలను, గుజరాత్ అమానుషత్వాన్ని కొనసాగించడమే. సామాజిక మార్పుకు దోహదపడకపోతే మనం చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

నూతన ఆర్థిక విధానమే ఒక హింస. మనుషుల మౌలిక అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా, వైద్యం, విద్య, అలాగే ఇతర సేవలను దూరం చేసి, రాజ్యం కేవలం సంపన్నులవైపు, సామ్రాజ్యశక్తుల బంటుగా ప్రవర్తిస్తే, రాజ్యపు విశ్వసనీయత దెబ్బతినడమే కాక, నేరం చాలా పెరిగిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలలో పెరిగిన నేరం, మహిళలను బలవంతంగా, వేశ్యా వలలోకి నెట్టడం, అత్యాచారాలు చేయడం మనుషులను నిర్ధాక్షిణ్యంగా చంపడం లాంటి ఘటనలు పెరిగాయి. మనం ఒక నేరమయ సమాజంవైపు ప్రయాణిస్తున్నాం. ఇలాంటి సమాజంలో మనుషులను చాలా సులభంగా రెచ్చగొట్టగలం. అందుకే మీడియా ముఖ్యంగా ఇంగ్లీష్ ఛానల్స్ ఈ పనిని చేస్తున్నాయి. అఫ్జల్‌గురును ఉరితీయ డం తాము సాధించిన ఘన విజయం గా ఒక ఇంగ్లీష్ ఛానల్ ప్రకటించడమే కాక ఉరిశిక్షను వ్యతిరేకించే వాళ్లకు తమ ఛానల్‌లో అవకాశం ఇవ్వమని అనడం ఎంత విడ్డూరం. ఇది మీడియా స్వేచ్ఛ లో భాగమా? ఇదే ఇంగ్లీష్ మీడియా ఫాసిస్టు శక్తులను విపరీతంగా ప్రోత్సహిస్తున్నది. దీంతో మీడియా తనకు తాను మరణశిక్ష వేసుకుంటున్నది.
ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేయవలసి ఉంది. మరణశిక్ష ఆటవికం, అనాగరికం. చరివూతను మానవీయ సమాజ ఆవిష్కరణ వైపు పోకుండా అడ్డుపడడమే. దీన్ని మానవ విలువలను గౌరవించేవారు ప్రతిఘటించాలి.
పొఫెసర్. జి. హరగోపాల్35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles