లెక్కతప్పిన కాంగ్రెస్


Wed,January 30, 2013 11:15 PM

Azadతెలంగాణ సమస్యను గణితాల ద్వారా పరిష్కరించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మీటింగ్‌లు పెట్టినా, ఎన్నిసార్లు లెక్కించినా పరిష్కారం రాదు. తెలంగాణలోఎన్ని సీట్లు గెలు స్తాం, ఆంధ్రలో ఎన్ని ఓడిపోతాం, ఎన్ని గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతాడు అనే చట్రంలో తెలంగాణ ఇమడదు. లెక్కల్లో మనుషులే ఇమడ రు. మనుషులను సంఖ్యల్లోకి మార్చి ఆర్థికశాస్త్రం సమాజానికి చేసిన మేలు కంటే నష్టమే ఎక్కువ. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న బెట్రాండ్ రస్సెల్ గణితంలో నుంచి తత్వశాస్త్రాలలోకి వచ్చాడు. అలాగే డి.డి. కోశాంబి చరిత్ర అధ్యయనంలోకి వెళ్లాడు.

ఇక బాలగోపాల్ సరాసరి న్యాయభావనతో ఆచరణలోకే వచ్చాడు. చుక్కా రామయ్యగారు లెక్క లు చెబుతూ, సామాజిక ఘర్షణలో భాగమయ్యాడు. వీరు నలుగురు ఇలాగే పలువురు గణిత శాస్త్రజ్ఞులు తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి విశాల ప్రపంచంలోకి వచ్చారు. కాంగ్రెస్‌లో లెక్కలు వచ్చిన వారు లేరనేది స్పష్టమే. లెక్కలు వేసేది ఎవరైనా ఉంటే తప్పుడు లెక్కలు వేస్తున్నారనడానికి గులాం నబీ ఆజాద్ ఈ మధ్య చెప్పిన లెక్కలే పెద్ద ఉదాహరణ. వారానికి ఎన్ని రోజులో, నెలకు ఎన్ని వారాలో ఆయన చేసిన ప్రకటన చూసి నేను ఎప్పుడో ఫిలాసఫి చదువుతున్నప్పుడు స్థలానికి, కాలానికి పరిమితులు లేవు కనుక అవి లేనట్లే అనే సూత్రీకరణ గుర్తుకు వచ్చింది. గులాంనబీ ఆజాద్ కాలాంతకుడు అనిపించుకున్నాడు.

కాంగ్రెస్ పార్టీ మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తే దేశాన్ని పరిపాలించే సత్తువ కోలుపోయినట్టుగా అనిపిస్తుంది. అంతిమంగా సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయాలి అనే సంకుచిత లక్ష్యానికి చేరుకోవడం ఆ జాతీయ పార్టీ విషాదం.అలాగే గుజరాత్‌లో దారుణ మారణకాండకు కారకుడైన నరేంవూదమోడీ మరో జాతీయపార్టీ అభ్యర్థి. గుజరాత్ చాలా అభివృద్ధి చెందిందట. ఆ నమూనానే దేశానికి దిక్కట. ఆయనే దేశాన్ని పాలించగలడట.గుజరాత్ నమూ నా అంటే మారణహోమంతో అభివృ ద్ధా? అభివృద్ధికి అడ్డం వచ్చినవాడిని అడ్డంగా తొలగించడమా? ఏమిటో భార త రాజకీయాలు పరిశీలిస్తున్న వారికి అయోమయంగా ఉన్నది. ఇక తెలంగాణ రాహుల్‌గాంధీ వల్ల వస్తుందా? లేక నరేంవూదమోడీ చేతుల మీదుగా వస్తుందా అని ఎదురు చూసే స్థితిలోకి తెలంగాణ ప్రజలను నెట్టారు.

ఒక విశాల దేశాన్ని పాలిస్తున్న రాజకీ య పార్టీలకు కొంత చరిత్ర, కొంత తత్వశాస్త్రము, కొంత తాత్విక చింతన, ప్రాపం చిక దృక్పథం అవసరం. ఎంత కాదన్నా నెహ్రూ కొంత చరిత్ర చదువుకున్నవాడే. చరివూతను ఎంత విమర్శించినా గాంధీకి తనకంటూ ఒక ప్రాపంచిక దృక్పథమున్నది. ఆ ఇద్దరి వారసత్వాన్ని స్వంతం చేసుకున్న వాళ్లకు ఈ రెండూ కరువయ్యాయి. సమాజంలో ఒక ఘర్షణ వచ్చినప్పుడు, రాజకీయ ఆకాంక్షలు ముందుకు వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యంగా ఎలా స్పందించాలనేది ఒక ప్రమాణం కావాలి. దీర్ఘ చరివూతలో నిలిచేది ప్రామాణికమైన నిర్ణయాలు. రాహుల్‌గాంధీ, నరేంవూదమోడీ, అలాంటి మరొకరు చరివూతను మలుపులు తిప్పేవాళ్లేమీ కాదు. కావలిస్తే చరివూతను మరింత వెనక్కి తీసుకపోయే ప్రయత్నం చేయవ చ్చు. ఈ రోజు తెలంగాణ ప్రజల భవిష్యత్తు, ఆకాంక్ష ఈ రాజకీయ చక్రాల కింద నలుగుతున్నయి.

తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను భిన్న మార్గాల ద్వారా, గాంధే య పద్ధతుల ద్వారా వ్యక్తీకరించారు. సాయుధ పోరాటాలకు శాంతిమార్గాన్ని ఉపదేశిస్తున్న కొందరు కేంద్ర మంత్రులు, కొందరు మేధావులు శాంతి పద్ధతులకు ప్రభుత్వాలు స్పందించకపోతే ప్రజలకు ఆ మార్గాల మీద విశ్వాసాన్ని ఎలా నిలబెడ్తారు అని ఆలోచించాలి కదా! వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తాం అని కాదు కదా, ఏ ప్రజాస్వామిక విలువలను పాటిస్తాం అని కద ఆలోచించవలసింది. ఏ రాజకీయపార్టీ అయినా అంతిమంగా సమాజానికి ఇవ్వవలసింది, కాపాడవలసింది ఉన్నతమైన విలువలు, ప్రజాస్వామిక ప్రమాణాలు. ఇవే సమాజాలను ఉన్నతీకరిస్తాయి.

ఏం తెలంగాణ ఉద్యమం అంత గొప్పదా అని అడగవచ్చు. గొప్పది కాకపోవచ్చుకానీ ఉద్యమంలో కొన్ని విలువలు, కొన్ని ఆకాంక్షలున్నా యి. అన్ని ఆధిపత్య రూపాలలాగే ఒక అభివృద్ధి చెందిన ప్రాంత సంపన్నులు కొంతమంది విపరీతమైన సంపదను కూడబెట్టుకున్నారు. ఈ సంపదలో తమ వాటా దక్కలేదనే కొన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమం లో ఉండవచ్చు. కానీ ప్రజలు తమకు అన్యాయం జరిగిందని భావించి తమ ప్రాంత అస్తిత్వాన్ని గుర్తించాలని ఉద్యమిస్తున్నారు. ఈ పెరుగుతున్న చైతన్యం ఈ ప్రాంతంలోని ప్రజావ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయవచ్చు. ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం విఫలమైతే మనకు న్యాయం జరగదని నిరాశావాదానికి గురైతే, లేదా మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటే అది తెలంగాణకే కాదు, మొత్తం ప్రజాస్వామ్య సంస్కృతికే దెబ్బ. ఇది ఏ దారిలోనైనా పోవచ్చు.

తెలంగాణ రాష్ట్రాన్ని అంగీకరిస్తే మరికొన్ని ఇలాంటి డిమాండ్లు దేశవ్యాప్తంగా రావచ్చు అంటున్నారు. అంటే ఆ ఆకాంక్ష మరికొన్ని ప్రాం తాల్లో ఉన్నదనే కదా.అలాంటప్పుడు ఈ ప్రాంతీయ, లేదా ఉప ప్రాం తీయ ఆకాంక్షల మూలాల్లోకి వెళ్లాలి కదా! ఒక అసమ సమాజంలో వెనకబడిన ప్రాంతాలు తప్పకుండా ఉద్యమాలు చేస్తాయి. అహ్లువాలియా, మన్‌మోహన్‌సింగ్ లెక్కల్లో వృద్ధిరేటు, సంపద వృద్ధే ఉన్నాయి. కానీ పెరుగుతున్న అసమానతల లెక్కేది? దేశంలో ఎందుకు సమ అభివృద్ధి జరగడంలేదు. అభివృద్ధి పథం మనల్ని ఎక్కడికి తీసుకుపోతున్నది? ఇక ముందు ప్రాంతీయ ఉద్యమాల అవసరం లేని దిశలో మనం ప్రయాణిస్తున్నామా? లేక ప్రాంతీయ ఉద్యమా లు తలెత్తితే వాటిని అణిచవేయడానికి కావలసిన నియంతను తయారు చేసుకుంటున్నామా ఆలోచించాలి.

అసమానతలున్న అన్ని సమాజాల లో అలజడులు అనివార్యంగా ఉంటా యి. ఈ భిన్న అసమానతలలో ప్రాంతీ య అసమానతలు కూడా ఒకటి. నిజానికి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే రాజకీయ ఉద్యమం ఉంటే చరి త్ర గతి వేగంగా మారేది. అలాంటి ఉద్యమాలు లేవు. ఉన్న వాటిని పూర్తిగా అణచివేయాలనే వ్యూహంలోనే పాలకులున్నారు. ప్రజలు తాము పరిష్కరించగలమనుకున్నా, లేదా తక్షణ పరిష్కారమున్నదన్న సమస్యల కోసమే పోరాడుతా రు.

అందుకే తమకు అర్థమైన మేరకు తాము సాధించగలమనుకున్న పరిష్కా రం కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధ్యమని, ప్రాంతీయ అసమానతలే ఒక పెద్ద సవాలు అని ఇప్పుడు ఈ పరిష్కా రం కోసం ఉద్యమిస్తున్నారు. శాంతియుతంగానే ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమానికి రాజకీయ పరిష్కారం రాకుంటే, ఎందుకు రావడం లేదని ప్రశ్న అడిగితే ప్రాంతీయ అసమానతలకు కారణమైన, అసమానతల ద్వారా ప్రయోజనం పొందిన స్వప్రయోజనపరుల అధికారం ప్రజా బలం కంటే ఎక్కు వ అని భావిస్తే, ఉద్యమ లక్ష్యం, ఉద్యమ రూపం మారుతుంది. వైరు ధ్యం మరింత ఉన్నతస్థాయికి పోతుంది. ఈ అవగాహన లేని పెద్దలు ఢిల్లీలో లెక్కలు వేస్తున్నా రు. లెక్కలు తప్పుతున్నాయి. లెక్కల్లో వైరుధ్యాలు అర్థం కావు.నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా లెక్కించి దానికి స్పందిస్తే కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలియదు. కానీ ప్రజాస్వామ్యం మీద, ఉద్యమాల మీద ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుంది.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల