దేశ రాజధానిలో అరాచకత్వం


Wed,December 26, 2012 11:45 PM

గత మూడునాల్గు రోజులుగా ఢిల్లీలో పరిణామాలను గమనిస్తే ఇంతకాలం తర్వాతనైనా ఒక మహిళ మీద జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు, పోరాటాలు కూడా చేస్తున్నారు. ఎవ్వరికి వారుగా నివసించి ఏదీ పట్టించుకొని నగరంలో ఈ మాత్రం స్పందన ఆహ్వానించదగిందే. ఈ ఉద్యమ ఫలితాలు ఏవిధంగా ఉన్నా, ఒక అత్యాచారం మీద ఇంత పెద్దఎత్తున మీడియా స్పందించడం, నిరంతర చర్చ జరపడం వల్ల కొంతలో కొంత ప్రభావం ఉండవచ్చు.

ఈ ఆగ్రహంలో ఉద్యమకారులు సంయమనం కోల్పోవడం, ఏం డిమాండ్ చేస్తున్నారో సరిగ్గా ఆలోచించపోవడం, ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడడం సహజమే కావచ్చు. కానీ చట్ట బద్ధ పాలనకు, రాజ్యాంగ ప్రమాణాలకు, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడం మంచి పరిణామం కాదు. అత్యాచారానికి పాల్పడ్డవాళ్ళకు శిక్ష పడాలి. కానీ ఆవేశంతో తోచిన శిక్ష విధించడం నాగరిక సమాజానికి చాలా నష్టం. రాళ్ళతో కొట్టండి, నరికి వేయండి, కాల్చిచంపండి, ఉరికంభం ఎక్కించండి, తీరా ఎన్‌కౌంటర్ చేయండి అనడం చూస్తే, ఈ శిక్షలన్ని నాగరిక సమాజంలో సమర్థనీయమేనా? అత్యాచారం చేసిన ఆరుగురు పశువూపాయంగా, అమానవీయంగా ప్రవర్తిస్తే మనం సూచించే శిక్షలు అనాగరికంగా ఉంటే, మొత్తం సంస్కృతి విలువల స్థాయి, సామాజిక ప్రమాణాలు కూడా అలాగే ఉంటే మన సమాజం ఇప్పుడున్న అనాగరిక స్థాయి నుంచి బయటపడి ముందుకు పోలేదు. అత్యాచారాలను ఆపలేదు.ఈ డిమాండ్లన్నీ శిక్షకు సంబంధించినవే.

కాని ఎంత ఆగ్రహంలోనైనా వివేకం కలిగిన మనుషులు- ఈ ఆరుగురు ఇంకా అలాంటి చాలా మంది ఇంత పశువులుగా మారడానికి కారణాలు ఏమిటని- ఇప్పుడు కాకు న్నా ఈ దోషుల కు శిక్షపడ్డ తర్వాతనైనా ఆలోచించాలి కదా. వాళ్ళకు శిక్ష వేస్తూనే మనం ఇంటికిపోయి మన టీవీల్లో మన పనుల్లో బీజీ అయిపోతాం. ఇలాంటి సంఘటన ఇంత దుర్మార్గంగానో, లేదా ఇంకో రూపంలోనో పునరావృ త్తం కాదని అనలేం.అసలు మన ఆగ్రహంలో ఆప్రశ్నలేదు. ఇలాంటివి పునరావృత్తం కావద్దు అని మనం బలంగా విశ్వసిస్తే, ఈ ఆరుగురి అమానుషత్వానికి కారణాలను వెతకాలి.

కారణాలు మనం జీవిస్తున్న సామాజిక ఆర్థిక నిర్మాణంలో ఉంటే, ఆ ఆరుగురికి శిక్ష ఈ సంఘటనకు పరిష్కారం కావచ్చుకాని, మరో ఇలాంటి సంఘటన జరగకుండా ఆపడానికి పనికిరాదు. దోషులను శిక్షించడం అన్ని సమాజాలలో ఏదో ఒక మేరకు ఉంది. వందల ఏళ్లుగా శిక్షలు వేస్తూనే ఉన్నాం. ఉరితీస్తూనే ఉన్నాం. కాని నేరాలు ఆగలేదు. 16-17వ శతాబ్దంలో బ్రిటన్‌లో జేబుదొంగలను బహిరంగంగా ఉరి తీసేవారు. జనం ఆ భయంకర దృశ్యాన్ని చూస్తూ ఉంటే, జేబు దొంగలు సం దర్శకుల జేబులు కత్తిరించి, పర్సులు దొంగిలిం చే వారు. ఇలాంటి అనుభవం తర్వాతే ఉరిశిక్ష మనిషిని భయపెట్టడం లేదని, ఒకరికి శిక్ష వేస్తే మరొకడు భయపడి నేరం చేయడని అనడానికీ సాక్ష్యాధారాలు లేవని న్యాయశాస్త్రం అభివూపాయపడుతున్నది. అందుకే వాళ్ళను శిక్షించినా, అత్యాచారానికి అది సమగ్ర పరిష్కా రం కాదు.

పారిక్షిశామిక విప్లవం తర్వాత వికాసం చెందిన ఉదారవాద సిద్ధాంతం వ్యక్తిని ప్రమాణంగా చేసి, వ్యక్తి చేసే ప్రతి చర్యకు వ్యక్తే సంపూర్ణ బాధ్యత వహించవలసి ఉంటుందని భావించి, నేరము- శిక్ష ప్రమాణాలను రూపొందించింది. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి వ్యక్తి కేంద్ర సిద్ధాంతం ఎంత వరకు పనికి వస్తుందన్న ప్రశ్న ఇప్పుడైనా అడగవలసి ఉంది. ఎందుకు కొన్ని సమాజాల్లో నేరం చాలా తక్కువ ఉంటుంది. కొన్ని ఉరిశిక్ష రద్దు చేసిన సమాజాల్లో ఏళ్ల తరబడి ఒక్క హత్య కూడా ఎందుకు జరగడం లేదు? అక్కడి మనుషుల మానవ ప్రవృత్తి భిన్నంగా ఉందా లేక వాళ్ళు నిర్మించుకున్న విలువలు, సామాజీకరణ,నాగరికత ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ భిన్నంగా ఉన్నాయా అనేది ఆలోచించాలి.

స్త్రీ పురుష సంబంధాలు ఎలా రూపొందించబడ్డాయి, పిల్లలకు స్త్రీలపట్ల ఎలాంటి దృక్పథాన్ని పెంచుతున్నాం, స్త్రీని సంపూర్ణమైన మనిషిగా చూసే కోణం నేర్పుతున్నామా? లేదా మీడియాల్లో, సాహిత్యంలో స్త్రీని విలాస వస్తువుగా చూపిస్తున్నామా? డర్టీ పిక్చర్ అని సినిమా తీసి, తన శరీరాన్ని దాదాపు నగ్నంగా చూపిస్తే వాళ్ళకు బెస్ట్ ఆక్ట్రెస్’ అవార్డు ఎందుకు ఇస్తున్నట్టు! మొత్తం సాంస్కృతిక విలువల నిర్మాణాన్ని మహిళ శరీరం చుట్టు ఎందుకు అల్లుతున్నట్లు, దాంట్లో ఏం విలువలున్నా యి? బ్యూటీ కాంటెస్టులు ఎందు కు నిర్వహిస్తున్నట్లు? అందాన్ని శారీరకంగా చూపిస్తే అందమైన స్త్రీ మేధస్సు ఎక్కడున్నట్లు? ఎవరు వీటిని చర్చించడానికి సిద్ధంగా లేరు .స్త్రీ పురుష సంబంధాలను మానవీకరించే బదులు, శారీరక దృష్టితో, లైంగిక దృష్టితో చూపడం నేర్పి కోట్లకుకోట్ల లాభాలు పొందే వారినేమనాలి? మార్కెట్టు-మనిషి వస్తువుల కొనుగోలులో చూసే స్వేచ్ఛను, మనిషి మనిషిగా ఎదగడంలో చూపదు. మనిషిని మానవీకరిస్తే మార్కెటు ప్రమాదంలో పడుతుంది. అందుకే అత్యాచారాలు మార్కెట్ సంబంధాల్లోకి రావు. మార్కెటుకు హారతులు పడుతున్నరాజకీయ వ్యవస్థ, అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలపై మొసలికన్నీరు కార్చి మళ్లీ మార్కెట్ భ్రాంతిలోకి కొట్టుకుతుంది. నిజానికి మార్కెట్ మానవ సమాజ నాగరికతకు, మనిషి ఉన్నతంగా ఎదగడానికి సాధనమా లేక అవరోధమా ఆలోచించాలి. మేధోమథ నం మార్కెట్‌ను సమర్థించడం కాదు, మనిషిని ఆవిష్కరించడం.

మార్కెటు విస్తరిస్తున్న కొద్దీ, నయా వలస విధానం సామాజిక జీవనంలోకి చొచ్చుకు పోతున్న కొద్దీ, అసమ సమాజంలో అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది. ఈ అసంతృప్తిని ప్రజాస్వామ్యంగా ఎదుర్కొవడానికి చాతకాని ప్రభుత్వం బల వూపయోగాన్ని ఎన్నుకుంటుంది. అందుకే దశాబ్దకాలంగా ప్రతి నేరానికి ఉరిశిక్ష వెయ్యండి అనే డిమాండ్ పెరుగుతున్నది. కసబ్‌ను ఉరితీయండి, అఫ్జల్ గురును ఉరితీయండి, అత్యాచారం చేసినవాడిని ఉరితీయం డి, అవినీతిపరులను ఉరితీయండి, రాజకీయ నాయకులను ఉరితీయండి. ఇక నక్సలైట్ల పట్ల ఆగ్రహానికి అంతేలేదు. ఎంతమందిని ఉరితీస్తే, ఎన్‌కౌంటర్లలో చంపితే శాంతి వస్తుందో ఉరితీయాలనే వారు సమాధానం చెప్పాలి. రాజ్యానికి ఎంత అధికారం ఇవ్వడానికి సమాజం సిద్ధంగా ఉందో చెప్పవలసి ఉంది. ఈ ఆగ్రహంలో-ఆగ్రహమే ఉంది, పరిష్కారం లేదు.

ఈ కలుషిత వాతావరణం నుం చి పుట్టిన వాడు నరేంద్ర మోడీ, నిన్ననే ఆయన పట్టాభిషేకం కూడా జరిగిం ది. అత్యాచారాలకు పాల్పడ్డ వాళ్లను ఉరితీయాలనే ప్ర మాణాన్ని అంగీకరిస్తే, గుజరాత్‌లో గోధ్ర పేర ఎన్ని అత్యాచారాలు జరిగాయి?అంతమంది ముస్లిం మహి ళల పట్ల ఎంత అమానవీయంగా ప్రవర్తించారు? ఈ నేరాలకు ఎంతమందిని గుజరాత్‌లో ఉరితీయవలసి ఉంటుంది! ఈ మాట అనడానికి కాంగ్రెస్‌కు, చివరకు సోనియాగాంధీ కి కూడా మొన్న ఎన్నికల్లో ధైర్యం సరిపోలేదు. ఇలాంటి ధైర్యంలేని వారు, బలమైన మానవీయమైన విశ్వాసాలు లేనివారు ఏనేరాలను అరికట్టగలరు? మన ఆలోచనలు దృక్పథాలు విశాలమైన, విశ్వజనీనమైన విలువల పునాదిమీద ఆధారపడి లేవు. నాగరిక సమాజ నిర్మాణంలో మన సమాజం ఇప్పుడైతే ఉన్నట్లు లేదు.

పరిస్థితి మారాలంటే ఢిల్లీ లాంటి నిరసనలు అవసరమే కాని సరిపోవు. మహిళల పట్ల దృక్పథాన్ని మనం గిరిజనుల నుంచి, ఆదివాసీల నుంచి నేర్చుకోవాలి. ఈశాన్య భారతంలో కొన్ని గిరిజన తెగలలో మగవాళ్లు ఆడవాళ్లను కోరతారని అంటే నమ్మరు. మేఘాలయలో గిరిజన నాయకులతో మాట్లాడుతూ పురుషాహంకారాన్ని ప్రస్తావిస్తూ మగవాళ్ళు స్త్రీలపై బలవూపయోగం చేస్తారా అని అడిగితే చాలా ఆశ్చర్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళను ఎలా కొట్టగలరు, అలాఎక్కడైన కొడ్తురా అని ఎదురు ప్రశ్నవేశా రు.

నాగా నాయకుడు తమ ప్రాంతంలో స్త్రీలకుండే గౌరవాన్ని గురించి నెహ్రూకు రాసిన ఉత్తరంలో గొప్పగా ప్రస్తావించాడు. అక్కడ బయలుదేరిన నాగరికత 21వ శతాబ్దంలో ఢిల్లీకి చేరుకునే వరకు ఎంత దిగజారిందో మనం చూస్తూనే ఉన్నాం. మహిళలపై అత్యాచారాలను ఆపాలంటే మానవ సంబంధాల మూలాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మానవ ప్రవృత్తిని చర్చించవలసి ఉంటుంది. మార్కెట్ భావ జాలాన్ని నిశితంగా చూడవలసి ఉంటుంది. అన్నింటికి మించి జీవితానికి అర్థమేమిటి అనే ప్రశ్నను మానవ చైతన్యంతో సజీవంగా కాపాడవలసి ఉంటుంది. ఈ బాధ్యత ప్రజా ఉద్యమాల మీద, ప్రజాసంఘాల మీద, ముఖ్యంగా విరసం లాంటి సంస్థల మీద ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా నినాదాలతోబాటు అత్యాచారాలు లేని తెలంగాణ అని మొత్తం తెలంగాణ ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఉద్యమాలే నూతన మానవ విలువలను ప్రసవిస్తాయి. ప్రసవ వేదనలో ఉన్నా తెలంగాణ కొత్త విలువలు కనడానికి కావలసిన సందర్భంలో ఉంది.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల