విదేశీ పెట్టుబడి: స్వదేశీ రాజకీయాలు


Wed,December 12, 2012 10:38 PM

విదేశీ వస్తు బహిష్కరణతో వేడెక్కిన స్వాతంవూతోద్యమం, గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదంతో వికసించిన జాతీయతా భావాల పునాదులు ఎంత బలహీనమో, ఇప్పుడు కానీ సామాజిక అవగాహనలోకి రావడం లేదు. ఇది సార్వభౌమ దేశమని, స్వాతంవూతోద్యమమంటే ‘ప్రజలు స్వతంవూతంగా తమ భవిష్యత్తును నిర్ణయించుకునే చారివూతక దశ’ అనే స్పృహను మధ్యతరగతి ఇంత త్వరగా మరిచిపోవడం విచివూతంగా తోస్తున్నది. వావిలాల గోపాలకృష్ణయ్య చివరి రోజుల్లో ఆయనను చూడడానికి వెళ్తే, నేను ఆయనతో గడిపిన సమయమంతా ఏడుస్తూనే ఉన్నాడు. మేం ఊహించిన స్వాతంత్య్రం ఇదికాదని, స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు దక్కకుండా పోయాయని చాలా బాధపడ్డాడు. ఆయన బతికుంటే, విదేశీ పెట్టుబడి సత్తెనపల్లికి కూడా వచ్చిందని గండెపగిలి చనిపోయేవాడో, లేక ఆయుధం పట్టుకుందామని అనుకునేవాడో.
విదేశీ పెట్టుబడిని చిల్లర వ్యాపారంలోకి ఆహ్వానిస్తూ పార్లమెంటు రెండు సభలు నిర్ణయించినట్టు ప్రకటించారు. వీళ్లు వద్దన్నా అమెరికా వాడు మొండికే సి వస్తాడు.

రావద్దని అన్నందుకు వాడు ఇరాక్ మీద యుద్ధం చేసి సద్దాం హుస్సేన్‌ను పబ్లిక్‌గా ఉరితీసి తన బలమేమిటో, ప్రపంచ బలహీనతేమిటో బహాటంగా చాటాడు. ఐదు దశాబ్దాలుగా బంటుగా ప్రవర్తించిన పాకిస్థాన్ కొంచెం తనమాట వినలేదని దాన్ని భిన్న పద్ధతుల్లో విధ్వంసం చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో అమెరికాను ఎదుర్కొనే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. ద్రౌపదీ వస్త్రాహరణప్పుడు పెద్ద పెద్ద వాళ్లు మౌనం వహించినట్టే, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులే కాక ఐక్యరాజ్యసమితీ మౌనాన్ని ఆశ్రయించింది. అంతర్జాతీయ రాజకీయాల్లో నైతిక విలువలు అడుగంటిన కాలంలో మనం జీవిస్తున్నాం. భారత రాజకీయాల్లో మనం ఇంతకు ముందెన్నడూ చూడని నైతిక పతనాన్ని చూస్తు న్నాం.

ఈ పార్టీ, ఆ పార్టీ అని గాక మొత్తం రాజకీయ సంస్కృతి విచ్ఛిన్నమౌతున్న దృశ్యాన్ని మొన్న ‘చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడి నిర్ణయ ప్రక్రియ’లో చూశాం. బీజేపీ విదేశీ పెట్టుబడిని నిజంగా వ్యతిరేకిస్తున్న దా? వ్యతిరేకిస్తే 2002లో తామే ఆ ప్రయత్నం ఎందుకు చేసినట్టు? మన్‌మోహన్‌సింగ్ అప్పటి ప్రతిపక్ష నేతగా ఆ విధానాన్ని ‘జాతి వ్యతిరేక చర్య’ అని ఎందుకన్నట్టు? నిజానికి బీజేపీ తమ వ్యూహంలో గెలుస్తామని నమ్మకముంటే దీన్ని వ్యతిరేకించేవారా? తాము తప్పక ఓడిపోతామని తెలిసేకదా ఇంత హంగామా చేశారు! మన రాజకీయా ల్లో ఓడిపోవడం కూడా గెలుపే. ప్రతిపక్షపార్టీలు మొత్తం విదేశీ పెట్టుబడిని వ్యతిరేకించినప్పుడు ఒక్క చిల్లర వ్యాపారంలోనే ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? తాము అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో విదేశీ కంపెనీల ఖనిజ వనరుల లూటీకి ఎందుకు సహకరిస్తున్నట్టు? విదేశీ పెట్టుబడి పట్ల ఎన్నడూలేని విధంగా పార్లమెంటరీ రాజకీయాలు ఒక అప్రకటిత ఒప్పందానికి వచ్చాయనిపిస్తున్నది. ప్రజాస్వామ్యం ఇంకా ఉందని నమ్మించడానికి నాటకంలో రక్తిక మన రాజకీయ నాయకులు తమ పాత్రలను జాగ్రత్తగా పోషిస్తున్నారు.

విదేశీ పెట్టుబడి మీద చర్చ జరుగుతూ ఉన్నది. పత్రికల్లో వ్యాసాలు ప్రచురిస్తున్నారు. అంతవరకు భావవూపకటనా స్వేచ్ఛ ఉన్నట్టే. రాజకీయ నాయకులు తప్పుదారి చదివితే, రాసేవాళ్లంతా పడకకుర్చీ మేధావులని, ఆర్థిక సూత్రాలు వాళ్లకు అర్థం కావని, దేశాభివృద్ధిని సహించలేక, వస్తున్న అద్భుతమార్పుకు తట్టుకోలేక పోతున్నారని అంటారు. తమకు జ్ఞానోదయమై, అభివృద్ధి అంటే అర్థమై స్పష్టంగా ముందుకుపోతున్న దశలో తమను కన్‌ప్యూజ్ చేసేందుకు ఈ విశ్లేషకులు అనవసర శ్రమపడుతున్నారనే నెపం కూడా వేయగలరు.

మన నాయకులకు ఏదీ చదవకపోవడమనే ఒక గొప్ప గుణం కూడా ఉండడం వల్ల, ప్రపంచీకరణ శక్తుల పని మరింత సులభమయింది. ప్రపంచీకరణ వెనక ఉండే శక్తులు చాలా పరిశోధన చేస్తూనే ఉన్నాయి. ప్రపంచబ్యాంకే ఐదు వేల మంది ఆర్థికశాస్త్రవేత్తల చేత పరిశోధనలు చేయిస్తున్నది. ప్రతిష్ట కలిగిన ఆర్థికవేత్తల మద్దతుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. అప్పటి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు ఉల్‌ఫెన్‌సన్ అమర్త్యసేన్‌కు నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి కొన్ని వ్యాసాలు రాశాడు. దానికి ఉల్‌ఫెన్‌సన్‌ను అని ఏం ప్రయోజనం?

మొన్నటి పార్లమెంటరీ తతంగం చూసిన తర్వాత విదేశీ పెట్టుబడిని ఆపే శక్తి కానీ, ఆపాలనే ఆసక్తి కానీ రాజకీయాల్లో లేదనేది స్పష్ట్తమయింది. సామ్రాజ్యవాద శక్తులకు మన రాజకీయ ప్రక్రియ మీద ఉడుంపట్టు కూడా బహిర్గతమయింది. ఇది చూసిన తర్వాత ‘జాతిరాజ్య’ భావన కూలిపోతున్నట్టు తోస్తున్నది. ఇది ప్రపంచవ్యాప్త పరిణామమే. పెట్టుబడి పరిణామ క్రమంలో జాతి రాజ్యపాత్ర ముగిసిందా, ముగిస్తే ఇక రాబోయే రాజకీయ వ్యవస్థ స్వరూపం ఎలా ఉండబోతుందో ఊహించవలసిందే. అంటే దేశీయ ప్రజల వరకు ఇక నేషన్‌స్టేట్ పాత్రను పునర్నిర్వచించవలసిన అవసరం ఏర్పడింది. అంతర్జాతీయ పెట్టుబడి ఈరాజ్యం నుంచి తన దోపిడీని కాపాడే పాత్రను కోరుకుంటున్నది.

దానికి మనవాళ్లు సిద్ధంగానే ఉన్నారు. దోపిడీ ఇంత నగ్నంగా జరుగుతున్నప్పుడు ప్రజలు ఊరుకుంటారా! అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఈ నమూనాను ప్రజలు పూర్తిగా ప్రశ్నించకముందే, మత రాజకీయాలను ఎగదోసి ఎన్నికలు జరిపితే, ద్వేషాగ్నిలో కొట్టుకుపోతున్న జనానికి ఆర్థికమైన మూలాలలోకి వెళ్లగలిగిన చొరవ చాలా తక్కువ ఉంటుంది. ఆ రాజకీయాల నుంచి పుట్టుకవచ్చేది నియంతృత్వ పాలనే. గత పది సంవత్సరాల కాలంలోనే నరేంవూదమోడీ నాయకత్వానికి, ఆయన అభివృద్ధి నమూనాకి మద్దతు కూడగట్టడానికి జాతీయ మీడియా, కాదు జాతీయ వ్యతిరేకత మీడియా 24 గంటలు, వారం రోజులు శ్రమిస్తూనే ఉన్నది. టాటా దగ్గరి నుంచి సాధారణ విశ్వవిద్యాలయ మేధావి దాకా అందరికీ నరేంవూదమోడీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.

ఆయన కారణమైన మారణకాండను , మానవ హననాన్ని మరిచిపోవాలని అంటున్నారు. మారణకాండ గురించి రెండు ఎన్నికల తర్వాత కూడామాట్లాడడమేమిటి అంటున్నారు. ఎన్నికలు పాలకులు చేసిన పాపాలను కడిగే గంగానదిలాగా తయారుచేశారు. గంగానది పాతకాలపు స్వచ్ఛమైన నది కాదు, అది ఇప్పుడు పెద్ద డ్రైనేజీ.

ఈ అభివృద్ధికి వ్యతిరేకంగా అట్టడుగు నుంచి ప్రతిఘటన వస్తూనే ఉన్నది. అయితే ప్రతిఘటనను కేవలం సాయుధ పోరాటంగా చూపిస్తూ, వ్యవస్థనే ప్రశ్నిస్తున్న రాజకీయాలనెలా సమర్థిస్తారు? ఏ వ్యవస్థ కూడా తనను కూలదోస్తానన్న శక్తులను సహించదు అంటున్నారు. ఇవి సంఘ వ్యతిరేక శక్తులు అని ఇంగ్లిషు మీడియా ప్రచారం చేస్తున్నది. దీనికి విరుగుడుగా పోరాడే శక్తులు అవి ఏరూపంలో, ఏ స్థాయిలో ఉన్నా, జాతీయతా భావాలని, అర్థాన్ని కోల్పోయిన దేశభక్తి లాంటి భావాలను సామాజిక చర్చలోకి, అలాగే దాన్ని ప్రజా చైతన్య స్రవంతిలోకి తీసుకరావలసిన అగత్యం ఏర్పడింది.ఏ జాతీయతా భావనైతే పెట్టుబడి అభివృద్ధికి ఉపకరించిందో, ఆ భావనే ఇప్పుడు ప్రజా ఉద్యమాలకు పనికి వచ్చే చారివూతక సాధనంగా కనిపిస్తున్నది. ఈ భావనమీదే కొన్ని లాటిన్ అమెరికా ప్రజాస్వామ్యశక్తులు నిలదొక్కుకోగలిగాయి.

ప్రపం చ కార్మికుల ఐక్యత చాలా దూరంలో ఉండడం వల్ల జాతీయ శక్తులు, దేశాన్ని ప్రేమించేవారు, ప్రజల పట్ల నిబద్ధత ఉన్నవాళ్లు, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, గాంధీయన్లు ఏకతాటిమీదకి రావాలి.

జాతీయతని పాఠ్యాంశాలుగా ఇంకా నిషేధించలేదు. లక్షలాదిమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థుల్లో జాతీయతా భావా న్ని పెంచాలి. జాతీయత అంటే సంకుచితమైన, ఇతరులను ద్వేషించేది కాక, ప్రజలను ముఖ్యంగా దళితులను, గిరిజనులను, అట్టడుగు ప్రజలను ప్రేమించే తత్వాన్ని విద్యార్థిలోకానికి బోధించాలి. జాతీయతా భావాల్ని ప్రోత్సహించడానికి కావలసిన భౌతిక పునాదిని అడవిలో పోరాటం చేస్తున్న ఆదివాసీలు నిర్మిస్తున్నారు. దేశమంటే ప్రజలు, ప్రజలంటే దేశం కోసం శ్రమిస్తున్న శ్రామికులు. ‘స్వదేశీ’ అనే భావనలాగే ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలవి అనే భావనను మరింత బలంగా విద్యాలయాల్లో చర్చకు పెట్టవలసి ఉంది. అభివృద్ధి నమూనా అదీ గుజరాత్ అభివృద్ధి నమూనా అనే భ్రాంతి నుంచి మధ్య తరగతిని కాపాడుకోవలసిన తరుణం బహుశా ఇదే కావచ్చు. ఈ అవకాశం జారవిడిస్తే దేశ ప్రజలు దుర్మార్గమైన హింసాయుత ఫాసిజాన్ని, అపారమైన రాజ్యహింస ద్వారా ప్రత్యామ్నాయ సమాజంలోకి ప్రయాణం చేయవలసి ఉంటుంది.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles