నగదు బదిలీ: మరో గారడీ


Wed,November 28, 2012 11:29 PM

rajuకేంద్ర ప్రభుత్వం తాను అమలు చేస్తున్న 29 సంక్షేమ, అభివృద్ధి పథకాల మీద పెడుతున్న ఖర్చును నేరుగా డబ్బుల రూపంలో ప్రజలకు బదిలీ చేయడానికి నిర్ణయించిందని కేంద్రమంవూతులు చిదంబరం, జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ పథకాన్ని అంగీకరించినందుకు చిదంబరం కాంగ్రెస్ పార్టీని ప్రశంసించా రు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో భాగమో కాదో తెలియదు.

ప్రపంచ పెట్టుబడికి ఏజెంటుగా, భారత పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని ప్రశంసించారేమో తెలియదు. ఈ పథకాన్ని ‘మీ డబ్బులు మీ హస్తాల్లో’ అనే నినాదంతో ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దగ్గరి డబ్బులు ప్రజల డబ్బులేనని తెలిసో తెలియకో ఒప్పుకోవడం కొంచమైనా మెరుగే. కానీ ప్రభుత్వం ప్రజలకు సేవలను అందించే బదులు డబ్బులు ఇచ్చి సేవలను మార్కెట్‌లో కొనుక్కొండి అంటే, ఈ ఇచ్చే డబ్బులతో ప్రజలు ఏం కోల్పోతారో? ఏం ప్రయోజనం పొందుతారో ప్రజలకు ఇంకా స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. ఈ పథకాన్ని ‘విప్లవాత్మకమైనదని’, ‘చరివూతాత్మకమైనద’ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పేర్కొన్నారు. చరివూతాత్మకం, విప్లవాత్మకమంటే ఏమిటో తెలియదు. ఈ పథకాన్ని 2009 ఎన్నికల మానిఫెస్టోలోనే చేర్చామంటున్నారు. నాకు గుర్తున్నంత మేరకు ఈ స్కీం చంద్రబాబునాయుడు ప్రకటించి, ఇది తన కుమారుడు లోకేష్‌కు తట్టిన ఐడియా అన్నారు. అప్పుడు ఆ అబ్బాయి, ప్రపంచబ్యాంకు ఒకేలా ఆలోచించడం అంత యాదృచ్ఛికమేమీ కాకపోవడం గమనించవలసిన విషయం.

ఈ పథకాన్ని లోతుగా విశ్లేషించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొన్ని దేశాల లో ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ఈ పథకం అమలులో ఉంది. అయితే పథకాన్ని నయా ఆర్థిక విధాన ఛట్రంలో పరిశీలిస్తే కొన్ని ధోరణుల గురించి సులభంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని, వంద రూపాయ లు ప్రభుత్వం ఖర్చు చేస్తే, పదిహేను రూపాయలు మాత్రమే పేదవాళ్లకు అందుతున్నాయని రాజీవ్‌గాంధీ అన్నారని చాలామంది గుర్తుచేస్తుంటారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, పాలన వాళ్లదే అయినప్పుడు ఇంత సుదీర్ఘ పాలనలో వంద రూపాయలు 15 రూపాయలుగా బక్కచిక్కడంలో ఆ పార్టీ పాత్ర ఏం లేదా? ఈ మాయమవుతున్న 85 రూపాయలలో ఆ పార్టీ వాటా ఏం ఉండదా? వీటన్నింటిని అధిగమించడానికి నగదు రూపంలో డబ్బు ను బ్యాంకుల్లో పేదవాడి ఖాతాలో జమ చేస్తామంటున్నారు. అంటే ఇది కేంద్ర ప్రభు త్వం నేరుగా చేస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా చేస్తారా ఇంకా స్పష్టత లేదు.

ముందుగా వృద్ధుల పెన్షన్ స్కీం, అలాగే స్కాలర్‌షిప్‌లు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చేసే ఖర్చును బదిలీచేసి, తర్వాత అన్ని సంక్షేమ పథకాల మీద అయ్యే ఖర్చు బదిలీ చేయడం. దీనివల్ల సగటున ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 30-40 వేల రూపాయల దాకా బదిలీ చేయబడతాయని అంటున్నారు. పైకి చూడడానికి ఇంత నగదు ప్రజలకు నేరుగా ఇవ్వడం ఆకర్షణీయంగా ఉన్నా, ఈ నగదును కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబ బ్యాంకు అకౌంట్‌లో జమా చేస్తామని అంటున్నారు. ఇది కూడా వినడానికి బాగానే ఉంది. కానీ నయా ఆర్థిక విధాన ప్రేరిత అభివృద్ధి నమూనా అమలులో ఉన్నప్పుడు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పేద కుటుంబాలకు ఇవ్వాలన్న నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగానే పరిశీలించవలసి ఉంటుంది.
నయా ఆర్థిక విధానం సంక్షేమంలో రాజ్యం పాత్రను కుదించాలని నమ్ముతుంది.

సంక్షేమం బీజవూపాయంలో ఉన్న కమ్యూనిజం అని కూడా వారు వాదిస్తున్నారన్నది ఇంతకు ముందు కూడా నేను రాశాను. ప్రారంభంలో సంక్షేమ కార్యక్షికమాలలో స్కాలర్‌షిప్‌లు వృద్ధాప్య పింఛన్ డబ్బుల రూపంలో ఇస్తారు కనుక పర్వాలేదు. తర్వాత విద్య, ఆరోగ్యం, ఆహార పంపిణీ లాంటి సేవలు ధన రూపంలో ఉండవు. క్రమేణా ఈ కార్యక్షికమాలన్నీ రద్దు చేసి వాటి మీద పెట్టే ఖర్చును డబ్బుల రూపంలో ఇచ్చినప్పుడు ఆస్పవూతులు, స్కూళ్లు నడపవలసిన బాధ్యతను మార్కెట్‌కు అప్పజెప్పవచ్చు. అప్పుడు ప్రజలు వీటిని బజారులో కొనుక్కోవలసి వస్తుంది. దాంతోపాటు ఈ శాఖల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులను స్వచ్చంద పదవీ విరమణతో బయటకు నెట్టవచ్చు. అలా ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కుదింపును సునాయసంగా సాధించవచ్చు. ఇది ఇప్పటికే కింది ఉద్యోగుల విషయంలో అమలులో ఉంది. ఔట్‌సోర్సింగ్ పేర డ్రైవర్లు, స్వీపర్లు, ఫ్యూన్‌లు, సెక్యూరిటీ ప్రైవేట్ రంగానికి అప్పజెప్పారు. ఇప్పుడు భిన్న శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా అలాగే కుదించవచ్చు.

ప్రభుత్వ సేవలకు బదులు నగదు ఇవ్వడం వల్ల ప్రపంచబ్యాంకు దృష్టి లో ఖర్చు చాలా ఆదా అవుతుందని అంటున్నారు. కానీ ఇవ్వడం వేరు డబ్బును ఇవ్వడం వేరు. 20వ శతాబ్ద ఆరంభంలోనే ‘మాలపల్లి’ నవలలోని ఒక ఉదాహరణ ఇవ్వవచ్చు. వ్యవసాయ రంగంలో అప్పటి జీతంలో కొంత భాగం ఆహారం, చెప్పులు, గొంగడి, దుస్తులు, మరికొంత భాగం నగదు ఇచ్చే వాళ్లు. లేదా కొంత ధాన్యం లేదా జొన్నలు లాంటివి ఇచ్చేవారు. ఆహారానికి బదులు మొత్తం నగదు రూపంలోనే ఇస్తామన్నప్పుడు కూలీలు దానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అప్పటికే వస్తువులకు బదు లు డబ్బు ఇవ్వడంలో మోసం ఉన్నదన్నది అస్పష్టంగానైనా అనుభవం ద్వారా వాళ్లకు అర్థమైంది. ఉదాహరణకు రోజు కూలీలో భాగంగా ఒక కిలో ‘జొన్నలు’ ఇచ్చినప్పుడు ఆకలి ఎంత వాస్తవమో జొన్నలు అంతే వాస్తవం. దానికి బదులు పది రూపాయలు ఇచ్చినప్పుడు జొన్నల ధర 12 రూపాయలు అయినప్పుడు కూలీలకు ఒక కిలో జొన్నలు రావు. ఆ ధర 20కి చేరితే సగం కిలో జొన్నలే వస్తాయి.

కూలీ పెంచమని పోరాడితే 10 రూపాయలను15 కు పెంచినా, కిలో జొన్నలు రావు. జొన్నలు ఎంత వాస్తవమో రూపాయలు అంత వాస్తవం కావు. కార్ల్‌మార్క్స్ పెట్టుబడి రహస్య వ్యూహాన్ని తన క్యాపిటల్ పుస్తకాలలో చాలా సవివరంగా విశ్లేషించారు. ఒక దేశంలోని ‘డబ్బు’ విలువ ఆ దేశంలోని మొత్తం ఉత్పత్తిని బట్టి ఉంటుంది. ఉత్పత్తికి మించి ద్రవ్యం ఉన్నప్పుడు ద్రవ్యం ఉత్పత్తి వెంటపడడం వల్ల ధరలు పెరుగుతాయి. అంటే మానవ శ్రమ ద్రవ్యరూపంలోకి మార్చడం క్యాపిటలిస్టు వ్యవస్థ చేసిన అతి పెద్ద గారడీ లేదా మ్యాజి క్. శ్రమను డబ్బులుగా మార్చి డబ్బులే శ్రమ అనే భావాలు కల్గించడం ఆ వ్యవస్థ అవసరం. నగదు బదిలీని ఆ ఛట్రంలో అర్థం చేసుకుంటే పెట్టుబడిదారీ దేశంగా మారడానికి అతి ప్రయాసపడుతున్న పాలకులకు దొరికిన మరో చిట్కా నగదు బదిలీ.

శ్రమ మొదట బంగారంలో దాచబడి బంగారు నాణాల రూపంలో, ఆ తర్వాత వెండి, ఆతర్వాత రాగి, కాగితాన్ని కనుకున్న తర్వాత కాగితపు కరెన్సీ వచ్చాయి. ఈ మధ్యే ఒక ఇంగ్లిష్ సినిమాలో ఒక దొంగల ముఠా ఒక సంపన్నుడి ఇంట్లో చోరీ చేస్తూ, ఆ ఇంట్లో విపరీతంగా బంగారము, అలాగే పేపర్ కరెన్సీ చూసి, ఒక దొంగ కరెన్సీ అయితే బరువు తక్కువ, ఎక్కువగా మోసుకపోవచ్చని అంటే, ముఠాలోని ఒక మహిళ అది కేవలం కాగితమేనని,బంగారానికి అది ప్రత్యామ్నా యం కాదని అంటుంది. ఆమెకు కూడా తెలియనిది బంగారం కూడా అంతిమంగా శ్రమ మాయలేడిగా మారడమేనని తెలియకపోవడం. పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం మానవ శ్రమను ఎన్నో రూపాలలో మారుస్తూ, మనుషులకుండే సహజ మానవ సంబంధాలను కృత్రిమంగా మార్చి డబ్బుల కోసం మనుషులు ఒకరినొకరు చంపుకునే దాకాపోయింది. ఈమధ్యే ఢిల్లీలో కోటీశ్వరులైన అన్న తమ్ముళ్లు ఆస్తి తగాదాలో కాల్పులు జరుపుకొని ఇద్దరూ చనిపోయారు. అంటే మనుషులు తాము మనుషులమనే స్పృహ కోల్పోవడం దాకా నెట్టుతుంది.
నగదు బదిలీ ఈ మొత్తం పరిణామంలో భాగంగా చూడాలి.

అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థగా మారే చారివూతక పరిస్థితు లు లేవు. దానివల్ల నగదు బదిలీ పథకం తప్పకుండా అస్తవ్యస్తంగా మారక తప్పదు. నగదును నేరుగా బ్యాంకులలో జమ చేస్తామనడం హాస్యాస్పదంయగామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన పేద ప్రజలు బ్యాం కులో అకౌంట్ ఎలా తెరుస్తారు? చెక్‌బుక్ ఎలా వాడుతారు? డబ్బుల లెక్కలు ఎలా తేల్చుకుంటారు అన్నవి చాలా కీలకమైన సవాళ్లు. దాని నుంచి కొత్త పైరవీకార్లు, దళారులు పుట్టడమే కాక, పాతవాళ్లు తమ అవతారాలను మార్చుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన మానవ సంబంధాలన్నింటినీ ద్రవ్యీకరించాలనే ఈ సామ్రాజ్యవాద వ్యూహం బెడిసికొట్టక తప్పదు. అందరికీ విద్య ఇవ్వకుండా బ్యాంకులో ఖాతాలు ఏమిటి? మానవ సంబంధాల మూలాలను విధ్వంసం చేసే బృహత్ ప్రయత్నంలో నగదు బదిలీ మరో తూటాగా చూడవలిసి ఉంటుంది.

పొఫెసర్ జి. హరగోపాల్భారతదేశ ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థగా మారే చారివూతక పరిస్థితులు లేవు. దానివల్ల నగదు బదిలీ పథకం తప్పకుండా అస్తవ్యస్తంగా మారక తప్పదు. నగదును నేరుగా బ్యాంకులలో జమ చేస్తామనడం హాస్యాస్పదం. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన పేద ప్రజలు బ్యాంకులో అకౌంట్ ఎలా తెరుస్తారు? చెక్‌బుక్ ఎలా వాడుతారు? డబ్బుల లెక్కలు ఎలా తేల్చుకుంటారు అన్నవి చాలా కీలకమైన సవాళ్లు.

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల