నిండా ముంచినవాడికి భయమేంటి?


Thu,November 1, 2012 12:03 AM

నయా ఆర్థిక విధానాల మీద ‘నిండా మునిగిన వాడికి చలి ఏమిటి’ అనే టైటిల్‌తో ఈ కాలమ్‌లో రాసిన వ్యాసంపై మిత్రుడు పర్‌స్పెక్టివ్ ఆర్‌కే స్పం దిస్తూ, టైటిల్ ‘నిండాముంచిన వానికి’ అని ఉంటే బావుండేదని అన్నా డు. మొన్నటి కేంద్రమంత్రి మండలి మార్పుల మీద, సమకాలీన రాజకీయాల మీద రాయాలనుకున్నప్పుడు కామెంట్ గుర్తొచ్చి ఈ రచనకు వాడుతున్నాను. మంత్రిమండలి మార్పుల గురించి చర్చించడమే వ్యర్థ ప్రయాస. నిజానికి మంత్రి మండలిలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండాలి అన్నది ప్రధాని పరిధిలోనిది. ఆయనకు అలా మార్చే అధికారం చట్టం కల్పించింది. కానీ ప్రధాని ఈ పునర్ వ్యవస్థీకరణను ఎందుకు చేసినట్టు? చేయడం వల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అని అడగవచ్చు. కానీ దీనికి మించి ఈ పునఃవ్యవస్థీకరణ అంతర్జాతీయ, జాతీయ కార్పొరేట్ ఒత్తిడి మేరకు జరిగిందని, ఏమంత్రి అయినా కార్పొరేట్ వ్యవస్థ ప్రయోజనాలకు ఏ మాత్రం భిన్నంగా నడుచుకున్నా, ఆయనకు మంత్రి పదవి ఊడడమో లేదా అది మార్చడమో లేదా ఆయా మంత్రుల ప్రాధ్యానం తగ్గించడమో జరుగుతుందని ఈ పునర్ వ్యవస్థీకరణలో మరింత ప్రస్ఫుటంగా బయటపడింది. ప్రధానమంత్రే కాక ఈ వ్యవహారం చూస్తుంటే సోనియాగాంధీ విశ్వసనీయతను కూడా ప్రశ్నించవలసిన సమయం వచ్చింది.

చాలా కాలంగా మన్మోహన్‌సింగ్, అహ్లువాలియా, చిదంబరం, కపిల్‌సిబాల్ అంతర్జాతీయ పెట్టుబడి ఏజెంట్లుగా ప్రవర్తిస్తే, సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, కిశోర్‌చంవూదదేవ్ కొంచెం భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్‌పార్టీ సంస్కృతిలో భాగం. వీళ్లలో జాతీయ సలహా మండలిలో కొందరు ఉద్యమకారులను, నిజాయితీగా మాట్లాడే వాళ్లను చేర్చుకున్నారు. వీళ్ల మధ్య సోనియాగాంధీ కొంత మెరుగేమో అని అనిపించినా, న్యూక్లియర్ పాలసీ విషయంలో, చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడి మీద, ఆర్థిక సంస్కరణల మీద ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తే ‘పేదల పక్షం’ అనేది కేవలం ఒక ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఒకరిచేత ఒకమాట, మరొకరి చేత మరోమాట మాట్లాడించి తమ పబ్బం గడుపుకోవడం అంతర్జాతీయ పెట్టుబడి వ్యూహా ల్లో ఒక భాగం. కానీ ఈనాటకాన్ని ఇంత పెద్ద దేశంలో ఆడించగలుగుతున్నారంటే వాడి తెలివితేటల కంటే మన ప్రజల అమాయకత్వం, చదువుకున్న వాళ్ల హ్రస్వదృష్టి ప్రధాన కారణం.

దేశంలోని కార్పొరేట్ రంగం, ముఖ్యంగా అంబానీ బ్రదర్స్ ప్రభుత్వ విధానాలను, మంత్రి మండలి సభ్యులను, యూజీసీ ఛైర్మన్‌ను, ఇందిరాగాంధీ దూరవిద్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఇది జైపాల్‌డ్డి విషయంలో చాలా బాహాటంగానే బయటికి వచ్చింది. ఒకవైపు స్కాం తర్వాత స్కాం బయటపడుతున్నప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లేదా యూపీఏ ప్రభుత్వం మంత్రులను నియమించేటప్పుడు కనీసం ‘బయటకి కనిపించడానికైనా’ కొంత విశ్వసనీయత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యం కల్పించి తమ ఇమేజ్‌ను కాపాడుకుంది. ఇప్పుడు ఆ మొహమాటం కానీ, సిగ్గు కాని, ఎన్నికల భయాన్ని కాని పాలకులు సంపూర్ణంగా వదులుకున్నట్టున్నది.

సల్మాన్ ఖుర్షీద్ మీద ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణల విషయంలో సరైన జవాబు ఇవ్వకుండానే ఆయనకు మరింత కీలకమైన శాఖను అప్పజెప్పడం, అలాగే వివాదాస్పదుడైన శశిథరూర్‌ను ఏకంగా మానవ వనరుల శాఖకు సహాయమంవూతిగా నియమించడం చూస్తుంటే ‘నవ్విపోదురు కాక నాకేమి సిగ్గు’ అన్నట్టుంది. పౌరుడిగా, విద్యారంగంలో చాలాకాలంగా పనిచేసిన వాడిగా మాలాంటివాళ్లను పూర్తిగా అగౌరవపరిచినట్టు అనిపిస్తుంది. కపిల్ సిబాల్‌ను మార్చారు అని గాలిపీల్చుకోకముందే, శశిథరూర్‌ను నియమించడమే కాక కొత్తమంత్రి పల్లంరాజు, ప్రభుత్వ విధానాలు కొనసాగిస్తాను అని అనే బదులు కపిల్ సిబాల్ విధానాలు కొనసాగిస్తానని కార్పొరేట్ విద్యకు, విదేశీ విశ్వవిద్యాలయ చొరబాటుకు భయం లేదు అని హామీ ఇచ్చినట్టుంది. పల్లంరాజు ఏం చేస్తాడోనని కొంత అనుమానపడి, విదేశీపెట్టుబడి సంపూర్ణంగా తమ విధేయుడైన వివాదాస్పద శశిథరూర్‌ను అక్కడ పెట్టుకున్నది. ఈ మొత్తం కేంద్ర మంత్రి మండలి మార్పులు వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనే రాజకీయ పట్టుదల ఉన్నట్టు కూడా అనిపించడం లేదు.


కేంద్ర మంత్రివర్గ మార్పు దెబ్బతిన్న అభివృద్ధిని పునరుద్ధరించడానికి అని అనుకోవాలా? అది కూడా స్పష్టంగా కనిపించడం లేదు. వృద్ధి రేటు పడిపోయింది అని దివారావూతులు ఆందోళన పడుతున్న పాలకులను కొన్ని మౌలిక ప్రశ్నలే అడగవలసి ఉంది. ఉదాహరణకు అంబానీల లాభాలు కొంత తగ్గాయే అనుకుందాం. జీడీపీ కొంత దెబ్బతిన్నదనే అనుకుందాం. దాని ప్రభావం మొత్తం సమాజం మీద ఎలా పడుతుందో వివరించాలి.ఆరు దశాబ్దాలుగా వృద్ధిరేటును చూస్తే మొదటి మూడు దశాబ్దాలు 2.5 శాతం ఉంది. 1980వ దశాబ్దంలో రాజీవ్‌గాంధీ మార్కెట్లను తెరిచినప్పుడు అది ఐదు శాతం దాటింది. హమ్మయ్య అని కునుకు తీయకముందే ఆర్థిక వ్యవస్థ విపరీత సంక్షోభంలో పడిందిఅని మీడియా ప్రచారం ద్వారా అందరికి భయాందోళనలు కలిగేలా చేసి, విదేశీ పెట్టుబడికి దేశాన్ని బార్లా తెరిచారు. అప్పుడు ఎవ్వరు కూడా వృద్ధి రేటు పెరిగిన దశాబ్దంలో అంతకుముందు లేనంత పెద్దఎత్తున సంక్షోభంలో ఎందుకుపడ్డాము అని అడిగే బదులు, విస్తృతంగా దేశ ఆర్థిక రంగాన్ని విదేశీ రంగంతో ముడివేయవలసిందే అని భావించారు.

అలా భావించే 1990వ దశాబ్దంలో నూతన ఆర్థిక విధానానికి హారతి పట్టి, తొమ్మిది శాతం వృద్ధి రేటును సాధించిందని ప్రగల్భాలు పలికి, భారత్ సూపర్ పవర్ కానున్నదని నమ్మబలికి, ఇప్పుడు వృద్ధిరేటు ఆరు శాతానికి పడిపోయిందంటున్నారు. ఎందుకు పడిపోయిందో చెప్పడం లేదు. వృద్ధిరేటు పెరగడం ఇల్లును, గుడ్డలను అమ్ముకుని చెట్ల కిందపడుకుని తన బ్యాంకు బాలెన్స్ పెరిగిందన్న పిచ్చివాడి భ్రమ లాంటిది.

వృద్ధిరేటు పడిపోతున్నదని ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని ఇబ్బడిముబ్బడిగా జాతీయ ఖనిజ వనరులను విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పుతున్నారు. దేశానికి ఇప్పుడు అత్యంత అవసరమైన గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్‌లకు అప్పజెప్పి వృద్ధి రేటు పెంచాలనుకుంటున్నారు. ఇలా గ్యాస్ నిక్షేపాలను అప్పజెప్పడం వల్ల 2జీ స్పెక్ట్రం, బొగ్గు అమ్మకం, లక్షలకోట్లు ప్రజల నష్టం అని అన్నవారిని అభివృద్ధి వ్యతిరేకులుగా చిత్రిస్తూ, క్యాబినేట్‌లో అలా ఆలోచించే వాళ్లను దించేస్తున్నారు. ఇరాన్ నుంచి గ్యాస్ పైప్‌లైన్ దేశానికి చాలా అవసరమని, ఒప్పంద ప్రక్రియను చేపట్టిన మణిశంకర్ అయ్యర్ శాఖను అమెరికా ఒత్తిడి మేరకు హుటాహుటిన మార్చారు.

ఈ నాటకం మొత్తం ప్రజల అవగాహనలోకి వస్తున్న తరుణంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఉద్యమానికి మంచి స్పందనే వచ్చింది. ఉద్యమకారుల మధ్యే విభేదాలు రావడం రాందేవ్ బాబా, అన్నాహజారే అప్పుడప్పుడు దర్శనమిస్తూ, మాయమవుతున్నరు. ఇప్పుడు కేజ్రీవాల్ అభిమన్యుడివలె ముందుకు వచ్చినట్టుగా అగుపించినా, వ్యవహారం అంత సజావుగా ఏం లేదు. ఆయన దీనివల్ల రెండు పార్లమెంటరీ పార్టీల విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. మూడవ ప్రత్యామ్నాయమేది కనుచూపునా కనిపించడం లేదు. అలాంటిదేవైనా ముందుకు వచ్చినా దాన్నేమీ ‘పెట్టుబడి’ బతకనివ్వదు. ఏ సామాజిక ఉద్యమం కూడా ఒక రాజకీయశక్తిగా ఎదిగే వాతావరణం కనిపించడంలేదు.

మొ త్తం అవినీతి చర్చ రాజకీయ అధికారంలో ఉండేవాళ్ల చుట్టూ తిరుగుతున్నది. కానీ కార్పొరేటు సంస్థల అవినీతి గురించి గానీ, ఊహించలేని వాళ్ల సంపద మీద కానీ వాళ్ల లాభాల మీద కాని, దానికి మించి మొత్తం నూతన ఆర్థిక వ్యవస్థ మీద జరగడం లేదు. చర్చ, ఉద్యమం అవినీతి చుట్టూ తిరగడం వల్ల ఇది ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగలేదు. ఆర్థిక అభివృద్ధి నమూనాను ప్రశ్నించిన వాళ్లని తీవ్రవాదులుగా ముద్రవేసి, వాళ్లను ఎన్‌కౌంటర్ పేర చంపినా అంగీకరించే ఒక పరిస్థితి కల్పించారు.

ఈమొత్తం సంక్షోభంలో నుంచి భయంకరంగా ముందుకు వస్తున్నది. నరేంవూదమోడీ ప్రహసనం. నరేం ద్ర మోడీని ఇంతవరకు అవినీతిపరుడు అని అనడంలేదు. అవినీతి మీద చర్చ తీవ్రమైన కొద్దీ నరేంవూదమోడీ ఇమేజ్‌ను పెంచడానికి మీడియా చాలా ప్రయాస పడుతున్నది. ఆయన కారణమైన మారణకాండను మరిచిపోవాలని చాలామంది అంటున్నట్టు ఒక మీడియా చానెల్ ప్రచారం చేస్తున్నది. ఎందుకు మరిచిపోవాలో అర్థం కావడంలేదు. నిజానికి మనుషులు ఒక నేరస్థుడిని క్షమించవచ్చు, కానీ నేరాన్ని ఎలా మరిచిపోగలరు. మరచిపోయినా ఆ నేరస్థుడు దేశ అధినేతగా ఎలా అర్హుడు. మానవ హనం అవినీతి కంటే తక్కువ నేరం అనే ఒక వక్రీకరణను ప్రవేశపెట్టారు. విలువలు వక్రీకరింపబడ్డ కొద్దీ వక్ర మనుషుల ఇమేజ్ పెరుగుతుంది.

ఈ ప్రక్రియను చాలా సునిశితంగా చూడవలసిన అవసరముంది. ఎందుకు ఈ ‘వ్యక్తిత్వాన్ని’ ముందుకు తెస్తున్నారు. అని అలోచిస్తే అభివృద్ధి పేర జరుగుతున్న ప్రచారానికి ఆయనను ఒక ప్రతీకగా చూపిస్తూ, ఈ అభివృద్ధికి ఎవ్వరు అడ్డం వచ్చినా అలాంటి వాళ్ళను ఏం చేయగలరు అన్న భయాన్ని కలిగించి, అవసరమైతే ఈ ప్రయోగాన్ని చేసి నయా ఆర్థిక సంస్కరణల విధ్వంసాన్ని పరిసమాప్తి చేయాలని పాలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రి ఆ రహదారి వెయ్యడానికి తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు.

ప్రొఫెసర్ జి.హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల