పాలమూరు మీనాంబరం వాగు ఏమైంది?


Thu,October 11, 2012 12:32 AM

SWECHARAVAM99మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు తెలంగాణ డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లారని విని నా బోటి వాడికి చాలా ఆశ్యర్యమేసింది. ఇంత పెద్ద ప్రజాఉద్యమం జరుగుతున్నప్పుడు, సెప్టెంబర్30న ప్రజా సమూహాన్ని చూసిన తర్వాత, తెలంగాణ ప్రజా వూపతినిధులంతా తమ పార్టీ పునాదులు ఎలా కదులుతున్నాయో గ్రహించి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వాళ్లకు కలిగి ఉండాలి. అలా ఆందోళన పడకపోతే వాళ్లకు ప్రజల పట్ల ఎంత చులకనో అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏ ఆశయాలు, ఆదర్శాలు లేకున్నా తమ సొంత మనుగడకే ప్రమాదం ఏర్పడినప్పుడైనా కదలాలి. ప్రజలతో నడవాలి.ఈ ఇంగిత జ్ఞానం తెలంగాణ రాజకీయ నాయకులకు లేదా? లేక 2014 ఎన్నికల వరకు అధికారంలోఎలాగో ఒకలాగ కొనసాగితే చాలు అనే అల్పసంతోషంతో ఉన్నారా? ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులకు కొంచమైనా జ్ఞానోదయమైనందుకు సంతోషించాలి.

తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం, అగత్యం, బాధ్యత మహబూబ్‌నగర్ ప్రతినిధులకు అందరికంటే ఎక్కువ ఉన్నది. ఢిల్లీలో వాళ్లు వేరే వాదనలేవీ చెప్పనవసరం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగిందో వివరిస్తే చాలు. అది అధిష్ఠానానికి అర్థమైతే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత ఏమిటో అర్థమవుతుంది. కానీ మహబూబ్‌నగర్ రాజకీయ నాయకత్వానికి ఆ అవసరం ఏ మేరకు అర్థమయ్యిందో ఆ వాదనలను ఎంత పటిష్టంగా ముందు పెట్టగలిగిందో మనకు తెలియదు.పాలమూరు దుస్థితికి రాజకీయ నాయకత్వం బాధ్యత వహించి, ఇప్పటికైనా పాలమూరు పేద ప్రజల పక్షాన మాట్లాడడం నేర్చుకోవాలి.


కృష్ణానది 2,70,2baba0 కిలోమీటర్లు జిల్లా గుండా ప్రవహిస్తుంటే తుంగభద్ర నదిలో ఈ జిల్లాకు రావలసిన న్యాయమైన వాటా వస్తే, మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాక పట్టణంలో కూడా నీళ్ల కోసం అన్ని కష్టాలు ఎందుకు? ఇదేం ఎడారి ప్రాంతం కాదు. జీవనదులు ప్రవహిస్తున్న జిల్లా. ఈ జిల్లా నుంచి లక్షలాది మంది వలసలు పోవడం ఏమిటి? కరువు చావులు ఏమిటి? వ్యవసాయం కోసం బోరుబావులు తవ్వడమెందు కు? రాత్రివేళల్లో కరెంటుకోసం పొలాలకు వెళ్లి పాముకాటుతో చావడమెందుకు? కోస్తా జిల్లా రైతులా బతకవలసిన పాలమూరు రైతులు దయనీయమైన స్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారు? ఈ ప్రశ్నలు మనందరిని నిలదీస్తున్నయిపజావూపతినిధులు యాభై ఏళ్ల కిందటే ఇలా ఢిల్లీకి వెళ్లవలసి ఉండే. బచావత్ ట్రిబ్యునల్‌తో కొట్లాడవలసి ఉండే.

పాపం బచావత్ మహబూబ్‌నగర్ గురించి ఎవ్వరూ ఏమీ అడగడం లేదని దయదలిచి జాలిపడి జూరాల ప్రాజెక్టును తన అవార్డులో చేర్చాడు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగిన ఒప్పందంలో పాలమూరు నీళ్ల గురించి ప్రస్తావన ఎందుకు లేదు? అరవైలలో జరిగిన ఉద్యమంలో పాలమూరు ప్రజలను చైతన్యవంతులను ఎందుకు చేయలేదు? అలా చేయకపోవడం అప్పటి ఉద్యమ వైఫల్యం. సరే నదులలో నీళ్ల వాటా రాకున్నా, ఉన్న సహజ జలవనరులు ఎందుకు విధ్వంసమయ్యాయి? చెరువులు, కుంటలు, వాగులు, బావులు ఏమైనట్టు? లేనిదానికి కొట్లాడకపోయినా, ఉన్నవాటిని రక్షించుకోకపోవడం ఒక తెలివిహీనత. పాలమూరు మెట్ట ప్రాంతం కావడం వల్ల చెరువులకు, కుంటలకు చాలా అనువైన ప్రాంతం. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చెరువులు ఉండేవి. ఒక్కొక్క చెరువు వెనక ఒక కథే ఉన్నది. కొన్ని చెరువుల నిర్మాణానికి ప్రాణత్యాగాలు చేశారనే కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైనా, కాకున్నా జనంలో ఈ కథల ప్రాచుర్యం చెరువుల ప్రాధాన్యాన్ని చాటుతుంది. ఈ మొత్తం అభివృద్ధి క్రమక్షికమంగా విధ్వంసమౌతూ, భారీ నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యం పెంచుతూ వచ్చారు.


కోస్తాంవూధకు ఉండే నైసర్గిక స్వభావం వల్ల భారీ ప్రాజెక్టుల అవసరం వాళ్లకు ఎక్కువ. అక్కడ కుంటలు, చెరువులు, బావుల నిర్మాణం చాలా కష్టం. అందుకే 1baba52లో కృష్ణా, గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టి బ్రిటిష్‌వాడు ఆ ప్రాంతా న్ని అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధి అనుభవంతో విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత నిధులను భారీ నీటి పారుదలకు కేటాయిస్తూ, నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అదే క్రమంలో చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ప్రాంతీయ అసమానతలు ఇంత పెద్ద ఎత్తున పెరిగేవి కావు. దీనికి తోడు ‘హరిత విప్లవం’ నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఒక శాపంగా మారింది.

ఈ వ్యవసాయక మార్పు సంపూర్ణంగా, సమృద్ధిగా నీళ్లు ఉండే ప్రాంతానికి మాత్రమే ప్రయోజనం. పోనీ నీటి వనరులు తక్కువున్న ప్రాంతం పంటల ను, జల వనరులను, వందల సంవత్సరాల వ్యవసాయ పద్ధతులను కాపాడి, దేశీయ విజ్ఞానం ఆధారంగా వీటిని మెరుగుపరిచే బదులు, వెనుకబడిన ప్రాంతాల వనరులతో సంబంధం లేకుండా, అన్ని ప్రాంతాలలో ‘హరిత విప్లవాన్ని’ ప్రోత్సహించడంతో, వేల సంవత్సరాలుగా తెలంగాణ పండిస్తున్న జొన్నలు, సజ్జలు, తైద లు, వేరుశనగ, ఆముదం, కందులు లాంటి పంటలు క్రమేణా క్షీణిస్తూ వచ్చాయి. హరితవిప్లవంతో దిగుమతి చేసుకున్న కొత్త వంగడాలు ప్రవేశపెట్టడంతో, చెరువులు, కుంటలు, బావుల స్థానంలో, వినాశనకరమైన బోరుబావులు రావడంతో పాలమూరు రైతుల పరిస్థితి మరింత దీనంగా మారింది. రాజకీయ, ఆర్థిక చైతన్యం లేకపోవడం వల్ల వస్తున్న మార్పులను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల, వందల సంవత్సరాల తమ సమష్టి వ్యవసాయక అనుభవం రైతులకు నిరుపయోగమైపోయింది.

ప్రతి అవసరానికి రైతు మార్కెట్లకు పరిగెత్తే పరిస్థితి ఏర్పడడంతో, పంటలకు సరైన ధరలు రాకపోవడంతో, గ్రామీణ జీవనం విచ్ఛిన్నమౌతూ వచ్చిం ది. ఈ విచ్ఛిన్నం నుంచే భారీ నీటి ప్రాజెక్టులు తమకూ కావాలనే డిమాండ్ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో పెరిగి, 1960లో ఉద్యమంలో లేని రాజకీయ అవగాహన 21వ శతాబ్ద తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ముందుకువచ్చింది.
ఈ జిల్లాలో ఉండే చెరువులు, కుంటలు ఎలా విధ్వంసమయ్యాయో జడ్చర్ల పట్టణంలోని ఊర చెరువు, అంతకుమించి పట్టణానికి ఐదు కిలోమీటర్లలో ఉన్న అద్భుతమైన మీనాంబరం వాగును చూస్తే చాలు. తెలంగాణ ఉద్యమకారులందరూ పాలమూరు జిల్లాకు వెళితే ఈ రెండు ప్రదేశాలను చూస్తే చాలు. అరవై ఏళ్ల రాజకీయ, ఆర్థిక ‘అభివృద్ధి’ ఏమిటో? దాని విషరూపమేమిటో అర్థమవుతుంది. నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని పాలమూరు వ్యవసాయం మరింత విధ్వంసం కావడానికి కారణమై ఆత్మహత్యల దాకా చేరుకుంది.

దీనితోపాటు ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది. ఒక మధ్యతరగతికి చెంది న విజయ్‌కుమార్ అనే కాంట్రాక్టర్ (కోస్తాంధ్ర కాంట్రాక్టర్) కోటీశ్వరుడు కాగలిగాడు. ఆయన చేసిన విధ్వంసానికి ప్రతీకగా ఆయన తల్లిదంవూడుల విగ్రహాలను జడ్చర్ల దగ్గర ప్రతిష్టించాడు. ఇలాంటి విగ్రహాల మీద ఆగ్రహాలు ఉండడం సహజం. ఇసుక తరలింపులో భూగర్భ జలాలు పాతాళానికి పోవడంతో బోరుబావులు 400-500 అడుగుల దాకా చేరడంతో వ్యవసాయం అసాధ్యమైపోయింది.

మీనాంబరం వాగును చూడడానికి మిత్రుడు పాలమూరు అధ్యయన వేదిక నాయకులలో ఒకరు యాదగిరితో కలిసి వెళ్లాం. యాదగిరి అలియాస్ ఉదయమిత్ర ఆక్టివిస్టే కాదు, రచయిత, కవి, అధ్యాపకు డు. ఆయనకు తోడు జడ్చర్లలో ఈ అంశాల పట్ల ఆందోళన చెందుతున్న కొందరు యువకులు, పౌరు లు ‘వనరుల సంరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేసి జంగ య్య కన్వీనర్‌గా, రవిశంకర్ కో-కన్వీనర్‌గా పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.

మీనాంబరం వాగుతో పాటు జడ్చర్ల ఊర చెరువు ఎలా దురాక్షికమణలకు గురైందో, చెరువు శికంలో కట్టడాలు ఎలా వచ్చాయో చూపించారు. నగరం నడి ఒడ్డున ఉండి మొత్తం పట్టణానికి ప్రాణాధారంగా ఉండే ఈ చెరువు తమ కళ్లముందే విధ్వం సం అవుతూ ఉంటే, జడ్చర్ల, బాదేపల్లి ప్రజలు ఎందుకు మాట్లాడలేదో? ప్రజావూపతినిధులు ఎందుకు పట్టించుకోలేదు?

ఇప్పుడు మీనాంబరం వాగులో కొనసాగుతున్న ఇసుక తరలింపును చూస్తే, భూకంపం వస్తే పడి ఉన్న శవాల వలె వందల ఏళ్లుగా ఎదిగిన మహావృక్షాలు కూలిపడి ఉన్నాయి. వాగును తవ్వుతూ తవ్వుతూ వాగు ఒడ్డున ఉన్న దేవాలయం పునాదుల దాకా వచ్చారు. ఇంకా ఒక్క ఇంచు తవ్వినా గుడి కూలిపోతుంది. ప్రజలను దేవుడే రక్షించాలి అన్నట్లు దేవాలయం ఇసుక తవ్వడానికి అడ్డుపడింది. నూతన ఆర్థిక విధానం ఎంత దుర్మార్గమైందంటే అది గుడిని, గుడిలోని లింగాన్ని మింగగలదు. ఆ లింగాన్ని మింగి స్వాముల నోటి లో నుంచి బయటికి తీసి మళ్లీ ప్రజలను నమ్మించగలదు. ఆ స్వాముల ఆశీస్సులు కాంట్రాక్టర్లకు ఎలాగూ ఉంటాయి. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినదని ఇప్పటికీ వేలాదిమందితో జాతర జరుగుతుందని అన్నప్పుడు, దేవుడి విగ్రహాన్ని కళ్లుమూసుకుని భక్తులు చూడాలనే పద్ధతి ఎందుకు వచ్చిందో అర్థమౌతుంది.

తెలంగాణ ఉద్యమ లక్ష్యం భౌగోళిక తెలంగాణ కాక ప్రజల నిత్య జీవిత సమస్యలు కూడా ముందుకు రావాలి. నీటి వనరుల రక్షణ సమస్య కీలకం కావాలి. ప్రతి చెరువు, కుంట, వాగును రక్షించుకోవడానికి, పునరుద్ధరించుకోవడానికి కమిటీలు ఏర్పడాలి. ఈ దిశగా కృషి చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఇంకా ఒక అడుగు ముందుకువేసి ఈ విధ్వంసం వెనక ఉన్న సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను ప్రశ్నించగలిగితే ప్రజల చైతన్యస్థాయి మరింత ఉన్నతస్థాయికి ఎదిగి ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్ష సాకారం కావడానికి దోహదపడుతుంది.

పొఫెసర్ జి. హరగోపాల్
35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

Featured Articles