విజయమ్మ దండయాత్ర


Wed,July 25, 2012 11:52 PM

Vijjay talangana patrika telangana culture telangana politics telangana cinemaవిజయమ్మ సిరిసిల్ల ‘సాహస’ యాత్రకు స్పందించడం కొంత వ్యక్తిగత ఇబ్బందితో కూడుకున్న అంశమైనా,ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగవలసిన అవసరముంది. రాయలసీమ ముఠా రాజకీయాల గురించి కాని, లేక రాజశేఖర్‌డ్డి కుటుంబపరంగా వస్తున్న ఫ్యాక్షనిజం గురించి కాని, దానితో ముడిపడి ఉన్న హింస, మనుషులు ఒకరికొకరు నిర్దాక్షిణ్యంగా చంపుకోవడంపై కథలు కథలుగా చెప్పుకునే కథనాన్ని ఇక్కడ చర్చించడం లేదు. ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం ఈ ఫ్యాక్షనిజాన్ని గురించి లోతుగానే పరిశీలించి ప్రచారం చేసింది. ప్రచారం చేసేప్పుడు బాలగోపాల్ చాలా పబ్లిక్ మీటింగ్‌లలో రాయలసీమ ప్రజలు ఫ్యాక్షనిజాన్ని, ఫ్యాక్షనిస్టులను అసహ్యించుకోవాలని పదేపదే చెప్పేవాడు. అసహ్యించుకోకపోతే దాని సాధికారత కొనసాగుతుందని, ప్రజలు ఆ విష వలయం నుంచి తప్పుకోలేరని చెప్పేవాడు.

ఈ మొత్తం హింసలో మహిళల ప్రత్యక్ష పాత్ర చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో మహాభారతంలో ద్రౌపది చేసిన ప్రతిజ్ఞలా మహిళలు చేశారని వినికిడి ఉంది. అయితే ఈ విషయాలు విజయమ్మకు పూర్తిగా తెలుసో లేదో తెలియదు. మొత్తంగా విజయమ్మ రాజశేఖర్‌డ్డి సతీమణిగా, జగన్మోహన్‌డ్డి తల్లిగా ఒక అనివార్య పరిస్థితిలో రాజకీయ జీవనంలోకి నెట్టబడింది. నిజానికి ఆమె కూతురు షర్మిలా బాగానే మాట్లాడుతుంది. ఆమెకు అవకాశమిస్తే నాయకురాలిగా ఎదిగే అవకాశముంది. కానీ ప్రియాంకగాంధీని ఎలా క్రియాశీల రాజకీయాల్లోకి రానివ్వడం లేదో ఈమె పట్ల కూడా అదే వైఖరి ఉంది. విజయమ్మ చెప్పిన మాటలు ఆమె తనయుడు వింటా డో లేదో కాని ఆయన సలహాల మేరకు ఆమె రాజకీయ పాత్రను నిర్వహిస్తున్నా రు. తల్లికి పిల్లల మీద సహజంగానే ప్రేమ ఉంటుంది. బైబిల్ ప్రకారం దారి తప్పిన వాడిమీద శ్రద్ధ ఎక్కువుంటుంది. కాని పరకాలలో కాని, సిరిసిల్లలో కాని పర్యటించేప్పుడు సమస్యలేమిటో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఆ సమస్యల పట్ల రాజశేఖర్‌డ్డి వైఖరి ఏముండేదో సరిగ్గా తెలియకపోతే సిరిసిల్లలో ఎందుకు అంత ప్రతిఘటన వచ్చిందో ఆమెకు పూర్తిగా అవగాహన కాకపోచ్చు.

ప్రభుత్వం తన ప్రయోజనం కోసమని, సమైక్యవాదాన్ని ఈ పద్ధతిలో తెలంగాణలో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే లేదు అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నది. పరకాలలో, సిరిసిల్లలో స్థానిక నాయకత్వాలకు ఇతర ప్రయోజనాలున్నా యి. ఈ రెండు పర్యటనలు తెలంగాణ గురించి వై.ఎస్.ఆర్. పార్టీ వైఖరి స్పష్టమై న ప్రకటన ఇప్పించలేకపోయాయి. ఈ మొత్తం రాజకీయ ప్రక్రియలో కొందరు తెలంగాణ నాయకులు ప్రజల ఆకాంక్షల ను కాదని ఇతర ప్రాంత నాయకత్వం మీద ఎంత ఆధారపడి ఉన్నారో మరొకసారి రుజువు అయ్యింది. తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షను సమీకరించడంలో తెలంగాణ ఉద్యమం ఎంత సఫలమయ్యిందో, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ప్రభావితం చేయడంలో అంత విఫలమయ్యింది. ఉద్యమ ప్రజాస్వామ్య సంస్కృతికి ‘ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యా’నికి ఎంత అంతరమున్నదో మరోసారి స్పష్టమయ్యింది.

విజయమ్మ సిరిసిల్ల చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి , వాళ్ల బాధలను అర్థం చేసుకోవడానికని వెళ్లామని అంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్య సానుభూతితో పరిష్కారమయ్యే సమస్య కాదు. అది ఒక సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనా అల్లిన విష వలయం. ఇది ఒక చేనేత కార్మికుల మీదే కాదు, దాదాపు అన్ని చేతి వృత్తులు అలా విధ్వంసం అయ్యాయి. సామ్రాజ్యవాద విషవలయం నుంచి చేనేత కార్మికులను కాపాడడానికి సానుభూతి సరిపోదు. అభివృద్ధి నమూనా మూలాలను ప్రశ్నించాలి. అలా ప్రశ్నించాలంటే బలమైన ప్రజా ఉద్యమం కావాలి. తెలంగాణ ఉద్యమానికి సామ్రాజ్యవాదం మీద స్పష్టమైన వైఖరి ఉన్నా లేకున్నా ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల ఆకాంక్షల వెనక అభివృద్ధి నమూనా మీద ఆగ్రహం ఉన్నదనేది చాలా స్పష్టం.

దానికి విజయమ్మ ఏం చేయగలరో తెలియదు.ఒక రాజకీయ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సిరిసిల్లకు వెళ్లి మాట్లాడే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలా వద్దా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవలసి ఉంది. సమాధానం కాకున్నా కనీసం చర్చించవలసిన అవసరం ఉంది. ఈ ప్రశ్న పరకాల ప్రభాకర్ పదే పదే అడుగుతున్నాడు. సమైక్యవాదాన్ని గురించి హైదరాబాద్‌లో మాట్లాడే హక్కు లేదా, పౌరహక్కుల ఉద్యమం ఈ మాట్లాడే స్వేచ్ఛను కాపాడాలి కదా అని నాతో వాదించాడు. నిజమే మాట్లాడే స్వేచ్ఛ అందరికి ఉండాలి. తెలంగాణవాదులకు ఆంధ్ర ప్రాంతంలో, సమైక్యవాదులకు తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటే బావుండేది.

కాని ప్రజాస్వామ్యం అంత పరిణితి చెందలేదు కదా. ఒక సందర్భంలో పాలమూరు కరువు మీద ఒకరోజు ధర్నా చేసి ఎన్నికలలో రాజకీయ నాయకులను పాలమూరు సమస్యలపై నిలదీయం డి అని ప్రజలకు చెప్పడానికి అనుమతి కోరితే ప్రభుత్వం దాన్ని తిరస్కరిస్తే బాలగోపాల్ హైకోర్టులో లంచ్‌మోషన్ మూవ్ చేసి కోర్టు నుంచి అనుమతి ఇప్పించాడు. తెలంగాణ ప్రజల నిరసనల మధ్య ఇంత పోలీసు రక్షణ కల్పించి విజయమ్మ మాట్లాడే హక్కును కాపాడిన ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సమస్యలను చెప్పుకోవడానికి హైదరాబాద్ వస్తే అర్ధరాత్రి వాళ్లను, వాళ్లతో పాటు పౌరహక్కుల నాయకులను అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు మాట్లాడే హక్కు ఉందా లేదా అన్న ప్రశ్నకు మన రాష్ట్ర పోలీసులు మాట్లాడే స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్లు జవాబు చెప్పాలి. వాళ్లు ఒకవేళ శాంతిభవూదతల సమస్య అని అంటే, విజయమ్మ యాత్ర శాంతియుతం గా, భద్రతగా జరిగిందా? ప్రభుత్వం పాటిం చే విలువలలో, ప్రమాణాలలో సార్వజనీనత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమాత్రం లేకపోవడం వల్లే రాజ్యాంగం కల్పించిన మాట్లాడే హక్కు ఇప్పుడు పోలీసుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది.

ఇక పులి రాజకీయ సంస్కృతి గురించి మాట్లాడితే చిట్టా చాలా విప్పవలసి ఉంటుంది. కడప లోపలి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాలంటే కడప దాటే మాట్లాడాలి. కడప లోపల అంతా గప్‌చిప్. ముఠాలుగా విడిపోయిన గ్రామాల్లో ఒక రాజకీయ పార్టీ మరొక ముఠా గ్రామానికి వెళ్లడం నిషేధం. అది ఉల్లంఘిస్తే మరణదండన కన్నా తక్కువ శిక్ష ఉండదు. ఈ అంశం మీద బహుశా మానవ హక్కుల వేదిక జయ శ్రీ కంటే ఎక్కువ ఎవరికి తెలిసి ఉండదు. ఆమెకు రాయడం, పబ్లిక్ లెక్చర్స్ ఇవ్వడం అలవాటులేకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికే చాలా నష్టం జరిగింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రజాస్వామిక హక్కు కోసం రాజీలేని సాహస పోరాటం జయశ్రీ చేస్తున్నది. జయశ్రీ విజయమ్మలా తిరిగితే రాజ్యం ఇంత రక్షణ కల్పిస్తుందా? ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ పులి రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత లేదేమో అనిపిస్తుంది. విజయమ్మ జయశ్రీని కలిసి చర్చిస్తే కొంత ప్రయోజనకరంగా ఉండవచ్చు.

అయితే విజయమ్మ మహిళగా రాయలసీమ రాజకీయాలలో ఎదిగితే, బయటి అనుభవాన్ని నిశితంగా పరిశీలిస్తే, కడపలో ప్రజాస్వామ్య ఆచరణను గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే బహుశా ఆమెకు చాలా ఆశ్చర్యకరమైన, ఊహించని కొన్ని నిజాలు అర్థం కావచ్చు. దారితప్పిన తన కొడుకు భవిష్యత్తే కాకుండా లక్షలాది మంది పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే రాయలసీమకు, కడపకు, ముఖ్యంగా పులి కొంత మేలు జరగవచ్చు. ఇలాంటి యాత్రలు ఏవైనా ప్రజల అభిమానం మధ్యన జరగాలి. కానీ పోలీసుల తుపాకుల రక్షణతో కాదు.

పొఫెసర్ జి. హరగోపాల్


35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల