జయశంకర్‌లేని తెలంగాణ


Thu,June 21, 2012 12:45 AM

జయశంకర్ మరణించి అప్పుడే ఒక్క సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల్లో పరకాల ఎన్నికలు, వాటి ఫలితాలు లోతుగా చర్చించవలసిన ఒక అంశ మే. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో జగన్మోహన్‌డ్డి గెలుస్తాడని ఊహించిందే. రాజకీయ సాంఘికశక్తుల పునరేకీకరణ జరుగుతున్నదని, పాల క వర్గాలలో అధికారం, సంపద, పంపిణీ విషయాల్లో ఘర్షణ కొంచెం తీవ్రస్థాయికే చేరుకుందని చాలా సందర్భాల్లో చెప్పే ఉన్నాం. రాజకీయ అధికారానికి అక్రమ సంపాదనతో ఎదిగిన మాఫియాయే సామాజిక పునాది, మాఫియా యువతే రాజకీయకార్యకర్తలు. ఏ పార్టీకి కూడా స్వతంవూతంగా, పార్టీ మీద, పార్టీ విధానాల మీద గౌరవముండి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు లేరు. పై నుంచి కిందిదాకా అక్రమ సంపాదనతో వాటాదారులే రాజకీయ ప్రక్రియకు కీలకశక్తులు. ఇది 80వ దశాబ్దంలో పుట్టి, 90లలో చాలా పెరిగింది.

రాజశేఖర్‌డ్డి ఈ మాఫియాను చాలా జాగ్రత్తగా పెంచి పోషించాడు.తన పీఠాన్ని అధిష్ఠానం ఎప్పుడు ముట్టి నా రాష్ట్రవ్యాప్తంగా శాంతిభవూదతలను విచ్ఛిన్నం చేసేవాడే. అది వాళ్లకు రాయలసీమ ముఠా రాజకీయాల నుంచి వచ్చిన వారసత్వం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఈ మాఫియా మీద ఆధారపడ్డవారు. కొందరైతే మాఫియాగా ప్రారంభమై మంత్రులుగా ఎదిగారు. ఇందులో తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు. అట్లా మాఫియా సంస్కృతి నుంచి పుట్టిన నాయకత్వమే పరకాలను గత దశాబ్ద కాలంగా పరిపాలిస్తున్నది. కొండా మురళి కుటుంబం పేరు చెపితే వరంగల్‌లో చాలా నిజాయితీగా జీవిస్తున్న వారు కూడా భయపడడం చూసి ఒక దశాబ్ద కాలం వరంగల్‌లో పనిచేసిన నాకే ఆశ్చర్యం వేసింది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణను ఈ మాఫియా సంస్కృతి నుంచి కాపాడింది అని నేను గాఢంగానే నమ్ముతున్నాను. మానుకోట సంఘటన తర్వాత ఈ నమ్మకం మరింత బలపడింది. అయితే మొత్తం తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసి, నేను పాల్గొన్న సభలలో ఒక్క పరకాలలోనే కొండాసురేఖ సభ జరగనివ్వలేదు. వేలమంది నుంచి నిరసన వచ్చినా, ఎంత నచ్చచెబుదామన్నా ఆమె వినలేదు.సభ జరగలేదు సరికదా, సభ నిర్వాహకులు మా భద్రత గురించి చాలా ఆందోళనపడ్డారు. గూండాలు మా మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చనే ఒక పుకారు కూడా చాలా వేగంగానే ప్రచారమయ్యింది. ఈ సంఘటన తెలంగాణ ఉద్యమానికి ఒక కనువిప్పుగా ఉండవలసింది. చాలామంది ఇప్పటికే పేర్కొన్నట్టు టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల రాజకీయాలు తప్ప తెలంగాణ సమస్యలపై ప్రజలను సమీకరించకపోవడం, తెలంగాణ యువతకు దిశానిర్దేశం చేయకపోవడం వల్ల ఎంత ప్రమాదమో పరకాల మనకు తెలియజేస్తున్నది. అయితే తెలంగాణ ఎన్నికల ద్వారానే సాధ్య ం కాదు. సమాంతరంగా ఉద్యమాలు కూడా ఉండాలని చాలామందే అంటున్నారు. కానీ ఆ ఉద్యమానికి ఏం లక్ష్యముండాలి, జనాన్ని ఏ విధంగా సమీకరిస్తారు, యువతకు ఎలాంటి విలువలు, విశ్వాసాలు ఇవ్వాలి అనే అంశాలపై ఎంత తీవ్రమైన చర్చ జరగాలో అది జరగడం లేదు. తెలంగాణ అనే ఒక అమూర్త లక్ష్యం ప్రజలను కదిలించినా, రాజకీయ నాయకులను ప్రశ్నించే ధైర్యాన్ని ఉద్యమం పూర్తిగా ఇవ్వలేకపోవడం వల్లే, పరకాలలో ‘భయా న్ని’ నివారించలేకపోయింది.

తెలంగాణ రాజకీయ సంస్కృతి గురించి, ఉద్యమధోరణుల గురించి జయశంకర్ నేను చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ సామాజిక విశ్లేషణలో ‘హరగోపాల్‌తో చర్చ చాలా ఉపయోగపడింది’అని ఆయన అన్నప్పుడు నేను కొంచెం ఆనందపడ్డ మాట వాస్తవం. అయితే పార్లమెంటరీ రాజకీయాల్లో చాలా పరిమితులున్నాయని మళ్లీ మళ్లీ అనేవాడు. కొంచెం గట్టిగా వాదిస్తే ‘డాక్టర్ సాబ్ ఉన్న సరుకు ఇది, మనం ఏం చేయగలం’ అనేవాడు. అయితే ప్రజలను నిరంతరంగా ఎడ్యుకేట్ చేయాలి అని మాత్రం సంపూర్ణంగా విశ్వసించేవాడు. అందుకే అలసట లేకుండా ఒక దశాబ్దకాలం తెలంగాణ ప్రాంతం మొత్తం పర్యటించాడు. వందల సభలకు హాజరయ్యేవాడు. చాలా స్పష్టంగా సులభమైన భాషలో అందరికి అర్థమయ్యేలా మాట్లాడేవాడు. తెలంగాణ ప్రజల చైతన్యానికి జయశంకర్ చాలా దోహదపడ్డా, పరకాల ఎన్నికల తర్వాత ఆయన లేని లోటు కొట్టవచ్చినట్టుగా కనిపిస్తున్నది.

జయశంకర్ ఉపన్యాసాలే కాక సమాచారాన్ని సమక్షిగంగా సేకరించడానికి చాలా శ్రమపడ్డాడు. వీలున్నప్పుడల్లా వ్యాసాలు రాశాడు. శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఎందు కు మీరు కమిటీ మీద అంత ఆశలు పెట్టుకున్నారు అని అడిగితే, కమి టీ సరైన సమాచారం లేక తప్పుడు నిర్ణయం చేస్తే అది మన వైఫల్యం అవుతుందని, రాజకీయంగా, సంకుచితంగా వాళ్లు నిర్ణయం తీసుకుంటే అది వాళ్ల తప్పిదమవుతుందని అన్నాడు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దానికి స్పందిస్తూ ‘It is trash’ అంటే చెత్తబుట్టలో వెయ్యవలసిన నివేదిక అని దాని భావం. ఆ కమిటీ ఇచ్చిన తప్పుడు వాస్తవాల మీద వివరంగా రాశాడు, మాట్లాడాడు. దానిపట్ల ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి శ్రమపడ్డాడు.

పరకాల ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నేర్చుకోవలసింది, జయశంకర్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకపోవడానికి, అధ్యయనం, ఆలోచన, ప్రజలతో నిరంతర సంభాషణ అవసరం. ఆవేశంగా మాట్లాడడం, లేని వాగ్దానాలు చేయడం, మనమే తెలంగాణ సాధిస్తాం అని చెప్పడం తగ్గించి, ఉద్యమ అవసరాన్ని, ప్రజల చైతన్యవంతమైన పాత్రను గుర్తుచేస్తూ, సామాన్య ప్రజలు తెలంగాణ ఎందుకు కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. అంటే ప్రజల నుంచి నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే రాష్ట్ర సాధన తర్వాత ఎలాంటి తెలంగాణను కోరుకుంటున్నామో, ఆ తెలంగాణ ఇప్పటి తెలంగాణ కంటే ఎంత భిన్నంగా ఉంటుందో, అంటే భవిష్యత్ తెలంగాణ స్వరూపాన్ని కొంతైనా చెప్పగలగాలి. ఈ విషయంలో జయశంకర్ తనమీదే తాను కొన్ని పరిమితులు విధించుకోవడం ఒక పెద్దపరిమితే. ఈ అం శం గురించి మాట్లాడితే తెలంగాణ రానియ్యండి డాక్టర్ సాబ్ అనేవాడు. బహుశా పరకాల ఎన్ని కల తర్వాత ఆయన మన మధ్య ఉంటే తప్పక ఆలోచించేవాడని నేను అనుకుంటున్నాను.

పరకాలలో ఎందుకు తెలంగా ణ ఉద్యమ ప్రభావం తక్కువున్నదో విశ్లేషించడమేకాక తెలంగాణలో తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాజశేఖర్‌డ్డి పెంచి పోషించిన మాఫియాను మార్చడమెలా, ఎన్నికల రాజకీయాల్లో వాళ్ల పాత్రను పూర్తిగా నివారించగలమా అన్నది ఒక సవాలు అయితే, చైతన్యవంతమైన ఉద్యమంలోకి ఈ మాఫియా యువతను ఎలా తీసుకరావడం, వాళ్లని ఎలా ఎడ్యుకేట్ చేయడం ఎలా అని ఆలోచించాలి. పరకాలలో మాఫియా పాత్రని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. నిజానికి మొత్తంరాష్ట్రంలో మాఫి యా వర్గం, రాజశేఖర్‌రెడ్డి మరణం పట్ల వచ్చిన సానుభూతిని చాలా పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. ఈ సానుభూతి పోతే మరొక జగన్‌మెహన్‌డ్డిని సృష్టించడం అంత సులభం కాదు అని వాళ్లకు తెలు సు. అందుకే రాజశేఖర్‌డ్డి మరణించగానే కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలందరూ జగన్‌మోహన్‌డ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అధిష్ఠానానికి ఇచ్చిన పత్రంలో అందరు సంతకాలు చేశారు.

జగన్‌మోహన్‌డ్డిని ముఖ్యమంవూతిని చేయాలని సంతకాలు చేసిన రోజే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఆత్మహత్యలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ బొందను తామే తవ్వుకున్నారు. ఈ విషయం జయశంకర్ పదేపదే అనేవాడు. తెలంగాణ ముఖ్యమంత్రి పదవే మీకు దక్కుతుంది అని అంటే ఉప ముఖ్యమంత్రి పదవికి ఆరాటపడుతున్నారు అనేవాడు. రాజకీయ నాయకులకు ఒక మంచి తెలంగాణ కావాలనే స్వప్నం, చారివూతక స్పృహ, సమగ్ర సామాజిక అవగాహన లేకపోవడం ఎంత ప్రమాదం. సమాజం తనను తాను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి జయశంకర్ లాంటి అరుదై న వ్యక్తులను సృష్టించుకుంటుంది. తెలంగాణలో ఈ జీవనాడి సజీవంగానే ఉంది. మనం జయశంకర్‌కు ఇవ్వగల నివాళి, పరకాల సంస్కృతి తెలంగాణ అంతా వ్యాపించకుండా జాగ్రత్త పడడమే.

ప్రొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Tue,December 8, 2015 12:04 AM

అట్టడుగువర్గాల ఆత్మీయుడు

నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంత్రాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. ఈ ని

Published: Thu,July 30, 2015 01:59 AM

మార్పుకు కొత్తదారులు, కొత్త పద్ధతులు

-స్వేచ్ఛారావం ఆవిష్కరణ సభ ప్రొఫెసర్ హరగోపాల్ నమస్తే తెలంగాణలో స్వేచ్ఛారావం పేరిట రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంపుటి

Published: Thu,February 12, 2015 03:47 AM

ఢిల్లీ ఎన్నికలు: రూపం-సారం

ఎన్నికల రాజకీయాల్లో వ్యక్తీరింపబడే ప్రజల ఆకాంక్షలకు, మీడియా ద్వారా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రచారం చేస్తున్న వ్యవస్థలకు మధ్

Published: Thu,February 5, 2015 01:02 AM

భావస్వేచ్ఛ వికసించాలి

దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 1948 జనవరి మొదటివారంలో మహాత్మాగాంధీ త న ఉదయం ప్రార్థనా సమావేశంలో మాట్లాడుతూ పోలీసులు స

Published: Thu,January 29, 2015 01:46 AM

పునర్నిర్మాణంలో పాలమూరు భవిష్యత్తు

కాలం కలిసివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావడంతో మహబూబ్‌నగర్ జిల్లా భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. జిల్లా ప్రజలు త

Published: Thu,January 22, 2015 02:19 AM

జీఎన్ సాయిబాబా చేసిన నేరమేమిటి?

ఎనిమిది నెలలుగా జైలు నిర్బంధం లో ఉన్న జీఎన్ సాయిబాబాను ఈ నెల 17న నేను, ఆయన వకీల్ సురేందర్‌గాడ్గిల్ కలిశాం. కలుస్తూనే కొంచెం ఎమోషనల

Published: Thu,January 15, 2015 12:14 AM

గుజరాత్ అభివృద్ధి జాతర!

ప్రపంచంలో అసమానతల గురించి ఎందుకు అంత ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న తీవ్ర వాదానికి, ప్రతిఘటనా ఉద్యమాలకు, హింసకు, ఇప్పుడు అమ

Published: Thu,January 1, 2015 01:19 AM

తెలుగు ప్రజల చరిత్రలో 2014

ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అభివృద్ధికి మనిషి ప్రమాణ

Published: Thu,December 25, 2014 02:01 AM

వెనక్కి నడుస్తున్న చరిత్ర

గత ఆరు నెలలుగా భారతదేశ రాజకీయాల పరిభాష, అధికారపార్టీ బంధు, మిత్రులు చేస్తు న్న, చేపట్టిన పనులతో అభివృద్ధి దశ-దిశ వేగంగానే మారుతున్

Published: Thu,December 18, 2014 02:02 AM

భోపాల్ సదస్సులో విద్యా స్వప్నం

దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నవంబర్ 2న ప్రారంభమైన విద్యా పోరాటయాత్రలు డిసెంబర్ 4న భోపాల్‌లో సమావేశమై చరిత్రాత్మకమైన ప్రకటన చేశాయి.

Published: Wed,December 10, 2014 11:33 PM

చైతన్యానికి ప్రతీక విద్యా పోరాట యాత్ర

ప్రజల చైతన్యానికి విద్యా వ్యవస్థ నిర్మాణానికి మధ్య అగాథం చాలా ఉన్నది. బహుశా అందువల్లే తెలంగాణలో విద్యా పోరాటానికి పెద్దఎత్తున స్ప

Published: Thu,November 27, 2014 01:42 AM

కర్ణాటకలో విద్యాహక్కు ఉద్యమం

పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన సినిసిజం వచ్చేసింది. ఏం జరగదని, ఏం చేసినా లాభం లేదనే నిరాసక్తత పట్టణవాసులను వేధిస్తున్నది. విద్యా కార్ప

Published: Thu,November 20, 2014 01:02 AM

పోరాటంతోనే విద్యాహక్కు

నా అనుభవం మేరకు దేశంలో ఏ మూల చూసినా విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వ్యాపారమయమైన విద్యావిధానం పో

Published: Sat,November 8, 2014 02:03 AM

విద్యాహక్కు పోరాట అనుభవాలు

రెండవ నవంబర్ 2014న దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యాహక్కు జాతీయస్థాయి పోరాటం ప్రారంభమయ్యింది. 18 రాష్ర్టాల్లో పోరాట యాత్ర సాగుతున

Published: Thu,October 30, 2014 12:22 AM

విద్య కోసం ప్రజా ఉద్యమం

పెట్టుబడి జగన్నాథుడి రథచక్రాలకు ఎవ్వరూ అడ్డం వచ్చినా వాళ్ల మీది నుంచిపోతుంది. ఈ రథచక్రాలను ప్రజా ఉద్యమాల ద్వారానే ఎదుర్కొగలం. విద్

Published: Thu,October 23, 2014 01:08 AM

ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తేమిటి?

పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలని తహతహలాడుతున్నారు. ప్రైవేట్ బడులకు పోతేనే చదువు వస్తుందన్న ప్రచారం ఉన్నది. ఆ హ

Published: Thu,October 16, 2014 01:29 AM

నవసమాజం కోసమే సమాన విద్య

తెలంగాణ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి.. జాతీయ స్థాయి ఉద్యమానికి ఖర్చు 15నుంచి 20 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఉద్యమంలో పనిచేస

Published: Fri,October 10, 2014 02:02 AM

స్వేచ్ఛతోనే విద్యా వికాసం

70వ దశాబ్దంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటుకు దేశంలో రెండవస్థానం దక్కింది. ఐదేళ్ల తర్వాత ఈప్రభుత్

Published: Thu,October 2, 2014 02:53 AM

గాంధీ పుట్టినరోజు..

గాంధీ వ్యక్తిత్వంలో ప్రాపంచిక దృక్పథంలో వైరుధ్యాలు లేవని కాదు. కానీ ఇవ్వాళ జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న కొద్దీ గాంధీజీ బతికుంట

Published: Thu,September 25, 2014 02:30 AM

మరో నిద్రలేని రాత్రి..

మొదటి ముఖ్యమంత్రికి చరిత్రలో ఎప్పుడూ ఒక కీలక స్థానముంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు, సమాజానికి ఏ కొత్త విల

country oven

Featured Articles