అన్ని పార్టీల తర్వాతే టీపై కాంగ్రెస్ నిర్ణయం: సీఎం


Thu,January 23, 2014 05:01 AM

హైదరాబాద్: తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం తమ నిర్ణయం ప్రకటించిన తర్వాతే తమ కాంగ్రెస్‌పార్టీ అత్యున్నత విభాగం సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. మా పార్టీ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. తాను సోనియా వల్లే సీఎంను అయ్యానని అయినా కూడా తెలంగాణ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నానో చర్చ పూర్తయ్యాక చెబుతానని పేర్కొన్నారు. దీంతో సభలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి జానారెడ్డితోపాటు టీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. సీఎం సభానాయకుడి హోదాలో తన నిర్ణయం చెబుతున్నారా? లేక వ్యక్తిగతంగా చెబుతున్నారా? స్పష్టం చేయాలని మంత్రి జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా నాయకుడి హోదాలో అయితే తాము అందులో భాగస్వాములం కాబోమని జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు వ్యతిరేకమని సీఎం అనగానే టీఆర్‌ఎస్ సభ్యులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. స్పీకర్ పొడియం ముందు బైఠాయించారు.

256

HARA GOPAL

Published: Mon,February 10, 2014 12:31 AM

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

చ రిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది. సంఘ్ పరివార్ జాతీయత, దేశభక్తిలాంటి నినాదాల ద్వారా వ్యాపించింది. దేశభక్తి అంటే ప్రజలందరిన

Published: Thu,September 27, 2012 12:39 AM

తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30

దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో ర

Published: Thu,September 20, 2012 12:33 AM

నిండమునిగిన వాడికి చలేమిటి?

చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అ

Published: Sat,November 12, 2011 10:50 PM

కాళోజీ బతికుంటే...

చరిత్ర గమనంలో, సమాజ పరిణామంలో వ్యక్తుల పాత్ర ఎంత ఉంటుందనేది నిరంతరంగా చర్చనీయాంశమే. చరివూతను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తు