తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30


Thu,September 27, 2012 12:39 AM

raju3
దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో రాజకీయ పార్టీల జోక్యం ఉన్నా లేకున్నా ప్రజలు ఈ ‘మార్చ్’ను విజయవంతం చేయాలనే దీక్షతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ పార్టీల రంగు రంగు వేషాలతో ప్రజలు విసిగిపోయారు. అయితే 30వ తేదీన ఏం జరగబోతున్న ది అన్నది ప్రభుత్వానికి, ప్రజలకు ఒక పెద్ద సవాలు. ఈ మార్చ్‌కు సహజంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వనంటున్నది. ఇది కొత్త సంగతేం కాదు. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు అణచివేతను భిన్న రూపాల్లో అనుభవించే ఉన్నారు. రాజకీయంగా పరిష్కరించవలసిన సమస్యలను శాంతిభవూదతల సమస్యగా చూడడం వెంగళరావు పాలనతోనే ఆ మాటకు బ్రహ్మానందడ్డి కాలంలోనే ప్రారంభమైంది. అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేయడాన్ని చట్ట, రాజ్య వ్యవస్థ అనుమతించడంతో ఆ యంత్రాంగమే సామాజిక పరిణామానికి ప్రజాస్వామ్య వికాసానికి పెద్ద గుదిబండై కూర్చుంది. ఏ రాజకీయ నాయకు లు గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాలో వాళ్లు హైదరాబాద్‌లో సౌఖ్యాలు అనుభవిస్తూ ప్రజా ఉద్యమాలను ఎదుర్కొనడానికి పోలీసులను ఉపయోగిస్తున్నారు. పోలీసులు కూడా దీన్ని కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజాసమస్యల నుంచి తప్పించుకొని తిరిగినంత కాలం ప్రజా నిరసన భిన్న రూపాల్లో వ్యక్తమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేదా భిన్న ఉద్యమాలు అలాగే నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పౌరహక్కుల సంఘా లు విశ్లేషిస్తూనే ఉన్నాయి. ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాయి. ఈ అవగాహనకు పరాకాష్టగా రాష్ట్రంలో ‘శాంతి చర్చలు’ జరిగాయి. శాంతి చర్చలు చరివూతలో చాలాకాలం గుర్తుండే ఒక ప్రయోగమే. వర్గాలుగా విడిపోయిన సమాజంలో శాంతి చర్చలు ఏమిటి అన్నవారు కూడా తర్వాత కాలంలో ఈ ప్రయోజనపు విశిష్టతను అంగీకరించక తప్పలేదు. శాంతి చర్చల విఫలం నక్సలైట్లకు ఎంత నష్టం చేశాయో తెలియదు. కానీ ‘శాంతి’కి ప్రజాస్వామ్యానికి అది పెద్ద విఘాతాన్ని కలిగించింది.

ఈ పర్యాయం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రెండు కళ్లు, రెండు చెవులు, రెండు నాలుకలు, మూడు ఆలోచనలు బార్లా తెరిచే ఉన్నాయి. కానీ ఒక సమస్యకు రెండు పరిష్కారాలుండవు. ఈ ఉద్యమం ఏ సాధించినా, సాధించకున్నా ప్రజా అవగాహనను, చైతన్యాన్ని పెంచింది. అందుకే మొత్తం దేశంలో తెలంగాణ ప్రాంత చైతన్యస్థాయి, మరే ప్రాంతంలో లేదు, ఉన్నా నాకు తెలియదు. అయితే ఉద్యమంలో, చాలా సందర్భాల్లో పేర్కొన్నట్లు, తెలంగాణ యువత పాటించవలసిన నిజాయితీ, నిబద్ధత ఏ స్థాయిలో ఉండాల్లో ఆ స్థాయిలో లేకపోవడం ఒక లోటే. అయితే సెప్టెంబర్30న తెలంగాణ యువతకు, విద్యార్థి లోకానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో పాస్ కాకపోతే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లే. ఏ ఆశలకు లొంగకుండా నిటారుగా నిలబడగలిగితే, తర్వాత జీవిత కాలమంతా ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా బతకవచ్చు. ఈ చైతన్యం ప్రజా సమీకరణలో, ప్రజలను చైతన్య పరచడంలో విద్యార్థులు, విద్యావంతులు తమ వంతు పాత్రను నిర్వహించవలసి ఉంది.

ప్రభుత్వం ఈ ‘మార్చ్’కు అంత సులభంగా అనుమతి ఇస్తుందన్న నమ్మకం లేదు. అనుమతి ఇస్తే కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం ప్రజాస్వా మ్య సంస్కృతిని కొంత కాపాడినట్టే. అనుమతి ఇవ్వడమే కాక తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా పెంచి పోషించిన గూండాలను, మాఫియాను, అసాంఘిక శక్తులను ‘మార్చ్’ను హింసాయుతం కానీయకుండా చూడగలిగితే లేదా ఆపగలిగితే అది ప్రజాస్వామ్య విజయంగా గుర్తించవలసి ఉంటుంది. అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రకటన కొంత ఆలస్యమైనా ప్రజలు మరికొంత కాలం ఓపిక పట్టవచ్చు. శాంతియుత పద్ధతుల ద్వారా, ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా తమ లక్ష్యాలను సాధించుకోవచ్చనే విశ్వాసమే ప్రజలకు కలిగితే, వ్యవస్థాపక హింస పాత్ర కూడా కొంత తగ్గవచ్చు. ఈ మధ్య కాలంలో భిన్న దేశాల ప్రజల నిరసన వెల్లువ, ఏ హింస లేకుండా నియంతలను అధికార పీఠం నుంచి దించగలిగారు. ఉద్యమాలలోని హింసస్థాయి రాజ్యహింస స్థాయిని బట్టే ఉంటుంది. రాజ్యం ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే, ప్రజలను శాంతియుత ఉద్యమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమౌతాయనే విశ్వాసమే కలిగితే, అది కలిగించగలిగితే జనజీవన స్రవంతి ఒక గంతు వేసినట్లే. ఒకమలుపు తిరిగినట్లే.

సెప్టెంబర్ 30న మార్చ్‌ను అంత ప్రజాస్వామికంగా పాలకులు అనుమతిస్తారని ఆశించడం అత్యాశే. కొందరు స్నేహితులు మీరు మరీ కలలు కనడం మొదలుపెట్టారు అని అనవచ్చు. శాంతియుత ఉద్యమాలను ప్రోత్సహిస్తే, హైదరాబాద్‌లో వేలాది ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నవారు, అక్రమ సంపాదనను కూడబెట్టుకున్నవారికి, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి ‘శాంతి’ పెద్ద శత్రువు. శాంతి మనిషిని తనలోని ‘ఆ మనిషి’ చూడడానికి ఒక అవకాశం. పాలకులకు తమ లోపలి మనిషిని చూసే ధైర్యం ఉండదు. అలా చూడడం చాలా మౌలిక ప్రశ్నలకు దారితీస్తుంది. చివరకు మనం ఎందుకు జీవిస్తున్నాం, జీవితానికి అర్థమేమిటో, ఈ సంపద కూడబెట్టి ఏం చేస్తాం అనే ప్రశ్నలకు దారితీయవచ్చు. అందుకే అమాయకమైన, నిరాడంబరమైన, నిజాయితీగా బతుకుతున్న ఏ మనిషైనా రాజ్యాన్ని భయపెట్టగలడు. అందుకే అలా అడవిలో జీవిస్తున్న ఆదివాసీల మీద యుద్ధమే ప్రకటించారు. ఆదివాసీల జీవన విధానం వలసవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రమాద మే. వాళ్ల జీవన విధానం ఒక దృష్టాంతం గా ఉన్నంత కాలం నూతన ఆర్థిక విధానానికి నిద్రపట్టదు.

రెండవ తరం ఆర్థిక సంస్కరణల పేరు మీద, వృద్ధి రేటు పడిపోయిందని, రెండు దశాబ్దాల ప్రయోగం తర్వాత సంస్కరణలను పునః పరిశీలించే బదు లు వాటిని మునుముందుకు తీసుకు పోవడానికి ప్రపంచ పెట్టుబడికి ఏజెంట్ అయిన చిదంబరం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా కీలక సమయంలో బ్రేక్ వేయవలసిన సోనియాగాంధీ ఈ సంస్కరణలకు తన పూర్తి మద్దతును తెలిపారు. భవిష్యత్ ప్రధాని అని తలుస్తున్న రాహుల్‌గాంధీ అవగాహన ఏమిటో తెలియదు. అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. సంస్కరణలు ముందుకుపోయినకొద్దీ జరగబోయేది ప్రమాదమే. ఈ పర్యవసానాన్ని గురించి నోబెల్ బహుమతి గ్రహీత జోసె ఫ్ స్టిగ్లిడ్చ్ తన ‘Price For In equality’ అసమానతల మూల్యం. అంటే పెరుగుతున్న అసమానతలకు రాజకీయాలు చెల్లించవలసిన మూల్యా న్ని గురించి వివరంగానే రాశాడు. ఈ రచనలో ‘ఒకరి చేత, ఒకరి కొరకు, ఒక వలన’ జరుగుతున్న పాలన 99 మంది ఆగ్రహాన్ని చూడక తప్పదు. నిజానికి తెలంగాణ మార్చ్‌కు ఇది చారివూతక, రాజకీయ, ఆర్థిక నేపథ్యం. అందుకే సెప్టెంబర్ 30 మార్చ్ ఒక ప్రధానమైన ప్రయోగంగా చూడవలసి ఉంటుంది.

మార్చ్‌ను జరగనివ్వకపోతే ప్రతి పట్టణం, ప్రతిక్షిగామం ఒక ట్యాంక్‌బండ్, ఒక ఇందిరాపార్క్, ఒక అమరవీరుల స్థూప చిహ్నంగా మారాలి. గ్రామక్షిగామంలో మార్చ్ జరగాలి. అవి మీడియా దృష్టికి రాకపోవచ్చు. రావు కూడా. మీడియా చరివూతను విశ్లేషించే సాధనం కాదు. ఇప్పటి సమకాలీన మీడియా చరిత్ర గమనాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయాస పడుతున్నది. చరిత్ర చోదకశక్తులు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు ముక్తకం తెలంగాణ రాష్ట్ర సాధనే కాక, ఒక ప్రజాస్వామ్య మానవీయ తెలంగాణ, దేశానికే ఒక నమూనాగా మార్చడానికి తమవంతు పాత్రను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ చైతన్యమే తెలంగాణ భవిష్యత్తుకు బాటలను వేస్తుంది.

పొఫెసర్ జి. హరగోపాల్

35

HARA GOPAL

Published: Mon,February 10, 2014 12:31 AM

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

చ రిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది. సంఘ్ పరివార్ జాతీయత, దేశభక్తిలాంటి నినాదాల ద్వారా వ్యాపించింది. దేశభక్తి అంటే ప్రజలందరిన

Published: Thu,January 23, 2014 05:01 AM

అన్ని పార్టీల తర్వాతే టీపై కాంగ్రెస్ నిర్ణయం: సీఎం

హైదరాబాద్: తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం తమ నిర్ణయం ప్రకటించిన తర్వాతే తమ కాంగ్రెస్‌పార్టీ అత్యున్నత విభాగం సీడబ్ల్యూసీ నిర్ణయ

Published: Thu,September 20, 2012 12:33 AM

నిండమునిగిన వాడికి చలేమిటి?

చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అ

Published: Sat,November 12, 2011 10:50 PM

కాళోజీ బతికుంటే...

చరిత్ర గమనంలో, సమాజ పరిణామంలో వ్యక్తుల పాత్ర ఎంత ఉంటుందనేది నిరంతరంగా చర్చనీయాంశమే. చరివూతను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తు