నిండమునిగిన వాడికి చలేమిటి?


Thu,September 20, 2012 12:33 AM

walmart
చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పినా మమతా బెనర్జీ తన మద్దతును ఉపసంహరించుకున్నా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదంటున్నది. పోరాడుతూ పోరాడుతూ పోయినా ఫర్వాలేదు అనే మన ప్రధాని, తన పదవికి న్యాయం చేయలేదు అని టైమ్ మ్యాగజైన్ అన్న తర్వాత, ఒబామా స్వయాన భారతదేశం ఆర్థిక సంస్కరణల అమలులో వెనుకబడి ఉన్నదని వ్యాఖ్యానించి న తర్వాత తెలంగాణ భాషలో చెప్పాలంటే, రోషం వచ్చింది. ఇక అగేది లేదు అని అంటున్నాడు. తొమ్మిది, పది సంవత్సరాల పదవీకాలంలో అణు ఒప్పం దం సందర్భంలో కూడా ప్రధాని చాలా మారాము చేశాడు. అదే ప్రధాని విశ్వవిద్యాలయ గ్రాంటు కమిషన్‌కు చైర్మన్ను నియమించలేకపోతున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు. ఎవ్వరైనా అడిగితే తాను అశక్తుడినని అంటూనే కొన్ని ఆర్థిక కఠిన నిర్ణయాలు తప్పవు అంటున్నాడు. ఈభాష తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. అలా కఠిన నిర్ణయాలు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని కాలేజీ సర్వీసు కమిషన్‌ను రద్దు చేసి, విద్యుచ్చక్తి మీద సబ్సిడీ లేదని, అసలు సబ్సిడీలు ఇవ్వడమే తప్పని అంటూ మాబోటి వాళ్ళు ఎవరైనా సలహాలు ఇచ్చినా పట్టించుకొని చంద్రబాబునాయుడి పైన ప్రజలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నా రు. ఎంత కఠినమంటే ఆయన ప్రజలని ఎలా విస్మరించారో, ప్రజలు ఆయనని అలాగే విస్మరించారు. నిజానికి కొన్ని విషయాల్లో చంద్రబాబు, రాజశేఖర్‌డ్డి కంటే కొంచెం మెరుగు. కానీ రాజశేఖర్‌డ్డి ప్రజలకు కొన్ని రాయితీలు కల్పించడం, కొన్ని సంక్షేమ కార్యక్షికమాలు అం దించడం వల్ల ఆయన కుమారుడు జైళ్ళో ఉన్నా ప్రజలకు ఆ కుటుంబం పట్ల కొంత అభిమానం మిగిలే ఉన్నది.

ఇప్పుడు ఎవరు గెలిచినా జరిగేది ఏమిలేదు అనే నిర్ణయానికి వచ్చి దుర్మార్గులలో ఎవరు తమకు కొంత ఉరట కల్పించినా వాళ్ళ పట్ల కొంచెం సానుకూలంగా ఉన్నారు. దీనినిబట్టి ప్రజలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఊహించవచ్చు. ఇది మన రాష్ట్ర అనుభవం. ఈ అనుభవాన్ని రాష్ట్రంలోని ఏ కాంగ్రెస్ ప్రజావూపతినిధి ప్రధానికి చెప్పడం లేదా, లేక ఆయన వినడా, లేక వీళ్ళ ప్రయోజనాలు కూడా చిల్లరవ్యాపారంలో విదేశీ పెట్టుబడులతో ఏమైనా ముడిపడి ఉన్నాయా? అన్నది పెద్ద సందేహమే.
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు కఠిన నిర్ణయాలను తీసుకున్నది. ఒకటి, డీజిల్ ధర పెంపు, రెండు: చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు; మూడు: ప్రభుత్వరంగ సంస్థల నుంచి 15 వేల కోట్ల పెట్టుబడి ఉపసంహరణ- అంటే ప్రజా ఆస్తులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం. అసలే ధరలు పెరుగుతూ సామాన్య ప్రజల జీవితం రోజురోజుకు దుర్భరం అవుతున్న దశలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో మునుగుతుందిరా బాబు అంటే మునిగితే మునుగని అనే వాళ్ళకు చెప్పడం ఎంతో కష్టం. మన్మోహన్ సింగ్‌కు మళ్ళీ ప్రధానమంత్రి అవుతానన్న ఆశలేదు. కానీ కాంగ్రెస్‌పార్టీ కలిసికట్టుగా సామ్రాజ్యవాద నౌకలో మునుగదలచుకుంటే, ఏ గజ ఈతగాళ్ళు వీళ్ళని రక్షించలేరు. పోనీ బీజేపీ ఏమైనా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుందా అంటే, నామమావూతపు వ్యతిరేకత ఎలాగు ఉంటుంది, కానీ ప్రపంచీకరణ విషయంలో, అభివృద్ధి నమూనా విషయంలో వాళ్ళకు ప్రత్యామ్నాయ దేశాభిమాన, దేశభక్తితో కూడిన జాతీయ నమూనా ఏదీ లేదు.

కొత్తగా ఎదుగుతున్న వెనుకబడిన తరగతుల ప్రభావం కలిగిన రాజకీయ పార్టీలకు కూడా ఆర్థిక నమూనా మీద ఎలాంటి అవగాహన లేకపోవడం చాలా పెద్ద విషాదం. ఈ అంశాన్ని గురించి వ్యాసాల్లో ఎన్నిసార్లు రాశానో తెలియదు. ఇలా మళ్ళీ మళ్ళీ రాయడం ఈ అంశాల గురించి ‘నమస్తే తెలంగాణ’ పాఠకులకు చెప్పడానికే. తెలంగాణ ఒక మహో ఉద్యమంలో ఉన్నది. కొత్తరాష్ట్రమే కాదు. కొత్త ఆర్థికనమూనా కోసం పురిటి నొప్పు లు పడుతున్నది. అవుతే ప్రసవంలో వినూత్న శిశువు జన్మిస్తుందన్న నమ్మకం లేదు. వికృతశిశువు కాకుండా ఒక ఆరోగ్యకర శిశువు జన్మించినా తెలంగాణ ప్రజలు తమను తాము అభినందించుకోవచ్చు. ఎందుకో ఈసారి తెలంగాణ ఉద్యమంలో యువకుల నుంచి కొత్త రాజకీయ నాయకత్వం రాలేదు. లేదా రానివ్వలేదు. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎవరైనా ఎదుగుతుంటే తమలో కలుపుకున్నాయి. కొందరిని ఇతర మార్గాల ద్వారా వశపరుచుకున్నారు. అందులోంచి ఎదిగిన కళాకారులకు , కవులకు, గాయకులకు రాజకీయ, ఆర్థిక అంశాలపై అంత లోతైన అవగాహన ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రభావం, అది ఉపయోగిస్తున్న భిన్న పద్ధతుల మీద , వాటి మధ్యన ఉండే అంతర్గత సంబంధాల మీద, వైరుధ్యాల మీద అంతగా అవగాహన ఉండదు. అవుతే ప్రజా చైతన్యం పెంచడం లో వాళ్లు చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆ చైతన్యం కొత్త ఆలోచనా విధానానికి , ప్రత్యామ్నాయ నమూనాల రూపకల్పనకు అంతగా ఉపకరించకపోవచ్చు.

అరుంధతీరాయ్ మావోయిస్టులకు అవకాశం వస్తే వారు ఖనిజ సంపద పట్ల ప్రకృతి పట్ల ఎలాంటి విధానాలను అవలంబిస్తారో అనే ప్రశ్న అడుగుతున్నది. ఈ ప్రశ్న నిజానికి అడగడానికి ఇక ఆ ప్రజల్లోని వారు మిగిలి ఉన్నారనిపిస్తున్నది. వాళ్లే ప్రత్యామ్నాయ జనతన సర్కార్ గురించి మాట్లాడుతున్నారు. అది బీజ ప్రాయంలోనే ఉన్నది. తగిన చర్చ కాని, ప్రచారం కాని జరగలేదు. అయితే వాళ్లు ఇప్పుడున్న నమూనాను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నారు. సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే సాహ సం చేస్తున్నారు. అందుకే భిన్నరంగాలలో దేశవ్యాప్తంగా ఈ రాజకీయాల పట్ల నేను ఊహించని ఆసక్తి పెరిగింది. అందుకే ఆ రాజకీయాలను జాతీయ భద్రతకు పెను ప్రమాదంగా , చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తున్న ప్రధాన మంత్రి భావిస్తున్నాడు.

చిల్లర వ్యాపారం చర్చకు వస్తే పాలకులు ఎందు కు లక్షలాది మంది చిల్లర మనుషుల జీవితాలకు చిల్లులు వేయడానికి సిద్ధపడుతున్నారు అంటే, సామ్రాజ్యవాదం పాలకుల మీద ఎలాంటి మాయజాలాన్ని విసిరిందో అర్థంచేసుకోవాలి. ప్రజలు ఎన్నికలలో ఎవరిని ఎన్నుకుంటున్నారు అనే అంశా న్ని పక్కకు పెడితే, ఒక దేశ ప్రధానమంవూతిగా ఎవ్వరుండాలి దగ్గర నుంచి, ఏ మంత్రిత్వశాఖ ఎవరికి ఇవ్వాలి అనే దాకా ఆదేశాలు వాళ్లే ఇస్తున్నారు. వాళ్ల మనుషులకు వాళ్ల మీడియా ద్వారా కావలసిన ప్రచారాన్ని చేయిస్తారు. లేకపోతే కపిల్ సిబల్ స్వతంత్ర భారతంలో అతి గొప్ప విద్యామంత్రి అనే ప్రచారం ఎలా సాధ్యం? అబ్దుల్ కలాం, ఆజాద్, చావ్లా, హుమాయిన్, కబీర్ లాంటి ప్రముఖులకంటే ఈయన ఎలా గొప్పవాడో! అడిగే వాడేడి? దేశీయ పెట్టుబడి అంతర్జాతీయ పెట్టుబడితో మిలాఖత్ అయిన తర్వాత అంతర్జాతీయ ఆర్థికశక్తులకు మన రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద, ఆర్థిక వనరుల మీద చాలా పట్టు లభించింది. వాళ్ల చదరంగంలో చిదంబరం, కపిల్‌సిబల్ లాంటి వాళ్లు పావులు. వీళ్లు సరిపోరని ఇంకొక ప్రధాన పావును కదుపు తున్నాయి.

పదేళ్ల క్రితం దేశమంతా అసహ్యించుకున్న నరేంవూదమోడీ బీజేపీలోని హేమాహేమీలను పక్కకు నెట్టి పెద్ద నేతగా అవతరిస్తున్నాడు. నరమేధం చేసిన వ్యక్తి చర్యలను ఇంత తొందరగా దేశం ఎలా మరిచిపోగలుగుతున్నదో ఆలోచిస్తే భయం వేస్తున్నది. మీడియా అలసట లేకుండా ఆయన ఇమేజీని పెంచుతున్నది. అందుకే చిల్లర వ్యాపారంలోనే కాదు, ఏ రంగంలో అయినా అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులు రావాలంటే తలుపులు తెరవడానికి పెట్టుకున్న ద్వారపాలకులు మన నేతలు. వీరు నిండ మునిగినా తమ దేవుళ్లు దేవాలయంతో సహా మునగడానికి సిద్ధంగా ఉన్నారు.

- పొఫెసర్ హరగోపాల్


35

HARA GOPAL

Published: Mon,February 10, 2014 12:31 AM

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

చ రిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది. సంఘ్ పరివార్ జాతీయత, దేశభక్తిలాంటి నినాదాల ద్వారా వ్యాపించింది. దేశభక్తి అంటే ప్రజలందరిన

Published: Thu,January 23, 2014 05:01 AM

అన్ని పార్టీల తర్వాతే టీపై కాంగ్రెస్ నిర్ణయం: సీఎం

హైదరాబాద్: తెలంగాణపై అన్ని పార్టీలు నిర్ణయం తమ నిర్ణయం ప్రకటించిన తర్వాతే తమ కాంగ్రెస్‌పార్టీ అత్యున్నత విభాగం సీడబ్ల్యూసీ నిర్ణయ

Published: Thu,September 27, 2012 12:39 AM

తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30

దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో ర

Published: Sat,November 12, 2011 10:50 PM

కాళోజీ బతికుంటే...

చరిత్ర గమనంలో, సమాజ పరిణామంలో వ్యక్తుల పాత్ర ఎంత ఉంటుందనేది నిరంతరంగా చర్చనీయాంశమే. చరివూతను వ్యక్తులు ప్రభావితం చేస్తారా, వ్యక్తు

country oven

Featured Articles