విధానం చెప్పకుండా వితండవాదం!


Fri,August 1, 2014 01:29 AM

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవాళ్ళనుద్దేశించి తెలంగాణ అస్తిత్వ రాజకీయపార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను కాదని వేరే పార్టీ కి ఓటు వేయడం మన ఆత్మగౌరవాన్ని చులకన చేసుకోవడమేనని చెప్పడానికి ఈ కథ చెప్పేవారు. ఆ పార్ట్టీ లో ఉండడం అన్నా, ఆ పార్టీకి ఓట్లు వేయడం అన్నా తమ ఇంట్లో సొంత తల్లిదండ్రుల ఫోటో తొలగించి పక్కింటివాళ్ళ ఫోటో పెట్టుకున్నట్టే అని ఆ పిట్టకథ ద్వారా చెప్పేవారు. ఇది చాలామందిని ఆకట్టుకుంది. ఇలాంటి కథలు అనేకం ప్రజలను టీఆర్‌ఎస్‌వైపు ఆకర్షించాయి.

ప్రజలు నిజంగానే టీఆర్‌ఎస్ పార్టీని సొం తం చేసుకున్నారు. టీడీపీని పరాయిపార్టీగా భావిం చారు. కాబట్టే ఆ పార్టీకి హైదరాబాద్ మినహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సీట్లు, సింగిల్ డిపాజిట్ దాటలేదు.ఆపార్టీలనాయకులను ఎన్నుకుంటే వాళ్ళు సామంతులైపోతారు తప్ప స్వతంత్రులుగా ఉండలేరని, ఆంధ్రా నాయకుల అనుచరులుగా మాత్రమే మిగిలిపోతారని ఆయన తన ఉపన్యాసాల్లో పదేపదే చెప్పేవారు. ఇప్పుడు అదే నిజమవుతున్నది.టీడీపీ నాయకుల కసరత్తు చూస్తుంటే వాళ్ళు స్పష్టంగా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా తమ ఆంధ్రా నాయకులకు అండగా నిలబడుతున్నారు. పోలవరం మొదలు ఫీజు రీయింబర్స్‌మెంటుదాకా దేన్ని తీసుకున్నా ఈ మూడు పార్టీలవైఖరి ఏమిటో, వాళ్ళు ఎవరివైపో అర్థంకాని, అయోమయం తెలంగాణలో నెలకొన్నది.

ప్రజలను తికమకపెట్టడంలో చంద్రబాబు దిట్ట. ఆయన ఒక సమస్య పరిష్కరించడానికి బదులు ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త సమస్యలు సృష్టిస్తుంటాడు. ఆయన సీఎంగా ఉన్న కాలమంతా ఇలాంటి ఎత్తులతోనే కాలయాపన చేశారు. ఇప్పు డూ అదే చేయాలని చూస్తున్నాడు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు.

ఆయన తన రాష్ట్రంలో చదువుతు న్న పిల్లలతో పాటు తెలంగాణ ప్రాంతంలో చదువుతున్నఆంధ్రా విద్యార్థుల బకాయీలు కూడా చెల్లించాల్సి ఉన్నది. ఏపీ ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల్లో ఒక విడత ఇంకా పెండింగులో ఉన్నది. దీనికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల ఒత్తిడి ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రైవేటు కాలేజీల్లో అందరూ కార్పొరేటు వ్యాపారులు కాదు. వారిలో కొందరు నిజాయితీగా దీన్నొక వృత్తిగా మార్చుకున్న వాళ్ళున్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు నడిపించలేమ ని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమని కాలేజీలు అంటున్నాయి. కానీ చంద్రబాబు దీన్ని పట్టించుకోవడంలేదు.

బకాయీలతో పాటు ఈ ఏడాది కాలేజీల్లో చేరేవారికి ఫీజు చెల్లిస్తారో లేదో చెప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టంగానే ఉంది. తెలంగాణ విద్యార్థులందరికీ కచ్చితంగా ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పేరు తో ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా ఎటువంటి విధివిధానాలు ప్రకటించలేదు. పాత బకాయిల విషయంలో పెదవి విప్పడం లేదు. ఇదిలాఉంటే ఆయన పార్టీ శాసనసభ్యులు కొందరు సత్వరమే ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉన్న బకాయిలను చెల్లించాలని రోడ్లెక్కారు!

బకాయిల వసూలుకు మధ్యవర్తులు, సెటిల్‌మెం ట్లు చేసేవాళ్ళు అవసరంలేదు. కాలేజీ యాజమాన్యా లు నేరుగా ప్రభుత్వ అధికారులతో, కుదరకపోతే రెండు రాష్ర్టాల మంత్రులు, ముఖ్యమంత్రులతో మాట్లాడుకొని వసూలుచేసుకోవచ్చు. అక్కడా సమాధానం రాకపోతే కోర్టుకు వెళ్ళవచ్చు. యాజమాన్యా లు ఆ పనిలో ఉన్నాయి కూడా. ఇప్పుడు ఆందోళన లేవదీస్తున్న మధ్యవర్తులు కూడా రెండు ప్రభుత్వాల ను కలిసి నిలదీయవచ్చు. కానీ వాళ్ళు చంద్రబాబు ను పల్లెత్తు మాట అనడంలేదు. ఆంధ్రా సెక్రటేరియట్‌లో అడుగుపెట్టడం లేదు.

టీవీ చానెళ్ళ ముందు, పత్రికల ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారపట్టే ప్రయత్నం చేస్తున్నారు.నిజానికి ఇది ఒక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. ఆంధ్రా కాలేజీల సమ స్య కూడా. రెండు ప్రభుత్వాలు ఎవరెవరి విద్యార్థు లు ఎంతమంది ఉన్నారో లెక్కలు వేసుకుని చెల్లింపు లు చేయాలి. ఆంధ్రాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల పాత బకాయిలను తెలంగాణప్రభుత్వం, తెలంగాణలోని ఆంధ్రా విద్యార్థులకు అక్కడి ప్రభు త్వం చెల్లించాలి. ఈ లెక్కలు సాంఘిక సంక్షేమశాఖ దగ్గర ఇప్పటికే ఉన్నాయి. కానీ బాబుగారు ఆ లెక్క లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణలో చదువుతున్న విద్యార్థుల్లో ఆంధ్రా నివాసధృవీకరణ పత్రా లతో నలభై శాతం ఉన్నట్టు తేలడంతో వాళ్లకు బకాయిలు కట్టలేక కుదేలైపోతున్నారు.

ఆంధ్రా పిల్లల ఫీజులు కూడా తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని కోరుకుంటున్నారు. తన పిల్లలకు పక్కింటి వాడు ఫీజులు కట్టాలని కోరుకుంటే నలుగురూ నవ్విపోతారు.తిట్టిపోస్తారు.అందుకే ఆయన ఆ సంగతి తెలంగాణ తమ్ముళ్ళకు వదిలేశాడు. ఏం ఆశ చూపించాడో కానీ ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు ఆంధ్రా పిల్లలకు తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని, పాత బకాయిలు కూడా మనమే ఇవ్వాలని జులుం చేస్తున్నారు. ఆంధ్రా వాళ్ళ కంటే ఆరాకులు ఎక్కువ చదివిన వీళ్ళ ప్రవర్తన చూస్తే నిజంగానే వీళ్ళు తెలంగాణ వాళ్ళేనా అన్న అనుమానం కలుగుతున్నది.

పాత బకాయిల మాటెత్తకుండా మరోవైపు చంద్రబాబు ఈ ఏడాది కొత్త అడ్మిషన్ల ప్రక్రియకు దొడ్డి దారి తెరిచి రాద్ధాంతం చేస్తున్నారు. కౌన్సిలింగ్ జరగడానికి ముందే ప్రభుత్వాలు ఫీజుల విషయంలో స్పష్టత ఇవ్వాలి, జీవో విడుదల చేయాలి. ఏయే కాలేజీలకు ఫీజులు చెల్లిస్తారో నోటిఫై చేయాలి. ఆ కాలేజీ ల అఫ్లియేషన్ పునరుద్ధరిస్తూ సంబంధిత విశ్వవిద్యాలయాలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. కౌన్సిలింగ్ నాటికి ఇవన్నీ ఉంటేనే అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇదేదీ చేపట్టకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఏయే కాలేజీల్లో ఎటువంటి వసతులున్నాయో పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను బట్టి అన్ని వసతులు ఉన్న కాలేజీలకే అనుమతులు పునరుద్ధరించే విధం గా ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ పని కొనసాగుతున్నందున కౌన్సిలింగ్‌కు మరికొంత సమయం కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో ఒక పిటిషన్ కూడా వేసింది. ఆ విషయంలో కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరింది. ఒకవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఒక ఎత్తుగడగా ఉన్న త విద్యామండలి ద్వారా ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఉన్నత విద్యామండలి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్నది. మండలి కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున అది తెలంగాణకు చెందుతుందని, ఏడాదిలోగా ఆంధ్రా ప్రభుత్వం అక్కడ కొత్త మండలిని ఏర్పాటు చేసుకోవాలని చట్టం చెపుతుంది. అప్పటిదాకా మండలి తెలంగాణ ప్రభుత్వ అజమాయిషీలో ఉంటూ రెండు ప్రాంతాల అవసరాలు తీర్చాలి. కానీ మండలి అధ్యక్ష ఉపాధ్యక్షులు ఇద్దరూ అక్కడివాల్లె కావడంతో వాళ్ళు చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారు.

ఆయన చెప్పినట్టే నోటిఫికేషన్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలు రాకుండానే తెలంగాణ ప్రభుత్వం వద్దన్నా వినకుండా ఎంసెట్ ఎంట్రెన్స్ నిర్వహించిన జేఎన్‌టీయూ అనుమతి లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీల జాబితా లేకుండానే, ఫీజుల విష యం తేల్చకుండానే అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు ప్రకటించారు. ఇది తెలంగాణ విద్యార్థులను గందరగోళపరిచే ప్రయత్నం మాత్రమే కాదు, చట్ట విరుద్ధంకూడా. నిజానికి ఇలా చేసే అడ్మిషన్లు చెల్లవు. కాలేజీలు ప్రభుత్వ అనుమతితో నడుస్తాయి. కౌన్సిల్ ప్రభుత్వం సృష్టించిన కార్యనిర్వాహక వ్యవస్థ మాత్ర మే. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అది ఏ కార్యక్ర మం చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమ ప్రభుత్వం అని కౌన్సిల్ భావిస్తే కేవలం ఆంధ్ర ప్రాంతానికే అడ్మిషన్లు ఇవ్వాలి తప్ప తెలంగాణలో కౌన్సిలింగ్ చేస్తే కుదరదు.

వీటిని ప్రస్తావించకుండా ఆంధ్రా మంత్రులు, మీడియా పదేపదే 1956ను ప్రస్తావిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 1956ను స్థానికతకు ప్రామాణికం చేస్తూ ఇవ్వబోయే ఉత్తర్వులు సవాలు చేస్తామని అంటున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్ 37డీ కి విరుద్ధమని వితండవాదం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక భౌగోళిక ప్రాంతమే స్థానికతకు ప్రామాణికం. ఒక ప్రాంతా న్ని స్థానిక ప్రాంతంగా ప్రకటించుకుని, ఆ ప్రాంతానికి రాయితీలు ఇచ్చుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాల కు ఉంటుందని ఉన్నత న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా రాయితీ మాత్రమే తప్ప హక్కు కాదు.

ఇక 371డీ అంటున్నారు, నిజానికి 371డీ ప్రకారమైతే 15శాతం సీట్లుమాత్రమే ఉమ్మడిగా ఓపెన్‌లో ఉంటా యి. కానీ ఇప్పుడు ఆంధ్రా ప్రాంత విద్యార్థులు అం త కంటే రెండు మూడు రెట్లు అధికంగా తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రా ధృవీకరణ పత్రాల తో ఉన్నవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో 40శాతం ఉన్నారని ప్రభుత్వం అంటున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీకి విరుద్ధంగా 40 శాతం సీట్లు ఆంధ్రా విద్యార్థులకు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు కట్టాలని ఏ న్యాయమూర్తి కూడా చెప్పే సాహసం చేయడు. చేసినా అది న్యాయం కాదు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నది. లోక ల్ పేరుతో సాగుతున్న లూటీ ఆపాలని చూస్తున్నది. కొంత సంయమనం పాటిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో చంద్రబాబు ఆయన తెలంగాణ సామంతులు సాగిస్తున్న ప్రచార ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ghantaపైగా మీడి యా మొత్తం ఇంకా ఏకపక్షంగానే ఉన్నది. కానీ అర్ధసత్యాలే ప్రచారం చేయడానికి అలవాటుపడ్డ ఆంధ్రా మీడియా చంద్రబాబు అసలు ఎత్తులు ఏమిటో తెలియకుండా కథనాలు అల్లుతున్నది. వారంరోజులుగా ఉద్వేగాలు పెంచే ప్రయత్నం మీడియాలో కొనసాగుతున్నది. దీన్ని తిప్పికొట్టాలి. తెలంగాణ విద్యాశాఖామంత్రి ఇప్పటికే ఈ విషయంపై ప్రకటన చేశారు. అలాగే అడ్మిషన్ల ప్రక్రియకు కావాల్సిన ముందస్తు చర్యలు వేగవంతం చేయాలి, ముఖ్యంగా ఫాస్ట్ పథకంలో ఆర్థిక సహాయానికి అవసరమైన మార్గదర్శకాలు త్వరగా పూర్తి చేసి, విద్యార్థులకు స్థానిక నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం జరగకుండా చూడాలి. ఇవన్నీ ఫాస్ట్‌గా జరిగినప్పుడే ఈ గందరగోళానికి తెరపడుతుంది.

1623

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి