1956: ఒక వివాదాస్పద సందర్భం!


Fri,July 25, 2014 05:59 PM

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్లమెంటు ద్వా రా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారం గానీ, అజమాయిషీ కానీ రాష్ర్టాల ఏర్పాటుతో, సరిహద్దుల నిర్ధారణతో ముగుస్తుంది. భారతదేశ అస్తిత్వానికి, సమైక్యతకు భంగం కలగనంత వరకు రాష్ట్ర అంతర్గత పరిపాలన, ప్రాదేశిక ప్రాధాన్యాల్లో తలదూర్చే అధికారం కేంద్రానికి ఉండదు.

అర్ధ దశాబ్దానికి పైగా తెలంగాణ నెత్తిమీద పెత్తనం చేసిన 1956 ఇప్పుడు చాలామందినే అటువంటి అసహనంలోకి నెట్టేస్తున్నది. అది ఇప్పుడిప్పుడే వదిలేటట్టు కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం స్థానికతకు 1956ను ప్రామాణికంగా పరిగణిస్తున్నట్టు అనధికారికంగా వార్తలు రావడంతో సీమాంధ్రశక్తులు అప్రమత్తమవుతున్నాయి.

స్థానికతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏమనుకుంటోంది? హైదరాబాద్‌లోగానీ, తెలంగా ణ ప్రాంతంలో గానీ ఎవరు స్థానికులు అవుతారు అనేది ఎవరు నిర్ణయించాలి? అనేవి ఇప్పుడు ప్రధా న ప్రశ్నలుగా ముందుకు వస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని సీమాంధ్ర అఖిలపక్ష కూటమి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి తమ రాష్ట్రంలో ఎవరు స్థానికులో నిర్ణయించుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండకూడదని వాదించి వచ్చాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ప్రాంతంలోనూ తమను స్థానికులుగానే పరిగణించాలని, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నాయి. దీనికి తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ, టీడీపీ లు వంత పాడుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సమర్థించిన కొందరు ఆద ర్శ మేధావులు కూడా స్థానికతకు ఏది ప్రామాణికం కావాలో చెప్పకుండా 1956 ఎలా ప్రామాణికమని అమాయకంగా అడుగుతున్నారు. ఇది మునుముం దు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే.

పార్లమెంటు ద్వా రా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారం గానీ, అజమాయిషీ కానీ రాష్ర్టాల ఏర్పాటుతో, సరిహద్దుల నిర్ధారణతో ముగుస్తుంది. భారతదేశ అస్తిత్వానికి, సమైక్యతకు భంగం కలగనంత వరకు రాష్ట్ర అంతర్గత పరిపాలన, ప్రాదేశిక ప్రాధాన్యాల్లో తలదూర్చే అధికారం కేంద్రానికి ఉండదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అంతర్గత వ్యవహారాలూ తమ చేతుల్లోనే ఉండాలని నాయుడు కూటమి కోరుకుంటోం ది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కొన్ని నిబంధనలు ఉటంకిస్తూ హైదరాబాద్ పాలన మొత్తాన్ని గవర్నర్‌కు అప్పగించాలని చూస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ ఆధీనంలోకి శాంతి భద్రతలు మాత్రమే కాకుండా రెవెన్యూ కూడా తీసుకురావాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు తాజాగా అఖిలపక్షం ద్వారా స్థానికత ప్రమేయం లేకుండా విద్య, ఉద్యోగాలు కేంద్రం చేతుల్లో ఉండే విధంగా ఒత్తిడి తెస్తున్నారు.

చాలామంది ఈ వివాదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. నిజంగానే చంద్రబాబు విద్యార్థులకు నష్టం కలుగుతోందని అంటున్నాడని నమ్మిన వాళ్ళు కూడా అలా నమ్మించడానికి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. కానీ ఆయన ఆ లేఖలో తెలంగాణలో చదువుతున్న ఆంధ్రా విద్యార్థులకు ఫీజులు తామే చెల్లిస్తామని చెప్పలేకపోయారు. అలా చెప్పివుంటే ఈ పాటికి అడ్మిషన్లు మొదలయ్యే వి. ఆ మాట చెప్పకుండానే ఆయన ఒక బృందాన్ని గవర్నర్ దగ్గరకు మరో బృందాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పంపించి స్థానికత పేరుమీద ఇప్పుడొక కొత్త నాటకానికి తెరతీశారు. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టి హైదరాబాద్‌ను తమ అడ్డాగా మార్చుకోవాలని సీమాంధ్ర పాలకులు చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న వాళ్ళలో అధికారులు చెపుతున్న వివరాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు కనీ సం రెండు లక్షలమంది ఉంటారు.

వీళ్ళంతా సీమాంధ్రకు చెందిన వారిగా స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లు పెట్టి చేరినవాళ్ళు. అక్కడి ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలతో అడ్మిషన్ పొందినవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే స్థిర నివాసం ఉన్నవాళ్ళు. చంద్రబాబును తమ నాయకుడుగా, పాలకుడుగా ఎన్నుకున్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ప్రతి ఏటా ఒక్క ఇంజనీరింగ్ కోర్సులలోనే నలభై వేలమంది దాకా చేరుతున్నారు. మిగిలిన కోర్సుల్లో కనీ సం మరో పదివేలమంది దాకా ఉంటారని అంచనా. ఇట్లా నాలుగేళ్ల కోర్సు కనీస కాలపరిమితి లెక్కేస్తే ఇక్కడ చదువుతున్న ఆంధ్రా విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా వేలకోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తోం ది. ఇప్పుడు ఆ సొమ్మును తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. నేరుగా ఫీజుల సంగతి ప్రస్తావించకుండా, హైదరాబాద్‌ను హస్తగ తం చేసుకోవాలని చూడడంలో భాగంగా స్థానికతను, 1956ను తెరమీదికి తెచ్చి ప్రజలనే కాకుండా గవర్నర్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాలన్న ప్రయత్నం సాగుతున్నది.

తెలంగాణవాదానికి 1956 మాత్రమే ప్రాతిపదిక. ఈ సంగతి తెలంగాణవాదులు అందరికీ తెలుసు. ఇప్పుడు 1956 ప్రస్తావనను ప్రశ్నిస్తున్న వారు చాలామంది విలీనం నుంచే తెలంగాణలో పరాధీన త అధికారికంగా అమలైందని చెప్పిన వాళ్ళే. 1956 విలీనం వివక్షకు దారి తీసిందని, విద్య ఉద్యోగాలు స్థానికులకు దక్కకుండా పోయాయని, ఆంధ్రా వలస వాదంవల్ల తెలంగాణ నీళ్ళు, నిధులు పరాధీనం అయిపోయాయని వాదించిన వాళ్ళే. అది వాస్తవం కూడా. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికే కాదు. తెలంగాణ పరాధీనతకు పునాది వేసిన సంవత్సరం కూడా. ఎవరు స్థానికులు అన్న సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా 1956ను మించిన ప్రామాణికత కనిపించదు. తెలంగాణ ఉద్యమకాలంలో చాలమంది మెర్జర్- డీ మెర్జర్ (విలీనం-విడిపోవడం) గురించి మాట్లాడారు. ఇప్పుడు డీ మెర్జర్ జరిగింది. ఈ సంగతి పక్కనపెట్టి ఇక్కడ పుట్టిన అందరు ఇక్కడి వాళ్ళే అని కొత్త సూత్రీకరణలు చేస్తున్నవాళ్లు బయలుదేరారు.

భారత దేశానికి సంబంధించినంత వరకు ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ స్థానికులు కారు. అలా కావడం లేదు. ఇక్కడ స్థానికత తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలులో ఉన్న చట్టం. తమిళనాడులో ఇప్పుడు ఒక విద్యార్థి స్థానికుడు కావాలంటే వాళ్ళ తల్లిదంద్రులు తమిళనాడులో పుట్టి ఉండాలి. అలాగే మహారాష్ట్రలో కూడా తల్లిదండ్రులు మహారాష్ట్రులు అయితేనే స్థానిక కోటాలో సీటు దొరుకుతుంది. స్థానికేతరులకు ఫీజులు కట్టి చదివించే పద్ధతి మోడీ రాజ్యం గుజరాత్‌తో సహా ఎక్కడా లేదు. కానీ భారతీయ జనతాపార్టీ మాత్రం అలాగే ఉండాలని ఏటా తెలంగాణ ప్రజల సొమ్ములో నుంచి, పన్నులలో నుంచి వేలాదికోట్ల రూపాయలు ఆంధ్రా విద్యార్థుల కు ఫీజులు కట్టాలని అంటున్నది. తెలంగాణ ప్రభు త్వం 1956 ప్రాతిపదిక నిజమే అయితే అంతకుముందు నుంచి తెలంగాణ పౌరులుగా ఉన్నవాళ్లకే స్థానిక రాయితీలు, ప్రయోజనాలు ఉండాలి తప్ప అందరికీ చెందాలనుకోవడం అన్యాయమవుతుంది. అలాగే ఉండాలని బీజేపీ గానీ ఇంకెవరైనా గానీ భావిస్తే బొంబాయిలో ఉన్న లక్షలాదిమంది తెలంగాణ వలస కార్మికులను కూడా అక్కడ స్థానికులుగా ప్రకటించాలి.

ఆ మేరకు శివసేనను ఒప్పించాలి. విభజనకు ముందులాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఆర్టికల్ 371 డీ ఉంటుందని కొందరు దబాయిస్తున్నారు. ఆ ఆర్టికల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిపి ఉంచడానికి తప్ప విడిపోయిన తరువాత కూడా పెత్తనం చేయడానికి కాదు. అయితే ఇక్కడ 1956 తరువాత వచ్చి స్థిరపడిన వాళ్ళ సంగ తి ఏమిటన్నది ప్రశ్న. దీన్ని ప్రభుత్వం స్పష్ట పరచా లి. వాళ్లను స్థానికులుగా పరిగణించి సీట్లు ఇవ్వాలని అడగవచ్చు కానీ వాళ్ళ ఫీజులు కూడా కట్టాలనడం. ఈ వివాదంలో మూడో అంశం ముల్కీ. ఈ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ఉంటే స్థానికులు అవుతారని కొందరు అంటున్నారు. మొత్తం తొమ్మిది ముల్కీ నిబంధనల్లో అది ఒకటి మాత్రమే. అలా 15 ఏళ్లు తల్లిదండ్రులు ఇక్కడే నివాసం ఉండడంతో పాటు, మళ్ళీ తమ ప్రాంతానికి వెళ్ళాలన్న ఆలోచన కూడాపూర్తిగా వదిలేసుకున్న వాళ్ళు మాత్రమే ముల్కీ చట్టం ప్రకారం స్థానికులు అవుతారు.

కానీ హైదరాబాద్‌లో స్థిరపడి ఉన్న చాలామంది హైదరాబాద్‌ను ఒక విడిదిగా చూస్తున్నారు తప్ప తాము ఈ సమాజంలో భాగం అనుకోవడం లేదు. ఇప్పటికి ప్రతి ఎన్నికలకు లక్షలాదిగా తరలి వెళ్లి ఆంధ్రాలో ఓట్లు వేసి వస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా ఉండాలనుకున్నా స్థానికేతరులు ఇక్కడి 15 శాతం సీట్లలో పోటీ పడవచ్చు. తెలంగాణలో కాలేజీలకు సీట్లకు కొదువలేదు. ఇప్పటికే అధికారికంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో 25శాతం మంది స్థానికేతరులు ఉన్నారు. అక్కడ బెంగుళూరులో, చెన్నైలో చదువుకున్నట్టే ఇక్కడ కూడా చదువుకోవచ్చు. కానీ ఫీజులు మాత్రం ఎవరివి వారే కట్టుకోవలసి ఉంటుంది.
1956 తరువాత వలస వచ్చిన వారిలో కొందరు నిజంగానే హైదరాబాద్‌ను సొంతం చేసుకున్నారు. అందులో ఆంధ్రా పేద ప్రజలతో పాటు గుజరాతీలు, బెంగాలీలు తమిళులు, మరాఠీ ప్రజలు ఇట్లా దేశం లో అన్ని ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్‌లో భాగం గా ఉన్నారు.

వారి విషయం ఏమిటని కూడా ప్రభు త్వం ఆలోచించాలి. వారికి కొన్ని సడలింపులు అవసరం అవుతాయి. పైకి కేవలం సీట్ల పంచాయితీలా కనిపిస్తున్నప్పటికీ దీనివెనుక సీమాంధ్ర విస్తరణవాద ఎజెండా ఉన్నది. హైదరాబాద్ నగరం దాని చుట్టూ ఆక్రమించుకున్న భూములు, ఇక్కడి తమ కాలేజీలు, ఇతర వ్యాపార సంస్థలు వాటిని కాపాడుకోవడంలో భాగంగా దీన్ని మరింత ప్రచారం చేసే పనిలో ఈ పార్టీలు ఉన్నాయి. ఈ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. వీలైతే అఖిలపక్షాన్ని పిలిచి వారు ఎవరి పక్షమో తేల్చాలి. ఈ వివాదం ఇప్పుడు సద్దుమణగకపోతే ఇంకో పదేళ్ళ పాటు కొనసాగుతుంది. ఎందుకంటే పదేళ్ళపాటు విద్యాసంస్థల ప్రవేశాలు ఇలాగే ఉండాలని విభజన చట్టం చెపుతోంది. ఈలోగా మరికొందరు స్థానికులు పుట్టుకొస్తారు కాబట్టి వెంటనే సమగ్రమైన విధి విధానాలు ప్రకటించాలి.

ghanta మరింత జాప్యం చేయకుండా ఫీజుల మీద కూడా స్పష్టత ఇవ్వాలి. ఏకాభిప్రాయం కుదిరితే ఆ స్కీం పూర్తిగా ఎత్తివేసి అదే సొమ్ముతో ప్రభుత్వమే కొత్త ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి తెలంగాణ పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలి. మిగిలిన సీట్లను మిగతా రాష్ర్టాల మాదిరిగానే ఆంధ్రాతో సహా ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఫీజుల ఆధారంగా ఇచ్చుకోవచ్చు. అలా కాకుం డా వివాదాన్ని ఇంకా నాన్చితే ఫీజు రీయింబర్స్‌మెం ట్ పథకం చట్టబద్ధం చేయాలని, ప్రభుత్వ ఉచిత విద్య వద్దే వద్దు అనే వాళ్ళుకూడా పుట్టుకొచ్చే ప్రమా దం ఉంది. అలాగే ఆంధ్రా పిల్లలు అందరికీ ఫీజులు తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలి అనే వితండవాదులు కూడా ముందుకొస్తారు.


1604

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి