పొంచి ఉన్న ప్రమాదం


Fri,May 23, 2014 01:17 AM

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలామందిని భయపెడుతున్నాయి. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ శకం మొదలవుతున్నదంటే ఆయన ఆలోచనలు, గతం లో ఆయన పరిపాలనలో గుజరాత్ చవిచూసిన అనుభవాలు తెలిసిన వారికి రానున్న రోజులు ఎలా ఉంటాయో అని ఊహించుకుంటే భయం కలగడం సహజం. అయితే ఆయన రాకతో పులకించిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆయన హిందూ భావజాలాన్ని భారత జాతీయ సాంస్కతికవాదంగా విస్తరించాలని తపనపడుతున్న ఛాంద సవర్గాలు, ఆయన ఆర్థిక సంస్కరణలలలో భాగస్వాములుగా మారి కోట్లకు పడగెత్తాలని కలలుగంటున్న వ్యాపార దళారీ వర్గాలు, దేశం ఎటుపోయినా ఫరవాలేదు, జీతం పెరగాలి, ధరలు తగ్గాలి అని మాత్రమే ఆలోచించే మధ్యతరగతి భద్రజీవులు ఇట్లా వివిధ వర్గాలు ఆయన రాకను ఆహ్వానిస్తున్నాయి.

ఆయన ప్రధాని అవుతున్నందుకు ఆనందిస్తున్నాయి.కానీ ఈ ఆనందం కంటే కొందరు ఆలోచనాపరుల్లో వ్యక్తమౌతున్న భయం ముమ్మాటికీ ఒక ప్రమాద సూచికగానే అర్థం చేసుకోవాలి. ప్రమాదం అంటే వ్యక్తిగతంగా మనకేదో ముప్పని కాదు, లౌకిక పునాదుల మీద నిలబడ్డ ఈ దేశానికి, ఈ దేశపు సామాజిక విలువలకు, ముఖ్యంగా భావ సమైక్యతకు భంగం తప్పదని మాత్రం అర్థం అవుతున్నది. ఈ సంగతిని తెలంగాణ ప్రజలు అందరికంటే ముందే అర్థం చేసుకుని ఆయన అవసరం లేదనుకున్నారు. ఎన్నికల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ఐదు, పార్లమెంటు లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టారు. అంతటి విజ్ఞతను ప్రదర్శించినందుకు తెలంగాణ ప్రజలను అభినందించాలి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కొత్త భయం పట్టుకున్నది. మోడీ తెలంగాణకు మొండిచేయి చూపుతాడని, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారి ఆంధ్రా పక్షపాతిగా ఉంటాడనీ అనుమానిస్తారు.

అధికారం మీద, హైదరాబాద్ మీద అచంచలమైన వ్యామోహం ఉన్న చంద్రబాబు ఏదో కుట్రచేసి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడని, లేదా రెండు రాష్ర్టాలను ఒక్కటి చేస్తాడని అంటున్నారు.దీనికి చంద్రబాబు చపలత్వమే కార ణం. ఆయన అప్పుడే మళ్ళీ 2019కి సంబంధించి న పగటికలలు మొదలుపెట్టాడు. వీలయితే ఆలోపే తెలంగాణకు వస్తానంటున్నాడు. రాజనీతి తెలిసినవాళ్ళు ఎవరూ ఇలా మాట్లాడరు. కొన్ని సందర్భా ల్లో కొన్ని మర్యాదలైనా పాటిస్తారు. కాబోయే ముఖ్యమంత్రులుగా కొంతయినా హుందాగా వ్యవహరిస్తారు. కానీ బాబు గారు అలా చేయలేదు.చింత చచ్చినా పులుపు చావనట్టు తెలంగాణలో కేవలం పదిహేను స్థానాలకే పరిమితమైపోయి అది కూడా హైదరాబాద్‌లో బీజేపీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు వచ్చే అయిదేళ్ళ తరువాత గురించి అప్పుడే మాట్లాడడం అత్యాశ అవుతుంది. చంద్రబాబు డాంబికాలు వింటుంటే కేసీఆర్ పదేపదే చెప్పినట్టు ఆయన నెట్టేసినా సరే ఆంధ్రాకు వెళ్ళేలా లేడు. ముందుగా ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. అక్కడ తెలుగుదేశంపార్టీని గెలిపించినట్టే ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. వేరే రాష్ట్రం వ్యవహారాల్లో వేలుపెట్టడం మంచిది కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. కనీసం తెలంగాణ తెలుగుదేశం నేతలైనా ఆయనకు ఆ విషయం బోధపరచాలి. నిజానికి ఓట్ల వారీగా చూసినా సీట్లవారీగా చూసిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీకి ఉన్న ఆదరణ కంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితినే ప్రజలు ఎక్కువగా ఆదరించారు.

తెలంగాణలో రెండో రాజకీయపార్టీ టీఆర్‌ఎస్ దరిదాపుల్లో కూడా లేదు. కానీ చంద్రబాబు కు జగన్ చాలా చేరువలోనే ఉన్నాడు. రేపటి నుంచి బాబు గారిని నిద్రపోనీయనని ప్రతినబూని మరీ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పక్క చూపు మానేసి ముందు చూపుతో వ్యవహరిస్తే మంచిది.
ఇక పోతే మోడీ తెలంగాణకు నష్టం చేస్తాడా? అంటే ఒక్క తెలంగాణకు నష్టం చేయాలన్న ఆలోచన ఆయనకు ఉండకపోవచ్చు. అలా చేయాలని ప్రయత్నం కూడా చేయడు. అది ఆయనకు చిన్న విషయం ఎందుకంటే ఆయనకు పెద్ద పెద్ద ఎజెండాలు ఉన్నాయి . నిజానికి అవే ఎక్కువ ప్రమాదక రం. ఎవరైనా భయపడాల్సింది వాటి గురించే. ఇప్పుడు దేశంలో ప్రగతిశీల లౌకికశక్తులు భయపడుతున్నది కూడా ఆయన ఛాందసవాద చరిత్ర చూసే. మోడీకి ఛాందసవాద చరిత్ర ఉన్నది. దీన్ని వాజ్‌పేయి ముందు ఛాందసవాది అనుకున్న లాల్ కిషన్ అద్వానీనే ధవపరిచారు. కేవలం మతాభిమానం ఉన్న ఫరవాలేదు, కానీ ఆయనకు పరమత ద్వేషం ఉందన్నది దేశమంతా గుర్తించిన వాస్తవం. గుజరాత్‌లో గోద్రా రైలు ప్రమాదానికి ప్రతీకారంగా (?)వేలాదిమంది అమాయకులను ఊచకోత కోశా రు. దానికి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మోడీ అండతో అల్లరిమూకలు వేలాదిమందిని వేటాడి చంపాయి. స్త్రీలు, పురుషులు, ముసలి, ముతకా తేడా లేకుండా కనిపించిన ప్రతి ముస్లింను చంపేశారు. అల్లర్లలో వెయ్యిమంది దాకా మరణించగా మరో మూడువేలమంది అమాయకులు క్షతగాత్రులై అప్పటి కిరాతకానికి ప్రత్యక్ష సాక్షులుగా మిగిలారు.

కానీ ఈ దేశంలో చట్టాలు, కోర్టులు ఆధిపత్యశక్తుల సాక్షాలు తప్ప అణగారిన వర్గాల ఆక్రందనలు వినవు అనడానికి మనకళ్ళముందే చుండూరు కేసు ఉన్నది. చుండూరు నిందితులను చూసీ చూడనట్టు వదిలేసినట్టే కోర్టులు నరేంద్రమోడీని కూడా వదిలేశాయి. గుజరాత్ మారణకాండకు మోడీ క్షమాపణ కోరలేదు. కనీసం దాన్ని ఖండించలేదు. మీరు జరిగిన దానికి చింతిస్తున్నారా ఆని ఒక విదేశీ విలేకరి అడిగితే అవు ను..! మీడియాను మేనేజ్ చేసుకోనందుకు చింతిస్తున్నానని చెప్పాడంటే ఆయన తలబిరుసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆ తల బిరుసుతోనే ఆయ న తన ప్రచారంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ర్టాలకు వెళ్లి అక్కడి బంగ్లా దేశీయులు వెళ్లిపోవాల్సిందేనని చెప్పారు. ముస్లిం లు ఏ దేశం వారైతే ఆ దేశం పోవలసిందేనని ఆయ న పదేపదే అంటాడు. అలాగైతే ప్రపంచంలో అనేక దేశాల్లో ముఖ్యంగా అరబిక్ దేశాల్లో, గల్ఫ్‌లో ఉన్న మనవాళ్ళ సంగతేమిటి అన్నదికూడా ఆలోచించా లి. అదొక్కటే కాదు మతం మోడీ పాలనలో మౌలికాంశం అయితే ఒక్క తెలంగాణకే కాదు యావత్ భారత దేశానికే పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది.

మోడీ ఆర్థికశక్తులు అక్రమ సంపాదనాపరుల చేతుల్లో కీలుబొమ్మ. ఆయన వెంట అదానీ, అంబానీలు తప్ప ఇంకెవరూ ఉండరనే విమర్శ కూడా ఉండదు. నిజానికి వాళ్ళ మార్కెట్ వ్యూహంలో భాగంగానే మోడీని కూడా ఒక సరుకుగా మార్చివేశారని ప్రచారం తీరు తెన్నులు చూస్తే అర్థమౌతుం ది. ఎలాంటి సరుకైనా సరే సరైన ప్రచారం ఉంటే మార్కెట్‌ను ఆకర్షిస్తుంది అన్నది వ్యాపార సూత్రం. దాన్ని మోడీ మిత్రులు అమలుచేసి నిరూపించారు. పత్రికలు,చానళ్ళు, రేడియోలు, హోర్డింగులు మొద లు సోషల్ మీడియా మొత్తం కొనేశారు.
మోడీ ఎన్నికల ప్రచారానికి బీజీపీ చేసిన మొత్తం ఖర్చు అక్షరాలా ఐదువేల కోట్ల రూపాయలని తెలిసి దేశం ముక్కున వేలేసుకుంటోంది. ఇప్పటి వరకు వ్యాపార ప్రకటనల రంగంలో ఎంత చవకబారు ఉత్పత్తికి కూడా ఇంత ఖర్చు చేయలేదట. ఒక్క హార్డింగ్‌లకే బీజీపీ దాదాపు 2500 కోట్ల రూపాయ లు ఖర్చు చేసిందట. దేశంలో దాదాపు 15వేల హోర్డింగులు పెట్టి ఆ పార్టీ వేలకోట్లు ఖర్చు చేసింది. ఇక పత్రికల్లో ప్రకటనలు కొదువేలేదు.దేశంలోని యాభై ప్రధాన వార్తా పత్రికల్లో (అన్ని భాషల్లో) నలభై రోజులపాటు ప్రకటనలిచ్చి బీజేపీ మోడీని ప్రమోట్ చేసింది.

దీనికోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేసింది. ఇవి కాక ప్రధాన వార, మాస పత్రికల్లో కూడా 250 కోట్లతో కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక టీవీల్లో ఈ ప్రకటనలు తెగ ఊదరగొట్టాయి. అన్ని టీవీల్లో కలిపి రోజుకు రెండు వేల సార్లు మోడీ టీవీ తెరమీద కనిపించాడు. అంటే ఆయన ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారంలోనే ఉన్నాడు. దీనికి ఎంత లేద న్నా రెండు వేలకోట్ల కంటే ఎక్కువే ఖర్చు అయ్యిందని అంటున్నారు. ఇంకా రేడియో, ఫేస్‌బుక్, ఇంటర్‌నెట్, వెబ్‌సైట్‌లలో కూడా మోడీ నిరంతరం దర్శనం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన గత చరిత్రను తెరమరుగు చేయాలన్న ఉద్దేశంతోనే బీజీపీ ఆయనను ప్రతిక్షణం తెర మీద ఉండేలా ప్రచారాన్ని రూపొందించిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

మోడీకి సామాజిక కోణం లేదు. ఆయన దేనికీ చెందడు. ఆయన ప్రచార సరళి చూసిన ఏ ఒక్కరికి కూడా మోడీ సమాజంలో ఎవరివైపో అర్థం కాదు. ఆర్థిక వ్యవస్థ ఎలా మెరుగుపరుస్తారో చెప్పాలని అడిగితే నేను హర్వర్డ్‌లో చదువలేదు, హార్డ్‌వర్క్ చాలు అని చెప్పుకున్నారు. తనకు తానే ఉక్కుమనిషినని కాసేపు సర్దార్ వల్లభ్‌భాయితో పోల్చుకున్నారు. అంబేద్కర్‌ను అసందర్భంగా తలచుకున్నా రు. పేదవాడినని, చాయ్ వాలానని చెప్పుకున్నా రు. చివరకు తనొక బీసీని అని కూడా ప్రచారం చేసుకున్నారు. పటేల్ గురించి ప్రచారం చేసుకున్నప్పుడు పటేల్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలుసు. అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు అంబేద్కర్ హిందూ మత ఛాందసభావ వ్యతిరేకి అని, పొరపాటున కూడా ఆ మతంలో బతకడానికి, కనీసం ఆ మతం లో చావడానికి కూడా ఆయన ఇష్టపడలేదని మోడీకి తెలుసు. అయినా ఆ ఇద్దరినీ వాడుకోవడం వాళ్ళ అటు అగ్రవర్ణాలకు, రైతులు, మోతుబరులకు ఇటు దళితులకు దగ్గర కావొచ్చని వాళ్ళ నామాలు జపించాడు. ఇక తనొక బీసీనని ఆయనకు పుట్టుకతోనే తెలిసి ఉండాలి, ఒకవేళ తెలియకపోయినా కనీసం రిజర్వేషన్స్‌ను, మండల్ కమిషన్ ను బీజేపీ వ్యతిరేకించిన సందర్భంలోనైనా గుర్తుకు వచ్చి ఉండాలి. కనీసం ఇప్పుడు తన పార్టీ మ్యానిఫెస్టో రాసినప్పుడైన బీసీలకు రాజకీయ రిజర్వేషన్‌లు ఇవ్వాలన్న ఆలోచన వచ్చి ఉండాలి. కానీ ఆయనకు ఏఒక్క సందర్భంలో కూడా ఆయనకు తన మూలా లు గుర్తుకు రాలేదు. ఆయన మూలాలు మతంలో ఉన్నాయి. మానవత్వంలో కాదు. అది ఎవరి విషయంలోనైనా ప్రమాదమే.

700

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి