పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!


Sun,May 18, 2014 12:38 AM

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్షంగా చూసిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కూడా. కానీ అది చారిత్రాత్మకం అయినప్పుడు. వ్యాఖ్యా నం అవసరం అవుతుంది, విశ్లేషణ ప్రధానమవుతుంది. వివరణ పనికొస్తుం ది. ఎప్పుడైనా సరే వర్తమాన సామాజిక సందర్భం గుర్తు పెట్టుకోదగినది అయినప్పుడు అది చరిత్రగా నమోదవుతుంది. తెలంగాణ జైత్రయాత్ర చరిత్రలో నిలిచిపోయే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ఇది ప్రజాస్వామ్య పోరాట విజయం. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజా ఉద్యమాలు గెలిచి ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటి అరుదైన విజయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఒక టి. అందుకే ఇది విశ్లేషించదగిన విషయం. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, సాధించిన విజయం అపూర్వమైనది.

తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సాగించిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇందులో రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, పౌరసమాజం మొత్తంగా యావత్ తెలంగాణ సకల జనులు భాగస్వాములై కదిలా రు. నిలబడి పోరాడారు. చివరకు విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం దాదాపు యాభై సంవత్సరాలు అంచెలంచెలుగా ఒక సుదీర్ఘ ప్రస్థానంగా సాగింది. ముఖ్యంగా చివరి దశలో ఒక బలమైన పౌరసమాజ వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ప్రజాఉద్యమాన్ని మూడు సంవత్సరాల పాటు నిలబెట్టి ఒక జైత్రయాత్రగా మలిచింది. ఈ పోరాట కాలంలోనే తెలంగాణ కరదీపికగా నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమయ్యింది. ఆ పత్రిక లో ఘంటాపథంగా వచ్చిన ఉద్యమ వ్యాఖ్యానమే ఈ సంకలనం. నమస్తే తెలంగాణ పత్రిక 2011లో జూన్ 6న ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే దాకా వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఇందులోపొందుపరచడం జరిగింది.

ఘంటాపథం పూర్తిగా ఒక రాజకీయ కాలం. తెలంగాణవాద కోణంలో రాజకీయాలను విశ్లేషించిన కాలం. అలాగని అన్నీ కేవలం తెలంగాణ వ్యాసా లే లేవు. తెలంగాణ ఉద్యమం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, ఉద్యమానికి, తెలంగాణకు పనికొచ్చే ఇతర సమాజాల అనుభవాలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. అయితే చాలావరకు ఉద్యమం మీద, రాజకీయ పరిణామాల మీద తక్షణ వ్యాఖ్యలుగానే ఉంటాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఘంటాపథంగా వచ్చిన వ్యాసాలను ఒకచోట ఉంచడం ద్వారా ఉద్యమ క్రమా న్ని సంకలన పరిచినట్టుగా ఉంటుందని భవిషత్తులో తెలంగాణ ఉద్యమానికి ఆ క్రమంలో మారుతూ వచ్చిన రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒకక్రానికల్‌గా పనికి వస్తుందన్న ఉద్దేశ్యంతో మలుపు మిత్రులు దీనిని పుస్తకం గా ప్రచురించడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. తెలుగు పుస్తక ప్రచురణ రంగంలో ఇటీవలే అడుగుపెట్టిన మలుపు దేశ సామాజిక రాజకీయ చర్చను కొత్త మలుపు తిప్పిన అనేక ప్రతిష్టాత్మక ప్రచురణలను తీసుకువచ్చింది. అటువంటి సంస్థ తెలంగాణ జైత్రయాత్ర ప్రచురించడం ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు కారకులైన మిత్రులు కందాడి బాల్‌రెడ్డి, కొణతం దిలీప్‌లకు కతజ్ఞతలు.
ఉద్యమంగా ఉధతంగా సాగుతున్న సందర్భంలో ఏ తెలంగాణ ఉద్యమ సంస్థలో భాగస్వామిని కాకపోయినా లక్షలాదిమందికి నా మాట వినిపించడానికి తెలుగు మీడియా ఒక వాహిక అయింది.

వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా ఉద్యమశక్తులతో నిరంతరం సంభాషించే అవకాశం నాకు మీడియా కల్పించింది. ఇది నా అవగాహనకు, రచనా వ్యాసంగానికి ఎంతగానో ఉపకరించిం ది. అలాగే నా ఆలోచనలు జనబాహుళ్యానికి చేరే అవకాశం టెలివిజన్ చర్చల ద్వారా కలిగింది. ఘంటాపథంగా సాగిన నా ఆలోచనలకు నమస్తే తెలంగాణ ఒక సరికొత్త వేదికయ్యింది, ఆ పత్రిక ప్రారంభానికి చాలారోజులు ముందే ఆ పత్రిక వ్యవస్థాపకులు కల్వకుంట్ల చద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు నన్ను ఒక కాలం రాయవలసిందిగా కోరారు. టీ న్యూస్‌లో ఒక లైవ్ షోలో నాతో మాట్లాడిన ఆయన మన పత్రికలో వారం వారం మీ విశ్లేషణ ఉండాలి అన్నారు. పత్రిక ప్రారంభ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. శుభాకాంక్షలు చెప్పడానికి సంపాదకులు అల్లం నారాయణ గారికి ఫోన్ చేశాను. అక్కడే ఉన్న కేసీఆర్ గారు ఫోన్ తీసుకుని ఎప్పుడొస్తున్నారు, మీ కాలం వెంటనే మొదలుపెట్టండి అని పురమాయించారు. నిజానికి ఒక రకంగా ఆయన పట్టుబట్టి ఘంటాపథం రాయించారు. వారికి నా ప్రత్యేక కతజ్ఞతలు. అలా మొదలయిన ఈ కాలాన్ని కొనసాగించిన వ్యక్తి అల్లం నారాయణ గారు.

అల్లం జర్నలిజంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా నాకు మార్గదర్శి. మా అనుబంధం మూడు దశాబ్దాల క్రితం కరీంనగర్‌లో జీవగడ్డ పత్రికతో మొదలయ్యింది. అప్పటి నుంచి నేను ఏం రాస్తానో, ఎలా రాస్తానో నారాయణ గారికి తెలుసు, ఆ నమ్మకంతోనే నేను ఏది రాసినా అభ్యంతరం పెట్టకుండా అచ్చువేశారు. అప్పుడప్పుడు వీలు కుదరక రాయకపోయినా కాలం మాత్రం కొనసాగనిచ్చారు. అందుకు అల్లంకు హదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ కాలం కొనసాగడానికి కారణమైన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి, ముఖ్యంగా ఆ పత్రిక సీఎండీ సీఎల్ రాజం గారికి, సీఈవో నాకు ఆత్మీయ మిత్రులు కట్టా శేఖర్‌రెడ్డి, అలాగే సంపాదకవర్గంలోని మిత్రు లు వేణుగోపాలస్వామి, ఆసరి రాజులకు ప్రత్యేక కతజ్ఞతలు. ఘంటాపథం మాత్రమే కాదు ఈ పుస్తక ప్రచురణలో రాజు సహకారం మరువలేనిది. అలాగే మిత్రుడు, జర్నలిస్టు రఘురాములు, మంచి పుస్తకం సురేష్‌లకు నా ధన్యవాదాలు.

ఈ కాలంలోనే కాదు చాలా కాలం నుంచి నా రచనలను చదివి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చే అంత్యంత ఆత్మీయ మిత్రులు కె. శ్రీనివాస్. నేను ఏ రంగం ఎంచుకున్నా వెన్నుతట్టి ప్రోత్సహించే వాత్సల్యం శ్రీనివాస్‌ది. ఆయన నన్ను కొత్తగా పరిచయం చేశారు. శ్రీనివాస్‌కు నా కతజ్ఞతలు. అలాగే నాకు ఆప్తుడు రైతునేస్తం వెంకటేశ్వర్‌రావు, ఈ పుస్తకాన్ని ముందుగా ఆయనే ప్రచురించాలనుకున్నారు. కంపోజ్ కూడా చేసి ఉంచా రు. కానీ మలుపు మిత్రుల కోరిక మేరకు వారికి ఇచ్చేశారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను అభిమానించే ఇద్దరు పెద్దలు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు.

ఆ ఇద్దరూ ఘంటాపథం చదివి అప్పుడప్పుడు అభిప్రాయాలు, అభినందనలు చెపుతూ ఉండేవారు. వారిలో ఒకరు విప్లవకవి వరవరరావు అయితే మరొకరు న్యాయకోవిదులు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గారు. అడిగిన వెంటనే నాలుగు మాటలు రాసిచ్చిన వారిద్దరికీ నా హదయపూర్వక కతజ్ఞతలు. అలాగే ఘంటాపథం పాఠకుల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఒకరు, వారు క్రమం తప్పకుండా చదివి తన అభిప్రాయాలు పంచుకునేవారు. ఇవి నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. వారితో పాటు అనేకమంది ఉద్యమకారు లు, ఫేస్‌బుక్‌లోనో నా బ్లాగ్‌లోనో వారం వారం కాలం చదివి అభిప్రాయాలు పంచుకున్న మిత్రులందరికి హదయ పూర్వక కతజ్ఞతలు. నమస్తే తెలంగాణ పాఠకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
(నేడు ఆవిష్కరణ జరుగుతున్న తెలంగాణ జైత్రయాత్ర
పుస్తకంలోని రచయిత ముందుమాట.)

1158

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి

country oven

Featured Articles