వాళ్లకు రాజనీతి బోధించండి!


Fri,April 18, 2014 01:42 AM

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్ర మహాసభతో మొదలయిన తెలంగాణ అస్తిత్వం దొరలూ, జమీన్‌దార్లు, జాగీర్‌దార్లను పల్లెల నుంచి తరిమేసిన క్రమాన్ని కళ్ళకు కడుతుంది. అలా పారిపోయిన దొరలు రెండుమూడేళ్ల అజ్ఞాతం తరువాత మళ్ళీ ఎలా గ్రామాలకు చేరుకొని పునర్నిర్మాణానికి పునాదులు వేసుకుంటారో దాశరథి తరువాతి కాలంలో రాసిన జనపథం నవలలో వివరిస్తారు. కథ, చెప్పిన పద్ధతి, అందులోని రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణలో ఇది జరిగిన సంగతి. 1942-52 మధ్య చరిత్రను పరిశీలిస్తే నిజంగానే చరిత్ర తనంతట తాను పునరావతం అవుతుందనే అనిపిస్తుంది. అందుకే దాశరథి భూమి గుండ్రం అన్నా డు. నిజాం రాజుల పాలనలోని లోపభూయిష్ట భూ పంపిణీ, యాజమాన్య విధానాల వల్ల భూస్వాము లే పాలకులుగా చెలామణి అయ్యారు. నిజాం రాజులకు తాబేదార్లుగా మారి ప్రజలను దోచుకుని దొరలయ్యారు. ఆ దొరల దోపిడీ, దాష్టీకాలకు హద్దూ అదుపు లేకుండా పోయింది.

తెలంగాణ బతుకు ఛిద్రమైపోయింది. ఆ దశలోనే ప్రపంచం గర్వించే స్థాయిలో సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణలో ప్రారంభమయ్యింది. నాగలి పట్టాల్సి న రైతులు, రైతు కూలీలు తుపాకులు పట్టారు, సాయుధ దళాలు ఏర్పాటు చేసుకుని భూస్వాముల మీద దండయాత్రకు దిగారు. దొరలూ ప్రతిఘటించారు.రజాకార్లను ఉసిగొలిపి దొరికిన వాళ్ళ ను దొరికినట్టు ఉద్యమకారులను ఊచకోత కోశా రు. వేలాదిమందిని జైళ్లలో తోశారు. కేసులు బనాయించారు. కోర్టులకు ఈడ్చారు. అయినా దొరలను నిజాం ప్రభువు కాపాడలేకపోయాడు, రజాకార్లు, కిరాయి మూకలు కాపాడలేకపోయా యి. కంటిచూపుతో మొత్తం సమాజా న్ని శాసించిన దొరలు తమ గ్రామాలు వదిలి, గడీ లు వదిలి పారిపోయారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అనేక నగరాలకు పారిపోయారు. ఉద్య మం ఉధతంగా సాగినంత కాలం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అజ్ఞాతంలో గడిపారు.

ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాధనకు ఊపిరై నిలబడ్డ రాజకీయ జేఏసీపౌర సమాజానికి దిశా నిర్దేశం చేయక తప్పదు. మీతో భుజం భుజం కలిపి పోరాడిన వాళ్ళను ఏ పార్టీలో ఉన్నా గెలిపించండి. విధ్వంసం జరిగిందని ఒప్పుకున్న పార్టీలను,పునర్నిర్మాణం అవసరాన్ని గుర్తించిన వాళ్ళను, నవ తెలంగాణ నిర్మించాలనే వాళ్ళనే బలపరచండి. లేకపోతే తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఆకాంక్షకు అర్థమే లేకుండాపోతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చరిత్ర పునరావతం అవుతుంది.


ఇదే అదనుగా నెహ్రూ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు చర్య పేరుతో భారత సైన్యాన్ని రంగంలోకి దింపి హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో కలిపేసుకుంది. అంతే! అప్పటిదాకా ఎక్కడెక్కడో దాక్కున్న దొరలంతా కొత్త అవతారాల్లో మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి చేరారు. అప్పటిదాకా వాడిన షేర్వానీలు వదిలేశారు. ఖద్దరు తొడిగారు. తలమీద గాంధీ టోపీలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో కలిసిపోయారు. సైన్యం, పోలీసు సెక్యూరిటీ వెంట బెట్టుకుని మళ్ళీ గ్రామాల్లో చేరిపోయారు. అప్పటి దాకా నిజాం రాజు తొత్తులుగా వుండి, మొత్తం పల్లెల్ని దోచి, ఈ దోపిడీ నుంచి, వెట్టి నుంచి, గులాంగిరీ నుంచి, భూస్వామ్య బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కావాలని పోరాడిన ఉద్యమకారుల మీద ఉక్కుపాదం మోపిన వాళ్ళు, ఇక్కడి జన జీవనాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు హటాత్తుగా జాతీయ వాదులై పోయారు. దేశ భక్తులయ్యా రు. కాంగ్రెస్ నేతలై కండువాలు కప్పుకున్నా రు. భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా నవసమాజా న్ని నిర్మిస్తామని ప్రతినబూనారు. తరువాత ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళే మళ్ళీ మంత్రులైపోయారు.

కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంటనే పాలనను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోకి తెచ్చేందుకు 1953లో ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా మద్రా స్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలుగు తెలిసిన ఉద్యోగులను ఇక్కడికి ఆహ్వానించింది. పనిలో పనిగా సాగు తెలిసిన కోస్తా రైతులను కూడా ఉచితంగా ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చి పిలిపించుకుంది. ఉద్యోగులను నియమించినప్పుడు పెద్ద ఎత్తున స్థానిక యువకులు, నిరుద్యోగులు నిరసన తెలిపా రు. ఆందోళనకు దిగారు. నాన్-ముల్కి గో బ్యాక్ పేరుతో ఉద్యమించిన పిల్లల మీద కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణచివేసింది. అప్పటి నుంచి స్థానికుల నోళ్ళు మూయించి వేలాదిమందిని ఉద్యోగా ల్లో నియమించింది. ఇది వలసాధిపత్యానికి తొలి మెట్టు అయింది. అప్పటి దాకా కొనసాగిన నిజాం ముతక పాలనా వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంది. ఇది జరిగి రెండేళ్ళు కూడా గడవక ముందే ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మం తనాలు మొదలుపెట్టారు. ఆంధ్రా పెద్దలు కలిసి వుంటే కలదు సుఖం అన్నారు. తెలంగాణ పెద్దమనుషులు ఎవరికి సుఖం అని ఆలోచించలేకపో యారు. హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గు ల రామకష్ణారావు అలాంటి ఆలోచన చేసినా కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీ పిలిపించి ఒప్పించింది.

భాషా ప్రయుక్త రాష్ర్టాల్లో బాగుపడతారని చెప్పింది. ఆయనా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మొదలు పెడతామని చెప్పారు. మళ్ళీ మంత్రులయ్యారు. కానీ పదేళ్ళు గడిచినా పరిస్థితి మారకపోగా మరింత శిథిలం అయ్యింది. ఇక చాలనుకున్న యువతరం తెలంగా ణ కోసం 1969 లో ఉప్పెనై లేచింది. ఆంధ్రా ఆధిపత్యశక్తులను, పాలకులను వాళ్లకు వంతలు పాడే తెలంగాణ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. స్థానిక కాంగ్రెస్ నాయకత్వ సహకారంతో ఆ ఉద్యమాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసింది. వందలాది మందిని హైదరాబాద్ వీధుల్లో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి వేసింది. అప్పటి పాలకుల్లో ఇప్ప టి నాయకుల తండ్రులున్నారు. కొందరు నేతల తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళే పెద్దమనుషులుగా ఉండి ఒప్పందాలు చేసుకుని, షరతులు పెట్టుకుని దాదాపు 1982 దాకా అదే తంతు కొనసాగించారు. ఈ పాలనే తెలంగాణ బతుకుల్ని రోడ్డు మీదికి తెచ్చింది. దానికి తెలుగుదేశం పాలన కూడా తోడయ్యింది. ఇదే నాయకత్వం ఆ పార్టీ హయాంలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. జానారెడ్డి లాంటి వాళ్ళయితే అక్కడా ఇక్కడా రెం డు చోట్లా ఉన్నారు. మళ్ళీ మొదలయిన తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు, అణచి వేసిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు, ఉద్యమకారుల మీద కేసులు బనాయించి జైళ్లలో తోసిన వాళ్ళు, చివరకు వేలాదిమందిని నిరాశలో ముంచి ఆత్మహత్యలకు పురికొల్పిన వాళ్ళు కూడా గడిచిన పదేళ్లుగా పాలించిన వాళ్ళే. వాళ్ళే ఈ విధ్వంసానికి మూలం అని ఉద్యమకారులు వాదిస్తున్నారు. ఇదంతా ఒక చరిత్ర.

ఆ చరిత్ర క్రమంలోనే తెలంగాణ విద్యావంతుల వేదిక అనేక అధ్యయనాలు చేసి తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్యమానికి సన్నద్ధులను చేసింది. ఈ విధ్వంసంలో భాగంగా వచ్చిన నిబంధనలు ఉద్యోగులను ఊపిరాడకుండా చేస్తున్నాయన్న ఆందోళనలో నుం చే కే.చంద్రశేఖర్‌రావు నిరాహారదీక్ష, జేఏసీ ఏర్పా టు జరిగిపోయాయి. ఈ విధ్వంసమే అప్పటిదాకా అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా మాత్రమే ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ పౌర సమాజానికి తిరుగులేని నాయకుడై నిలబడ్డాడు. రాజకీయవాదులు, పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా వెరవకుండా తుదిదాకా నిలబడి ఇప్పుడు పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకటించాడు.కానీ తెలంగాణ కాంగ్రెస్ అధినేత పొన్నాల లక్ష్మయ్య మాత్రం అసలు విధ్వం సం జరగనే లేదని, అలాంటప్పుడు పునర్నిర్మాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఇంకా తటస్థంగా ఉంటే కుదిరేలా లేదు. వాళ్లకు రాజనీతిశాస్త్రం బోధించాల్సిన అవసరం ఉంది. వీలయితే చరిత్ర కూడా చెప్పాల్సి ఉంది. ఎవరయినా తెలియని వాళ్లకు చెప్పవచ్చు. కానీ తెలిసీ తెలియనట్ట్టు నటించే వాళ్లకు ఏది చెప్పినా ప్రయోజనం ఉండదు అని అనిపిస్తే మీకు మీరే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోండి. ఉద్యమాన్ని రాజేసి తెలంగాణ సాధనకు ఊపిరై నిలబడ్డ రాజకీయ జేఏసీ పౌరసమాజానికి దిశా నిర్దేశం చేయక తప్పదు. మీతో భుజం భుజం కలిపి పోరాడినవాళ్ళను ఏ పార్టీలో ఉన్నా గెలిపించండి. విధ్వంసం జరిగిందని ఒప్పుకున్న పార్టీలను, పునర్నిర్మాణం అవసరాన్ని గుర్తించిన వాళ్ళను, నవ తెలంగాణ నిర్మించాలనే వాళ్ళనే బలపరచండి. లేకపోతే తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఆకాంక్షకు అర్థమే లేకుండాపోతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చరిత్ర పునరావతం అవుతుంది.

389

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి