పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?


Fri,March 21, 2014 01:42 AM

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊతమిచ్చిన విద్యావంతులు, జేఏసీల ప్రమేయం లేకుండాపోయింది.
స్వాతంత్య్రం రావడం సంతోషదాయకం అనడంలో సందేహంలేదు. కానీ అది మనమీద ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టిందన్న సంగతి మరచిపోవద్దు. స్వాతంత్య్రం రావడంతో మనలో ఏ తప్పు జరిగినా బ్రిటీష్ వాళ్ళమీద తోసేసి పబ్బం గడుపుకునే అవకాశాన్ని కోల్పోయాం. ఇకముందు కూడా పొరపాట్లు జరిగితే దానికి నిందించడానికి మనం తప్ప ఇంకెవరూ ఉండరు. కాలం వేగంగా మారుతోంది, తప్పులు జరిగే ప్రమాదం మెండుగా ఉంది.
భారత రాజ్యాంగ రచన పూర్తవుతున్న దశలో రాజ్యాంగ సభనుద్దేశించి అంబేద్కర్ అన్న ఈ మాటలు ఇప్పుడు తెలంగాణ సమాజానికి కూడా వర్తిస్తాయి. తెలంగాణ సమాజం కూడా రాష్ట్ర ఆకాంక్షను ఒక స్వాతంత్య్ర ఆకాంక్షగా, స్వయంపాలన ఆకాంక్షగానే భావించింది.తెలంగాణ ఉద్యమం కూడా అదే పద్ధతుల్లో అంతే స్థాయి లో జరిగింది. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు తీరి బతుకు బంగారంలా మారిపోతుందన్న భావన చాలా మందిలో ఉంది.
ఉద్యమ భావ వ్యాప్తి, రాజకీయాలు అలాంటి హామీని తెలంగాణ సమాజానికి ఇచ్చాయి. మొత్తానికి తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణకు ఇదొ క చారిత్రక సందర్భం.ఇప్పుడు అంతా స్వపరిపాలన మీద, తెలంగాణ పునర్నిర్మాణం మీద దష్టి పెడుతున్నారు. రాజకీయపక్షాలే కాదు జేఏసీతో సహా ప్రజాపక్షం ఉండే మేధావులు, జర్నలిస్టులు కూడా భవిష్యత్ తెలంగాణ గురించి ఆలోచిస్తున్నారు. అందుకు ప్రణాళికలు ప్రతిపాదిస్తున్నారు.
దీన్ని తెలంగాణ పునర్నిర్మాణంఅని కొందరంటే మరి కొందరు నవనిర్మాణంఅనీ, ఇంకా కొందరు పునరుజ్జీవం అనీ అంటున్నారు. మాట ఏదయినా రేపటి తెలంగా ణ ఎలా ఉండాలన్నదే అందరి ఆలోచన. ఇదొక మంచి పరిణామం. ఇటువంటి ఆలోచనలు గతంలో ఏర్పడ్డ కొత్తరాష్ర్టాల్లో పెద్దగా కనిపించలేదు. ఒక రాజకీయ ప్రక్రియ ముగిసి కొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాక వారిని రాజకీయపార్టీలకు, పాలక వర్గాలకు వదిలేయడం వల్ల అక్కడ సామాజిక మార్పు పెద్దగా కనిపించలేదు.
తెలంగాణ ఆలోచనాపరులు ఇప్పుడు ఆ మార్పును కోరుకుంటున్నారు. కొత్త సామాజిక, ప్రజాస్వామిక విలువలు రావాలని ఆశిస్తున్నారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించి ప్రయోజనం లేదని, అది రాజకీయ స్వాతంత్రాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం, ప్రజాస్వామిక వాతావరణం వీటిద్వారా ఏర్పడదని నమ్ముతున్నారు. అలా కాకుండా ప్రజల బతుకుల్లో వెలుగు నింపే తెలంగాణ కావాలని ఇప్పుడు అంతా కోరుకుంటున్నారు.
అందుకే ఆ ఆకాంక్షలు ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అంబేద్కర్ ఇలాంటి ఆలోచన చేశారు. ఆయన భారత రాజ్యాంగాన్ని దేశ పునర్నిర్మాణ ప్రణాళికగా మలిచారు. దేశంలోని అన్ని వర్గాలు, జాతులు, తెగలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, స్త్రీ, పురుషులు ఇట్లా అన్ని అస్తిత్వాల ఆకాంక్షలవేదికగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పుడు తెలంగాణలో వ్యక్తమవుతున్న ఆకాంక్షలే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కాలంలో కూడా వ్యక్తం అయినాయి. తరతరాల స్వపరిపాలన ఆకాంక్షకు స్వాతంత్య్రం వచ్చిందన్న భావోద్వేగం తోడై ఇకనైనా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలన్న తపన పట్టుదలతో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు.
దానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నారు. రాజకీయ స్వాతం త్య్రం పొందిన భారతదేశం సామాజిక విప్లవం సాధించాలన్నది ఆ లక్ష్యాల్లో అన్నిటికంటే కీలకమైనది. రాజ్యాంగం ద్వా రా ఆ లక్ష్యం సాధించాలని భావించి అందుకు అవసరమైన అన్ని మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఏ ఒక్కరి చేతుల్లోనో పెట్టకుండా ప్రజలందరికీ ప్రాతి ధ్యం వహించే ఒక వేదికగా రాజ్యాంగ నిర్ణాయక సభను ఏర్పరచి వారి ఆలోచనలు, సలహాలు సూచనలతో న్యాయనిపుణులు, మేధావులతో కూడిన రచనా సంఘం ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించారు.
స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు, ఆదర్శాలను ఆలోచనలో పెట్టే విధంగా బంగారు భారతావనిని నిర్మించే దిశగా రాజ్యాంగం ఉండాలని భావించారు. స్వపరిపాలన అంటే రాజకీయ స్వాతంత్య్రం మాత్ర మే కాదని ఆ స్వాతంత్య్రంలో ప్రజలందరి భాగస్వామ్యమని విశ్వసించి రాజ్యాంగ నిర్మాతలు సమష్టి ఆలోచనలతో దానిని రూపొందించారు. భారత రాజ్యాంగం దేశ భవిష్యత్తు పునర్నిర్మాణానికి ఒక ప్రాతిపదికగా రూపొందింది.
ఇప్పుడు అదే హెచ్చరిక తెలంగాణ రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఇంతకాలం ఆంధ్రా దోపిడీని సాకుగా చూపి పబ్బం గడుపుకున్నట్టు భవిష్యత్తులో పరిపాలన సాగదని వారు గుర్తుపెట్టుకోవా లి. బహుశా అది గుర్తించే ఇప్పుడు అన్ని పార్టీలు పునర్నిర్మాణ మంత్రాన్ని జపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడంతో పాటు రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయపార్టీలన్నీ తమ తమ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి.
ఎన్నికల ప్రణాళికలనే ఇప్పుడు రాజకీయపార్టీలు పునర్నిర్మాణ ప్రణాళికలుగా చెపుతున్నాయి. కానీ పునర్నిర్మాణం ఎవరు చేయాలి అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న కాబోతున్నది. స్వాతంత్య్రం వచ్చింది మొదలు తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకునే అవకాశం ఏనాడు పొందలేదు. హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అయిన వెంటనే రాజకీయ అధికారం పొందలేదు. మొదట కొద్దికాలం సైనిక పాలన ఆ తరువాత పౌర ప్రభుత్వం పేరుతో అధికారుల పాలనలో ఉండాల్సి వచ్చింది.
1952-56 మధ్య స్వతంత్రంగా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఉమ్మడి హైదరాబాద్‌గా కన్నడ, మరాఠీ ప్రాంతాలతో కలిసి ఉండడంతో తెలంగాణ పునర్నిర్మాణ అవకాశం రాలేదు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలంగాణ పునర్నిర్మాణ అవకాశమే రాక పోగా తెలంగాణ అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్ పేరుతో కొత్త వలసవాదం మొదలయ్యింది. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను, అభివద్ధిని గడిచిన అరవై సంవత్సరా ల్లో అణచివేసి దీనిని ఆంధ్రప్రదేశ్‌గా మలిచిన శక్తుల్లో కాంగ్రెస్,టీడీపీ పార్టీలు ప్రధానపాత్ర పోషించాయి.
ఈ రెండు పార్టీల పాలనలో సాగిన అన్యాయాలకు పరిష్కారంగానే ప్రజలు తెలంగాణను కోరుకున్నారు. తెలంగాణ ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఎదగాలని, స్వీయ రాజకీయ చైతన్యంతో ఆ ప్రజా బాహుళ్యంలోనుంచి ఎదిగివచ్చిన విద్యావంతులు కలలుగన్నారు. ఫలితంగా ఉద్య మం సకల జనుల సమాహారమై నిలబడి తెలంగాణ సాధించుకుంది.ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది.
ఉద్యమానికి ఊతమిచ్చిన విద్యావంతులు, జేఏసీల ప్రమే యం లేకుండాపోయింది. తెలంగాణలో ప్రతి రాజకీయపార్టీ పునర్నిర్మాణం గురించి ప్రస్తావిస్తున్నా నిర్దిష్టమైన ప్రతిపాదనలతో టీఆర్‌ఎస్ మినహా ఇంకెవ రూ ముందుకు రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కేసీఆర్ ఆలోచనలు, హామీలు క్రోడీకరించి అదే పునర్నిర్మాణ ప్రణాళిక అంటుందే తప్ప ప్రజల్లో చర్చించి ప్రజల ఆశలు, ఆకాంక్షల ప్రాతిపదికన దీని ని ఒక భవిష్యత్ ప్రణాళికగా మలిచే ప్రయత్నం చేయడం లేదు.
నిజానికి తెలంగాణ పునర్నిర్మాణం ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికన, ఉద్యమ ఎజెండా ప్రకారం జరగాలి. ఇంతకాలం ఏ సమస్యల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారో, ఆ సమస్యలే పునాదిగా తెలంగాణ ఏర్పడాలి. దానికొక ఆచరణాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇప్పుడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు మనవారో ఎవరు పరాయివారో తెలియని రోజులు వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు మానుకోట మారణకాండ సష్టించిన కొండా మురళి దంపతులు కీలక నేతలైపోయారు. ఆపార్టీలో ఇంతకాలం ఉద్యమాన్ని ఉక్కుపాదాల కిందా అణచివేసిన వాళ్ళు చాలామంది చేరిపోతున్నారు. వాళ్ళే గెలిచి తెలంగాణను పునర్నిర్మిస్తారు.
అలాగే ఆరు దశాబ్దాల వంచనకు, మూడు సంవత్సరాల మారణకాండకు కారణమైన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు, జేఏసీ నాయకులకు ఊయలగా మారిపోయింది. కాంగ్రె స్ పార్టీ మోసం, జాప్యం వల్ల కలత చెంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఇప్పుడు ఆ పార్టీ గుండెలకు హత్తుకుంటోంది. అమరవీరులని ఆకాశానికి ఎత్తుతోంది. చివరిదాకా తెలంగాణకు అండగా ఉన్న తెలంగాణ బీజేపీ తెలంగాణా ఏర్పాటును ఆఖరి నిమిషం దాకా అడ్డుకోవడానికి ప్రయత్నించి, దేశంలోని అన్నిపార్టీలను ఏకం చేసిన చంద్రబాబు నాయుడుతో చెలిమి చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు నిజంగానే ఎవ రు ద్రోహులో తేల్చుకోలేని అయోమయంలో తెలంగాణ సమాజం పడిపోయింది.
ఈ పరిస్థితికి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తిరోగమన వైఖరి కూడా కారణం. మూడేళ్ళపాటు తెలంగాణ ఉద్యమానికి జవజీవాలు నింపిన రాజకీయ జేఏసీ తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత పూర్తిగా నిర్వీర్యమైపోయింది. జేఏసీ సారధులు చాలామంది ఇప్పుడు రాజకీయపార్టీలకు గెలుపు గుర్రాలుగా మారిపోతున్నారు. టీఆర్‌ఎస్ మొదలు బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇట్లా అన్ని రాజకీయపార్టీలు వారిని దువ్వే పనిలో పడ్డాయి.
రాజకీయ జేఏసీ ఒక స్వీయ రాజకీయశక్తిగా ఎదిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్వాతంత్య్రం రాగానే భారత జాతీయ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ చెప్పినప్పటికీ నెహ్రూ వినలేదు. ఆయనే దానికి అధ్యక్షుడై దేశ పునర్నిర్మాణంలో భాగస్వామిగా మారాలనుకున్నాడు. జేఏసీ కూడా అటువంటి పాత్ర పోషించి ఉంటే బాగుండేది. ఏ ఉద్యమమైనా సరే ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళే భవిష్యత్తుకు నాయకత్వం వహించినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.
కానీ ప్రొఫెసర్ కోదండరామ్ అలా చేయలేకపోయా రు. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఆయన జేఏసీ ఏర్పాటుచేసి ఇంతకాలం నిలబెట్టి, తెలంగాణ సాధిం చి ఇప్పుడు పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు రాజకీయపార్టీల చేతిలో తెలంగాణ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఇది మంచి పరిణామం ఎంత మాత్రమూ కాదు!
[email protected]

580

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి