కేసీఆర్‌ను అభినందిద్దాం !!


Fri,February 28, 2014 12:28 AM

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం. అందరి పక్షాన నిలబడి అన్ని ప్రతికూలతలకు ఎదురొడ్డి తెలంగాణ తెచ్చినందుకు ఇప్పటికైతే ఆయనను మనసారా అభినందిద్దాం! వీలయితే ఆయన ప్రజల పక్షాన నిలబడేటట్టు చూద్దాం.!!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సం బంధించి తొలి ప్రకటన వెలువడ్డ 2009 డిసెంబర్9,రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సంబురా ల్లో పాల్గొన్న నన్ను ఇంగ్లిష్ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణకు స్వా తంత్రం తెచ్చిన కేసీఆర్‌ను మీరు ఎలా చూస్తారని ఒక విలేకరి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆయ న మహాత్ముడని చెప్పాను. అంటే తెలంగాణ ప్రజల కు ఆయన మహాత్మాగాంధీ అంటారా! అని ఆ విలేకరి మళ్ళీ అడిగాడు. నాకు అవుననక తప్పలేదు. ఆ తర్వాత నా చుట్టూ ఉన్న మిత్రులు, లైవ్‌లో అది వి న్న వాళ్ళు చాలామంది నన్ను నిజంగానే నువ్వు కేసీఆర్‌ను మహాత్ముడు అనగలవా? అని ప్రశ్నించారు. నేను చెప్పాల్సింది చెప్పాను.మహాత్ముడు అనేది పేరు కాదు.అదొక భారతరత్న లాంటి బిరుదు అంతకంటే కాదు. అశేష ప్రజావాహిని ఆకాంక్షలకు ప్రతినిధిగా ఉండివాళ్ళ కలను నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా సరే మహాత్ముడే అవుతాడన్నది నా అభిప్రాయం. కొంద రు అంటున్నట్టు ఆయన కారణజన్ముడని, త్యాగధనుడని కీర్తించనవసరంలేదు. కానీ తెలంగాణ ప్రజలు, ఉద్యమం ఆయనను మహాత్ముణ్ణి చేసింది.

ఈ నేపథ్యంలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఒక్క కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ వచ్చిందా?అన్నది. తెలంగాణ ఉద్యమంలో మిగతా ఎవరికీ అందులో పాత్ర లేదా? అంటే ఉంది. దేశానికి కూడా స్వాతంత్య్రం ఒక్క గాంధీ పోరాడితేనే రాలేదు. మిగతావారికెవరికీ రానంత ఖ్యాతి ఒక్క గాంధీకే ఎందుకు వచ్చిందీ అంటే ఆయన ఒకే పద్ధతిలో, ఒకే సిద్ధాంతంతో అప్పటి పాలకులు, చట్టాలు అనుమతించే రీతిలో పోరాడారు. నిజానికి గాంధీని మహాత్ముడు అన్నది స్వాతంత్య్రం తెచ్చినందుకు కాదు.ఆయనను1915లో సబర్మతి ఆశ్రమం ప్రారంభించినప్పుడు తన గుజరాతీ అనుచరుడు అలా పిలిచారు.జన బాహుళ్యానికి ఆత్మతప్తిని మిగిల్చిన ఎవరినైనా సరే మహాత్ముడు అనడానికి మొహమాటం ఎందుకు? పైగా యావత్ ప్రజానీకం ఎలుగెత్తి నీరాజనాలు పలుకుతున్నప్పుడు శషభిషలు దేనికి?

ఒక్క కేసీఆర్ పోరాడితేనే తెలంగాణ రాలేదు. అనేక త్యాగాలు, పోరాటా సంస్థలు, వ్యక్తులు ఈ అన్నిటినీ ఉద్యమంగా మలిచి నిలబెట్టింది ఎవరో కూడా ఆలోచిద్దాం. స్వాతంత్రోద్యమం గాంధీ ఒక్కరే నిర్మించలేదు. ఇంకో రకంగా గాంధీ పుట్టడానికి పదేళ్ల ముందే మొదటి స్వాతంత్య్రసంగ్రామం జరిగింది. గాంధీ ఉద్యమం మార్గం ప్రజలను ఆకట్టుకుంది. ఆయన వేషం, భాష, ఉత్తర దక్షిణ కోణాలను కలిపాయి. ఇవన్నీ ప్రజల్లో చాలామందికి ఆమోదయో గ్యం అయ్యాయి. తెలంగాణ ఉద్యమం కూడా కేసీఆర్ నిర్మించిందే కాదు, ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఒక్కరే పోరాడితే వచ్చింది కూడా కాదు. అరవై దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్న స్పహను ఆయన తట్టిలేపారు.గతంలో కూడా చెన్నారెడ్డి మొద లు చిన్నారెడ్డి దాకా అనేకమంది అలాగే తట్టి లేపా రు. కానీ వాళ్ళెవరూ ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టలేకపోయారు. వాళ్లూ నిలబడలేకపోయారు. నిజానికి 1969 ఉద్యమం నిలబడి ఉండాల్సింది. అప్పటి ఉద్యమంవీరోచితం,కానీ పరిమితం.కొందరు విద్యావంతులు,యువకులు, ఉద్యోగులు నగరాల్లో పట్టణా ల్లో మొదలుపెట్టిన ఉద్యమం గ్రామాలను తాకలే దు.కానీ ఇప్పుడు అలాకాదు.

తెలంగాణ జెం డాలేని గ్రామం లేదు. కేసీఆర్ పేరు వినని గడపలేదు. ఇదంతా ఆయన రాజకీయ చతురతతో సాధ్యమయ్యింది. ఎదుటివారు ఎంతటి వారైనా తనవైపు తిప్పుకోగల నేర్పరితనం ఆయనది. ఆ నేర్పు వల్లనే ఆయన కాంగ్రెస్‌ను(2004)లో, టీడీపీని (2009) లో తనవైపు తిప్పుకోగాలిగారు. ఆయా పార్టీల ఓటర్లనూ తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. కేవలం పార్లమెంటరీ పార్టీలే కాదు ఉద్యమ సంఘా లు,ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు ఇట్లా తెలంగాణ పౌర సమాజం అంతా ఏదో ఒక దశలో కేసీఆర్‌ను అనునయించడమో కుదిరితే అనుసరించాడమో చేసిన వాళ్ళే. కేసీఆర్ కంటే ముం దు నుంచి పనిచేస్తున్న వివిధ సంఘాలు వేదిక లు, వ్యక్తులు తమ వంతుగా భావజాలవ్యాప్తికి తోడ్పడ్డా రు. కార్యాచరణకు దిగారు. అందులో ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్‌రావు మొదలు అనేకమంది ప్రొఫెసర్లు ఉన్నారు. గద్దర్, విమలక్క, మందకష్ణ, ఆకుల భూమయ్య లాంటి ఎందరో ఉద్యమకారులు కూడా ఉన్నారు. కుల సంఘాలు, ఇతర రాజకీయపక్షాలు ప్రత్యామ్నా య వేదికలూ వచ్చా యి. అందరికంటే మిన్నగా కేసీఆర్ మొండితనాన్ని భరించి గడిచిన నాలుగేళ్ళు ఆయనతో నడిచి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఓర్పు, సహనంకూడా ఉన్నాయి. ఆయ న సారథ్యంలో గ్రామగ్రామానా పౌరసమాజాన్ని రూపొందించిన జేఏసీ ఉంది.

ఈ అందరికీ ఆయనతో అనేక విభేదాలు ఉండవచ్చు, ఆయన పార్టీ పట్ల, వ్యవహార శైలి పట్ల అభ్యంతరాలు ఉండి ఉండవచ్చు. కానీ ఈ అందరూ ఏదో ఒక దశలో ఆయనతో ఏకీభవించిన వాళ్ళే. ఆయనతో కలిసి నడించిన వాళ్ళే. అలాగే భిన్న సిద్ధాంత భావజాలాలు ఉన్న వాళ్ళను కూడా ఆయన ఒక చోటికి తేగలిగారు. కొన్ని నక్సలైటు పార్టీలను అనేక బూర్జువా పార్టీలతో కలిసి పనిచేసే పరిస్థితులు సష్టించారు. ఇట్లా తెలంగాణ అస్తిత్వానికి కేంద్ర బిందువు కాగలిగారు. ఈ అన్నిటినీ మించిన మొండితనం కూడా ఆయనకే సొంతం. ఇవి చాలా మందికి నచ్చే గుణాలు. అందు కే కొందరు ఆయనను ఇప్పుడు గాంధీతో పోల్చుతున్నారు.గాంధీలోకూడా ఇలాంటి మొండితనం మం కుపట్టు ఉండేవని చరిత్రకారులు చెపుతుంటారు.

1969 మొదలు తెలంగాణ ఉద్యమం ఉత్థాన పతనాలు చూసింది. ఒక దశలో తెలంగాణ ఒక కలగానే మిగిలిపోతుందనే అంతా అనుకున్నారు. కానీ అదిప్పుడు ఊహకు అందని రీతిలో నిజమయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనచేతిలో ఉన్న పనినే ఎప్పుడు చేయగలమో చెప్పలేం. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే కాలం కాదిది. రాజకీయాల్లో అది ఊహించలేం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని పైకి ఎన్ని గంభీరమైన మాటలు చెప్పుకున్నా ఎప్పుడవుతుందో ఎవరూ సరిగ్గా ఊహించే సాహసం చేయలేదు. పార్లమెంటు ఉభయసభల్లో సాగిన ప్రహసనాన్ని ఊపిరిబిగపట్టి చూసినవాళ్లకైతే తెలంగాణ ఇక రాదేమో అనిపించింది. పెప్పర్‌పాటి రాజగోపాల్ అతని ఆత్మాహుతి దళం ఒకవైపు, వెంకయ్యనాయుడు అదశ్య కూటమి ఇంకొకవైపు చివరి నిమిషం దాకా తెలంగాణ అంశాన్ని వీలయినంత వరకు అడ్డుకోవాలని, కుదరకపోతే సాగదీయాలనే చూశాయి. మొత్తానికి ఒక సంక్లిష్ట రాజకీయ పరిణామాల మధ్య తెలంగాణబిల్లుకు ఆమోదముద్ర పడింది. రాజకీయం ఇంతకంటే అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు.నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళుతున్నాను.

మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతాను అన్నారు. ఆ మాట అనడానికి ముమ్మాటికీ గుండె ధైర్యమో, మొండితనమో ఉండి తీరాలి. లేకపోతే ఈ కాలపు రాజకీయా లు తెలిసిన ఎవరూ అటువంటి శపథం చేయరు. ఆ రెండూ ఉండడం వల్లనే ఆయన అందరూ ఇక అసా ధ్యం అని వదిలేసిన తెలంగాణ అంశాన్ని తలకెత్తుకున్నారు. ఎన్ని విమర్శలు, నిందలు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా తన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఉపయోగించి ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు ఢిల్లీ తెలంగాణ ప్రజలకు మోకరిల్లేలా చేశా రు. కేసీఆర్‌ను వ్యతిరేకించే వారైనా సరే ఇది కాదనలేని సత్యం.
తెలంగాణ ప్రకటన వచ్చి పదిరోజులు దాటినా ఎవరూ పెద్దగా సంబరాలు చేసుకున్నట్టు లేదు. కానీ కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణకు తిరిగొచ్చిన రోజు నగరం తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఆయనను కారణ జ న్ముడని, త్యాగాధనుడని పార్టీ శ్రేణులు కీర్తిస్తున్నా యి. మరి కొందరు తెలంగాణ గాంధీ అంటున్నారు. ఈ లోగా ఆంధ్రా మీడియా తెరాస-కాంగ్రెస్ విలీనానికి తెరతీసింది. కూపీలు లాగి మరీ చర్చలు పెడుతోంది. ఆ చర్చల్లో రక్తి కట్టించే కొత్త ప్రశ్నలు వస్తున్నాయి.

దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని అన్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తానే ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నాడని ఒకరంటే అలాంటప్పుడు ఆయన మహాత్మా గాంధీ ఎలా అవుతాడు మహా అయితే రాహుల్‌గాం ధీకి అనుచరుడు అవుతాడని ఇంకొకరు అంటున్నా రు. గాంధీ స్వాతంత్య్రం తెచ్చాక ఎలాంటి అధికారం పదవీ ఆశించలేదు. ఆయన పిల్లలు, కుటుంబం ఎవరెవరో ఎక్కడున్నారో తెలియదు. అలాంటప్పుడు ఈ పోలికలు ఎందుకు అనేవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్‌కు బిరుదులు ఇవ్వాల్సిన పనిలేదు. కానీ ఆయన ఒక చరిత్ర సష్టించారు కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం. అందరి పక్షాన నిలబడి అన్ని ప్రతికూలతలకు ఎదురొడ్డి తెలంగాణ తెచ్చినందుకు ఇప్పటికైతే ఆయనను మనసారా అభినందిద్దాం! వీలయితే ఆయన ప్రజల పక్షాన నిలబడేటట్టు చూద్దాం.!!
[email protected]

289

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి