తెలంగాణ జైత్రయాత్ర


Fri,February 21, 2014 01:03 AM

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక
ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమాలను
చూసిన వాళ్లకు, వాటి గురించి రాసిన వాళ్లకు వాళ్ళ మీదే కాదు, తెలంగాణ ప్రజల మీద, పోరాట పటిమ మీద కూడా ఎనలేని విశ్వాసం. బహుశా ఆ విశ్వాసమే ఇప్పుడు వాళ్లను గెలిపించింది.

మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆనందిస్తారు? ఎప్పుడు ఎగిరి గంతేస్తారు? ఎవరైనా సరే ఎదురు చూసిం ది కళ్లముందు కనిపిస్తున్నప్పుడు, కల గా మిగిలిపోతుందని భయపడ్డది నిజమైనప్పుడు, అనుకున్నది అనుకున్నట్టుగా ఆవిష్కతమైనప్పుడు మాత్రమే ఆ క్షణాన్ని ఆస్వాదిస్తాడు. కానీ పోరాటంలో ఊహించని విజయాన్ని పొందినవాడి కంటే తరతరాలుగా ఆధిపత్య దురహంకార ధోరణులను ఎదిరించి గెలిచినవాడే ఎక్కువగా ఆనందిస్తాడు. ఈ ఆలోచనలో ఉన్న నాకు తెలంగా ణ వచ్చినందుకు ఎలా ఫీలయ్యవన్నా అని మిత్రు డు, జర్నలిస్టు కందుకూరి రమేష్‌బాబు అడిగిన ప్పుడు ఒక క్షణం ఏమీ తోచలేదు. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజు చిత్రకారు డు ఏలే లక్ష్మణ్ కూతురు పెళ్ళిలో రమేష్ కలిశాడు. ఆ పెళ్లి పెళ్ళిలా లేదు. తెలంగాణ జాతరను తల పించింది. అప్పటికి బిల్లు ఇంకా రాజ్యసభకు చేరలేదు. అయినా ఆ పెళ్లికి హాజరైన వేలాది మంది మొహాల్లో ఒక కొత్త కళ. తమ కల నెరవేరిన ఆనం దం. పెళ్లి సందడిని మించిన సంబురం. అంతా అవే చర్చలు. తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమో దం పొందినప్పుడు కూడా ఒక గండం గట్టెక్కింది అనిపించింది తప్ప, ఎగిరి గంతులేసే అంత ఆనం దం కలుగలేదు. నాకింకా తెలంగాణ వచ్చేసిందని అనిపించలేదు. కానీ గురువారం రాజ్య సభలో బిల్లు ఆమోదం పొందిన క్షణాన రమేష్‌బాబు ప్రశ్న కు సమాధానం దొరికింది. జన్మభూమి విముక్తి పొందిన అనుభూతి ఎలా ఉంటుందో అర్థమైంది. దీనికోసం దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్‌తో సహా తెలంగాణను కలువరిస్తూ ఈ ఆరు దశాబ్దాల్లో నేలకొరిన వేలాది మంది అమరవీరులు గుర్తుకువచ్చారు.

వాళ్ల త్యాగా లు, ఆరాటాలు, అంచెలంచెలుగా విస్తరించి దావానలమై వ్యాపించిన పోరాటం గుర్తుకు వచ్చింది. రమేష్ బాబు ప్రశ్నలో ఉన్న లోతు అర్థమైంది. అప్పటికి నేను వీ6 లైవ్‌లో ఉన్నానన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా విశాల తెలంగాణ ప్రజానీకంతో నా అనుభూతిని పంచుకున్నాను. నా కళ్లు చెమర్చాయి. అవి ఆనందంతో కావచ్చు. అసంతప్తితో కావచ్చు. చివరి నిమిషం దాకా తెలంగాణను అడ్డుకోజూసి అసంపూర్ణ తెలంగాణను ఆవిష్కరించినందుకు కావచ్చు.


కొన్నేళ్లుగా మీడియా చర్చల్లో సీమాంధ్ర రాజ కీయాన్ని, అక్కడి రాజకీయ నాయకత్వపు మానసి క స్థితిని గమనిస్తున్న వాడిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాం గ ప్రక్రియ మొదలైన తరువాత ఎదురైన అవాం తరాలు చూస్తూ, ప్రతిదశలో మీడియాలో చర్చల్లో ఉండి సీమాంధ్రుల వికత చేష్టలు విడ్డూర చర్యలు గమనిస్తున్న నాకు నిజంగానే తెలంగాణ వచ్చింద న్న భావన మొదటిసారి కలిగింది. లోక్‌సభ ఆమో దించాక, అక్కడ బిల్లును సమర్థించి ఓటు వేసిన పార్టీలే రాజ్యసభలో రాద్ధాంతం చేశాయి. ఆ ఆనం దా న్ని ఇంకా ఆపేసే దశలో.. తెలంగాణ వచ్చేసింద ని అనిపించలేదు. ఆంధ్రా మీడియా హఠాత్తుగా తెలంగాణ పాట ఎత్తుకోవచ్చు, పతాక శీర్షికలు మార్చవచ్చు. కానీ అధికారం మారే దాకా వాళ్ళు తెలంగాణను ఏమార్చే అవకాశాలున్నాయి కాబట్టి అప్పుడే హడావుడి అక్కరలేదని నాకనిపించింది.

తెలంగాణ సమాజం పోరాడింది ఆంక్షలులేని తెలంగాణ కోసమే కానీ అస్తవ్యస్థ తెలంగాణ కోసం కాదు. గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినే త కేసీఆర్ చెపుతున్నది, తెలంగాణ ఉద్యమ సారధి ప్రొఫెసర్ కోదండరామ్ పదిరోజుల క్రితం దాకా చెప్పింది కూడా అదే. కానీ ఇప్పుడు రాబోతున్నది హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ఆంక్షలులేని తెలంగాణ కాదు. పది జిల్లాల్లో ఇప్పు డు ఖమ్మం జిల్లాలో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను తెలంగాణ నుంచి తొలగిస్తున్నారు. దీంతో తెలం గాణ చిత్రపటమే మారిపోతుంది. అలాగే హైదరా బాద్‌లో తెలంగాణ పౌరుల హోదా ఇప్పుడు గం దరగోళంలో పడిపోనుంది. ఉమ్మడి రాజధాని సాకు తో హైదరాబాద్‌లో పదేళ్ళపాటు తిష్ట వేయడమే కాకుండా ఇక్కడి పరిపాలనకూడా తమ కనుసన్న ల్లోనే నడవాలని సీమాంధ్ర నాయకులు కోరుకు న్నారు. గవర్నర్‌కు అధికారాలు ఇచ్చే రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టారు. అయితే ఈ ప్రతిపాదనను అధికార పార్టీ తిరస్కరించిది. కాంగ్రెస్ పార్టీని భయపెట్టి, బెదిరించి, లొంగదీసుకుని సీమాంధ్రకు పరిహారాలు, ప్రత్యేక హోదా కోరారు. ప్యాకేజీలు అడిగారు. దీనివెనుక ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయం ఉంది.

గడిచిన ముప్పైఏళ్ళలో ఈ రాష్ట్రం నుంచి ఎలాంటి చట్టసభకు ఎన్నిక కాని ఈయన ఇప్పుడు ఏకంగా సీమాంధ్రుల ఆరాధ్యదైవంగా మారిపోవాలనుకుంటున్నాడు. ఏ అధికార హోదా లేకున్నా ఆయన దాదాపు పదిసా ర్లు బిల్లు ముసాయిదాను చూశారు. తనకు అను కూలమైన రీతిలో మార్పులు సూచిస్తూ వచ్చారు. ఆయన రాజ్యసభలో చర్చ సందర్భంగా ఒకవైపు మేం తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే, అనేక సవరణలు కోరారు. హైదరాబాద్ సంపదను, ఆదా యాన్ని లెక్కలు చూపిస్తూ గుండెలు బాదుకున్నా రు. అందులో తమ చెమట శ్రమ ఉన్నట్టు వాటాలు అడిగారు. అన్ని నదులు తెలంగాణలోనే ఉన్నాయ ని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే నీళ్ళు దొచుకువచ్చి ప్రాజెక్టులు కట్టాలని షరతు పెట్టారు. పరిశ్రమలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో కొత్త పరిశ్రమలు పెట్టే తమ పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే ప్యాకేజీలు కోరారు. మరోవై పు టీడీపీ నేతలను సమన్వయపరుస్తూ ఒక ఉప ప్రాంతీయ పార్టీ నేత అవతారం ఎత్తారు. ఆయన నిర్వాకం వల్లే తెలంగాణ ప్రక్రియలో రెండు రోజు లు రాజ్యసభలో అవాంతరాలు వచ్చాయి. ఆంధ్రా ప్రాంతానికి అనవసర మినహాయింపులు వచ్చా యి. అయినా సరే ఆయన ఒక్క సవరణను కూడా నెగ్గించుకోవడం గానీ, నిలబెట్టుకోవడం గానీ చేయలేకపోయారు. ఆయన వితండవాదం విని విసిగిపో యి అదే సభలో ఉన్న బీజేపీ అగ్రనేతలు అరుణ్‌జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తలలు పట్టుకున్నారు.

నాకే కాదు ఢిల్లీ రాజకీయాలను ప్రత్యక్షంగా గమనిస్తున్న వాళ్ళు, సీమాంధ్ర సామ్రాజ్యవాదుల ఎత్తుగడలు తెలిసిన వాళ్ళు ఇదే నిర్వేదంలో ఉన్నా రు.ముఖ్యంగా వెంకయ్యనాయుడు వెకిలి ప్రవర్తన తెలిసిన బీజేపీ తెలంగాణ నేతలు కూడావిస్తుపోయారు. వాళ్లు గత నెలరోజులుగా ఆయన మనసు మార్చడానికి చేయని ప్రయత్నం లేదు. చివరికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉపవాస దీక్షకూడా చేశాడు. అయినా వెంకయ్య మారలేదు. వాళ్లు తెలంగాణ కోసం జేఏసీతో కలిసి నాలుగేళ్ళు పోరా డింది ఒక ఎత్తయితే, ఇప్పుడు వెంకయ్య ఎత్తులను చిత్తు చేయడం ఒక ఎత్తయింది..
ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణ వాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమాలను చూసిన వాళ్లకు, వాటి గురించి రాసిన వాళ్లకు వాళ్ళ మీదే కాదు, తెలంగా ణ ప్రజల మీద, పోరాట పటిమ మీద కూడా ఎనలే ని విశ్వాసం. బహుశా ఆ విశ్వాసమే ఇప్పుడు వాళ్ల ను గెలిపించింది. ఆ గెలుపు వెనుక కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, వేలాది అమరుల త్యాగం ఉన్నాయన్నది మరిచిపోలేం. అలాగే అరవై ఏళ్లుగా నిరంతరం తల్లడిల్లుతూ తిరగబడుతూ ఉన్న తెలంగాణ ను ఒక రాజకీయ చైతన్య అస్తిత్వంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది. అలాగే అనేక రాజకీయ వేదికలు పక్షాలు కేసీఆర్‌ను, ఉద్యమాన్ని జారీపోకుండా చూశాయి. వారందరి కషి అభినందనీయం.

ఎన్ని ఇబ్బందులు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ నలుగురు మహిళలను తెలంగాణ జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవా లి. పార్టీలో ఎంత వ్యతిరేకత వచ్చినా ఎదురొడ్డి నిలబడి ఎన్ని పార్టీలు ఎన్ని రంగులు మార్చినా వెనక్కుతగ్గని సోనియాగాంధీకి నిజంగానే తెలంగాణ యావత్తు ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని గుర్తించిన సుష్మాస్వరాజ్, తెలంగాణ పోరాటానికి వెన్నుతట్టిన మాయావతికి, సీమాంధ్ర ఎంపీల వికత చేష్టలకు వెరువకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంటరీ ప్రక్రియను సాహసోపేతంగా కొనసాగించిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు తెలంగాణ జాతి రుణపడి ఉంటుంది. మొత్తానికి తెలంగాణ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగి జయకేతనమై ఎగిరింది. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణానికి మరో ప్రస్థానం మొదలు కావాల్సి ఉన్నది.
జై తెలంగాణ.
[email protected]

300

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి