చివరి అంకంలో చిక్కుముడులు


Fri,February 7, 2014 01:07 AM

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇంతకాలం తామే గార్డులమని చెప్పినవాళ్ళు, రైలు రాగానే పచ్చజెండా ఊపి పంపిస్తామని చెప్పినవాళ్ళు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. జెండాలు పక్కనపడేసి ఒకరిమీద ఒకరు అభాండాలు వేసుకుంటున్నారు. సంద ట్లో సడేమియాలు కొందరు తెలంగాణ రైలుకు అడ్డుపడుతున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ సమాజం లో ఉత్కంఠను రేపుతున్నది. ఎన్నో ఏళ్ళుగా తెలంగాణ రాక కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఉద్వేగాలకు లోనవుతున్నారు. ఢిల్లీ పరిణామాలతో దిగులు పడిపోతున్నా రు.

కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వై ఎస్ జగన్‌లు మాత్రమే సైంధవులు అనుకున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వెంకయ్యనాయుడు రూపంలో బీజేపీ కూడా తోడవడం ఈ దిగులుకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ పరిస్థితి ఊహించనిదేమీ కాదు. గడిచిన ఐదేళ్లుగా తెలంగాణ విషయంలో సీమాంధ్ర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. పూటకో మాట మారుస్తూ తెలంగాణ ప్రజలను ఏమార్చిన ఘనత చంద్రబాబు నుంచి మొదలు జగన్‌బాబు వరకు అందరిలోనూ గమనించాం. రెండు నెలలుగా కిరణ్ పెడుతున్న కిరికిరి వల్ల సమస్య మరింత జఠిలమైపోయింది. కిరణ్ కుమార్‌రెడ్డి శాసనసభకు బిల్లు వచ్చిన నాటి నుంచి అటు తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్‌ఆర్ సీపీని బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో వేస్తున్న ఎత్తులు ఇవ్వాల ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాల సంగతి ఎలా ఉన్నా ఇవ్వాల్టి పార్లమెంటు ప్రక్రియలో బీజేపీ వైఖరే కీలకం కాబోతున్నది. ఒకవేళ తెలంగాణ రాని పరిస్థితి ఎదురైతే అందుకు ప్రధాన దోషి భారతీయ జనతా పార్టీనే అని అందరూ గమనించాలి.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును శాసనసభలో చర్చకు పెట్టిన పద్ధతి, ఆ చర్చ లో ఆయన మాట్లాడిన తీరు చివరకు నిబంధనలకు విరుద్ధంగా తీర్మానాన్ని ఆమోదించిన విధానం అన్నీ రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకమే అయినా కిరణ్‌కుమార్‌రెడ్డిని సీమాంధ్ర కథానాయకుడిగా జాతీ య మీడియాతో సహా అందరూ చిత్రీకరిస్తున్నారు. అధిష్ఠానం మీద ఇక సమరమే అంటూ ఆయన సవాలు విసురుతున్నారు. రాష్ర్టాల ఏర్పాటు విషయంలో నిజానికి రాజకీయ పార్టీలకు ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగం లో నిక్షిప్తమై ఉన్న అంశం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు, వాటికి నాయకత్వం వహిస్తున్న నేతలు వారికి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విధానాన్ని అభాసుపాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు.

ఈ కుప్పిగంతులు ఎలా ఉన్నా పార్లమెంటులో ఉన్న రాజకీయ పక్షాలకు మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలకు ఈ విషయంపై ఒక స్పష్టమైన వైఖరి ఉండి తీరాలి. సీడబ్ల్యూసీలో తీర్మా నం చేసి, ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌లో ఆమోదించి, బిల్లును రూపొందించేంత వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన విశ్వాసాన్ని కలిగించింది. కేవలం ప్రజల్లోనే కాదు, రాజకీయ పార్టీల వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న పరిశీలకులకు కూడా అటువంటి అభిప్రాయాన్నే కలిగించిం ది. కానీ బిల్లు శాసనసభకు చేరిన తర్వాత ఆ పార్టీ అంటీముట్టనట్టు ఉంటున్న వైఖరి ఇవ్వాల ఈ సం క్షోభానికి కారణమైంది. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం బిల్లు శాసనసభకు పంపించే కంటె ముందే ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడికి పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించవలసింది గా చేయాల్సి ఉండే. కానీ బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తం చేసే పేరుతో అటు ముఖ్యమంత్రికి, ఇటు సీమాంధ్ర శాసనసభ్యులకు ఎక్కడా లేని స్వేచ్ఛను కట్టబెట్టింది. పార్టీ ఇచ్చిన వెసులుబాటును బలహీనతగా భావించిన కిరణ్‌కుమార్‌రెడ్డి తాను వ్యక్తిగతంగా బలోపేతం కావడానికి ఉపయోగించుకున్నా డు.

బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి దాదాపు యాభై రోజుల గడువు ఇస్తే, దాదాపు యాభై రెండు గంటలు మాత్రమే చర్చ జరిగేలా కిరణ్ తనదైన వ్యూహాన్ని అమలు చేశాడు. దీనికి సీమాంధ్ర స్పీకర్ కూడా తోడై ముఖ్యమంత్రికి సభానాయకుడు అన్న పేరుతో అత్యధిక సమయాన్ని కేటాయించాడు. అంతటితో ఆగకుండా పనికిరాని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేవలం 48 సెకన్లలోనే దాన్ని ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించడం ఈ కుమ్ముక్కు రాజకీయాలకు నిదర్శనం.
గతంలో చట్టసభల చరిత్రలో ఏ తీర్మానం కూడా ఇంత స్వల్ప వ్యవధిలో సభలో ప్రవేశపెట్టడం ఆమో దం పొందడం జరగలేదు. ఈ మొత్తం తతంగంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకరకంగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. సభలో ఉన్న 175 మంది సీమాంధ్ర సభ్యుల మద్దతు పార్టీలకు అతీతంగా తనకే ఉంద ని, తానే సీమాంధ్ర చాంపియన్ అని చాటుకునే ప్రయత్నం చేశాడు. ఈ మొత్తం తతంగంలో అత్యం త విలక్షణ వ్యూహకర్తనని తనకు తాను పదే పదే చెప్పుకునే చంద్రబాబు నిండు సభలో మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ప్రధాన ప్రతిపక్షానికి చెం దిన సభ్యులంతా కిరణ్‌కు జై కొట్టడంతో చేసేది ఏమీ లేక ఇప్పుడు ఢిల్లీ బాట పట్టాడు. ఆయన కేవ లం ఢిల్లీతోనే ఆగలేదు. ఢిల్లీ నుంచి ముంబైకి, ముం బై నుంచి మద్రాస్‌కు ఇట్లా ప్రతిపక్షాలు ఉన్న ప్రతిచోటకు వెళ్లి, వాళ్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా డు. తెలంగాణను అడ్డుకోవాల్సిందిగా ప్రాధేయపడుతున్నాడు. అట్లా ఆయన భారతీయ జనతా పార్టీ ని, శివసేనను, సమాజ్‌వాదీ పార్టీ, అన్నాడీఎంకేతో సహా చిల్లరమల్లర పార్టీలను కూడా కలిసి ఒక కొత్త కుట్రకు తెరతీశాడు. ఈ రకంగా విభజన ఆగిపోతే తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని, తనకు తాను సీమాంధ్రలో హీరోను అని చాటుకోవాలని ఆరాటపడుతున్నాడు. అదే దశలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తన హామీని నెరవేర్చుకోవడంలో విఫలమైందని చెప్పదల్చుకున్నాడు.

తెలంగాణ టీడీపీ తమ్ముళ్లకు బాబు గారడీ ఇంకా అర్థమైనట్టుగా అనిపించ డం లేదు. బాబు వైఖరిపై బాధ పడుతున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప ఆయనను నిలదీయలేకపోతున్నారు. ఇదే అదునుగా భావించి న చంద్రబాబు కమ్యూనిస్టుల నుంచి కమలనాథుల దాకా అందరిని ప్రభావితం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కమ్యూనిస్టుల సంగతి తెలియదు కానీ, కమలనాథులు మాత్రం బాబు మాటలకు లొంగిపోతున్నట్టుగా కనిపిస్తున్నది. నిన్నటి దాకా తెలంగా ణ బిల్లు వస్తే పార్లమెంటులో బేషరతుగా మద్దతు ఇస్తామన్న భారతీయ జనతాపార్టీ ఇప్పుడు కుప్పిగంతులు మొదలుపెట్టింది. సగం సగం మాటలతో వంకర మాటలు మాట్లాడుతున్నది. చంద్రబాబు మాటలకు సదరన్ స్పైస్ జోడించి వెంకయ్యనాయుడు చేస్తున్న అనువాదాలకు నిజంగానే బీజేపీ లొంగిపోతున్నట్టు కనిపిస్తున్నది.
గత వారం రోజుల్లో బీజేపీకి సంబంధించిన ఐదుగురు అగ్రనాయకులు ఆరు రకాలుగా మాట్లాడడం చూస్తుంటే ఆ పార్టీ తెలంగాణకు దోకా చేస్తుందేమోనన్న భయం ఇవ్వాల ప్రజల్లో కలుగుతున్నది. ఎందరు చంద్రబాబులు ఎన్ని రంగులు మార్చినా, ఎందరు కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఎన్ని బంతులు విసిరినా, ఎందరు జగన్‌లు ఎన్ని కుప్పిగంతులు వేసినా తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిన్నటి దాకా చేతిలో ఆకుపచ్చ జెండా పట్టుకుని ఇది తెలంగాణ గ్రీన్ సిగ్నల్ అని చెప్పిన బీజేపీ ఇవ్వాళ పసుపు పచ్చ జెండాతో ప్రత్యక్షం కావడం ఈ అయోమయానికి కారణమవుతున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఉద్యమ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాల సంగతి ఎలా ఉన్నా ఇవ్వాల్టి పార్లమెంటు ప్రక్రియలో బీజేపీ వైఖరే కీలకం కాబోతున్నది. ఒకవేళ తెలంగాణ రాని పరిస్థితి ఎదురైతే అందుకు ప్రధాన దోషి భారతీయ జనతా పార్టీనే అని అందరూ గమనించాలి.

ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కొత్తగా విధిస్తున్న షరతులు బతుకమ్మగా ఇంతకాలం ఊరేగిన ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ మార్చుకుంటున్న రంగులు, నరేంద్రమోడీ విషపు మాటలు, అరుణ్ జైట్లీ బ్లాగోతాలు తెప్ప తగలేసినట్టుగానే అనిపిస్తున్నది. అదే గనుక జరిగితే భారతీయ జనతా పార్టీతో సహా తెలంగాణను అడ్డుకున్న అన్ని పార్టీలను పాతరేసి ఆ సమాధుల మీద ఎర్రజెండాలు ఎగరేయడానికి ప్రజలు సిద్ధ పడాలి.

తెలంగాణ బిల్లు భవిష్యత్తు తేలడానికి కేవలం రెండుమూడు రోజులే మిగిలి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ వ్యూహకర్తలు, జేఏసీలతో సహా ఉద్యమకారులు, ఉద్యమ, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు తిరుగుబాటు సంకేతాలు పంపడమే కాదు, మరో సమరానికి సమాయత్తం కాకపోతే చరిత్ర క్షమించదు.
ghantapatham@gmail.com

264

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి

Published: Fri,January 10, 2014 02:12 AM

చర్చ జరగాల్సిందే!

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

Published: Fri,January 10, 2014 02:11 AM

చర్చ జరగాల్సిందే!

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

Published: Fri,January 3, 2014 01:17 AM

వృథా ప్రయాస!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణను ఆపేంత శక్తిమంతుడా! న్యాయంగా అయితే ఒక రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి అడ్డుకోవడం సాధ్యం కాదని ఆ

Published: Fri,December 27, 2013 03:02 AM

ఉద్యమాలే ఊపిరిగా..

చరివూతలో మనం అనేకమంది ఉపాధ్యాయులను చూసి, విని ఉండవచ్చు. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని పలు సందర్భాల్లో మనకు తారసపడిన ఉపాధ్యాయులను

Published: Fri,March 1, 2013 12:05 AM

తెలంగాణమీది నిఘా టెర్రరిజంమీద ఏది?

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు మొత్తం దేశాన్నివణికించాయి. ఇది హైదరాబాద్ నగరానికి ఊహించని పెను విషాదం. మరణించిన వారిలో అంతా సామాన్యు

Published: Thu,February 21, 2013 10:50 PM

బాలచంవూదుడికి బాసట కాలేమా!

బుద్ధుడు యుద్ధమే వద్దన్నాడు. యుద్ధ కాలంలో బతికి ఉన్నవారికి బాసటగా ఉండాలన్నాడు. పోరాడాలన్న తలంపు వీడి మనసునిండా దయను నింపుకోమన్న

Published: Thu,January 31, 2013 11:35 PM

ముమ్మాటికీ మూడు తరాల మోసం

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది. నమ్మించి మోసం చేయడం ఆ పార్టీ నైజం. నెలరోజుల్లో తెలంగాణ ఇస్తామని యూపీఏ ప్రభుత్

Published: Thu,January 17, 2013 11:28 PM

కాంగ్రెస్‌ను నమ్మగలమా !?

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా? కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించే సమయం దగ్గరపడుతున్నకొద్దీ సీమాంధ్ర మంత్రులు, రాజకీయ నా

Published: Thu,December 20, 2012 11:09 PM

నేరమే అధికారమయితే..!

క ళ్ళకు గంతలతో ఉండే న్యాయదేవత ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా దేనికీ ప్రభావితం కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా తీర్పు చెపుతుందని ఒక వ

Published: Thu,December 6, 2012 10:33 PM

ప్రజలు ప్రేక్షకులు కావొద్దు..!

అఖిలపక్ష భేటీకి ముందుగానే పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అ

Published: Thu,November 22, 2012 11:53 PM

చుప్..నోరు మూసుకుని బతకండి!

మీకు ఈ ‘ఘంటాపథం’ నచ్చితే మౌనంగానే ఉండండి. మనసులోనే అభినందించండి. దయచేసి నోరు విప్పకండి. ఇంకెవరికీ ఆ మాట చెప్పకండి. నేను ఫేస్‌బుక్‌

Published: Thu,November 15, 2012 11:10 PM

పాపం పురోహితులు...

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మొదలైన గొడవలు‘దేనికైనాడీ’అని మ

Published: Fri,November 2, 2012 12:41 AM

చర్చలు జరపాల్సింది ఎవరితో?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావును చాలామంది కీలెరిగి వాతలుపెట్టే నేతగా పేర్కొంటారు. ఆయన వర్తమాన రాజకీయాలలో ఆరి

Published: Fri,October 19, 2012 03:06 PM

ఎనిమిదో చాప్టరే ఇప్పడు శాసనం !

చాలారోజుల కిందట సినీ నటుడు చిరంజీవి గారింట్లో ఆయన పెద్దకూతురు నిశ్చితార్థం జరిగింది. ఆయన ఆ కార్యక్షికమాన్ని తన ఇంటివరకే పరిమితం చే

Published: Fri,October 5, 2012 12:34 AM

ఈజిప్ట్‌ను తలదన్నిన మార్చ్

మేం ముందుగా చెప్పినట్టే మా మాటమీద నిలబడి ఉంటాం. మేం గడిచిన అరవై ఏళ్ళుగా మా తల్లి తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన విద్యార్థులం.

Published: Thu,September 20, 2012 11:33 PM

తెలంగాణ మార్చ్‌ను ఏమార్చే కుట్ర !

తెలంగాణ మార్చ్ శాంతియుతంగా గాంధేయ మార్గంలో జరుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం పదేపదే చెపుతున్నా ప్రభుత్వం మాత్రం ఏదో ఒక రకంగా మార్చ్‌క

Published: Fri,September 14, 2012 02:15 AM

సెప్టెంబర్ -17 ముందూ వెనకా...

సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలి ఆన్న విషయంలో చాలా చర్చే జరిగింది, జరుగుతూనే ఉన్నది. చారిత్రకంగా స్వతంత్ర రాజ్యం గా ఉన్న హైదరాబాద్

Published: Thu,September 6, 2012 11:45 PM

తెలంగాణ: ఒక అనివార్యత

చాలా రోజుల స్తబ్దత తరువాత మళ్ళీ తెలంగాణలో కదలిక కనిపిస్తోం ది. తెలంగాణ జిల్లాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ, ఢిల్లీలో భారతీయ జనతాపా

Published: Thu,August 30, 2012 11:14 PM

‘సర్వే’జనా సుఖినోభవంతు..!

నూటికి ఎనభై ఆరు మంది తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఎన్డీ టీవీ సర్వే తేల్చింది. ఈ వార్త విని చాలామంది సంతోష

Published: Fri,August 17, 2012 12:13 AM

బడుగుల నెత్తిన పిడుగులు !

ధర్మాన ప్రసాదరావు బీసీ అయినందువల్లే ఆయనమీద నేరాభియో గం మోపారా? ఇది బీసీలను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమా? దీని వెనుక కుట్ర కోణ

Published: Thu,August 9, 2012 11:52 PM

సిగ్నల్ సిండ్రోమ్!

తెలంగాణ సమాజం ఇప్పుడు కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలారోజుల స్తబ్తత తరువాత, ఈ మధ్యే మళ్ళీ తెలంగాణ మాట వినబడుతోంది.

Published: Sat,August 4, 2012 01:00 AM

ఒక బాబు.. రెండు కళ్లు.. మూడు రంగులు

ఆ మధ్య ఊసర పేరుతో ఒక సినిమా వచ్చినప్పుడు ఇదేం పేరని అనుకున్నా! అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఊసర చాలా అరుదైన కీటకం. పరిస్థితిని బట్

Published: Thu,August 9, 2012 08:45 PM

డబుల్ బారెల్ జ‘గన్’!

సిరిసిల్ల పరిణామాలు శ్రీలంకను గుర్తుకు తెచ్చాయి. అందుకు ముందు గా తెలంగాణ లిబరేషన్ టైగర్ రహీమున్నీసాకు తెలంగాణవాదులంతా కృతజ్ఞతలు

Published: Thu,July 5, 2012 11:45 PM

రాయల తెలంగాణ రాగం వెనుక..?!

ఈసారి నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ నెలరోజుల క్రితం సాధికారికంగ

Published: Fri,June 29, 2012 12:02 AM

అన్నీ డమ్మీ తుపాకులే సార్..!

ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో తెలుసుకోవడమే రాజనీతి అంటారు. రాజనీతికి అత్యున్నత దశగా, ఒక ఆదర్శంగా విప్లవాన్ని అభివర్ణించే వాళ్ళు ట్రిగ

Published: Fri,June 22, 2012 12:09 AM

జయశంకర్ సర్‌తో కరచాలనం!

ఆంధ్రుల దినపత్రికలను పెట్టుబడికీ కట్టుకథకు పుట్టిన విష పుత్రికలుగా శ్రీ శ్రీ అభివర్ణించారు. ఆంధ్రుల పత్రికలు గోరంతలు కొండంతలు చేస

Published: Fri,June 15, 2012 12:01 AM

జయశంకర్ స్ఫూర్తిని మరిచిపోయామా!

జ యశంకర్ సార్ చనిపోయిన నెల రోజుల్లో మిత్రుడు జూలూరు గౌరీశంకర్ ‘తెలంగాణ జాతిపిత సర్ జయశంకర్’ పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. మూడు

Published: Fri,June 1, 2012 12:46 AM

దేవుడు చేసిన మనుషులు!

దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మేవాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు లేడని నిర్ధారించుకున్నాక ఆ చర్చకు కాలం

Published: Fri,August 31, 2012 07:12 PM

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సీబీఐ అరెస్టు చేసింది. వాన్‌పిక్ పేరుతో వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిన

Published: Fri,May 11, 2012 12:52 AM

తెలంగాణ గళంలో కాషాయ గరళం!

బీజేపీ గురించి ఈ తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్‌కే ఎక్కువగా తెలుసు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న ఈ య

Published: Fri,April 27, 2012 12:21 AM

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగవ్యవస్థ

ఉద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పదునెక్కిస్తా యి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఉన్నట్టుండి తమ పెద్దలందరి

Published: Fri,April 13, 2012 12:29 AM

తెలంగాణకు కొత్త ఫేస్‌బుక్ కావాలి!

మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు’. ఇది తెలంగాణ విద్యార్థులకు

Published: Fri,April 6, 2012 12:11 AM

బస్తర్ బిడ్డలకు బాసటగా నిలబడదాం!

తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల అగ్గి ఎందుకు రాజుకుందో కానీ అదిప్పుడు అందరినీ కలచివేస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట ఎవ రో ఒకరు ఆత్మహత్యకు ఆ

Published: Thu,March 29, 2012 11:02 PM

ఆ ‘ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!

వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు.

Published: Thu,March 8, 2012 11:57 PM

ఈ విరామం ఇక చాలు...

చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వైఖరి. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక కూడ

Published: Fri,February 17, 2012 01:40 AM

అధ్యక్షా ! మన్నించండి...

శాసనసభ స్పీకర్ ఎవరు? ఎవరైనా నాదెండ్ల మనోహర్ అనే చెపుతారు. అది నిజమే! కానీ శాసన సభలో గందరగోళం గమనిస్తున్న వారికి అలా అనిపించడం ల

Published: Fri,February 10, 2012 12:03 AM

అవినీతి ఆచార్యులు

హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసిన ఖులీ కుతుబ్ షా పేరున ఆయన చనిపోయి నాలుగు శతాబ్దాలు దాటినా ఒక్క స్మారక చిహ్నం కూడా లేదు. కానీ బ

Published: Fri,February 3, 2012 01:37 AM

కోస్తాలో కుల ‘కరివేకాపులు’!

కోస్తా జిల్లాల్లో రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సందర్భంగా తెలంగాణ సమాజం స్పందించి న తీరు అభినందనీయం.

Published: Thu,January 19, 2012 11:25 PM

తెలంగాణలో పత్తి గత్తర!

సంక్రాంతిని రైతుల పండుగ అంటారు. కొత ్తపంటలతో రైతుల లోగి ళ్ళు కళకళలాడినప్పుడు చేసుకునే పండుగ అది. సంక్రాంతి సందర్భంగా సీమాంధ్రలో జర

Published: Thu,January 12, 2012 11:35 PM

విజయం కాదు.. వైఫల్యం!

రా జకీయాలు రణరంగం కంటే ప్రమాదకరం అంటారు చర్చిల్. చర్చి ల్ రాజకీయ అభివూపాయలతో మనకు ఏకాభివూపాయం ఉన్నా ,లేకున్నా బ్రిటీష్ పాలకుడిగా ఆ

Published: Fri,January 6, 2012 12:02 AM

మనుషులా? మృగాలా!?

ఆంధ్రవూపదేశ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత సౌమ్యుడుగా కనిపిస్తారో అంతటి రాజకీయ చతురుడు. ప్రజల ఒత్తిడో, తెలంగాణ సాధన లక్ష్యమో

Published: Fri,December 30, 2011 12:44 AM

బాబు వెడలె రభసకు..

శనీశ్వరుడి మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. నేను అలాంటివేమీ నమ్మను గానీ నమ్మిన వారి విశ్వాసాలు గౌరవిస్తాను. శని చాలా ప్రభావశీలి అన

Published: Thu,December 22, 2011 11:29 PM

మౌపమే మారణాయుధం!

మీరెప్పుడైనా జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్‌కు వెళ్ళారా? హైదరాబాద్‌లో ఉండే వారు మినహా చాలా మందికి అదేమిటో తెలియకపోవచ్చు. సరిగ

Published: Fri,December 9, 2011 12:13 AM

‘రాజ’ద్రోహానికి రెండేళ్ళు!

కావూరి సాంబశివరావును తెలంగాణ కు విలన్ అని చాలామంది అనుకుంటారు. కానీ తెలంగాణ నేతల గుణగణాలు ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవని అన

Published: Thu,December 1, 2011 11:50 PM

తెలంగాణ తొలిపొద్దు..

ఇంట్నట్ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పే జీకి తీసుకెళ్తుంది

Published: Fri,November 25, 2011 12:00 AM

ఇద్దరూ దోచింది తెలంగాణనే!

నవంబర్ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. తెలంగాణను ఆంధ్రవూపదేశ్‌లో కలిపింది నవంబర్ ఒకటి అయి తే, ఆంధ్రవూపదేశ్ నుంచి తెలం

Published: Thu,November 17, 2011 11:58 PM

పెనం వేడయ్యేదాకా వంట ’చెరుకు’ ను కాపాడాలి..!!

దాదాపు ఆరు నెలల క్రితం ‘టీ న్యూస్’ ఛానల్ లో ఉద్యమ తీరు తెన్నుల మీద ఒక చర్చ జరిగింది. నాతోపాటు ఆ చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితి ఫైర్

Published: Thu,November 10, 2011 11:06 PM

నాయకులకు ఇది పరీక్షా సమయం!

తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చలేమని ఢిల్లీ పెద్దలకు అర్థమయిపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఏదో ఒక ప్రకటన రావొచ్చనీ అంటున్నారు.

Published: Thu,October 27, 2011 11:46 PM

విద్రోహ పార్టీలకు బుద్ధి చెప్పాలె

దీపావళిలోగా తెలంగాణ పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పిన కాకమ్మ కబుర్లు నమ్మిన వాళ్లకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దీపావళి

Published: Sun,October 23, 2011 01:38 PM

కాంగ్రెస్ లక్ష్యంగానే కార్యాచరణ

ప్రభుత్వోద్యోగులు భద్ర జీవులని చాలామంది అనుకుంటారు. ఉద్యో గం ఉంటే కడుపులో చల్ల కదలకుంటా పనిచేసుకోవచ్చని, నెలతిరిగే సరికి జీతం వస్త

Published: Mon,October 10, 2011 11:22 PM

కాలం వంతెన పై కవాతు..!

మీకు కోదాటి సుధీర్ గురించి చెప్పాలి. ప్రస్తుతం కెనడా రాజధాని ఒట్టా వాలో నివసిస్తోన్న సుధీర్ కొన్నేళ్లుగా తెలంగాణ కోసం తపస్సు చే

Published: Mon,September 26, 2011 11:06 PM

ఇపుడొక కొత్త ఆయుధం కావాలి..!

ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబోతోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంల

Published: Mon,September 19, 2011 11:09 PM

రజాకార్లు వస్తున్నరు..జర భద్రం..!

మనలో చాలా మందిమి రజాకార్ల గురించి వినడమే తప్ప చూడలేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలంతా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి భూస్వామ్

Published: Tue,September 13, 2011 12:05 AM

సమ్మె దెబ్బకు దిమ్మ తిరగాలి..

అమెరికాలో బోస్టన్ నగరంలో వెంకట్ మారోజు అనే మిత్రుడున్నాడు. అంతనొక వీర తెలంగాణవాది. వెంకట్ సొంతూరు వరంగల్ జిల్లా జనగా మ. ఉస్మానియా

Published: Tue,September 6, 2011 12:11 AM

వో సుబహ్ కభీ థో ఆయేగీ...!?

దాదాపు నూటా పదిహేనేళ్ల క్రితం ఒక ఆదివాసీ యువకుడు అప్పటి బ్రిటీష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాడు. అప్పటికి సరిగ్గా ఇరవైయ్యేళ్లు కూడ

Published: Sun,October 23, 2011 01:52 PM

పౌర సమాజం.. పజలు.. ప్రజాస్వామ్యం!

పొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు అనుకున్నట్టుగానే జరిగింది. భారత పార్లమెంటు అసాధారణ రీతిలో బాబూరావు హజారే అలియాస్ అన్నా హజ

Published: Mon,August 22, 2011 11:18 PM

అన్నా ..అవినీతి..మనం

పెద్ద పెద్ద త్యాగాలతో పనిలేకుండానే వారం రోజుల్లో విప్లవం తేవచ్చన్న సంగతి అన్నా హజారే చెప్పేదాకా మన దేశంలో ఎవరికీ తెలియలేదు. ఔను! అ

Published: Tue,August 16, 2011 05:32 PM

తెలంగాణకు ఇంక తెల్లారనే లేదు..!

పొ. ఘంటా చక్రపాణి (సామాజిక పరిశోధకులు) భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడా

Published: Tue,August 2, 2011 03:33 PM

నాటి దోషి-నేటి ద్రోహులు

వర్తమానం కంటే చరిత్రే చాలా సార్లు ఘనంగా కనిపిస్తుంది. చరిత్రలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉంటాయి. అందుకే భవిష్యత్ గురించి ఆలో

Published: Thu,July 28, 2011 07:32 PM

బలిదానం తప్ప మరి దారే లేదా?

బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణా లు. అతను ఇంజనీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం త

Published: Tue,July 19, 2011 04:25 AM

తెగేదాకా లాగడమే మేలు..!

-ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు ఇప్పుడు ప్రజలతో కలిసి నడవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, పార్టీలది. రాజీనామా చేసిన వాళ్లను ము

Published: Wed,July 27, 2011 09:15 PM

వారు సరిహద్దులు గీస్తున్నారు..

ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సి

Published: Wed,July 27, 2011 09:27 PM

ఉమ్మడిగా ఉద్యమిద్దాం

పొ. ఘంటాచక్షికపాణి (సామాజిక పరిశోధకులు) ‘ఘంటా’ పథం పాలకవర్గంలో ఉన్న ఒక ప్రతినిధి రాజీనామా చేయడమంటే బాధ్యత నుంచి పారిపోవడం

Published: Wed,July 27, 2011 09:21 PM

మన తరం మార్గదర్శి

ప్రొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థి