ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?


Fri,January 24, 2014 12:06 AM

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా
ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలచారి సభ చర్చను చేపట్టిన తరువాత విభజనను వ్యతిరేకిస్తున్న తమిళ సభ్యులకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. బిల్లును
వ్యతిరేకించేవాళ్లు ఎవరూ సభలో మాట్లాడవద్దని, ఎందుకు విడిపొవాలనుకుంటున్నారో
తెలుగు సభ్యులు వివరిస్తారని వాళ్ళ మనోభావాలు, అభిప్రాయాలు సభ గౌరవించాలంటే వారిని అడ్డుకోకుండా సంయమనం పాటించాలని కోరారు.
సాధారణంగా మనుషుల్లో చాలామంది తమకు గత్యంతరంలేని స్థితిలో సమస్యను ఎదుర్కోలేని సందర్భంలో నిరాశ పడిపోతారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే అంతా తమ దురదష్టమని వాపోతుంటారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అగమ్యగోచరమైన ఈ దశలో ఆయన అంతా తన దురదష్టమని అనుకుంటున్నారు. అదే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చ జరిగిన సందర్భంగా శాసనసభలోనే అనేశారు. ఆ మాట అన్నప్పుడు ఆయన నిజంగానే చిత్తుగా ఓడిపోయిన టీం కెప్టెన్‌గా కనిపించాడు. నిజానికి ఈ పరిస్థితి ఆయన స్వయంకతం. ఆరునెలల క్రితం దాకా అందరూ వర్తమాన రాజకీయాల్లో కిరణ్‌ను మించిన అదష్టవంతుడు ఇంకొకరు లేరనే అనుకున్నారు. ఆయన కూడా పదేపదే అదే చెప్పేవాడు. ముఖ్యమంత్రి కావడం తన అదష్టమని, సోనియాగాంధీ దయ అని ఆయన తరచూ చెపుతుండేవాడు. ఈసారి మాత్రం అమ్మ దయ అంటూనే ఆయన తన మాట మొదట్లోనే ఓటమిని ఒప్పుకున్నారు. తన ఓటమికి దురదష్టాన్ని సాకుగా చూపించే ప్రయత్నం చేశారు. కార ణం ఏదైనప్పటికీ కిరణ్ తన ఓటమిని నిండు సభ లో ఒప్పుకోవడం విశేషం.

గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఆయన ఆడిన ఆటే అనైతికం. సాధారణంగా క్రీడాకారులు ఉదార విలువలతో ఉంటారని, నిబంధనలకు అనుగుణం గా నడుచుకునే క్రమశిక్షణ కలిగి ఉంటారని అం టుంటారు. కానీ కిరణ్‌లో అది లోపించింది. ఒక్క క్రీడాస్ఫూర్తి మాత్రమే కాదు ఆయనలో ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన రాజ్యాంగ నిబద్ధత కూడా కొరవడింది.

ఆయన బిల్లు సందర్భంగా వ్యవహరించిన తీరు సభా నాయకుడి హోదాకే కళంకం తెచ్చేదిగా ఉన్నది. సాధారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సభ లోపల అయినా వెలుపల అయినా మంత్రి వర్గ సమష్టి నిర్ణయానికి నిబద్ధుడై నడుచుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ముఖ్యమంత్రికి సంపూర్ణమైన అధికారాలు ఇవ్వలేదు. ఆయన కేవలం సభా నాయకుడు. శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి అయినందున ఆయన సభానాయకుడుగా, ప్రభుత్వ అధినేతగా ఉండవచ్చు. ఆ మొత్తం సభకు ప్రతినిధిగా ఆయన రాజ్యాంగ విధులు నిర్వహిస్తా రు. రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ద్వారా ఈ విధులన్నీ అమలు చేస్తారు. సభా నాయకుడు సభ్యుల మనోభావాలకు భిన్నంగా ఉన్నా, మంత్రివర్గ సమష్టి నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించినా ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించి పక్కకు తప్పించే అధికారం సభ్యులకు ఉన్నది. కిరణ్ ఇప్పు డు బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వం వెళ్లదీస్తున్నాడు.

ఆయనకున్న మెజారిటీలో దాదాపు యాభై మంది తెలంగాణ శాసనసభ్యులే ఉన్నారు. మంత్రివర్గంలో కూడా తెలంగాణ ప్రాతినిధ్యం ఉన్నది. అయితే ఇటు మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధులను సంప్రదించకుండా, ఆయకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యులెవరినీ సంప్రదించకుండా, ఆయనను ముఖ్యమంత్రిగా నియమించిన పార్టీ విధానానికి విరుద్ధంగా ఆయన మాట్లాడవచ్చునా అన్నది ప్రశ్న. ఇదే ప్రశ్నను మంత్రి జానారెడ్డి అడిగారు. కానీ ముఖ్యమంత్రి నుంచి జవాబు లేదు. ఎందుకంటే సహచర మంత్రుల విశ్వాసం లేకుండాతనను ఎన్నుకున్న వారిలో సగంమంది ప్రమేయం లేకుండా ఎవరైనా నాయకులుగా చెలామణి కావ డం చెల్లదని ఆయనకు తెలుసు. అదే సభలో వాళ్ళంతాలేచి నిలబడి ఈయనను మేం మా ప్రతినిధిగా అంగీకరించలేము అని చేతులెత్తేస్తే ఆ వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాల్సి వస్తుందనీ తెలుసు. రాజ్యాంగం కూడా అదే చెపుతున్నది. ఇదేదీ జరగకపోయినా మొత్తం చర్చంతా రాజ్యాంగ విరుద్ధంగా పోతున్నదని భావిస్తే రాజ్యాంగ ధర్మంగా గవర్నర్ నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, 164 (1),356 ఇదే విషయం చెపుతున్నాయి. బహుశా కిరణ్ ప్రవర్తన ఇంకా ఇదే రీతిలో కొనసాగితే రాజ్యాంగంలోని నిబంధనల మేరకు రాష్ట్రపతి పాలన మినహా మరో మార్గం కనిపించడంలేదు.


అయినా సరే మంత్రి మండలి విశ్వాసం లేకపోయినా, (ఆంధ్ర ప్రాంతంలోని కొందరు సభ్యులు కూడా రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారు కాబట్టి) మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యంగా లేకపోయి నా ముఖ్యమంత్రి కిరణ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. పోనీ ఆ ప్రసంగం అయినా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానో, రాష్ట్రపతి సూచించిన మేరకు ఉందా అంటే అదీ లేదు. కేంద్ర కేబినెట్ రూపొందించిన బిల్లును రాజ్యాంగ నియమాల మేరకు రాష్ట్రపతి శాసనసభకు పంపించారు. ఆ బిల్లు పైన అందులోని అంశాలపైన సభ్యుల అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఆయన అందు లో కోరారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి బద్ధుడైతే హుందాగా చర్చను కొనసాగనివ్వాలి. కానీ ఆయన రెండువారాల పాటు చర్చే లేకుండా చేసి సభా వ్యవహారాల శాఖ మంత్రినే మార్చివేశా రు. సభ సజావుగా సాగే విధంగా చూడడం నాయకుడుగా ఆయన బాధ్యత. కానీ ఆయన సభకు అడుగడుగునా ఆటంకాలు కల్పించే వారిని ఉసిగొల్పి కెప్టెన్‌గా ఉండాల్సిన మనిషి నెలరోజుల పాటు సామాన్య ఆటగాడిగా మారిపోయాడు. పనిలో పని గా నియమాలకు విరుద్ధంగా అందరితో లిఖితపూర్వక అఫిడవిట్‌లు తీసుకున్నాడు. చర్చ బిల్లు అంశా ల మీద కాకుండాతీరిగ్గా చరిత్ర చర్చిస్తూ కాలయాపన చేస్తున్నాడు. పైగా చరిత్ర నేర్చుకోండని సభ్యు లకు హితబోధ చేస్తున్నాడు. నిజానికి చరిత్ర చదువుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ముఖ్యమం త్రి గారే.

నిజానికి ఇదంతా రాజనీతిజ్ఞులు చేయాల్సి న పనికాదు. చరిత్రలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుం చి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజగోపాలచారి సభ చర్చను చేపట్టిన తరువాత విభజనను వ్యతిరేకిస్తున్న తమిళ సభ్యులకు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. బిల్లును వ్యతిరేకించేవాళ్లు ఎవరూ సభలో మాట్లాడవద్దని, ఎందుకు విడిపోవాలనుకుంటున్నా రో తెలుగు సభ్యులు వివరిస్తారని వాళ్ళ మనోభావాలు, అభిప్రాయాలు సభ గౌరవించాలంటే వారి ని అడ్డుకోకుండా సంయమనం పాటించాలని కోరా రు. అలాగే చేశారు కూడా. అందుకే రాజాజీ రాజనీతిజ్ఞత గురించి అరవైఏళ్ళ తరువాత కూడా చరిత్ర లో చరిత్ర కారులు చెప్పుకుంటున్నారు. కానీ కిరణ్ అలా లేరు, అయినా చరిత్రలో ఆయన గురించి కూడా చెప్పుకుంటారు. కానీ రాజాజీ మాదిరిగా రాజనీతిజ్ఞుడని మాత్రం కాదు.

[email protected]

363

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Featured Articles