ఉద్యమాలే ఊపిరిగా..


Fri,December 27, 2013 03:02 AM

చరివూతలో మనం అనేకమంది ఉపాధ్యాయులను చూసి, విని ఉండవచ్చు. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని పలు సందర్భాల్లో మనకు తారసపడిన ఉపాధ్యాయులను గమనించినప్పుడు మనకు అనిపించి ఉండవచ్చు. కానీ తెలంగాణ ఉపాధ్యాయులను గమనించినప్పుడు మాత్రం ఇలాంటి ఉపాధ్యాయులు ఇంకెక్కడా ఉండరేమో అనిపించకమానదు. ముఖ్యంగా 1969ఉద్యమం ముగిసిన తరువాత ఆవరించుకున్న నిశ్శబ్దాన్ని ఛేదించుకుని వచ్చిన తరం తెలంగాణ నేల గర్వపడే విధంగా ఎదిగింది. ఈ నేలను ప్రజాస్వామ్యీకరించేందుకు ప్రతిన బూనినట్టు జీవితమంతా జన చైతన్యంతో తపించిం ది. అలాంటి తరంలోని వాడే ఆకుల భూమయ్య సర్. నిరాడంబరంగా, నిండుగా కనిపించే భూమ య్య సర్ చూడడానికి ఒక సాదాసీదా స్కూల్ టీచర్‌గానే కనిపించినా ఆయన లోతైన ఆలోచనల వెనుక ప్రజల కోసం పరితపించే నిరంతర చైతన్య శీలత ఉండేది. ఉపాధ్యాయుడు అంటే తరగతిగది గురిం చి మాత్రమే ఆలోచించి విద్యార్థులకు పాఠాలు బోధించే పనిముట్టు అన్న భావనను పక్కకుపెట్టి తన చుట్టూ వున్న సమాజాన్ని తరగతిగదిగా మార్చుకు న్న వ్యక్తి ఆయన.

కరీంనగర్ జిల్లాలో ఒక మామూలు ఉపాధ్యాయుడుగా మొదలుపెట్టిన ఆకుల భూమయ్య ప్రయాణం డిసెంబర్ 24తో ముగిసింది. ప్రమాదంలో చనిపోయినట్టు చెపుతున్నా.. ఆ ప్రమాదం సహజమైంది కాదని, దాని వెనుక కుట్ర ఉందని ఉద్యమ సంఘాలు, ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

1969లో మొదటి తరం తెలంగా ణ ఉద్యమానికి ప్రభావితుడై, అందులో పాల్గొని, ఆ ఉద్యమ వైఫల్యం తరువాత పీడిత ప్రజల విముక్తితోనే తెలంగాణ విముక్తి కూడా ముడివడి ఉందని గ్రహించిన అప్పటి తరంలో ఆయన ఒకరు. ఆంధ్రవూపదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడిగా ఎదిగి ఆయన ఉపాధ్యాయ ఉద్యమ స్వరూపాన్నే మార్చివేశారు. అప్పటిదాకా కేవలం జీతాలు, ఇంక్రిమెంట్లు, బదిలీ లు, నియామకాల గురించి ఆలోచించే ఉపాధ్యాయ సంఘాల స్వభావాన్ని మార్చి, ప్రజలతో మమేకమై, ప్రజాచైతన్యంతో సమాజాన్ని మార్చే మార్గాన్ని ఎం చుకున్నాడు. అప్పటి నుంచి అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో ఆయన అంతర్భాగంగా ఉన్నాడు.
భూమయ్య సర్ ఇవాళ ప్రజావూఫంట్ భూమయ్య గా మారడం దాదాపు నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం ఉంది. ఈ కాలంలో తెలంగాణ ప్రజలు నిరంతరం ఏదో ఒక పోరాటంలోనే ఉన్నారు. ఆ పోరాటాలే ఇక్కడి తొలితరం విద్యార్థులను ప్రజాస్వామిక విలువలవైపు నడిపించాయి. అయితే ఇక్క డి ఉపాధ్యాయులు ప్రజల నుంచి ఎంత నేర్చుకున్నా రో అంతకు అంత పలు సంక్షోభ సమయాల్లో ప్రజాపక్షం వహించారు.

ఆకుల భూమయ్య ఆ కోవకు చెం దిన వ్యక్తి. భూమయ్యది పెద్దపల్లి దగ్గరి కాచాపూర్. ఆయన ప్రస్థానం మీద ఆ ఊరి ప్రభావం, ఆ నేల ప్రభావం, ఆ ప్రాంతంలో ప్రజలు చూపిన తెగువ ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయి. పెద్దపెల్లికి చుట్టూ నలభై యాభై గ్రామాలు అప్పటి ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పాలేర్లు సంఘాలు పెట్టి తమ హక్కుల కోసం నినదించడం మొదలుపెట్టిన నాటి నుంచి, రైతుకూలీ సంఘాలు ఏర్పడి కనీస వేతనాల కోసం పల్లెలన్నీ ఏకం చేసిన కాలంలో పెద్దపల్లి ఒక విప్లవ శిబిరం. పీపుల్స్‌వార్ నాయకత్వంలో వాళ్ల ఆలోచనలకు మరింత పదునుపెట్టి ‘దున్నే వాడికే భూమి కావాలని’ నినదించారు. ఇది కల్లోలానికి దారితీసిన ది. అప్పటికే అక్కడ బయ్యపు దేవేందర్‌డ్డి లాంటి యువనాయకులు ప్రజల్లో ఒక కొత్త ఆలోచనలకు బీజం వేసి ఉన్నారు. అలాగే మల్లోజుల సోదరులు కోటేశ్వర్‌రావు, వేణుగోపాల్ ఎదిగి వచ్చారు. కాచాపూర్ చుట్టూ ఉన్న ఊర్లు ఆకాలంలో రగిలే కొలుము ల్లా ఉండేవి.

కాచాపూర్ 1970కి అటుఇటుగా అట్టుడికిన ఊరు. కాచాపూర్‌ను ఆనుకుని వడ్కాపూర్ ఉంటుంది. ఈ ఊరికి పరిచయమే అవసరం లేదు. వడ్కాపూర్ చంద్రమౌళి అంటే విప్లవోద్యమంలో ఒక సంచలనం. వడ్కాపూర్ ఐదారు కిలోమీటర్ల దూరం లో ఎలిగేడు అనే ఊరుంటుంది. అది కట్ల మల్లేశం ఊరు. తెలంగాణ కార్మిక రంగ చరివూతను తిరగరాసిన సింగరేణి కార్మిక సమాఖ్య రూపశిల్పి. రమాకాంత్‌గా ఆయన చిరపరిచితుడు. వీళ్ళంతా ఒక కోవకు చెంది న ఒకే కాలపు వీరులు. ఒక దశలో కాచాపూర్ నుంచి కాట్నపల్లి దాకా ఎర్ర తివాచీలా ఉండేది. ఆ తివాచీ నుంచి ఎందరో యువకులు నడిచి వెళ్ళారు. చీకటి నిండిన ఆ పల్లెల్లో వెలుగు నింపాలని కలగన్నారు. అప్పటికి అంత సాహసం చేయలేని వాళ్ళు మాత్రం ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి చేతనైనంత సాయం అందిస్తూ ఉద్యమాలను నిలబెడుతూ వచ్చారు. అలా చివరిదాకా నిలబడ్డ వ్యక్తి భూమయ్య. నిలబడడమే కాదు ఒక ఉపాధ్యాయుడుగా ఉంటూనే, ఉద్యమాలతో మమేకమై కదిలాడు.


టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమ మలిదశ మొదలయ్యిందని అంటుంటారు. కానీ 1990వ దశకంలో ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీజాలు పడ్డాయి, కిషోర్‌డ్డి మనోహర్‌డ్డి లాంటి మిత్రులు తెలంగాణ విద్యార్థి సంఘాలు పెట్టి అడపాదడపా అలజడులు చేస్తున్న ఆ దశలోనే పెద్దలు కేశవరావు జాదవ్, నాట్యకళా ప్రభాకర్, పాశం యాదగిరి ఇట్లా ఎవరికీ తోచిన పద్ధతుల్లో వాళ్ళు తెలంగాణవాదాన్ని సజీవంగా ఉంచు తూ వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు లక్ష్మణ్, హరినాథ్, సింహాద్రి, పీ.ఎల్. విశ్వేశ్వర్‌రావు లాంటి అనేకమంది కలిసి ‘సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్’ ఏర్పాటు చేసి తెలంగాణ వెనుకబాటుతనానికి కారణాలు అధ్యయనంచేసి ప్రచురించారు.

అప్పటికే గాదె ఇన్నయ్య ‘దగాపడ్డ తెలంగాణ’ పేరుతో మొట్టమొదటగా వివిధ రూపాల్లో ఉన్న ఆంధ్ర వలస దోపి డీ మీద ప్రచురణలు, సదస్సులు నిర్వహిస్తూ కొత్త ఆలోచనలకు బీజం వేశాడు. ఇట్లా 1995-96 నాటి కి తెలంగాణ ఆకాంక్ష మళ్ళీ చిగురించింది. 1996 భువనగిరి సభ, ఆ తరువాత 1997లో ‘వరంగల్ డిక్లరేషన్’ వచ్చాయి. అవి తెలంగాణ జనసభకు ఒక రూపాన్నిచ్చాయి.భౌగోళిక విభజన మాత్రమే కాకుం డా తెలంగాణ ప్రజలకు ఇక్కడి వనరుల మీద, భూమి, నీళ్ళ మీద అధికారం కావాలన్న ప్రణాళికతో ప్రజాస్వామిక పునాదుల మీద కొత్త రాష్ట్రం కావాల న్న డిమాండును ఆకుల భూమయ్య నాయకత్వం లో ‘జనసభ’ ముందుకు తెచ్చింది. అది తరువాత 2010లో ప్రజావూఫంట్‌గా ఆవిర్భవించింది. దానికి ఆయన చైర్మన్. తన విద్యార్ధి దశలో వదిలేసిన తెలంగాణ జెండాను మళ్ళీ భుజానికి ఎత్తుకున్నాడు. పోలవరం, సింగరేణి ప్రైవేటీకరణ, వనరుల దోపిడీ విషయాల్లో భూమయ్య సాగించిన పోరాటం మరువలేనిది. ఇట్లా కరీంనగర్ జిల్లాలో ఒక మామూలు ఉపాధ్యాయుడుగా ఆయన మొదలుపెట్టిన ప్రయాణం డిసెంబర్ 24తో ముగిసింది. ప్రమాదంలో చనిపోయినట్టు చెపుతున్నా.. ఆ ప్రమాదం సహజమైంది కాదని, దాని వెనుక కుట్ర ఉందని ఉద్యమ సంఘా లు, ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

ఆకుల భూమ య్య సర్‌తో సహా ఆయన తరహా భావజాలాన్ని, బాధ్యతలను నిర్వహించిన వారికి ఇటువంటి అనూ హ్య ప్రమాదాలు అనుభవంలో ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడబోతున్న ఈ తరుణంలో ప్రత్యామ్నాయం లేకుండా చూసుకునే ప్రయత్నంలో పాలకులే ఈ పనిచేసి ఉంటారని ప్రజా సంఘాలు అంటున్నాయి. కానీ ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళెవరూ పెదవి విప్పలేదు. పోలీసులు కూడా ప్రజ ల్లో, తెలంగాణ సంఘాల్లో ఉన్న ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి పూనుకోలేదు. ఇది అనుమానా లు బలపడడానికి ఆస్కారం కల్పిస్తున్నది. జీవితమంతా తెలంగాణ కోసం నిలబడి రాష్ట్రం ఏర్పడుతు న్న దశలో భూమయ్య లేకపోవడం విషాదం. ఆయ న ఆశించిన ప్రజాస్వామ్య తెలంగాణ సాధన ఒక్కటే ఆయనకు ఎవరైనా ఇవ్వగలిగే నివాళి.

[email protected]

393

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ