ఇపుడొక కొత్త ఆయుధం కావాలి..!


Mon,September 26, 2011 11:06 PM


ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబోతోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఉద్యోగులు జీతాల గురించి ఆలోచించడం లేదు. అయినప్పటికీ వచ్చే నెలలో పండగలున్నాయి కాబట్టి జీతాలిప్పించే బాధ్యత అధికారంలో ఉన్న మంత్రులు తీసుకోవాలి. అలా జరగని పక్షంలో ఒకటో తారీఖున వాళ్ళంతా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఉద్యమం ఈ విడత తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యంగా కదలాలి.

మనకు ‘చీమ’ కథ చిన్నప్పటి నుంచీ తెలుసు. ‘చీమా చీమా ఎందుకు కుట్టావూ’ అని అడిగితే ‘నాబంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా’! అనే సమాధానం. చీమకంటే ముందు ఏ చిన్న పిల్లోడైనా చెప్పేస్తాడు. పాపం కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ఆ కథను తిరగేసి చెప్పి చేతులు కాల్చుకున్నాడు. అసలాయన తన కథ మొదలుపెట్టాల్సింది ‘చేపా చేపా ఎందుకు ఎండలేద ని’. తెలంగాణ రైతులు ‘తమ పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయని’ ఇంకా అడగకముందే ఆయన చీమతో ప్రారంభించి కథ చెప్పడం మొద లుపెట్టాడు. ‘సింగరేణిలో సమ్మె చేయడం వల్ల బొగ్గు పెల్ల పెగల లేదని, బొగ్గులేక పోవడం వల్ల కరెంటు ఉత్పత్తి ఆగిందని, కాబట్టి మీ పంటలు ఎండి పోవాల్సిందే’నని ఆయన ఇప్పుడు కథ చెపుతున్నాడు. అట్లా చెప్పగానే రైతులు, ప్రజలు సమ్మె చేస్తోన్న కార్మికుల మీదనో, విద్యుత్ ఉద్యోగుల మీద నో తిరగబడితే సమ్మె ఆపేస్తారని ఆ దెబ్బతో అసలు తెలంగాణే వద్దని అంటారని పాపం ఆయన ఆశపడ్డారు.

కానీ తెలంగాణ ప్రజలు ‘యువకిరణంలా’ రాజకీయ అనుభవం, అవగాహనలేని వాళ్ళు కాదు గదా. ఇప్పుడు ప్రజలు, ఉద్యమకారులు ఆయన కథల్లోని నీతిని అర్థం చేసుకున్నారు కాబట్టే చేప దగ్గరే ఆగిపోకుండా సింగరేణి కార్మికులు సమ్మె ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్నను అడుగుతున్నారు. ఒక్క సింగరేణి కార్మికులే కాదు, యావత్ తెలం గాణ యివాళ ఎందుకు తిరగబడిందో తెలుసుకోమని కోరుతున్నారు. కానీ అడ్డదిడ్డంగా కథను తిప్పి అడిగిన వారిని అయోమయంలో పడేయాలన్నది ఆయన ప్లాన్. రెండువారాలుగా సాగుతున్న సమ్మెతో సకల జనులు ఈ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు పొలాలు ఎందుకు ఎండాయని మాత్రమే అడగ తెలంగాణలో ఉన్న జలాశయాలు ఇంకా నిండుగా కళకళ లాడుతూనే ఉన్నా అక్కడ కరెంటు ఎందుకు ఉత్పత్తి కావడం లేదని అడుగుతున్నారు.

కరెంటు కేవలం ఒక్క బొగ్గుతోనే ఉత్పత్తి కాదని, జలవిద్యుత్ కూడా ఉంటుందన్న సంగతి ఎప్పుడో తాతల కాలం కిందటే కనిపెట్టారు. అది కనిపెట్టిన నాడే శ్రీశైలంలో, నాగార్జున సాగర్‌లో ప్రాజెక్టులు కట్టి, నీళ్ళను నిల్వచేసి అక్కడ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేసి బొగ్గు నిలిపేస్తే ఆ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్ ఎందుకు ఉత్పత్తి చేయడం లేదని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిలదీసే సరికి ఇప్పుడు ఆయన నీళ్ళు నమలాల్సి వస్తోంది. అలాగే సమైక్యాంధ్ర మిథ్యావాద సృష్టికర్త లగడపాటి రాజగోపాల్ తన ల్యాంకో కంపెనీ నుంచి రోజుకు మూడు వందల యాభై మెగావాట్ల విద్యుత్తును పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకున్నదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎవరూ ఊకదంపుడు మాటలు మాట్లాడరు. అందులో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మెరుపు తీగలు. వాళ్ళు కేవలం కరెంట్ మాత్రమే కాదు అవసరమైనప్పుడు షాక్ కూడా ఇవ్వగలరు.


బొగ్గు గనులు మూతపడినా కరెంటుకు కష్టం ఉండదని, ప్రత్యామ్నాయం గా జలవిద్యుత్ వాడవచ్చన్నది మన విద్యుత్ ఉద్యోగుల వాదన. మన రాష్ట్రంలోని జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలతో రోజుకు అరవై అయిదు మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఆ ఉత్పత్తిని ముప్ఫై మిలియన్లకే పరిమితం చేసి కృత్రిమ కొరతను సృష్టించి తెలంగాణలో రైతులకు ఇవ్వాల్సిన కరెంట్‌లో కోత విధించింది. అట్లా పొలాలను ఎండబెట్టి, పంటనష్టం చేసే పాపపు పనికి ప్రభుత్వమే ఒడిగట్టింది. అంతే కాదు జలాశయాలు నిండుగా ఉంటే సీమాంధ్రలో మూడో పంటకు వాడుకోవచ్చన్నది ఆ కుట్రలో అసలు ఎత్తుగడ. ఇవాళ తెలంగాణ లో వరిచేన్లు పొట్టకొచ్చే కాలంలో నీళ్లు అందకుండా చేయడం గర్భవూసావా న్ని మించిన దుర్మార్గం. ఈ ఎత్తుగడలో మరోకోణం, తెలంగాణ రైతుల పంట లు చంపేసి ఆంధ్రా పరిక్షిశమలను కాపాడుకోవడం.

గడిచిన పదేళ్ళలో ఎంత కరెంట్ కొరత ఉన్నా రైతులకు ఇచ్చే కనీస కరెంట్‌లో కోత విధించకూడదని, కొరత మరీ తీవ్రంగా ఉంటే ముందు గృహ అవసరాలకు, ఆ తరువాత వాణి జ్య అవసరాలకు ఇచ్చే కరెంట్‌ను క్రమబద్ధీకరించే విధానాన్ని ప్రభుత్వం పాటిస్తోంది. అది మరీ ఎక్కువైనప్పుడు పరిక్షిశమలకు ‘పవర్ హాలిడే’ ఇవ్వ డం ఈవిధానంలో భాగం. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే కాదు రైతు వ్యతిరే కి అన్న అపవూపద మూటగట్టుకున్న చంద్రబాబుపాలనలో కూడా ఈ పధ్ధతి పాటించారు. కానీ ఈసారి నేరుగా ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే రైతులకు, గ్రామాలకు కరెంట్ కోత విధించడం వెనుక ప్రతీకార ధోరణితో కూడిన కుట్ర దాగి ఉన్నదని అర్థమౌతోంది. పరిక్షిశమలకు ‘పవర్ హాలీడే’ ఇస్తే ఆంధ్రా పెట్టుబడిదారులు, పారిక్షిశామిక వేత్తలు నష్టపోతారు.

కాబట్టి ఇప్పుడాయన విద్యు త్ విధానాన్ని తిరగ రాస్తున్నారు. ‘మీరు సమ్మె చేస్తున్నారు కాబట్టి మీరే నష్ట పోవాల’న్నది ఆయనిప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నారు. అయితే సీమాంవూధలో ‘క్రాప్’ హాలిడే పేరుతో సమ్మె చేస్తున్న రైతులతో ముఖ్యమంత్రి చర్చపూందుకు జరిపారు. నిజానికి తెలంగాణ రైతులు సీమాంవూధలో మాదిరిగా పొలాలను రొయ్యల చెరువులో, చేపల చెరువులో చేసుకుని సొమ్ము చేసుకుంటూ, పంటలు పండించకుండా ప్రభుత్వానికి ధాన్యం కొరత సృష్టిస్తామని బెదిరించలేదు. అలా బెదిరించిన కోస్తా రైతుల కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీ వేసి వారంలో నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడు వాళ్లకు పరిహారం, ప్యాకేజీలు ప్రకటించడానికి సిద్ధపడుతూ.. తెలంగాణ రైతుల మీద కత్తి గట్టడానికి కారణాలను అడగాల్సి ఉంది.


నిజంగానే ముఖ్యమంత్రికే ఏడు చేపల కథలో చీమ చెప్పిన తార్కికత, తాత్వికత అర్థమైనట్టు లేదు. సీమాంధ్ర పాలకులు ఇలా కుయుక్తులతో తెలంగాణ బంగారు పుట్టలో వేలు పెట్టి కకావికలం చేసినందువల్లనే గత అర్ధ శతా బ్ద కాలంగా చీమలు తిరగబడుతూ చస్తూ వస్తున్నాయి. ఇవాళ చలి చీమలు దండు కట్టి తిరుగుబాటు చేస్తున్నాయి. అందుకే సకల జనుల సమ్మెను చూసి న ఎవరికైనా అది ఎంతటి సాహసోపేతమైన తిరుగుబాటో అర్థమౌతుంది. క్షురకులు, రజకులు మొదలు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు కదులుతున్నారు. అటువంటప్పుడు మూలాలలోకి వెళ్ళకుండా కేవ లం ‘చేపా చేపా ఎందుకు ఎండలేద’ని అడిగి ఆగిపోతే కథ అక్కడితో ముగిసి పోతుందనుకుంటే అంతకుమించిన అతితెలివి ఇంకేముంటుంది? ముఖ్య మంత్రి చూడడానికి అమాయకుడిలాగే కనిపిస్తారు. ఎలాంటి భావోద్వేగాలు లేని చిరునవ్వు పులుముకుని వచ్చీరాని తెలుగులో తడబడుతూ మాట్లాడే అతన్ని నిజంగానే అమాయకుడనుకుంటే పొరపాటే.

అతని కవళికలు, కదలికలే కాదు మాటలో తత్తరపాటు గమనించిన వారికి అతని మనసుకూ మాటకు పొంతన లేదన్నది తెలిసిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంవూతిగా సకల జనుల సమ్మె ప్రారంభమై తెలంగాణ సమరోధృతి పెరిగిన తరువాత ఆయన పత్రికల వారితో తను చెప్పదలుచుకున్నది చెప్పేశారు. విలేకరులు ప్రశ్నలు అడగొద్దని హుకుం జారీ చేశారు. ఎప్పుడైనా, ఎవరితోనైనా సంభాషణ మొదలుపెడితే చాలా ప్రశ్నలు అడుగుతారు, వాటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అలా చెపితే అసలు రంగు బయటపడుతుంది కాబట్టి అతి తెలివి గలవాళ్ళు అలా ప్రశ్నలు అడగడాన్నే అడ్డుకుంటారు. ముఖ్యమంత్రి కూడా అదే చేశారు. కానీ పత్రికల వారితో చెప్పిన విషయాల్లోనే ఆయన తానేమిటో, తన కార్యాచరణ ఏమిటో స్పష్టపరిచారు. సింగరేణి కార్మికుల సమ్మె వల్ల కరెంట్ ఉత్పత్తి ఆగిపోతుందని, దీనితో మీ ప్రాంత రైతుల పంటలే ఎండిపోతాయని, విద్యాసంస్థల బంద్ వల్ల మీ పిల్లలే నష్టపోతారని, పరీక్షలు అడ్డుకుంటే మీ పిల్లలకే ఉద్యోగాలు రావని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ‘మా’’ మీ’ అన్న మాటలు మాట్లాడడమే విభజించి పాలించే ఆలోచనకు నిదర్శనం.

కిరణ్‌కుమార్ రెడ్డి ఇవాళ తాను సీమాంధ్ర సీఎంను అనుకుంటున్నాడు. అసలు ఆయన ముఖ్యమంవూతిగా ఉన్నాడంటే అది తెలంగాణ ప్రజల చలవ. తెలంగాణ నుంచి ప్రజలు గెలిపించిన 53 మంది శాసన సభ్యుల మద్ద తు వల్లే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ వాళ్ళంతా గెలిపించిన ప్రజలకంటే కిరణ్‌కుమార్ రెడ్డికే విధేయులుగా వుంటున్నారు. అదే సీమాంధ్ర నుంచి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 102 మందిలో ఇప్పటికే సగం మంది జగన్‌కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జెండా ఎత్తేశారు. అలాంటి వ్యక్తి ‘మీరు, మేము’ అని మాట్లాడడం అతన్ని నిలబెడుతున్న శాస నసభ్యుల్నే కాదు, వాళ్ళను గెలిపించిన ప్రజలందరినీ అవమానించినట్టే లెక్క.


అవమానం అని కేవలం మాటవరసకు అన్నది కాదు. ఆయన ఆ పనిని ప్రత్యక్షంగా చేస్తున్నాడు. తెలంగాణ సమ్మె విషయంలో తప్పుడు నివేదికలు ఎందుకు పంపిస్తున్నావని అడిగినందుకు పొన్నం ప్రభాకర్‌ను ‘బుద్ధి లేకుం డా ఏం మాట్లాడుతున్నావ్’ అని గదమాయించాడు. ప్రభాకర్‌ను గతంలో కూడా ఒక సభలో జై తెలంగాణ అని నినదించినందుకు ‘ఒక్కసారి గెలిస్తే హీరో అయిపోయినట్టా’ అని కూడా అవమానించాడని విన్నాం. నిజమే ఒక్కసారి గెలిచినా ప్రజలతో ఉన్నాడు కాబట్టి ఇక్కడి ప్రజలకు ప్రభాకర్ హీరోనే. పొన్నం ప్రభాకర్‌కు పదవి దొడ్డి దారిలోనో, వారసత్వంగానో రాలేదు. అత ను కిరణ్ రెడ్డిలా దశాబ్దాల పాటు రాజ్యం ఏలిన రాజకీయ నాయకుడి కొడు కో, శ్రీధర్‌బాబులా స్పీకర్ కొడుకో కాదు. వాళ్ళ తల్లిదంవూడులు సాదా సీదా కల్లుగీత కార్మికులు. అతని ఎదుగుదల వెనుక ఇరవై ఐదేళ్ళ పోరాటం, శ్రమా ఉన్నాయి. సమస్యలు అనుభవించి సమాజం అట్టడుగు వర్గాల నుంచి వచ్చి న వాళ్ళే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలలో ఎక్కువమంది ఉన్నందువల్లే ఇప్పు డు పార్లమెంటులో అడపాదడపా తెలంగాణవాదం వినిపిస్తోంది.

అతనొక పార్లమెంటు సభ్యుడని కూడా చూడకుండా అవహేళన చేయడం దొరతనం అయితే అవ్వొచ్చేమో కానీ రాజనీతి కాదు. అలాగే తెలంగాణ మీద ఎన్నడూ బహిరంగంగా నోరు మెదపకుండా, అతని సొంత నియోజక వర్గం యువకుడు యాదిడ్డి ఆయన ఉండే ఢిల్లీ వాకిట్లో ఆత్మార్పణం చేసుకున్నా చలించని వ్యక్తి జైపాల్ రెడ్డి. పాపం గుట్టు చప్పుడు కాకుండా తన పదవిని కాపాడుకుంటున్న సీనియర్ కేంద్ర మంత్రి అతను! అలాంటి వ్యక్తిని కూడా అదనపు గ్యాస్ అడిగితే ఆదుకోలేదని నిందించడం, తెలంగాణ ఎంపీలు అతన్ని అడ్డుకున్నారని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసం? కిరణ్‌కుమార్ రెడ్డి కేవలం మాటలతోనే కాదు చేతలతో అంతకంటే ఎక్కువగా తెలంగాణ వాదాన్ని తిప్పికొట్టే పేరుతో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నాడు. ఈ పరి స్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. తెలంగాణ ప్రాంత మంత్రులతో సమస్యను చర్చించాల్సింది.

ఈ ప్రాంత ప్రజలను అంతో ఇంతో నమ్మించ గలుగుతున్న పార్లమెంటు సభ్యుల సహకారం కోరాల్సింది. కనీసం అఖిల పక్షాన్ని పిలిచి పరిస్థితులు చర్చించి, సమస్య పరిష్కరించాలని కేంద్రానికొక లేఖ నైనా రాసి ఉండాల్సింది. లేదా సమ్మెకు ముందస్తుగానే నోటీసు ఇచ్చిన వారిని పిలిపించి మాట్లాడాల్సింది. పరిష్కారం తన చేతుల్లో లేదని, ఢిల్లీ స్పందించడం లేదని, అన్ని రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి అక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని చెప్పి గడువు అడగాల్సింది. ఇవన్నీ ప్రజాస్వామిక పద్ధతులు. ఇవి వదిలేసి ఆయన తెలంగాణతో అమీ తుమీ తెల్చుకోవాలన్నంత కసితో వ్యవహరిస్త్తున్నాడని కాంగ్రెస్ నేతలే చెపుతున్నారు. ఆయన ‘ఎవ్వరి మాటా వినాల్సిన పనిలేద’న్న ధోరణితో ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని వారు వాపోతున్నారు.

అదే నిజమైతే నియంతలు ఎంత బలవంతులైనా ప్రజాస్వామ్యంలో ఎక్కువకాలం నిలబడలేరన్నది సత్యం. సమస్యను సామరస్యంగా పరిష్కరించే మా ర్గాలు వెతకకపోగా సమ్మెను తుపాకి గొట్టం ద్వారా అణచివేయడానికి అదనపు బలగాలు ఇవ్వాలని కోరాడు. ఇప్పుడు సమ్మె చేస్తోన్న ఉద్యోగులపైకి పోలీసులనే కాదు, ప్రజలను కూడా ఉసిగొల్పాలన్నది అయన ప్రణాళికని అర్థమౌతోంది. అందుకే ఆయన తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిన కరెంటు ఆపేశారు. ‘బొగ్గు లేదు కాబట్టి కరెంటు తయారు కాలేద’ని ఆయనిప్పుడు తెలంగాణ రైతులకు కాకమ్మ కబుర్లు చెపుతున్నారు. ముఖ్యమంత్రి సమస్య ను పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా ఈ ప్రాంతంలో అంతర్యుద్ధం సృష్టించి సమ్మె చేస్తోన్న సకల జనులను అణచివేయాలన్న కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని జేఏసీ అంటోంది.

సొంత మంత్రుల విజ్ఞప్తులను, పార్టీ తెలంగాణ పెద్దల సూచనలను పెడచెవిన పెట్టి ఆయన ఎపీపీఎస్‌సి పరీక్షలు నడిపిస్తున్నాడు. రవాణా స్తంభించి దాదాపు సగం మంది పరీక్షలు రాయలేకపోయారు. ఇది నిరుద్యోగుల మీద కక్ష సాధింపు కాక ఏమౌతుంది? ఆంధ్రాలో సమ్మెలేదు, అక్కడ అంతా ప్రశాంతంగా పరీక్షలు రాస్తుంటే ఇక్కడి విద్యార్థులు నష్టపోతారు. అలా నష్టపోయిన వాళ్ళో, లేక దాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగాలని, కేంద్రంలో చిన్నచితకా పదవిని పొందాలని ఆశ పడుతున్న వాళ్ళో సమ్మె మీద విరుచుకు పడాలన్నది ప్యూహమైతే అయివుండవచ్చు. కానీ అది ప్రభుత్వమే చేస్తే అంతకుమించిన ప్రజావూదోహం ఇంకొకటి ఉండదు.

తెలంగాణ డిమాండు రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాదు, న్యాయబద్ధమైన ఆకాంక్ష. పైగా అది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా. అటువంటి సమస్యను పరిష్కరించకపోగా, ఆ బాధ్యతను గుర్తు చేస్తో న్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం, వారిని శత్రువులుగా ఎంచి ప్రతీకార చర్యలకు పూనుకోవడం ప్రజాస్వామ్యంలో దుస్సాహసం. ఇప్పుడాయన దూకుడుతోనే పాలన మీద పట్టు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అసలైతే ఉద్యమకారులు దూకుడుతో ఉంటారు. కానీ అందు కు భిన్నంగా ఉద్యమ కారులు పరిమితికి మించిన సహనాన్ని ప్రదర్శిస్తున్నా రు. తెలంగాణ పౌరులు ఉద్యమంలో ఎంత పరిణతిని ప్రదర్శిస్తున్నారంటే ప్రజలంతా రైల్‌రోకోను కొనసాగించాలని పట్టుబట్టినా చెప్పిన మాట ప్రకారం గంటకొట్టినంత టంచనుగా పట్టాల మీదినుంచి లేచారు.

జేఏసీ తాము ఇంకా గాంధీ గిరికే కట్టుబడి ఉన్నామని అంటోంది. ఇప్పుడు మనల్ని పాలిస్తోన్న వాళ్లకు గాంధీ మీదే నమ్మకం లేదు. వాళ్ళు ‘గాంధీగిరి’ని గౌరవిస్తారని నేననుకోను. అలా ఉండి ఉంటే, ‘సమ్మె లేనేలేద’ని ఢిల్లీలో కూర్చున్న కొంగ్రెస్ పెద్దలు దబాయించే అవకాశం లేదు. వాళ్లకు సెగ తగలాలంటే ఉద్యమం ఇంకో దశకు చేరాలి. ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబోతోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఉద్యోగులు జీతాల గురించి ఆలోచించడం లేదు. అయినప్పటికీ వచ్చే నెలలో పండగలున్నాయి కాబట్టి జీతాలిప్పించే బాధ్యత అధికారంలో ఉన్న మంత్రులు తీసుకోవాలి. అలా జరగని పక్షంలో ఒకటో తారీఖున వాళ్ళంతా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలి.

ఉద్యమం ఈ విడత తెలంగాణ కాంగ్రె స్ లక్ష్యంగా కదలాలి. కూలిపోతున్నామన్నబలమైన సంకేతం అందితే తప్ప కుర్చీల మీద ఉన్నవాళ్ళు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళను కదిలించ గలిగే కొత్త ఆయుధం ఒకటి ఇప్పుడు కావాలి.

ప్రొ. ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
[email protected]


35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ