సమ్మె దెబ్బకు దిమ్మ తిరగాలి..


Tue,September 13, 2011 12:05 AM

అమెరికాలో బోస్టన్ నగరంలో వెంకట్ మారోజు అనే మిత్రుడున్నాడు. అంతనొక వీర తెలంగాణవాది. వెంకట్ సొంతూరు వరంగల్ జిల్లా జనగా మ. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చదివి ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఎంఐటిలో పీహెచ్‌డీ చేశాడు. అక్కడే ఒక పెద్ద కంపెనీలో పదేళ్ళపాటు పనిచేసి ఇప్పుడు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృ ద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నాడు. వెంకట్ లాగా భావి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచిస్తోన్న వాళ్ళు అమెరికాలో చాలా మంది ఉన్నారు. కానీ వెంక ట్ కొన్ని కశ్చితమైన రాజకీయ అభివూపాయాలున్న వ్యక్తి.

ముఖ్యంగా అతను అమెరికా ఉదారవాద, వ్యక్తి శ్రేయోవాద రాజకీయాలను అభివృద్ధి నమూనాను బాగా ఆకళింపు చేసుకున్నవాడు. అలాగే అమెరికాలో నల్లజాతి ప్రజల హక్కుల పోరాటాలలాగే ఇక్కడ దళిత బహుజన విముక్తి ఉద్యమాలు రావాలని ఆశిస్తూ ప్రత్యేక తెలంగాణలోనే అది సాధ్యమని భావించే వ్యక్తి. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల ప్రభావంలో ఉన్న వెంకట్ తెలంగాణ రాష్ట్రం విస్తృత ప్రజాపోరాటం ద్వారానే సాధ్యమని నమ్ముతాడు. గత మే, జూన్ మాసాల్లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది తెలంగాణ మిత్రులను కలుసుకునే అవకాశం వచ్చింది. పోయిన ప్రతి ఊరిలో వందలాది మంది తెలంగాణవాదులు పోగయ్యేవాళ్ళు. తెలంగాణ గురించి, ఉద్యమ తీరు తెన్నుల గురించి, రాజకీయ పార్టీల వైఖరి గురించి ఇక్కడి సంగతులు చర్చించేవాళ్ళు. ఉద్యమ తీరు పట్ల కొంద రు ఆవేదన చెందేవాళ్లు. వాళ్ళ అలోచనలు చెప్పేవారు. సలహాలు, సూచనలు చేసేవాళ్ళు.

అప్పటికి ఉద్యమం వేసవి సెలవులు తీసుకుంది. రాజకీయ పార్టీ ల అంటీ ముట్టని ధోరణి, ప్రజల నిర్లిప్తత వల్ల ఉద్యోగులు సహాయ నిరాకర ణ ముగించవలసి వచ్చింది. ఇది సహజంగానే తెలంగాణ వాదులను నిరుత్సాహపరిచింది. ఆ తరువాత కొద్ది రోజులకే నేను అక్కడికి వెళ్ళడం వాళ్ళందరూ ఆ విషయాలనే చర్చించేవారు. వెంక ట్ నన్ను అతనుండే బోస్టన్‌కు ఆహ్వానించాడు. 19వ శతాబ్దమంతా బోస్టన్ నగరం అద్భుతమైన పౌర ప్రతిఘటనకు వేదికగా ఉండింది. అది వివరంగా చూపించడానికి అతను నన్నొక రోజు అక్కడి కాంకర్డ్ మ్యూజియానికి తీసుకెళ్ళారు. 1850 నుంచి ఆ ప్రాంతపు సాహిత్యాన్ని, సంస్కృతిని నిక్షి ప్తం చేసిన చారివూతక భండాగారం అది. అక్కడ వెంకట్ నా కోసం కొన్ని పుస్తకాలను కొన్నాడు. అందులో హెన్రి డేవిడ్ థారో రాసిన చిన్న పుస్తకం ‘సివిల్ డిసోబిడియన్స్’ ఒకటి.

సివిల్ డిసోబిడియన్స్‌ను మన తెలుగు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో ‘శాసనోల్లంఘన’ అని సరిపెట్టారు గానీ ఆ పదాన్ని థారో చాలా విస్తృతమైన అర్థంలో వాడారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పనిచేయనప్పుడు దానిపై ప్రజలు ఎలా తిరుగుబాటు చేయవచ్చో అందులో ఆయన సవివరంగా పేర్కొన్నారు. దానికతడు తొలుత పౌర ప్రభుత్వాలపై ప్రజల ప్రతిఘటనగా పేరుపెట్టారు. ఇది ముందుగా ఒక చిన్న వ్యాసంగా అచ్చయి అమెరికాలో ఒక నూతన భావ విప్లవానికి బాటలు వేసింది. అది అతి తక్కువ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాల నిరంకుశత్వానికి బలైపోతోన్న జాతులు, తెగలు, దేశాలకు ఒక ఆచరణాత్మక ప్రణాళికా పత్రం గా మారిపోయింది. అమెరికా లోపలా, బయటా అది అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. అది చదివే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ న్యాయవాది ‘సత్యక్షిగహం’ అనే కొత్త ఆయుధాన్ని అందించి చరివూతలో నిలిచిపోయాడు. ఆ పద్ధతిని అనుసరించే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో నల్లజాతీయులు వివక్షకు వ్యతిరేకంగా పోరాడి గెలిచారు. వెంకట్ ఆ పుస్తకాన్ని నాకు ప్రత్యేకంగా ఎందుకిచ్చారో, అర్థమయ్యింది. ‘మే’ నెల ఎండకాలంలో అగ్గిమండుతుందనుకున్న తెలంగాణ ఉద్యమం మీద ఢిల్లీ రాజకీయాలతో, వేరే రాష్ట్రాల ఎన్నికల పేరుతో మన కాంగ్రెస్ నేతలు నీల్లుచల్లి ఉంచారు.

ప్రజల్లో అశాంతి ఉన్నప్పటికీ ఎలా వ్యక్తం చేయాలో తెలియని అయోమయం ఆవహించి ఉంది. తెలంగాణ ఏమౌతుందో అన్న ఆందోళనా ఆవరించి ఉన్న కాలమది. ఇదొక్క తెలంగాణలోనే కాదు. దేశ దేశాల్లో ఉంటోన్న తెలంగాణ వాళ్ళ అందరిలో నెలకొన్న సందర్భం. వెంకట్ అప్పటికీ ఉద్యమ పంథా ఎలా ఉండాలో, ప్రజలు ఏం చేస్తే ప్రభుత్వం దిగివస్తుందో నాతో సుదీర్ఘంగా చర్చిస్తున్నాడు. అనేక కొత్త ఆలోచనలు, వ్యూహా లు పంచుకున్నాడు. సరిగ్గా ఆ పుస్తకం అదే చెప్తోంది. సరిగ్గా తెలంగాణ ఉద్య మ ప్రస్తుత స్థితికి తక్షణ కర్తవ్యానికి థారో విశ్లేషణ సరిగ్గా సరిపోతుంది. ‘ప్రభుత్వాల చర్యలన్నీ న్యాయబద్ధంగా సమర్థనీయంగా ఉండవు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అనుకుంటే మెజారిటీకి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి. తప్ప విజ్ఞతతో, న్యాయబద్ధతతో ఉండ వు. ‘మెజారిటీ పేరు చెప్పి రాజకీయ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలు వ్యక్తుల నోళ్ళు నొక్కడం దారుణం’ అన్నది థారో అభివూపాయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. శాసనసభలోనో, రాజకీయ పార్టీల్లోనో ఏకాభివూపాయం లేదనే సాకుతో తెలంగాణ ఆకాంక్షను అణచిపెట్టడం జరుగుతూనే ఉంది.

గతంలో శ్రీకృష్ణ కమిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం, సంప్రదింపుల సాకుతో కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున ఆజాద్ తెలంగాణ ఆకాంక్షను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉన్న ప్రభుత్వాలను మన ప్రభుత్వాలు అనుకోవడం అనవసరమని, అలాం టి ప్రభుత్వాలకు విధేయులుగా ఉండాల్సిన పనిలేదని, ప్రభుత్వం ఇట్లా మాట తప్పినప్పుడు, లేదా మన మాట ప్రకారం పనిచేయనప్పుడు నిజాయితీ కలిగిన మనుషులు తిరగబడి తీరాలని, ఆ ప్రభుత్వ పెత్తనాన్ని తిప్పికొట్టాలని పిలుపునిస్తూ ..దానినే ఆయన శాసనోల్లంఘన అన్నారు. ప్రభుత్వమనేది భగవంతుడి సృష్టి కాదు. అది మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మనకే ఎదురు తిరిగినప్పుడు దాన్ని దెబ్బతీయక తప్పదు. మన మనోభావాలను గౌరవించని ప్రభుత్వాలను మనమెందుకు గౌరవించాలన్నది ఆయన ప్రశ్న. ఈ ప్రశ్న తెలంగాణ ప్రజలు ప్రజావూపతినిధులను అడుగుతున్నారు. గత రెండేళ్లుగా తమ ఆకాంక్షలను తమ ప్రతినిధులుగా ఆయా పార్టీల అధిష్ఠాన వర్గాలకు తెలియజెప్పాలని కోరుతున్నారు.

కానీ ప్రజావూపతినిధులు మాత్రం తమకు ప్రజలకంటే ప్రభు త్వం, పదవులు, పార్టీలు ఆయా పార్టీల అధినేతల అండదండలే ముఖ్యమని అంటున్నారు. ప్రభుత్వాలను, పార్టీలను వూపజలు కూలగొట్టాలంటే, వాళ్ళు మాత్రం కాపాడుతామని చెప్పుతున్నారు. అలాంటప్పుడు ప్రజలకు సమ్మె చేయడం, తిరగబడడం, ప్రభుత్వాన్ని గుర్తించ నిరాకరించడం తప్ప వేరే మార్గం ఏముంటుంది? కొందరు మళ్ళీ రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుతుండవచ్చు. కచ్చితంగా రాజకీయ పార్టీలకు ప్రజల మద్దతు ఉందో లేదో తేల్చడానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి. కానీ ప్రజలు కూడా ఎన్నికలే పరిష్కారం అనుకోవద్దన్నది డేవిడ్ థారో వాదన. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎదిరించకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా క్రియాహీనంగా ఎదురు చూడడం దండగ అంటాడాయన. న్యాయం కోసం మీరు పోరాడకుండా ఎవరో న్యాయం చేస్తారని అనుకోవడం పొరపాటన్నది అతని ఉద్దేశం. తెలంగాణకు సంబంధించి చరివూతలో అలాంటి పొరపాట్లు చేశాం. ఇంకా చేయాలనుకుంటే చరిత్ర క్షమించదు.

ఇప్పుడు తెలంగాణ సకల జనులు సమ్మెకు సమాయత్తం అవుతున్న సందర్భంలో మనం చరివూతలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం మంచిది. సివి ల్ డిసోబిడియన్స్ అంటే సమాజంలోని ప్రజలంతా ప్రభుత్వాన్ని ధిక్కరించ డం. ప్రభుత్వ శాసనాలను, ఆదేశాలను ఉల్లఘించడం. ప్రభుత్వానికి తమ మద్దతు లేదని తెలియజెప్పడం. ప్రజల ఆమోదం లేని ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో విలువ ఉండదు. అట్లా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి నిరసన చెప్ప డం. థారో కేవలం నీతి బోధ కోసం ఆ వ్యాసం రాయలేదు. ఆయన దాన్ని ఆచరించి చూపించాడు. అతను అప్పటి అమెరికా ప్రభుత్వం 1846-48 మధ్య పొరుగు దేశమైన మెక్సికోపై అన్యాయంగా దాడి చేసి ఇప్పటి టెక్సాస్, కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించారు. అలాగే అప్పటికే బానిసత్వానికి వ్యతిరేకంగా అక్కడి నల్లజాతీయులు పోరాడుతున్నారు.

దీన్ని ప్రజాస్వామ్య వాదులు సమర్థించారు. ప్రజాస్వామ్యవాదుల పని కేవలం ఇంట్లో కూర్చొని ఖండించడమో, సమర్థించడమో మాత్రమేనా అన్నది థారో లేవనెత్తిన ప్రశ్నల్లో ప్రధానమైనది. అలాగే మన శ్రమతో, సంపదతో వచ్చే పన్నులతో నడుస్తొన్న మన ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఒకవైపు పన్నులు కడు తూ, సహకరిస్తూ మరోవైపు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడంలో అర్థం లేదని వాదించాడు. ప్రభుత్వాలు అన్యాయంగా వ్వవహరిస్తున్నప్పుడు, అహంకార పూరితంగా ఉన్నప్పుడు ప్రజలుగా ఆ ప్రభుత్వం పొగరు అనచడానికి ఏం చేయాలో ఆయన చెప్పాడు. చెప్పి ఊరుకోలేదు. స్వయంగా చేసి చూపించాడు. పన్నులు ఎగ్గొట్టాడు. శాసనాలు ఉల్లంఘించాడు. అనేక మంది అతన్ని అనుసరించారు. ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది. అయినా భయపడకుండా ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ అటువంటి పాలనను ధిక్కరించాడు.
ప్రొఫెసర్ కోదండరాం మాటల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికి ఇది ఇప్పటికే బోధపడి ఉండాలి. బహుశా మూడు దశాబ్దాలకుపైగా రాజనీతిశాస్త్రం చదివి, బోధిస్తున్న కోదండరాం అదొక్కటే తెలంగాణ ప్రజలకు మిగిలి ఉన్న మార్గంగా భావిస్తున్నారు.

ఆయన మాటలకు ఎవరూ ఉలిక్కి పడవలసిన అవసరం లేదనే అనుకుంటాను. పది పదిహేనేళ్లుగా తెలంగాణ కోసం మడమ తిప్పకుండా ఉన్న మనిషికి తోచిన పద్ధతి అది. దాన్ని అతనే నాయకత్వం వహిస్తొన్న జేఏసీ ఆమోదించడమే కాదు, ఆ బాధ్యతను స్వయంగా స్వీకరించినప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఎందుకుండాలి? నిజానికి ఇవాళ బరువు భుజానికెత్తుకున్నందుకు కోదండరాం భయపడాలి. లేదంటే తమకు నెల జీతం రాకపోతే పూట గడవటం కష్టమని తెలిసీ తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డందుకు ఉద్యోగులు ఆందోళన పడాలి. పైగా అటు జేఏసీ, ఇటు ఉద్యోగులు ఇప్పటికే రాజకీయ పార్టీల చేతిలో మోసపోయి ఉన్నారు. గతం లో రాజీనామాలు చేయాలని ప్రజలనుంచి ఒత్తిడి రాగానే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉద్యమాన్ని గాలికి వదిలేసి జేఏసీ నుంచి జారుకున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే గతంలో ఉద్యోగులను సహాయ నిరాకరణ బరిలో కి దించి, మద్దతునిస్తామన్న ఆ రెండు పార్టీలు మరుసటి రోజునుంచి కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ భయం చాలా మంది ఉద్యోగుల్లో ఉన్నా తెలంగాణ కోసం వెనుదిరిగే ప్రసక్తే లేదని చెపుతున్నారు. అయినా సరే ఉద్యోగులు ఇంకొంచెం ఆగి ఉండాల్సింది. ముందు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కదిలిన తరువాత వాళ్లు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాల్సింది.

రాజకీయ పార్టీలు కేవలం మద్దతు మాటలు చెప్పి లాభం లేదు. అసలైతే ఇప్పుడు ముందు నిలబడాల్సింది నేతలే. కానీ వాళ్లు ఆపని చేయరు. అయినప్పటికీ వాళ్లను ముందువరుసలో పెట్టే పని ప్రజలు చేయాలి. ప్రజలు సమ్మె చేయాల్సింది వారిపైనే. ప్రజలు ఎలా సమ్మె చేస్తారు? ఎవరిమీద సమ్మె చేయాలి? అన్న అనుమానాలు కొందరిలో ఉండొచ్చు. సమ్మె అంటే నిరసన ను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల అభివూపాయాలను తెలపడానికి ఒక మార్గం. దాన్ని ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే విధంగా నష్టం కలిగించే విధంగా పాలనను స్తంభింప చేయడం ద్వారా తెలియజెప్పాల్సిన బాధ్య త కచ్చితంగా ప్రజదే. ఇక్కడ ప్రభుత్వం అంటే ఎక్కడో ఏడేడు సమువూదాల ఆవల దాగి ఉన్న అదృశ్యశక్తి కాదు. మన ఊరి బస్సునుంచి మొదలు, దేశరాజధానికి వెళ్లే రైళ్లదాకా అన్నీ ప్రభుత్వానికి ఆదాయాన్ని మోసుకెళ్లేవే. వాటిని నిలిపేయడానికి డ్రైవర్లే సమ్మె చేయనవసరం లేదు. ప్రజలు ఎక్కడానికి నిరాకరించినా అవి ఎక్కడికక్కడ ఆగిపోతాయి. అమెరికా నల్ల జాతీయు లు అది నిరూపించారు. అదెప్పుడో పాతకాలపు సంగతి. తెలంగాణ ప్రజలు గత ఏడాది చేసిన ఉద్యమాన్ని ప్రపంచమంతా చూసింది. అప్పటి ఉద్యమంలో ఉద్యోగులే కాదు కులసంఘాల ద్వారా, ప్రజాసంఘాల ద్వారా ప్రజలంతా మమేకమై కదిలారు. మనం కూడా యిదే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తూ వచ్చాం. మంగలివాళ్లు, చాకలి వాళ్లు, కాటికాపర్లు తెలంగాణ వ్యతిరేకులకు సేవలు నిరాకరించారని చెపు తూ వచ్చాం. సమ్మె అంటే అంతకంటే వివరమైన నిర్వచనం ఇంకేం ఉంటుంది.

ఇప్పుడూ అదే చేయాల్సి ఉంటుంది. సమ్మె రెండంచెల్లో ఉండాలి. ఒక వైపు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచాలి. ఇప్పటి దాకా పగటి వేషాలతో రంజింప జేసే ప్రయత్నం చేస్తోన్న వాళ్ల ముసుగులు లాగేసి అసలు రూపాన్ని ప్రజలకు చూపించాలి. తెలుగుదేశం పార్టీ ప్రజలతో నడుస్తుందో వేరుగా నడుస్తుందో ఆ పార్టీ యిష్టం. కానీ ఆ నడక ఎటువైపు దారి తీస్తుందో గమనిస్తూనే ప్రజలతో నడిచే వాళ్లను కలుపుకుపోవాలి. రెండోవైపు ప్రభుత్వానికి తెలంగాణ నుంచి ఆదాయం రాకుండా చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే హైదరాబాద్‌తో కలిపి తెలంగాణ నుంచి గడిచిన ఏడా ది వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం ఈ ప్రభుత్వం తెలంగాణలో మోహరించిన పోలీసు బలగాలమీద, విద్యార్థుల మీద ప్రయోగించిన భాష్పవాయు గోలాల మీద మాత్రమే ఖర్చు చేసింది. కాబట్టి ఆ ఆదాయం ప్రభుత్వానికి రాకుండా చూడాలి. సింగరేణి మిత్రులు ఈ ఆలోచనలో ముందున్నందుకు వాళ్లను అభినందించి తీరాలి. అలాగే సీమాంధ్ర పెట్టుబడీని ముట్టడించాలి. వాళ్ల ఆధీనంలో ఉన్న అన్ని సంస్థలను, వ్యాపారాలను మూసివేసి వాళ్ల వ్యవహారాలిక్కడ నడవకుండా చేయాలి. అలాగే చాలా కాలం నుంచి మనం గుజ్జర్లను గుర్తు చేస్తున్నాం.

అలాంటి పోరాటానికి ఇదొక తొలి అడుగు కావాలి. నిజానికి ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. ఇవాళ మంచికో చెడుకో జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సమస్య అందరిదని భావించి మరొక్కసారి నిలబడి పోరాడాలి. ఏ సమాజంలోనైనా సమ్మెలు చేసే వాళ్లు, ఉద్యోగాలు చేసే వాళ్లు వేరు వేరుగా ఉండరు. పౌరసమ్మెలో ఉద్యోగులైనా, సాధార ణ ప్రజానీకమైనా ఒక్కటే. చరివూతలో ప్రజల సమ్మెలో ఆ ప్రజల్లో భాగంగా ఉద్యోగులు పాల్గొన్న సందర్భాలు, ఉద్యోగుల సమ్మెలకు ప్రజలు సంఘీభావంగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సమస్య అందరిదైనప్పుడు అందరూ కదిలి తీరాల్సి ఉంటుంది. లేకపోతే అది కేవలం ఉద్యోగుల సమ్మెగా మిగిలి పోతుంది. ఇప్పుడు మొదలైన ఈ ఆఖరి పోరాటాన్ని విజయవంతం గా కొనసాగించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. తెలంగాణ వాదులుగా చెప్పుకునే ఎవరైనా ఇప్పుడు వెనకడుగు వేస్తే ముందు ముందు మాట్లాడే అర్హత కోల్పోతారన్న సంగతి గుర్తుంచుకోవాలి.

పొ. ఘంటా చక్రపాణి


సామాజిక పరిశోధకులు

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Featured Articles