ప్రజలు ప్రేక్షకులు కావొద్దు..!


Thu,December 6, 2012 10:33 PM

main1అఖిలపక్ష భేటీకి ముందుగానే పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అది నాటకమే కావొచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు. నాటకం క్లైమాక్స్ మార్చే విధంగా ప్రజలు ఆయా పార్టీల మీద ఒత్తిడి చేయాలి. అందుకు జేఏసీ పూనుకోవాలి. ఈమధ్య తెలంగాణవాదులు సినిమాలు పూర్తయిన తరువాత మాత్రమే ఆందోళన చేస్తున్నారు. కానీ ఈ నాటకం రక్తికట్టాలన్నా, ఆశించిన ముగింపు రావాలన్నా స్క్రిప్ట్ దశలోనే ఒత్తిడి పెంచాలి.

తెలంగాణ విషయంలో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసింది. ఈసారి నాటకంలో తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు ప్రాధాన పాత్ర పోషించారు. ఇటీవల చాలాకాలంగా పార్లమెంటు మెట్ల వరకు మాత్రమే పరిమితమైన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సరికొత్త అంకానికి తెరలేపి పార్లమెంటు లోపలికి వెళ్ళగలిగారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల పరిస్థితి చూస్తే కొన్నిసార్లు జాలేస్తుంది. పాపం వాళ్ళు పార్లమెంటులో తమ తమ స్థానాల్లో కూర్చోక ఎంతకాలమయ్యిందో! ఆ బెంగే ఇప్పు డు వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో తమతమ నియోజకవర్గాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం మీద నిప్పులు చెరగడం, ఢిల్లీకి చేరగానే పార్లమెంటు మెట్ల మీదో, పార్క్‌లోని గాంధీ విగ్రహం ముందో కూలబడిపోవడం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. వాళ్ళ అధిష్ఠాన వర్గాని కి కూడా అదే బాగుంది. ప్రతిరోజూ సభలోకి వచ్చి గోల చేయడం కంటే అట్లా సభ బయట ఉండడమే బెటరని వాళ్ళ ఉద్దేశం. అయితే అందుబాటులో ఉండండి అవసరాన్ని బట్టి చేతుపూత్తడానికి మేమే పిలుస్తాం అన్న ధోరణిలోనే ఆ పార్టీ ఉన్నది. నిన్నమొన్నటి వరకు కూడా అలాగే ప్రవర్తించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో పార్లమెంటులో రెండు రోజు ల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొదటిరోజు తెలంగాణ ఎంపీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మొక్కుబడిగా కేంద్ర మంత్రులు సమావేశానికి పిలిచినా టీ ఎంపీలు వెళ్ళలేదు. రెండోరోజు ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వం కూలిపోకుండా చేతుపూత్తి కాపాడడానికి సంఖ్యా బలం అవసరం కాబట్టి ఎవరు పిలిచారో తెలియదుగానీ కొందరు ఎంపీలు కేంద్ర హోం శాఖా మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసి ఆయన చేత అఖిలపక్షం పేరు తో ఒక పనికి మాలిన ప్రకటన చేయించారు. అప్పటికి అదొక చరివూతాత్మక విజయంగా చెప్పుకున్నారు. తమ ఒత్తిడికి కేంద్రం దిగివచ్చిందని చెప్పుకున్నారు.

కేంద్రం దిగిరావడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పదిమంది పార్లమెంటు సభ్యులు అవసరం లేదు. ఉత్తిత్తి బెదిరింపులకు తావులేకుండాఅందరూ ఒక్క తాటిమీద ఉండి ఉంటే స్వయానా సోనియాగాంధీ దిగివచ్చి తెలంగాణ ప్రకటించి ఉండేవారు. కావూరి సాంబశివరావు విషయాన్నే తీసుకోండి, ఆయన మంత్రి పదవి ఇవ్వనందుకు అధిష్ఠానం మీద అలిగి రాజీనామా లేఖ రాస్తే స్వయానా ప్రధాన మంత్రి ఫోన్ చేసి సభకు రావాల్సిందిగా బతిమాలుకున్నారు. వాళ్ళ అవసరం అలాంటిది. కావూరి ఒక్కడు చేసి న పనిని తెలంగాణ ఎంపీల్లో ఏ ఒక్కరూ చేయలేక పోవడమే సమస్య.
తెలంగాణ ఎంపీల సమస్య ఏమిటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ప్రజల్లో వాళ్ళు పోరాడుతున్నట్టు కనిపించాలి. ఆ పోరాటానికి దిగివచ్చి ప్రభుత్వ మో, పార్టీనో ఏదో ఒక ప్రకటన చేసినట్టు ఉండాలి, అది తమ విజయమని వీళ్ళు మరికొన్ని రోజులు చెప్పుకునే వీలుండాలి. ఈ తంతు గత మూడేళ్ళుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా రాజకీయ నాయకుల పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. రాజకీయ పార్టీలు, నేతలు కేవ లం తమ భవిష్యత్తు కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ భవిష్యత్తు పట్ల వాళ్లకు ఎలాంటి బెంగా లేదని సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమౌతున్నది.

రాజకీయ పార్టీలు మనుగడ సాధించాలంటే ప్రజలు నిరాశ పడకూడదు, నీరసించకూడదు. వాళ్లకు నిరంతరం ఏదో జరుగుతున్న దృశ్యం కనిపించాలి. కచ్చితంగా ఇపుడు కాకపోయినా 2014లోగా ఏదో ఒకటి జరుగుతుందన్న భ్రమ ఏర్పడాలి. ఇప్పుడు పల్లెబాటల్లో సాగుతున్న పాదయావూతల లక్ష్యం 2014. ఆ లక్ష్యంతోనే తెలంగాణలో ఇప్పుడు చంద్రబాబు యథేచ్ఛగా నడుస్తున్నాడు. నడవడమే కాదు, ఒకప్పుడు పచ్చచొక్కా లు తిరగడానికి సాహసించని ఈ ప్రాంతంలో తనకిక తిరుగేలేదని నమ్ముతున్నాడు. ఇప్పటిదాకా తెలంగాణ రావాలని కోరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు వస్తుందో లేదోనన్న అయోమయంలో ఉన్నవాళ్ళు బాబు వచ్చేసరికి ఆయన వెంట నడుస్తున్నారు. నిజానికి ఆయన వెంట తెలంగాణ వాళ్ళెవరూ నడవాల్సిన పనిలేదు. నిజామాబాద్ జిల్లానుంచి ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఆయన వెంట నిరంతరం ఐదువందలమంది ఉంటున్నారు. వాళ్ళంతా పాదయాత్ర మొదలయినప్పటి నుంచి ఆయన వెంటే వస్తున్నారు. దీనికితోడు ఆయన రక్షణలో ఉన్న పోలీసులు, పారామిలటరీ దళాలు, మధ్యమధ్యలో వచ్చి బంధు మిత్ర వర్గాలు ఆయన కదలికే ఒక మహాయావూతగా మారిపోతోంది.

ఆయన ఏ ఊరి కూడలిలో ఆగినా అదే ఒక పెద్ద బహిరంగ సభ అయి గోచరిస్తున్నది. వాళ్ళందరికీ వండి వార్చడానికి బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ముప్ఫై మూడుమంది వంటవాళ్లు రేయింబవళ్ళు కష్టపడుతున్నారని ఆ పత్రిక రాసింది. మరోవైపు జగనన్న వదిలిన బాణం కూడా వాయువేగంతో దూసుకు వస్తోంది. అది పెద్ద తుపాను సృష్టించలేకపోతున్నా తెలంగాణ గడ్డమీద వారికొక రూట్‌మ్యాప్ కోసం ఉపయోగపడుతున్నది. ఆమె వెంట ఉన్న వాళ్ళు అడ్డొచ్చిన వారినల్లా చావబాదుతూ సాగిపోతున్నారు. వారి చేతుల్లో ఆమెను ప్రతిఘటించిన పాపానికి పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు చావు దెబ్బలు తిన్నారు. బయటకు పెద్దగా కనిపించకపోయినా తెలంగాణలో జగన్ సామాజిక వర్గం, రాజశేఖర్‌డ్డి రాజకీయ వర్గం లోపాయికారిగా ఆమెకు సహకరిస్తున్నది. ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్ర సమితి పల్లె బాట పట్టింది.
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కలవర పెట్టే పరిణామాలే! ఆ పార్టీ కి ఇప్పటికే ఇక్కడ నూకలు చెల్లాయని, 2014 దాటితే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఇతర నేతలకు ఇప్పటికే అర్థమయ్యింది. కొందరు ఇప్పటికే పెట్టే బేడాసర్దుకున్నారని కూడావార్తలందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తెలంగాణలో ఫ్రంట్ కట్టడమా, ఎప్పట్లాగే ఎన్నికలదాకా ఇలాగే తెర ఉండడమా అన్నది అర్థం కాని అయోమయంలో ఉన్న ఈ దశలో కాంగ్రెస్ అధిష్ఠానం మళ్ళీ ఇప్పుడు అఖిలపక్షం పేరుతో కొత్త అంకానికి తెరలేపింది. ఇప్పుడు ఆ పేరుమీద మరో నెలపాటు, ఏకాభివూపాయం కుదరకపోతే 2014 వరకూ ఈ నాటకాన్ని ఇలాగే కొనసాగించే వెసులుబాటు వారికి లభిస్తుంది.

ఇంతకీ అఖిలపక్షం కావాలని చంద్రబాబు మినహా తెలంగాణవాదులు ఎవరు కోరా రు? అఖిలపక్షం ఏరకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుంది. ఆగిపోయి ఉన్న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ మొదటికి రావడం వెనుక కారణాలేమిటి అన్నవి సామాన్య ప్రజలకే కాదు రాజ్యాంగ నిపుణులకు కూడాఅంతుచిక్కని విషయాలు. ఇది తెలంగాణ ప్రజల్ని మోసగించేదిగానే కాదు భారత రాజ్యంగా స్ఫూర్తికి విరుద్ధంగా కూడా ఉంది. ఒక రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే హక్కు కేవలం భారత పార్లమెంటుకే ఉండాలని రాజ్యాంగం స్పష్టంగా చెపుతోంది. అంతేకాదు రాష్ట్ర విభజన విషయంలో ఇప్పుడున్న సమైక్య రాష్ట్రానికి గానీ, ఆ రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు గానీ ఎటువంటి అధికారం ఉండడానికి వీలులేదని రాజ్యాంగ రచన సందర్భంగా జరిగిన చర్చ స్పష్ట పరిచింది. రాజ్యాంగ రచనా సంఘంలో ఆర్టికల్ మూడు పొందుపరిచేటప్పుడు జరిగిన చర్చలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని లేవనేత్తినప్పుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దీనిపై సమగ్ర విశ్లేషణ చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అన్యాయానికి, దోపిడీకి గురైనవాళ్ళు, ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఆధిపత్యం ఉన్న ప్రాంతం వారి చేతిలో మోసపోతున్న వాళ్ళు, నష్టపోతున్నవాళ్ళే కొత్త రాష్ట్రం కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు రాష్ట్రం ఏర్పాటు చేయాలా వద్దా అని ఆ ఆధిపత్య వర్గాలనే అడగడం అన్యా యం అవుతుందని అంబేడ్కర్ వాదించారు.

అందుకే రాష్ట్ర విభజనను రాష్ట్ర శాసనసభ ఆమోదించాలని గానీ, ఆ రాష్ట్ర ప్రజలందరి అంగీకారం ఉండాలనిగానీ లేదు. అది కేవలం పార్లమెంటు కు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన హక్కు. కేంద్ర కేబినేట్ తీసుకోవలసిన రాజ్యాంగ నిర్ణయం. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చింది. తమకు కావాల్సిన బిల్లులు, నిర్ణయాలను అన్నిరకాల అనైతిక మార్గాలద్వారా ఆమోదింపజేసుకుంటూ కాలం గడిపేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అఖిల పక్షాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలనడం రాజ్యాంగ ధర్మానికి విరుద్ధం. ఇదంతా ఒక రాజకీయం. ఇది కేవలం పాదయావూతికులను కట్టడి చేయడానికి ఉపయోగపడుతుందేమో తప్ప పరిష్కారం చూపే మార్గం మాత్రం కాదు. అలాగే ఇది ఒక దుస్సాంవూపదాయం కూడా. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటు విషయంలో 2009 డిసెంబర్ ఏడున ఒక అఖిలపక్షం జరిగింది. అందులో తెలంగాణ వెంటనే ఏర్పాటు చేయాలన్న తీర్మానం ఏకక్షిగీవ ఆమోదం పొందింది. ఆ తరువాత ఢిల్లీలో మరోసారి అఖిలపక్షం కలిసింది. అదికూడా శాంతియుత వాతావరణం ఏర్పడాలని భావించిందే తప్ప పాత తీర్మానాన్ని రద్దు చేయలేదు. ఆ తరువాత కమిటీలు, నివేదికలు అన్నీ జరిగాయి. వాటి ఆధారంగానైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో పచ్చి సమైక్యవాదులు కూడా ప్రశాంతంగా పాదయావూతలు చేస్తున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రక్షికియ పూర్తిచేయడమే తప్ప కొత్త నాటకాలు కాదు.

అయినా సరే నాటకాలు నడవనియ్యాలి. రోజుకో రంగుమార్చి, కొత్తకొత్త వేషాలతో నేతలు ప్రజల్లోకి వస్తున్నప్పుడు వారి అసలు రూపం ఏమి టో తెలియాలి. కొన్నిసార్లు నాటకాల్లోని ఎత్తుగడలు కూడా ఉత్కం రేపుతుంటాయి. కొన్ని ఘట్టాలు ముగింపు పలుకుతాయి. బహుశా ఈ అఖిలపక్షం కూడాఅదే పని చేయవచ్చు. ఇది తెలంగాణకు చరమాంకం కావొ చ్చు. కావాలి కూడా. ఇంతకాలం వ్యతిరేకం కాదు అంటూ కాలక్షేపం చేస్తు న్న తెలుగుదేశంపార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీల అసలు రంగు బయటపెట్టడానికి ఇది దోహదపడవచ్చు. అయితే ఈ సారి అఖిలపక్ష విధి విధానాలు కూడా స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. కచ్చితంగా ఒక్కొక్క పార్టీ నుంచి, ఒక్కొక్క ప్రతినిధి మాత్రమే చర్చలకు రావాలని, వీలైతే పార్టీ అధ్యక్ల్షుడు గానీ, ఆయన అధికారిక లేఖతో ప్రతినిధి గానీ హాజరవ్వాలని స్పష్టం గా కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించాలి. సమావేశంలో పార్టీల నిర్ణయాలు చెప్పాలే తప్ప వ్యక్తిగత అభివూపాయాలకు తావు ఉండకూడదు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలి. అలాగే కాంగ్రెస్‌పార్టీ కూడాతన అభివూపాయం ఏమిటో ముందే చెప్పాలి.

ఒకానొక చర్చ సందర్భంగా తెలుగు దేశం నేతలు జేఏసీకి చేతనైతే కేంద్రవూపభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు తెలంగాణలో పాదయావూతలో ఉన్నప్పుడే అఖిలపక్షం పెట్టేవిధంగా ప్రయత్నించాలని, అలాగైతే ఆయన పాద యాత్ర నిలిపేసి ఢిల్లీ వెళ్లి చర్చలకు హాజరయ్యే విధంగా తాము ఒప్పిస్తామని నాతో అన్నారు. నిజంగానే వారికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధిగానీ, భవిష్యత్తులో రాజకీయాల పట్ల ఆశగానీ ఉంటే ఆ పని చేసి చూపించాలి.అలాగే జగన్ వెంట ఉన్నవాళ్ళు, షర్మిలను నీడలా వెంబడిస్తున్న వాళ్ళు కూడా అవసరమైతే అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు జైలు నుంచి జగన్ వెళ్ళే విధంగా న్యాయపరమైన అనుమతులు కోరాలి. అది వీలు కానప్పుడు వై.ఎస్. విజయమ్మ అందుకు సిద్ధపడాలి. పార్టీలు ముందుగానే తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అది నాటకమే కావొచ్చు. కానీ ప్రజలు మాత్రం ప్రేక్షకులుగా మిగిలిపోవద్దు. నాటకం క్లైమాక్స్ మార్చే విధంగా ప్రజలు ఆయా పార్టీ ల మీద ఒత్తిడి చేయాలి. అందుకు జేఏసీ పూనుకోవాలి. ఈమధ్య తెలంగాణవాదులు సినిమాలు పూర్తయిన తరువాత మాత్రమే ఆందోళన చేస్తున్నారు. కానీ ఈ నాటకం రక్తికట్టాలన్నా, ఆశించిన ముగింపు రావాలన్నా స్క్రిప్ట్ దశలోనే ఒత్తిడి పెంచాలి. ఇప్పుడు అన్ని పార్టీలు మళ్ళీ పాత కథలకే బూజు దులిపే ప్రమాదం ఉంది. అది అడ్డుకునే విధంగా ఒత్తిడి పెంచాలి. ఆ ఒత్తిడికి పాదయావూతికులు ఒకే ఎజెండాతో ఢిల్లీ బాట పట్టాలి.
పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
[email protected]

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ