చుప్..నోరు మూసుకుని బతకండి!


Thu,November 22, 2012 11:53 PM

shahin-interviewమీకు ఈ ‘ఘంటాపథం’ నచ్చితే మౌనంగానే ఉండండి. మనసులోనే అభినందించండి. దయచేసి నోరు విప్పకండి. ఇంకెవరికీ ఆ మాట చెప్పకండి. నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినా సరే ‘లైక్’ని క్లిక్ చెయ్యకండి. ఇప్పుడు నోరు విప్పాలం భయపడాల్సిన రోజులు వచ్చేశాయి. మన మాటలను, చర్యలను, చేష్టలనే కాదు మన ఆకాంక్షలను, ఆలోచనలను చివరికి భావోద్వేగాలను కూడా మనలోనే సమాధి చేసుకోవాల్సిన రోజుల్ని మనం చూస్తున్నాం. అలా చేసుకోకుండా మొండిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి, మీ మనసుతో మీరు ఆలోచించి, మీకు మీరుగా మీ భావాలను బయటపెట్టాలనే ప్రయత్నంలో గొంతెత్తి గట్టిగా అరవాలని నోరుతెరిచారో అంతే సంగతులు.

మీరు తల దించుకుని బతకాల్సి వస్తుంది. మళ్ళీ తలెత్తుకోవాలంటే ఒకటికి పదిసార్లు క్షమాపణలు కోరుకోవాల్సి ఉంటుంది. అయినా ఎవ్వరూ వినరు. మిమ్మల్ని ముట్టడిస్తారు. మీ వెంటపడి నిరంతరం వేధిస్తారు. అవస రం అనుకుంటే ఏదో ఒక చట్టంలో బుక్ చేసి మిమ్మల్ని అరెస్టుచేసి బొక్కలో తోసేస్తారు. అట్లా మన ఆకాంక్షలను, అభివూపాయాలను కట్టడి చేసే కొత్త తరం దొరలు, నయా నిఘా వర్గాలు, మన ఆలోచనలను అరెస్టు చేసే ‘థాట్ పోలీసులు’, మనం ఏమి చేయాలో, చేయకూడదో చెప్పే తత్వ బోధకులు ఇప్పుడు తయారుగా ఉన్నారు. వాళ్ళందరికీ మన పాలకవర్గాలు పహారా కాస్తుంటాయి. అవసరమైతే పాదపూజ చేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యం నిలబడింది, నిలబడాలని కలగంటోంది అలాంటి వాళ్ళ కాళ్ళ మీదే!

మొన్నకు మొన్న ముంబాయిలో ఎవరో ఒకరు చనిపోయారు. అదికూడాదాదాపు ఎనభై ఏళ్లకు పైగా బతికి సహజంగానే చనిపోయాడు, తప్ప మరొక రకంగా కాదు. జనన మరణ గణాంకాల ప్రకారం అలా దేశంలో ప్రతి సెకనుకు ఒకరికంటే ఎక్కువమందే చనిపోతున్నారు. కానీ ఆ రోజు చనిపోయిం ది మాత్రం మనిషి కాదు. పులి. ఆ నగరానికే పెద్దపులి. దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఆ నగరాన్ని, ఆ నగరానికి బతకడానికి వచ్చిన మూగజీవాలను తన అరుపులతో హడపూత్తించిన పులి. ఒక్క మరాఠీ జాతి తప్ప మరెవ్వరూ ముంబాయిలో కాలగిరేసి బతకడానికి వీలులేదని శాసించిన వ్యక్తి.

1960 చివర్లో బతుకుదెరువు కోసం ముంబాయి వెళ్ళిన తెలంగాణ బిడ్డల్ని తరిమి తరిమి వెంటాడిన వ్యక్తి. మహారాష్ట్ర అంటే మరాఠీల జాగీరని చెప్పిన వ్యక్తి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలను లుంగీ వాలాలని అవహేళన చేసి, ఉద్యోగాలు రాకుండా చేసిన వ్యక్తి. తన ప్రతాపమంతా వలసకూలీల మీద, బీహారీ టాక్సీడ్రైవర్ల మీద. చిన్నా చితకా వ్యాపారుల మీదా చూపించి ముంబాయి నగరాన్ని తన కబంధహస్తాల్లో ఉంచుకున్న వ్యక్తి. అతనొక నియంత. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు నియంతృత్వాన్ని సమర్థించాడు. అనుసరించాడు, ఆచరించాడు. ఆయన జర్మన్ నియంత హిట్లర్ ప్రేమికుడు. తనను తాను హిట్లర్‌తో పోల్చుకున్నాడు.

హిట్లర్‌కు తనకు చాలా సారూప్యత ఉందని, అలవాట్లు, పద్ధతులు హాబీలు వృత్తి వ్యాపకాలు, మనస్తత్వం ఇద్దరిదీ ఒక చెప్పుకున్న వ్యక్తి. ఆయన ప్రజాస్వామ్యానికి పచ్చి వ్యతిరేకి. భారతదేశానికి ప్రజాస్వామ్యం పనికి రాదనీ, నియంతృత్వమే పరిష్కారమని పదేపదే ప్రబోధించిన వ్యక్తి. దేశమంతా ఎమ్జన్సీ కాలంలో ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తే ఆమెకు మద్దతు తెలిపి ఆమె అప్రజాస్వామిక ధోరణిని సమర్థించిన వ్యక్తి. ఆయనకు గౌరవ సూచకంగా బంద్ పాటించాలని ఆయన అనుచరులైన సైనికులు పిలుపునిచ్చారు. వీధుల్లో పెద్ద ర్యాలీతీసి అన్ని షాపులను దగ్గరుండి మూయించింది. అంతే ముంబాయి మూత పడింది.

ఈ సంఘటనలు కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రకంగా స్పందిస్తారు. మనిషన్నాక స్పందించి తీరాలి. చాలామంది చాలా రకాలుగా స్పందించారు. అందులో షహీన్ అనే యువతి కూడా ఉంది. మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసిన ఆ యువతీ తన భావాలను నిర్మొహమాటంగా తన మిత్రులతో ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది. అది ఆమె హక్కు. ఏ మనిషైనా తన మనసులో కలిగిన భావాలను, అభివూపాయాలను ఇతరులతో పంచుకోవచ్చని, ఎటువంటి మాధ్యమం ద్వారా అయినా దానిని ప్రచారం చేసుకోవచ్చునని రాజ్యాంగం చెపుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(ఎ)(బి) పౌరుడికి భావవూపకటన స్వేచ్ఛను కల్పించాయి. నిజానికి మన పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు కూడా మనిషికి ఉండే ఈ రాజ్యాంగ హక్కును అడ్డుపెట్టుకునే నడుస్తున్నాయి. మీడియా ఏదైనా అది నిర్వహిస్తున్న పాత్ర భావ ప్రసరణ.

వ్యక్తు లు, సమూహాల అభివూపాయాలను, భావాలను ఇతరులకు చేరవేయడం కోస మే మీడియా పుట్టింది. అలాగే సోషల్ మీడియా కూడా. పత్రికలు టెలివిజన్‌ల లాగే ఇప్పుడు సోషల్ మీడియా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. అందు లో ఫేస్‌బుక్‌కు విపరీతమైన ఆదరణ ఉన్నది. వ్యక్తులు తమ భావాలు, ఉద్వేగాలను, అభివూపాయలు అంచనాలను పదిమందితో అదీ వారి మిత్రులతో పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా సైట్లు ఉపయోగపడుతున్నాయి. అలా తన మనసులోని ఉద్వేగాలను షహీన్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో రాసుకుంది. ప్రొఫైల్ అంటే ఓపెన్ డైరీ లాంటిది. మీరు ఏదైనా అందులో రాసుకోవచ్చు. అది మీ మిత్రులతో పంచుకోవచ్చు.

షహీన్ ఈ విధంగా రాసి మిత్రులతో పంచుకుంది. ‘గౌరవంతో చెబుతున్నాను. ప్రతిరోజు వేలమంది మరణిస్తుంటారు. అయినా ప్రపంచం ముందు కు సాగిపోతూనే ఉంటుంది. కానీ ఒక రాజకీయవేత్త సహజమరణం పొందినపుడు ప్రతి ఒక్కరూ ఆవేదనకు గురవుతారు. ఇష్టాన్ని బట్టిగాక బలవంతంవల్ల అలా జరుగుతుందని వారు తెలుసుకోవాలి. ఎవరివల్లనైతే స్వేచ్ఛాయుత భారతీయులుగా మనం జీవిస్తున్నామో అటువంటి షహీద్ భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు, ఇంకా అటువంటి వారికి ఎవరైనా కొంత గౌరవం చూపి, లేదా రెండు నిమిషాల మౌనం పాటించి ఎంత కాలమైందో కదా? గౌరవాన్ని ఆర్జించాలి, పొందాలి.

అది బలవూపయోగం ద్వారా కాకూడదు. ఈ రోజున ముంబాయి గౌరవంతో గాక భయంతో మూతపడింది’’. ఇది ఆమె అభివూపా యం. ఆమె సగటు మనిషి కాబట్టి, ఆమెకు మనసు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి సహజంగానే కలిగిన అభివూపాయం. అందులో ఇతరులను కించపరచడం గానీ, అవమానించే వ్యాఖ్యలు గానీ, అనవసర మాటలు గానీ లేవు. నిజానికి ఆమె ఎవరి పేరును కూడా ఎత్తలేదు. కేవలం తన భావాలు పంచుకుంది. అలాంటప్పుడు, ఇలాంటి బలవంతపు బందులు చూసినప్పుడు దేశం కోసం మరణించిన వారికోసం ఒక్క నిమిషం ఆలోచించక ఎంతకాలమయ్యిందో కదా అనిపిస్తుంది. అదే ఆమెకు కూడా అనిపించి రాసింది. అది ఆమె హక్కు. కానీ పోలీసులు ఆమె చేసింది నేరమంటూ అరెస్టు చేశారు. అలాంటి దేశభక్తి భావాలున్నందుకు అరెస్టు చేసి ఆమె మీద మతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన చేసిందని అభియోగం మోపారు. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టును చదివి బాగుంది అని ‘లైక్’ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఆమె భావాలు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేవి గా ఉన్నాయట! ఈ ఇద్దరిమీదా ఇండియన్ పీనల్ కోడ్‌లోని 505 (2), 295 ఎ, తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్‌లోని 66 ఎ, ప్రకారం కేసులు పెట్టా రు. ఆ అరెస్టులను చూసి దేశమంతా ముక్కున వేలేసుకుంది. కొద్దోగొప్పో ఇంకా ప్రజాస్వామిక స్పృహలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా స్పందించడంతో ఇప్పుడు పోలీసు చర్య పెద్ద వివాదమై కూర్చుంది. పోనీ చట్టం తన పని తాను చేసుకుంటుందని సరిపెట్టుకున్నారా అంటే అదీలేదు. బాల్ ఠాక్రే భక్తు లు ఆ యువతి ఇంటిమీద, బంధువుల ఆస్తుల మీద దాడిచేసి కోట్లాది రూపాయలు నష్టం చేశారు. విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు చట్టం, పోలీసులు, ప్రభుత్వం తప్పు సవరించుకుని వారిద్దరినీ వదిలేసినా వీళ్ళు మాత్రం వదిలేస్థితిలో లేరు. వాళ్ళిప్పుడు ఠాక్రే తమ దేవుడని చెపుతున్నారు.

మనిషిగానే మారణహోమాన్ని సృష్టించిన ఠాక్రే నిజంగానే దేవుడై కూర్చుంటే మరీ ప్రమాదం. ఎందుకంటే ఆయన బతికుండగానే రాజ్యాంగా న్ని, చట్టాన్ని పనిచేయనీయలేదు. ఆయన చెప్పిందే రాజ్యాంగం, చేసిందే శాసనం. కేవలం నియంతృత్వ ధోరణే కాదు చట్టం, న్యాయం రాజ్యాంగంతో సమాంతరంగా పనిచేసి, ఏ అధికారం లేకున్నా ముంబాయి నగరాన్ని శాసించిన వ్యక్తి ఠాక్రే. ఒక దశలో ఆయన ఉగ్రవాదులను మించి ప్రకటనలు చేశా రు. ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం అనుమతించని మాటలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి విద్వేషాల విషం విరజిమ్మే ప్రకటనలు చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆయన ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా హిందూ మానవబాంబులు గా మారాలని యువతను రెచ్చగొట్టి అలజడి సృష్టించారు.

అట్లా అనుకుని ఆయన హిందూ రాజకీయ సిద్ధాంతాలు నమ్మినవాడని అనుకుంటే పొరపాటు. ఆయన పక్కా సంకుచిత వాది. ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వాళ్ళ ప్రాంతీయ పండుగ ఛాత్ పూజ చేసుకుంటే అడ్డుపడడమే కాక ఆ పూజలో పాల్గొన్న ఎంపీలను కూడా బెదిరించాడాయన. ఆయన తీరును యావత్ పార్లమెంటు హక్కుల తీర్మానం పెట్టి మరీ ఖండించింది. చివరకు ఆయన పార్టీలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నేతలు కూడాఠాక్రే ధోరణిని ఖండించి పార్టీ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ‘పంజాబ్‌లో ఖలిస్థాన్‌కు, కాశ్మీర్ ఉగ్రవాద మిలిటెంట్లకు, శివసేనకు పెద్ద తేడా లేదని అన్నవారూ ఉన్నారు. అయినా సరే ఠాక్రే ముద్ర చాలామందికి నచ్చింది.

దేశంలోని అన్ని పత్రికలు ఆయన మరణ వార్తను పతాక శీర్షికలలో ప్రచురించాయి. ఛానళ్లు చర్చలు పెట్టాయి. ఈ దేశ ప్రధానితో సహా అనేకమంది ఆయనను అజరామరుడిగా కీర్తించారు, కొనియాడారు! ప్రజాస్వామిక విలువలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండే మనుషులు హటాత్తుగా ఏదో ఒకరోజు మరణించగానే మహానుభావులైపోయే పరిస్థితి కొత్తగా వచ్చినదేమి కాకపోయినా, ఇప్పుడు ఆయన ఆత్మ శాంతికోసం ముంబాయి పోలీసులు అతిగా ప్రవర్తించి రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మాట్లాడిన తరువాత పరిస్థితి మారింది. గానీ లేకపోతే ఎవరూ పెద్దగా స్పందించే వాళ్ళు కూడా కాదు.
ఎందుకో ఏమోగానీ చాలామంది ఈ మధ్య ఎవరు నిజాలు మాట్లాడినా భరించలేకపోతున్నారు. అభివూపాయాలు, భావాలు చెప్పినా విమర్శలుగానో, తిట్లుగానో, తీవ్రమైన అభాండాలుగానో భావించి గాబరా పడిపోతున్నారు. నిజాలు మాట్లాడినా సరే నిలువునా రగిలిపోయి ఒంటికాలిమీద లేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళయితే మరింత రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పార్టీల నేతలను ఏమన్నా సరే ఇప్పుడు తట్టుకునే స్థితిలో లేరు.

ఆ మధ్యన ఒక కార్టూనిస్ట్ అన్నాహజారే కాంపైన్‌కు ప్రభావితుడై అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్టూన్ వేశా డు. అది పార్లమెంటును కించపరిచేదిగా ఉందని ఆ కార్టూనిస్టు మీద ఇదే ముంబాయి పోలీసులు రాజవూదోహం కేసులు పెట్టి అరెస్టు చేశారు. అలాగే మమతాబెనర్జీని వ్యంగ్యంగా చిత్రించినందుకు జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రోఫెసర్‌ను అరెస్ట్ చేశారు. వీటన్నిటికి పరాకాష్టగా చిదంబరం చేష్టలను చెప్పుకోవచ్చు. తన కొడుకు మీద ట్విట్టర్‌లో కామెంట్ చేసినందుకు పుదుచ్చేరికి చెందినా ఒక వ్యాపారిని అరెస్టు చేయించారు. ఇట్లా చట్టాన్ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వాడేసుకుని, ఎదుటివాడి నోరు నొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారు. చట్టం పరిధిలో నేరుగా అలా వీలు కానప్పుడు దొడ్డిదారిలో మిగితా చట్టాలను వాడుకుంటున్నారు.

పాపం బాల్ ఠాక్రే ఒక్కడే కాదు. బలమున్న ప్రతి ఒక్కరూ ఆయన వారసులే. అదే నియంతృత్వం, అదే ఫాసిస్టు ధోరణి ఇప్పుడు చాలామందికే అబ్బుతున్నాయి. మన రాష్ట్రంలోనే చూడండి. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా జేఏసీ చైర్మన్‌గా కోదండరాం తెలంగాణ ప్రజల పక్షాన ఒక సమష్టి ప్రకటన చేశారు. దాన్ని గీతాడ్డి ఒక విమర్శగా స్వీకరించి స్పందించవచ్చు. లేదా అదేస్థాయిలో సమాధానం చెప్పి ఉండవచ్చు.

కానీ ఆమె హటాత్తుగా దళితురాలిగా మారిపోయింది. మూడు దశాబ్దాల క్రితమే రెడ్డి అనే వారసత్వ పదా న్ని తన పేరులోంచి తీసివేసి, పీడిత, తాడిత దళిత వర్గాలతో, అవసరమైనప్పుడు న్యాయానికి గుర్తులుగా ఉన్నప్పుడు నక్సలైటు శక్తులతో సహా అణగారిన వర్గాలకు అందరికీ అండగా ఉన్న కోదండరాం ఇప్పుడు కోదండ రామిడ్డి అయిపోయాడు. దాదాపుగా అదే కాలంలో జెట్టి ఈశ్వరీబాయి కూతురుగా పుట్టిన జెట్టి గీత తన వారసత్వ దళిత అస్తిత్వాన్ని వదిలేసి రెడ్డి కులాంతరీకరణం చెంది దొరసానిగా చెలామణి అవుతున్నా హటాత్తుగా దళిత మహిళగా అవతారమెత్త గలుగుతున్నారు. నిజానికి ఉపముఖ్యమంవూతిగా దామోదర రాజనరసింహతో గీత గారు పోటీ పడ్డప్పుడు ఆమె ఉట్టి గీత కాదని గీతాడ్డి అని వాదించిన వాళ్ళు, అసలు ఆమె దళితురాలే కాదని, ఎప్పుడో రెడ్డిగా మారిపోయిందని చెప్పినవాళ్లే ఇప్పుడు గీతాడ్డి గారిని దళిత మహిళను చేసేశారు. ఆమె ఇప్పుడు అన్యాయంగా, అధర్మంగా ఉన్నా సరే ఎవరూ ఏమీ అనకూడదు. ఏది న్యాయమో, ఏది ధర్మమో చెప్పకూడదు. ప్రజల పక్షం ఉండమని అడగకూడదు. కనీసం ఒక తెలంగాణ బిడ్డగా తన తల్లి మార్గంలో నడవాలని కూడా ఆశించకూడదు.

అసలు ఆమెపట్ల మీ అభివూపాయమే చెప్పకూడదు. నోరు తెరిచి ఏమైనా మాట్లాడారో ఎస్సీ, ఎస్టీ చట్రంలో ఇరుక్కుపోతారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే రాజవూదోహం కిందో వీలైతే దేశవూదోహం కిందో మీ మీద కేసులు పెడతారు. పెట్టకపోతే పెట్టితీరాలని ఆందోళన చేసే ఉద్యమకారులు పుట్టుకువస్తారు. వాళ్ళు మీ ఇంటిముందర ధర్నాలకు దిగి మీ మైండ్‌ను ముట్టడిస్తారు. మనం ఒక్కమాట అంటామో లేదో ఎవరో ఒక రు ఎదో ఒక రూపంలో విరుచుకు పడడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది కులమో, మతమో, ప్రాంతమో రూపమేదైనా కావొచ్చు. మాటా పలుకూ లేకుండా మన మనోభావాలను పంచుకోకుండా అంతా గప్‌చుప్‌గా ఉండం డి. మనమిప్పుడు ఠాక్రే రాజ్యంలో తాకట్టుపడి ఉన్నాం.

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ