ఈజిప్ట్‌ను తలదన్నిన మార్చ్


Fri,October 5, 2012 12:34 AM

మేం ముందుగా చెప్పినట్టే మా మాటమీద నిలబడి ఉంటాం. మేం గడిచిన అరవై ఏళ్ళుగా మా తల్లి తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన విద్యార్థులం. యిప్పుడు మళ్ళీ ఈ చారివూతక రుతువులో మరోసారి తెలంగాణ తల్లి స్వేచ్ఛ కోసం ప్రాణాలనైనా అర్పించి పోరాడడానికి ముందుకు కదులుతున్నాం. కనీసం మా మీద కురిసిన ఆ రబ్బరు బుల్లెట్ల ను, బాష్పవాయు గోళాల శకలాలను చూసైనా మా ప్రియతమ నాయకుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆయన మా మాతృభూమి మీద నిలబడి ఆ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తాడు.

జస్వంత్ జెస్సి సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ కోసం తన ఫేస్‌బుక్‌లో ఆంగ్లంలో రాసుకున్న భావోద్వేగ ప్రకటనకు తెలుగుభావం ఇది. ఆయన ఆరోజు చేసిన అనేక పోస్టులలో ఇదొకటి. అది చదువుతున్నంతసేపూ నిండా వర్షంలో తడిసి సమత తదితర మిత్రులతో కలిసి ఆయన నాకు నెక్లెస్‌రోడ్‌లో కలియ తిరుగుతున్న దృశ్యమే కళ్ళల్లో మెదిలింది. జెస్సి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్ కావాలని కలలుకంటున్నాడు. అయితే అదేమంత పెద్ద కల కాదతనికి! అంతకుమించిన కల తెలంగాణ.ఆ తెలంగాణ కోసం ఆయన కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నా డు. ఎక్కడ ఉద్యమ అలికిడి విన్నా ఆ యువకుడు ఉలిక్కిపడి లేస్తాడు. ముందు వరుసలో ఉరుకుతాడు. అలాగే సాగరహారానికి కూడా పరిగెత్తి వచ్చాడు. అలా ఒక్క జస్వంత్ మాత్రమే కాదు లక్షలాది మంది సెప్టెంబర్ 30న నెక్లెస్‌రోడ్ కొచ్చారు. చాలామంది జస్వంత్‌లాగే తమ కలలను రాసుకున్నారు.పాడుకున్నారుపతిన బూనారు.

అచంచలవిశ్వాసంతో,అసమాన సాహసం చేసి వచ్చారు. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని వెళ్ళారు. తెలంగాణ మార్చ్ ఏం సాధించిందని కొంటె ప్రశ్నలు వేస్తున్న తుంటరి మీడియాకు తెలంగాణ అంతటా తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసమే సమాధానం. ఏదో ఒకరోజు నిర్ణయం ప్రకటించే రోజు రానే వస్తుందన్న విశ్వాసం ఆ ఆకాంక్షను నిరంతరం వెలిగిస్తూనే ఉంటుంది. ఈజిప్ట్ తరహా ఉద్యమం అని ముందుగా ఎవరన్నారో గానీ ఇది ఈజిప్టును మించిన ఉద్యమం. ఈజి ప్టు కంటే ఎక్కువ ప్రతికూల పరిస్థితుల్లో సాగుతున్న ఉద్యమం ఇది. ఈజిప్ట్ మొత్తం కథ రెండువారాల్లో ముగిసింది. 2011 జనవరి 25న కొద్దివేలమంది యువకుల ప్రజాస్వామ్య ప్రదర్శనతో మొదలయిన ఉద్యమం ఫిబ్రవరి 11న ఆ దేశ అధినేత హోస్ని ముబారక్ రాజీనామాతో ముగిసింది.


కానీ తెలంగాణ కథ అది కాదు. ఇది అరవయ్యేళ్ళ వ్యథ. ఇప్పటికే వందలాదిమందిని పాలక వర్గాలు బలిగొన్నాయి. కనీసం మూడేళ్లుగా యావత్ తెలంగాణ సమాజం అన్ని పనులూ వదిలేసి తెలంగాణ ప్రకటన కోసం చూస్తున్నది. జస్వంత్ లాగే ఎప్పుడో ఒకరోజు ఆ ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నది. ఇప్పటికే ఒకసారి వెలువడ్డ ఆ ప్రకటన తరువాయి భాగం కోసమే ఇంకా తండ్లాడుతున్నారు. సాగర హారం చరివూతలో అపూర్వం. వేలాదిమంది పోలీసులను, చెక్ పోస్టులను దాటి మరఫిరంగులను ఎదిరించి, ఇనుప కంచెలు ఛేదించుకుని లక్షలాదిమంది పిల్లాపాపలతో తరలిరావడం అసాధారణం. భారత దేశంలో ప్రజాస్వామ్యం ఉందని అంటారు. కానీ ఈజిప్ట్ నియంత హోస్ని ముబారక్ కనబరచిన ప్రజాస్వామిక ధోరణిని కూడా ఇక్కడి పాలకులు కనబరచలేదు. ముబారక్‌కు వ్యతిరేకంగా వేలాదిమంది గుమికూడిన రోజు నుంచి మూడురోజుల దాకా అక్కడ లాఠీచార్జ్ జరగలేదు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించలేదు, సరికదా ముబారక్ స్వయంగా ప్రదర్శకుల డిమాండ్లను ఒక్కొక్కటి అమలుచేస్తూ, తలవంచుతూ వచ్చాడు. ఈజిప్ట్‌లో చట్టం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ అన్నీ ఆ నియంత చేతిలోనే ఉన్నా ఆయన వాటిని ఆచి తూచి వాడుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సజీవంగా ఉంది. ఆ పార్లమెంటు సభ్యు లు కూడా ప్రజలతో సమాంతరంగా ఉద్యమంలో ఉన్నారు. వారిలో కొందరు ప్రజాస్వామిక విలువల మీద గౌరవంతో ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఇంకొందరు ఆ ప్రజల తరఫున ముఖ్యమంవూతిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఒక నియంత కనబరిచిన స్ఫూర్తిని కూడా ఇక్కడి పాలకులు కనబరచలేదు. అన్ని హక్కులనూ కాలరాచి పాలకులు నియంతలనే తలదన్నే విధంగా వ్యవహరించారు.

‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ’ హైదరాబాద్‌లో మార్చ్ నిర్వహిస్తామని మూడు నెలల ముందే ప్రకటించింది. మూడేళ్ళ కింద చేసిన ప్రకటనకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం సూచించిన ప్రకారం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలన్నది జేఏసీ ప్రభుత్వం ముందుంచిన ఒకే ఒక్క డిమాండ్. ఈ డిమాండ్ పూర్తిగా ప్రజాస్వామ్యయుతమైనది. కేంద్రం లో అధికారంలో ఉన్న కూటమి ఆమోదించిన నిర్ణయాన్ని అమలు చేయాల ని మాత్రమే ఇక్కడి ప్రజలు కోరారు. పూర్తిగా ఈ పాలకుల మీద, రాజ్యాంగ వ్యవస్థమీద విశ్వాసం ప్రకటిస్తూనే పాలకులు రాజ్యాంగాన్ని అనుసరించి ప్రవర్తించాలనే కోరారు. అలా మూకుమ్మడిగా తమ ఆకాంక్షను వ్యక్తపరచడానికి ఒక వేదిక కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది ప్రజల కనీస హక్కుల్లో ఒకటి. ఈ విషయాన్ని జేఏసీ అన్ని రకాలుగా వివరించింది. చివరికి రాజ్యాంగం గురించి తెలిసిన పెద్దలు, మాజీ న్యాయమూర్తులు, మేధావులు రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ విషయం తీసుకువచ్చారు. అనేక పద్ధతుల్లో తెలంగాణవాదులు చేసిన ప్రయత్నాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం సాగరహారానికి అనుమతి ఇచ్చింది. హుస్సేన్‌సాగర్ తీరంలో మార్చ్ చేసుకోవచ్చని ఒకవైపు అనుమతినిస్తూనే ఆ ప్రాంతాన్ని ముళ్ళ కంచెలలో బంధించింది. మార్చ్‌కు వస్తున్న లక్షలాదిమందిని నిర్బంధించింది. ఒక రాజకీయ ప్రక్రియ కోసం సాగుతున్న మార్చ్‌ను పూర్తిగా పోలీసులకు, పారా మిలిటరీ బలగాలకు అప్పగించింది. మార్చ్ జరుగుతున్నంత సేపు సైన్యం నెక్లెస్‌రోడ్ చుట్టూ కవాతు నిర్వహించింది. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు, జలఫిరంగులను విచ్చలవిడిగా ప్రయోగించింది. అక్కడొక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. అయినా ఒక్క అడుగైనా వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రజలు కవాతు చేశారు. ప్రపంచానికి తమ ఆకాంక్ష ఏమిటో మరోసారి వినిపించారు.

ఇన్ని అవరోధాలకు ఎదురునిలిచి నిలబడినందుకు, ఎంత రెచ్చగొట్టినా విధ్వంసానికి దిగకుండా ఉన్నందుకు ప్రపంచమంతా తెలంగాణ ప్రజలను అభినందించాలి. కానీ అలా జరగలేదు. ఈజిప్ట్ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన మీడియాకు తెలంగాణ మార్చ్ చిన్నదిగా కనిపించింది. ఈజిప్ట్ నియంతలు ప్రజాస్వామ్య ఆకాంక్షకు తలవంచారని రకరకాల కథలల్లి చెప్పి కాలక్షేపం చేసిన భారతీయ మీడియాకు హైదరాబాద్ నది ఒడ్డున పాలకుల నియంతృ త్వ ధోరణి కనిపించలేదు. ఒక్క పత్రికైనా ఎడిటోరియల్ రాస్తుందేమోనని, ఒక్క చానెల్ అయినా తెలంగాణ ప్రజలను అభినందిస్తూ చర్చ పెడుతుందేమోనని చూశాను. కనీసం వ్యక్తమైన ఆకాంక్షను గుర్తిస్తుందేమోనని ఆశించాను. కానీ మీడియా మార్చ్ మొదలు కాకముందే వక్రీకరణలు మొదలుపెట్టింది. మార్చ్ ముగియకముందే ఏం సాధించారని ఎగతాళి కథనాలు రూపొందించింది. ఇట్లా మొత్తంగా ప్రభుత్వం, పోలీసులు, మీడియా మూకుమ్మడిగా దాడిచేసినా కలత చెందకుండా కదిలిపోకుండా నిలబడి ఉండడం ఒక్క తెలంగాణ ప్రజలకే సాధ్యం. అందుకు వారిని, వారినలా తయారుచేసిన జేఏసీని అభినందించాలి.

సాగరహారం ఏం సాధించిందనే ప్రశ్నకు ఇప్పుడు అర్థం లేదు. అలాంటి ప్రశ్నలు వేసేవారు అక్కడ భారీ హింస జరగాలని, బాష్పవాయు గోళాలు మండి హైదరాబాద్ అగ్నిగుండం కావాలని, ఆ దృశ్యాలను పదేపదే చూపి మళ్ళీ మంటలు రాజేసి తమ చానెళ్ళ రేటింగులు పెంచుకోవాలని, దానితో పాటు ఆ హింసను ఆసరా చేసుకుని తెలంగాణవాదాన్ని పూర్తిగా అణచివేసి ఈ రాష్ట్రం విడిపోకుండా చూసుకోవాలనే ఎజెండా కూడా ఉండి ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు మార్చ్ ఒక మహదానందాన్ని కలిగించింది. మార్చ్ లో పాల్గొన్న వాళ్ళు తమ జన్మ ధన్యమయిందని భావించారు. దైవదర్శనం చేసుకుని వెళ్ళినంత తృప్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రకంగా మార్చ్ తెలంగాణ ప్రజలకొక ఆత్మవిశ్వాసం కలిగించింది. మార్చ్ సాధించిన రెండో విజయం ప్రజలకు ఒక కొత్త విశ్వాసం అందించడం. పరకాల ఎన్నికల తరువాత తెలంగాణవాదం కనుమరుగైపోయిందని, ఫాంహౌజులకు, ఢిల్లీ సిగ్నల్స్‌కే పరిమితమైపోయిందని అనుకుంటున్న వాళ్లకు మనం కూడా బలమైన సంకేతాలే పంపగలిగామన్న తృప్తిని మిగిల్చింది. నిజంగానే ఆ సంకేతాలు ఎంత బలంగా ఉన్నాయంటే మార్చ్ ప్రశాంతంగా ముగిసినందుకు తాను ఊపిరి పీల్చుకున్నానని స్వయంగా కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించారు.

ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయాలన్న మార్చ్ లక్ష్యం నెరవేరింది. ఇంతకాలం మనం ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ మాత్రమే టెలివిజన్‌లలో చూసే వాళ్ళం. కానీ మార్చ్ జరుగుతున్నంతసేపూ కేంద్రంలో అధికారంలో ఉన్న అగ్రనేతలంతా తెలుగు చానళ్లలో తెలంగాణ మార్చ్‌ను అంతే భావోద్వేగంతో తిలకించారట. బహుశా ఆ భావోద్వేగంతోనే సుశీల్‌కుమార్ షిండే అటువంటి ప్రకటన చేసి ఉంటాడు. మార్చ్ తెలంగాణ పౌర సమాజ పటిష్టతకు అద్దం పట్టింది. రాజకీయపక్షాలకు దీటు గా ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, అధ్యాపకులు, పాత్రికేయులు ఈ మార్చ్‌లో సైనికుల్లా కదిలారు. ఒకవైపు డాక్టర్లు జై తెలంగాణ అని నినదిస్తూనే మరోవైపు క్షతగావూతులకు ప్రాథమిక చికిత్స చేస్తూ అంబుపూన్సుల్లో ఆస్పవూతులకు తరలించే దృశ్యం. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తూనే... జర్నలిస్టులే స్వయంగా పారామిలటరీ దళాలను తరిమికొట్టడం. తాము అరెస్ట్ అయి పోలీసుల చెర లో బందీలుగా ఉండీ న్యాయవాదులు ఉద్యమకారులను విడిపించే ప్రయత్నాలు చేయడం.. ఇట్లా అనేక అరుదైన సంఘటనల సమాహారంగా సాగరహారం ముగిసింది. మార్చ్ సాధించిన మరో విజయం ప్రభుత్వ నిజ స్వరూ పాన్ని ప్రజలకు అర్థం చేయించడం. చివరి నిమిషం దాకా ఉద్రిక్తతలు పెంచి, మార్చ్‌కు అనుమతి నిచ్చినట్టు ప్రకటించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రజలందరూ గమనించారు. మార్చ్‌ను తాము అడ్డుకోబోమని చెపుతూనే ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధించడం, స్వయంగా ముఖ్యమం త్రి స్వీయ గృహ నిర్బంధంలో ఉండిపోయి చివరకు సొంతపార్టీ పార్లమెంటు సభ్యులను కూడా కలుసుకోవడానికి నిరాకరించడం, గవర్నర్ నివసించే రాజ్‌భవన్ చుట్టూ ముళ్లకంచెలు నాటడం, శాసనసభకు, సచివాలయానికీ తాళాలు వేసి పోలీసు పహారాలో కాపాడుకోవడం ఇవన్నీ ప్రజలు ప్రత్యక్షంగా గమనించారుపభుత్వ హడావుడికి భిన్నంగా ప్రజలు ప్రశాంతంగా నడవడాన్ని గమనించిన నగరవాసులు చాలామంది ఆ రోజు స్వయంగా వచ్చి చేరుకున్నారు. ఇది తెలంగాణ ఉద్యమానికి ఉన్న బలానికొక నిదర్శనం.


కానీ ఆ బలాన్ని నిలబెట్టుకోవడానికి జేఏసీ ఇప్పుడు ఏం చేయబోతుంద న్న ప్రశ్న చాలా కీలకం. మార్చ్ అనంతరం ఇప్పుడు తెలంగాణ ప్రజలే కాదు సీమాంధ్ర నాయకులు, ఆ ప్రాంత మీడియా కూడా ఈ విషయంపట్ల ఆసక్తి ని చూపిస్తోంది. నిజానికి సాగరహారం జేఏసీ నిర్వహించిందే అయినప్పటికీ జేఏసీలో ఉన్న భాగస్వామ్య పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు కీలక భూమిక పోషించాయన్నది తిరుగులేని వాస్తవం. జేఏసీ స్వయంగా స్వతంవూతంగా కేడర్, సంస్థాగత నిర్మాణం ఉన్న వ్యవస్థ కాదు. జేఏసీ తెలంగాణ సకల జనులకు ఒక గొడుగు లాంటిది. అందులో భాగస్వామ్యంగా ఉండి కదులుతున్న పార్టీలు, పక్షాలు దానికొక రూపాన్నిచ్చి నిలబెట్టాయన్నది వాస్తవం. ఆ పక్షాలన్నిటి కృషి వల్లే సాగరహారం మానవహారమై నిలబడింది. వారితో పాటు జేఏసీలో భాగంగాలేని సంస్థలు, వ్యక్తులు కూడా అందులో భాగ మై కదిలారు. ఒక రకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మినహా అన్ని రాజకీయపార్టీలు అక్కడి కి వచ్చాయి. గద్దర్, విమలక్క వంటి ఉద్యమకారులు కూడా తమ తమ కార్యకర్తలతో కళా బృందాలతో అక్కడికి వచ్చారు. ఇదొక మంచి పరిణామం. జేఏసీకి ఇదొక కొత్త బలాన్ని ఇచ్చే విషయం కూడా. కానీ ఇటువంటి ఉమ్మడి వేదిక మీది నుంచి రాజకీయ ప్రసంగాలు చేయ డం ఇతర రాజకీయ పక్షాలను కొందరు విమర్శించడం కొత్త వివాదాలకు కారణం అయింది.

ముఖ్యంగా విమలక్క చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్క టీఆర్‌ఎస్‌నే కాదు జేఏసీని కూడా ఇరకాటంలో పెట్టాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీలో చేస్తోన్న లాబీతో తెలంగాణ రాదని ఇక్కడ రాళ్ళు పట్టుకోవాలన్న ధోరణిలో ఆమె కొంచెం కటువైన పదాలతో ఆవేశ పూరిత ప్రసంగం చేశారు. అది అప్రస్తుత ప్రస్తావన. నిజంగానే టీఆర్‌ఎస్ పూర్తిగా ఢిల్లీకే పరిమితమై ఉంటే ఆ విమర్శ బాగుండేదేమో కానీ టీఆర్‌ఎస్ అక్కడ ఇక్కడా రెండుచోట్లా విమలక్క పార్టీ కంటే బలంగానే కనిపిస్తోంది. నిజానికి ఆవేశంతో ఆమె ఆ మాటలు అన్నప్పుడు ఎదురుగా ఉన్న సాగరహారంలో గులాబీ జెండాలే బలంగా ఎగిసిపడుతున్నాయి. పైగా ఆ జేఏసీ అందులో విమలక్క పార్టీ భాగం కాదు. టీఆర్‌ఎస్ ఆ వేదిక నిర్మాణం లో, ఇంతకాలం మనగలగడంలో కీలక పాత్ర పోషించింది. ఒక రాజకీయపార్టీగా విమలక్క పార్టీ తన వేదిక ద్వారా ఏదైనా మాట్లాడవచ్చు. ఎంతయినా విమర్శించవచ్చు. కానీ టీఆర్‌ఎస్ కీలక భాగస్వామి అయిన జేఏసీ వేదిక నుంచి అలా మాట్లాడడం జేఏసీ ధర్మ సూత్రాలకు విరుద్ధం. ఆది పెద్ద దుమారమై చివరకు టీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడి నుంచి వైదొలిగేలా చేసింది. అలా జరిగి ఉండకపోతే కోదండరాం ఆశించినట్టు మార్చ్ కొనసాగేదేమో. అది రాజకీయ ఒత్తిడిని పెంచేదేమో. కానీ చివరకు అదేదీ జరగకుండానే మార్చ్ ముగిసింది.

ఈ అనుభవం కోదండరాం నాయకత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇప్పటిదాకా అనేక అవమానాలను పంటి బిగువున అణచిపెట్టుకుంటూ పరస్పర విరుద్ధభావాలు, సిద్ధాంతాలున్న సంస్థలను సమన్వయపరుస్తున్న వ్యక్తి ఆయ న. ఆయనను ఇబ్బందిపెట్టే రీతిలో ఆ సంస్థలో భాగస్వాములే కాదు తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరూ ప్రవర్తించకూడదు. ఉద్యమం టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు ఎంత అవసరమో టీఆర్‌ఎస్, కేసీఆర్ కూడా ఉద్యమానికి అంతే అవసరం.
ఇప్పుడు తెలంగాణ కీలక దశలో ఉంది. ఢిల్లీ సిగ్నల్స్‌ను బట్టి ఈ మాట చెప్పడం లేదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుతున్న సిగ్నల్స్ కూడా ఇప్పుడు బలంగానే ఉన్నాయి. తెలంగాణ ఎంపీలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌ను బద్దలు కొడుతున్నారు. కచ్చితంగా ఇది కాంగ్రెస్‌ను కలవరపెట్టే విషయం. ఇప్పుడు జేఏసీ కాంగ్రెస్ ఎంపీలకు కూడా అండగా ఉండాలి. మంత్రుల మీద ఒత్తిడి పెడతామని జేఏసీ చేసిన ప్రకటన చాలా కీలకం. ఆ పని చేస్తే తప్ప కాంగ్రెస్ మత్తు వదలదు. అయితే దానికొక స్పష్టమైన కార్యాచరణ జేఏసీ ప్రకటించాలి. ఢిల్లీలో ఏం జరిగిందో జేఏసీ కేసీఆర్‌ను కలిసి తెలుసుకోవాలి.

ప్రజలకు ఆ సంగతులన్నీ తెలియజెప్పాలి. మళ్ళీ ఢిల్లీ చర్చలకు పిలిచేదాకా ఆగకుండా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉద్యమం కొనసాగాలి. ఈ నెలే చివరి గడువు అని కేసీఆర్ అంటున్నారు. ఈ నెలలో తేలితే సరే సరి, లేకపోతే జేఏసీ ఈ ఏడాది చివరి గడువుగా ప్రకటించాలి. మళ్ళీ డిసెంబర్ 9 నాటికి తెలంగాణ ప్రకటన రాకపోతే డిసెంబర్ 9న స్వయంగా ప్రజలే హైదరాబాద్‌కు వచ్చి శాసనసభకు, సచివాలయానికి వేసివున్న తాళాలు తెరుచుకుని స్వయంపాలన ప్రకటించుకునే దిశగా ఆలోచించాలి. ఈజిప్ట్ తరహా కాదు. దాన్ని తలదన్నే స్ఫూర్తి పొందిన ఈ తరుణంలో ఇంకొకసారి డిసెంబర్ 9 ‘ఆక్యుపై హైదరాబాద్’ అంటే ఢిల్లీ దానంతట అదే దిగివస్తుంది. జస్వం త్ పేర్కొన్నట్టు అప్పుడే మన నేలమీద నిలబడి మనం ఒక స్పష్టమైన ప్రకటన వినే రోజు వస్తుంది!!

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ghantapatham@gmail.com

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ