రాయల తెలంగాణ రాగం వెనుక..?!


Thu,July 5, 2012 11:45 PM

ఈసారి నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వానలు కురుస్తాయని వాతావరణశాఖ నెలరోజుల క్రితం సాధికారికంగా ప్రకటించింది. అది నిజమేనన్నట్టు ఆకాశం నిండా మేఘాలు కమ్ముకుని మురిపించింది. వేడి తగ్గింది. మబ్బు లు కమ్ముకున్నాయి. ఆ మబ్బులు చూసి ఈసారైనా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని తెలంగాణ రైతులు ఆశ పడ్డారు. కానీ ఆయి టి పూని నెల దాటుతున్నా ఒక్క చినుకు లేదు. మబ్బులు అలాగే ఉన్నాయి. ప్రతిరోజూ నేడో రేపో అన్నట్టు కమ్ముకు వస్తున్నాయి. మనలో ఆశలు ఎన్ను న్నా ఇలా నెలలు గడుస్తున్నా అవి ఇప్పుడిప్పుడే కురిసే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం సంగతి కూడా ఋతుపవనాల ను తలపిస్తోంది. ఎండాకాలపు వేడి, ఎన్నికల హడావుడి తగ్గాయో లేదో ఢిల్లీలో కొత్త కోలాహలం మొదలయ్యింది. వానలు రాక, విత్తనాలు లేక నాగళ్ళు వదిలి రైతులు రోడ్లెక్కారు. వాళ్ళనలా గాలికి వదిలేసి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ విమానాపూక్కారు. వాళ్ళు విమానాపూక్కింది మేఘమథనం కోసం కాదు! మేధోమథనం కోసమని ఉపఎన్నికల్లో ఊపిరాడకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించాలో చర్చించడానికని కొందరంటున్నారు. మరికొందరు మాత్రం వాళ్ళు ఢిల్లీ వెళ్ళింది కేవలం రాష్ట్రపతి ఎన్నికల వ్యూహ రచన కోసమని, ఊహించని పరిణామం ఏదైనా జరిగి రాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న అధికారపార్టీ అభ్యర్థి ప్రణబ్‌కుమార్ ముఖర్జీ ఓడిపోతే పరువుపోతుందని ముందు జాగ్రత్తగానే పిలిపించుకున్నారని అంటున్నారు. అవి రెండూ వాస్తవమే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అతి పెద్ద ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రం ఆంధ్రవూపదేశే. పొరపాటున ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల మాటవిని ఓటు వేయకుండా ఉంటారేమోననే భ్రమ వాళ్ళ ది. అలా జరగకపోయినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న జగన్ విధేయులు జెండా ఎత్తేస్తారేమోననే భయం కూడా వాళ్ళను వెంటాడుతోంది.

అసలు సంగతి ఇదైతే హఠాత్తుగా తెలంగాణ ఇవ్వబోతున్నారని గాలి వార్త ఒకటి ఢిల్లీలో పుట్టించారు. వాతావరణశాఖ ఎండాకాలంలో వాన కురుస్తుందంటే నమ్మవచ్చేమో కానీ ఇన్ని దశాబ్దాల అనుభవం తరువాత కూడా కాంగ్రెస్ ఉన్నఫలంగా తెలంగాణ ఇచ్చేస్తుందంటే మాత్రం నమ్మలేం. పైగా ఇప్పుడు ఉద్యమం విరామంలో ఉన్నది. అయినప్పటికీ ఆ వార్త కరడుగట్టిన సమైక్యవాదుల నోటినుంచి చెప్పించారు. కోస్తాంధ్ర నేతల్లో ఒకరు నేడో రేపో తెలంగాణ ప్రకటన రానున్నదని అంటే, రానున్నది రాయల తెలంగాణ అని రాయలసీమ నేత ఒకరు ఊదరగొట్టారు. అదేదో లేకపోయినా కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాయల తెలంగాణ తమకు ఆమోదయోగ్యమేనని కాంగ్రెస్‌పార్టీలోని చోటామోటా లీడర్లు అప్పటికప్పు డు ఆగమేఘాల మీద ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ప్రకటించేశారు. వాన పడుతుందో లేదో తెలియని అయోమయంలో ఎందుకైనా మంచిదని గొడుగును సరిచేసుకున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ రాయల తెలంగాణ వద్దంటూ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలుచేసి, కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా ఇచ్చేసింది. అది ఆంధ్రా మీడియా చిలువలు పలువలు చేసి తెరమీదే సరిహద్దులు గీసేసి మరింత ఆందోళనకు గురి చేసింది. మీకిది ఆమోదయోగ్యమేనా అని ఎస్‌ఎంఎస్ ప్రశ్నలు, చర్చలు మొదలయ్యాయి. హఠాత్తుగా హైదరాబాద్ ఎవరిది? అంటూ కథనాలు మొదలయ్యాయి.. హైదరాబాద్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలంతా రాయలసీమ వాళ్ళేనని ఒకరంటే, ఆ కూలీలకు జీతాలిచ్చింది కోస్తా వాళ్ళే అన్న కట్టు కథలూ ప్రసారమయ్యాయి. ఐదారు నెలలుగా అజ్ఞాత వాసంలో ఉన్న ఆంధ్రా మేధావులు శాలువాలు సరిచేసుకుని మళ్ళీ బుల్లితెరమీద ప్రత్యక్షమైపోయారు. నిజానికి ఆకాశం మబ్బు పట్టినంత మాత్రాన వాన రాదని వాళ్ళకూ తెలుసు. అయి నా ఏదో ఒక తుపాను సృష్టించాలి. ఇప్పుడు ఆ తుపాను ఇంకా ఢిల్లీ తీరం దాటలేదు. బహుశా ప్రణబ్ ఎన్నిక సజావుగా జరిగే దాకా ఈ ఈదురు గాలు లు, ఉరుములతో కూడిన జల్లులు పడుతూనే ఉంటాయి.

కాంగ్రెస్‌పార్టీ ఇప్పుడు మరోసారి తెలంగాణ అనే బహుళార్థ సాధక ప్రాజెక్టును ముందుకు తేవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒక టి రాయల తెలంగాణ అనే కొత్త ప్రతిపాదనతో సమస్యను మరింత జటిలం చేయడం. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణ లో కలిపి, కడప చిత్తూరు జిల్లాలు ఆంధ్రాకు వదిలేయాలన్నది ఆ ప్రతిపాద న సారాంశం. ఇది కేవలం కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి వచ్చిన ఆలోచన కాదు. కొందరు మత పెద్దలు శ్రీ కృష్ణ కమిటీ బుర్రలో వేసిన బీజం. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ పదే పదే చెపుతూ వస్తున్నది ఇదే. దీనివల్ల ముస్లిం ప్రాబల్య స్థానాలు పెరుగుతాయని ఆయన అంచనా. ఈ బీజాన్ని ఇటు తెలంగాణ అటు రాయలసీమలో రాజ్య పరిపాలనాకాంక్ష ఉన్న కొంద రు రెడ్డి సామాజిక వర్గ నేతలు పెంచి పెద్ద చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణ వస్తే తమ ప్రాబల్యం తగ్గిపోతుందేమో అన్న బెంగ వారి మనస్సుల్లో చాలాకాలంగా ఉందని, ఒకవేళ ఉన్న ఫలంగా తెలంగాణ వస్తే నాయకత్వం తమ చేతుల్లోనే ఉండేట్టు చూసుకోవాలని రెడ్డి కుల పెద్దలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో అన్ని పార్టీలు కలిపితే 41 స్థానాలు వారి ప్రాతినిధ్యంలో ఉన్నప్పటికీ అందులో కాంగ్రెస్ గెలిచింది ఇరవైలోపే. ప్రత్యేక రాష్ట్రంలో చక్రం తిప్పాలంటే ఏ పార్టీకైనా కనీసం అరవై మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉండాలి. ఈ అరవై మందిలో తమ సామాజిక వర్గం వాళ్ళే మెజారిటీ అయితే తిరుగు ఉండదని ఒక ఆలోచన. అది ఒక్క తెలంగాణ అయితే కష్టం. కాబట్టి కర్నూ లు, అనంతపూర్ జిల్లాలను కలుపుకోవాలని రెండు ప్రాంతాల నేతలు ప్రయత్నిస్తున్నారు. జేసీ దివాకర్‌డ్డి కలిసిపోతామంటే, గండ్ర వెంకట రమణాడ్డి కలుపుకుంటాం అనడం వెనుక కారణం ఇదేనని అంచనా! రాయలసీమలోని ఈ రెండు జిల్లాలు కలిస్తే శాసనసభ బలం 147కు పెరుగుతుం ది. ఈ రెండు జిల్లాలలో సాంప్రదాయకంగా రెడ్లు గెలిచే స్థానాలు 13 నుంచి 18దాకా ఉంటాయి. అంటే ఆ కులం బలం 55-60 అప్పుడు దాదాపు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ సీట్లు, ముస్లిం ప్రాబల్యం ఉండే పాతబసీ ్తతదితర స్థానా లు పోతే కాస్త అటుఇటుగా వంద స్థానాలు ఉంటాయి. వాటిలో యాభై నుంచి అరవై స్థానాలు ఒకే కులం చేతిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన, ఏ పార్టీలో చూసినా రెడ్డి సామాజిక వర్గం ఒక ప్రాబల్య రాజకీయ వర్గంగా అవతరించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. అందరికీ ఈ లెక్కలే ఉండకపోవచ్చు. అందులో కొందరైనా అసలు సిసలు తెలంగాణవాదులు ఉండవచ్చు కాబట్టి వాటిని పూర్తిగా నిజమని అనలేం. కానీ ఈ లెక్కలన్నీ తెలిసినవాళ్ళు ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. వాళ్ళే అధిష్ఠాన వర్గం దగ్గర రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే కనీసం ఇరవై మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీ పంపిస్తామని అంటున్నారని వినికిడి. అదే జరిగితే అటు సామాజిక తెలంగాణవాదం, ఇటు ప్రజాస్వామ్య తెలంగాణ ప్రయ త్నం రెండూ వీగిపోతాయన్నది మాత్రం నిజం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గణాంకాలే తప్ప సామాజిక సమీకరణాలతో పనిలేదు. కాబట్టి ఈ ప్రతిపాదనను ఆమోదించినా ఆశ్చర్యం లేదు.

ఒకవేళ ఆ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్రంలో కొత్త రామాయణం మొదలవుతుంది. రాయల తెలంగాణ రాయలసీమ ప్రజల నుంచి వచ్చిన డిమాం డ్ కాదు. కేవలం రాజకీయ వ్యాపారులు తెచ్చిన ప్రతిపాదన. సీమాంవూధలో జగన్ సృష్టిస్తోన్న తుపానులో కాంగ్రెస్‌పార్టీ కొట్టుకుపోకుండా రాయలసీమను రెండేసి జిల్లాలుగా విడదీసి అందులో ఒక భాగాన్ని తెలంగాణలో కలిపేయాలన్నది వాళ్ళు చేస్తున్న ప్రతిపాదన. ఒక రకంగా జగన్ బూచీచూపిస్తూ వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నది కాంగ్రెస్‌ను కాదు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారాలను, రింగ్ రోడ్ చుట్టు పక్కల ఆక్రమించుకున్న భూముల ను. వాటితోపాటు హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిని. జేసీ దివాకర్‌డ్డి లాంటి వారికైతే అదే జీవనాడి. ఆయన వందల సంఖ్యలో తన బస్సుల్ని నడిపించుకునేది, కోట్లాది రూపాయలు కూడబెట్టుకుంటున్నది. ఈ రోడ్డు మీదే. అలాగే టీజీ వెంక వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా తెలంగాణవాదులు విడిపోతామంటే వేర్పాటువాదమని వాదించిన వీళ్ళు రాయలసీమను రెండుముక్కలు చేసేస్తామ ని అంటున్నారు. ఇంతకు మించిన అవకాశవాదం ఇంకొకటి ఉండదు. రాయలసీమ ఒక ప్రాంతం మాత్రమే కాదు. తెలంగాణలాగే ఒక అస్తిత్వం. ఒక సంస్కృతి. ఒక ప్రత్యేక సాంఘిక రాజకీయ ఆర్థిక ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అయినా అలా విడదీసే అధికారంగానీ, తాహతు గానీ జేసీకో, టీజీకో లేవు. అది అక్కడి ప్రజల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఆ రెండు జిల్లాల ప్రజలు, లేక మొత్తం రాయలసీమ ప్రజలు ప్రజాస్వామికంగా అలా నిర్ణయించుకుంటే విడిపోవ చ్చు. కానీ తెలంగాణ ప్రజల అంగీకారం లేకుండా తెలంగాణలో కలవలేరు. ఎవరైనా ఇష్టం లేకుంటే విడిపోవచ్చేమో కానీ ఇష్టం లేకున్నా కలవడం సాధ్యం కాదు. ఈ ఇద్దరు నేతలకు ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వార్నింగ్ ఇచ్చింది. తమను దెబ్బతీయడం కోసం సీమను చీలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక జారీ చేసింది. ఇది కచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరికగా వాళ్ళు భావిస్తే మంచిది. ఇది కేవలం ఇద్దరు నాయకులకే కాదు. మొత్తం రాష్ట్రానికే నష్టదాయకమయ్యే పరిణామం. ప్రాంతాల మధ్య కొత్త ఉద్రిక్తత లు పెంచే ప్రయత్నం. బహుశా కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం కూడా ఇలాంటి కొత్త ఉద్రిక్తతనే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాయలసీమలో ఇటువంటి అలజడిని ఒకదానిని సృష్టించి రాష్ట్ర విభజనను శాశ్వతంగా అటక ఎక్కించే ఆలోచన ఆ పార్టీకి ఉందనిపిస్తోంది.
ఒకవేళ ఏ ఆందోళనా లేకుండా విడిపోతే రాయల తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కూటమికి తిరుగుండదని వారు భావిస్తుండవచ్చు. కేసీఆర్ గతంలో చేసిన ప్రకటన మేరకు టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసి-లేదా కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో కలిపి- కేసీఆర్‌కే ఇక్కడి ప్రభుత్వ పగ్గాలు అప్పగిం చవచ్చు. ఎలాగూ జగన్‌ను ఓడించే అవకాశం లేదు. కాబ ట్టి రాయలసీమను రెండుగా చీల్చడం వల్ల జగన్ కచ్చితంగా గెలిచే స్థానాలలో కనీసం 25 స్థానాలు తగ్గిపోతాయి. ఆంధ్రా లో కాపు, కమ్మ, రెడ్డి, మాల సామాజిక వర్గాల బలం దాదాపు సమానమైపోతుంది. అక్కడ ఏ కొత్త కాపుకో నాయకత్వం అప్పగించి రెండేళ్ళు కాలం గడపవచ్చు. ఈ లోగా జగన్‌ను దారిలోకి తెచ్చుకోవడానికి సీబీఐ విచారణ ఎలాగూ ఉంది. నిజంగానే జగన్ భయపడిపోతే కాంగ్రెస్ గూటికే చేరతాడు. అలా కాకపోతే ఆయనే గతంలో చెప్పినట్టు బయటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాడు. అప్పుడు 2014లో అక్కడ జగన్ కాంగ్రెస్, ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్. రూపమేదైనా కనీసం 30 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంటాయి.

ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది ఇటువంటి నాటకానికి ఒక రిహార్సల్ మాత్రమే. దానికి రాష్ట్రపతి ఎన్నిక ఉపయోగపడుతోంది. ఈ ఎన్నికలో ఆంధ్రవూపదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. ప్రణబ్‌ను సమర్థించే వాళ్ళు కాంగ్రెస్ కూటమిగా, వ్యతిరేకించే వాళ్ళు బీజేపీ కూటమి గా మారనున్నారు. అందుకేనేమో పాపం చంద్రబాబు ఇక్కడకూడా తటస్థ పాత్రతో గుమ్మం బయటే నిలబడాల్సి వస్తోంది. తెలంగాణ జేఏసీ ఎన్ని చెప్పినా కేసీఆర్ ప్రధానికి మాట ఇచ్చివుంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం అనివార్యం. టీఆర్‌ఎస్ మద్దతు జనరంజకంగా ఉండాలంటే ఢిల్లీ నుంచి ఏదో ఒక హామీ రావాలి. బహుశా ఈ తెలంగాణ అనుకూల పవనాలు అందుకు ఉపయోగపడవచ్చు. నిన్నటిదాకా బద్ధ శత్రువులన్న భ్రమ కల్పించిన కాంగ్రెస్-వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఒక రాజకీయ అవగాహనకు రానున్నాయి. కాంగ్రెస్‌పార్టీ చాణక్యుడు స్వయంగా రాష్ట్రపతి అభ్యర్థి అయిన ప్రణబ్ విజయమ్మకు ఫోన్‌చేసి మద్దతు కోరారు. ఆ మరుసటిరోజే ఆమె ఢిల్లీ వెళ్లి సీబీఐ వేధింపుల నుంచి తన కొడుకును కాపాడవలసినదిగా స్వయంగా ప్రధానినే కోరారు. ‘మతతత్వ బీజేపీ’కి తాము వ్యతిరేకమని చెప్పి రేపో మాపో జగన్ ప్రణబ్‌కు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు! ఇది రాజకీయం, ఏదైనా జరగవచ్చు! అంతా క్విడ్ ప్రో కో!

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్: ghantapatham@gmail.com

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ

Published: Fri,January 24, 2014 12:06 AM

ఇదేనా రాజ్యాంగ నిబద్ధత?

గతంలో రాష్ర్టాల విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడి

Published: Fri,January 10, 2014 02:12 AM

చర్చ జరగాల్సిందే!

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

Published: Fri,January 10, 2014 02:11 AM

చర్చ జరగాల్సిందే!

ఇప్పటిదాకా తెలంగాణ పేరుమీద రాజకీయాలు చేసినవాళ్ళు, రేపు తెలంగాణ సాధించామని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు.

Published: Fri,January 3, 2014 01:17 AM

వృథా ప్రయాస!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణను ఆపేంత శక్తిమంతుడా! న్యాయంగా అయితే ఒక రాజ్యాంగ ప్రక్రియ కాబట్టి అడ్డుకోవడం సాధ్యం కాదని ఆ

Published: Fri,December 27, 2013 03:02 AM

ఉద్యమాలే ఊపిరిగా..

చరివూతలో మనం అనేకమంది ఉపాధ్యాయులను చూసి, విని ఉండవచ్చు. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని పలు సందర్భాల్లో మనకు తారసపడిన ఉపాధ్యాయులను

Published: Fri,March 1, 2013 12:05 AM

తెలంగాణమీది నిఘా టెర్రరిజంమీద ఏది?

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు మొత్తం దేశాన్నివణికించాయి. ఇది హైదరాబాద్ నగరానికి ఊహించని పెను విషాదం. మరణించిన వారిలో అంతా సామాన్యు

Published: Thu,February 21, 2013 10:50 PM

బాలచంవూదుడికి బాసట కాలేమా!

బుద్ధుడు యుద్ధమే వద్దన్నాడు. యుద్ధ కాలంలో బతికి ఉన్నవారికి బాసటగా ఉండాలన్నాడు. పోరాడాలన్న తలంపు వీడి మనసునిండా దయను నింపుకోమన్న

Published: Thu,January 31, 2013 11:35 PM

ముమ్మాటికీ మూడు తరాల మోసం

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది. నమ్మించి మోసం చేయడం ఆ పార్టీ నైజం. నెలరోజుల్లో తెలంగాణ ఇస్తామని యూపీఏ ప్రభుత్

Published: Thu,January 17, 2013 11:28 PM

కాంగ్రెస్‌ను నమ్మగలమా !?

తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందా? కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించే సమయం దగ్గరపడుతున్నకొద్దీ సీమాంధ్ర మంత్రులు, రాజకీయ నా

Published: Thu,December 20, 2012 11:09 PM

నేరమే అధికారమయితే..!

క ళ్ళకు గంతలతో ఉండే న్యాయదేవత ఎటువంటి ప్రలోభాలకు తావులేకుండా దేనికీ ప్రభావితం కాకుండా, రాగద్వేషాలకు అతీతంగా తీర్పు చెపుతుందని ఒక వ

Published: Thu,December 6, 2012 10:33 PM

ప్రజలు ప్రేక్షకులు కావొద్దు..!

అఖిలపక్ష భేటీకి ముందుగానే పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పే విధంగా ఆయా పార్టీలలో ఉన్న తెలంగాణ నేతలు ఒత్తిడి చేయాలి. నిజమే అ

Published: Thu,November 22, 2012 11:53 PM

చుప్..నోరు మూసుకుని బతకండి!

మీకు ఈ ‘ఘంటాపథం’ నచ్చితే మౌనంగానే ఉండండి. మనసులోనే అభినందించండి. దయచేసి నోరు విప్పకండి. ఇంకెవరికీ ఆ మాట చెప్పకండి. నేను ఫేస్‌బుక్‌

Published: Thu,November 15, 2012 11:10 PM

పాపం పురోహితులు...

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువ వివాదాస్పదం అవుతున్నాయి. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మొదలైన గొడవలు‘దేనికైనాడీ’అని మ

Published: Fri,November 2, 2012 12:41 AM

చర్చలు జరపాల్సింది ఎవరితో?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావును చాలామంది కీలెరిగి వాతలుపెట్టే నేతగా పేర్కొంటారు. ఆయన వర్తమాన రాజకీయాలలో ఆరి

Published: Fri,October 19, 2012 03:06 PM

ఎనిమిదో చాప్టరే ఇప్పడు శాసనం !

చాలారోజుల కిందట సినీ నటుడు చిరంజీవి గారింట్లో ఆయన పెద్దకూతురు నిశ్చితార్థం జరిగింది. ఆయన ఆ కార్యక్షికమాన్ని తన ఇంటివరకే పరిమితం చే

Published: Fri,October 5, 2012 12:34 AM

ఈజిప్ట్‌ను తలదన్నిన మార్చ్

మేం ముందుగా చెప్పినట్టే మా మాటమీద నిలబడి ఉంటాం. మేం గడిచిన అరవై ఏళ్ళుగా మా తల్లి తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన విద్యార్థులం.

Published: Thu,September 20, 2012 11:33 PM

తెలంగాణ మార్చ్‌ను ఏమార్చే కుట్ర !

తెలంగాణ మార్చ్ శాంతియుతంగా గాంధేయ మార్గంలో జరుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం పదేపదే చెపుతున్నా ప్రభుత్వం మాత్రం ఏదో ఒక రకంగా మార్చ్‌క

Published: Fri,September 14, 2012 02:15 AM

సెప్టెంబర్ -17 ముందూ వెనకా...

సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలి ఆన్న విషయంలో చాలా చర్చే జరిగింది, జరుగుతూనే ఉన్నది. చారిత్రకంగా స్వతంత్ర రాజ్యం గా ఉన్న హైదరాబాద్

Published: Thu,September 6, 2012 11:45 PM

తెలంగాణ: ఒక అనివార్యత

చాలా రోజుల స్తబ్దత తరువాత మళ్ళీ తెలంగాణలో కదలిక కనిపిస్తోం ది. తెలంగాణ జిల్లాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ, ఢిల్లీలో భారతీయ జనతాపా

Published: Thu,August 30, 2012 11:14 PM

‘సర్వే’జనా సుఖినోభవంతు..!

నూటికి ఎనభై ఆరు మంది తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఎన్డీ టీవీ సర్వే తేల్చింది. ఈ వార్త విని చాలామంది సంతోష

Published: Fri,August 17, 2012 12:13 AM

బడుగుల నెత్తిన పిడుగులు !

ధర్మాన ప్రసాదరావు బీసీ అయినందువల్లే ఆయనమీద నేరాభియో గం మోపారా? ఇది బీసీలను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నమా? దీని వెనుక కుట్ర కోణ

Published: Thu,August 9, 2012 11:52 PM

సిగ్నల్ సిండ్రోమ్!

తెలంగాణ సమాజం ఇప్పుడు కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలారోజుల స్తబ్తత తరువాత, ఈ మధ్యే మళ్ళీ తెలంగాణ మాట వినబడుతోంది.

Published: Sat,August 4, 2012 01:00 AM

ఒక బాబు.. రెండు కళ్లు.. మూడు రంగులు

ఆ మధ్య ఊసర పేరుతో ఒక సినిమా వచ్చినప్పుడు ఇదేం పేరని అనుకున్నా! అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఊసర చాలా అరుదైన కీటకం. పరిస్థితిని బట్

Published: Thu,August 9, 2012 08:45 PM

డబుల్ బారెల్ జ‘గన్’!

సిరిసిల్ల పరిణామాలు శ్రీలంకను గుర్తుకు తెచ్చాయి. అందుకు ముందు గా తెలంగాణ లిబరేషన్ టైగర్ రహీమున్నీసాకు తెలంగాణవాదులంతా కృతజ్ఞతలు

Published: Fri,June 29, 2012 12:02 AM

అన్నీ డమ్మీ తుపాకులే సార్..!

ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కాలో తెలుసుకోవడమే రాజనీతి అంటారు. రాజనీతికి అత్యున్నత దశగా, ఒక ఆదర్శంగా విప్లవాన్ని అభివర్ణించే వాళ్ళు ట్రిగ

Published: Fri,June 22, 2012 12:09 AM

జయశంకర్ సర్‌తో కరచాలనం!

ఆంధ్రుల దినపత్రికలను పెట్టుబడికీ కట్టుకథకు పుట్టిన విష పుత్రికలుగా శ్రీ శ్రీ అభివర్ణించారు. ఆంధ్రుల పత్రికలు గోరంతలు కొండంతలు చేస

Published: Fri,June 15, 2012 12:01 AM

జయశంకర్ స్ఫూర్తిని మరిచిపోయామా!

జ యశంకర్ సార్ చనిపోయిన నెల రోజుల్లో మిత్రుడు జూలూరు గౌరీశంకర్ ‘తెలంగాణ జాతిపిత సర్ జయశంకర్’ పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. మూడు

Published: Fri,June 1, 2012 12:46 AM

దేవుడు చేసిన మనుషులు!

దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మేవాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు లేడని నిర్ధారించుకున్నాక ఆ చర్చకు కాలం

Published: Fri,August 31, 2012 07:12 PM

కోస్తా తీరాన్ని కొల్లగొట్టారు!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ ను సీబీఐ అరెస్టు చేసింది. వాన్‌పిక్ పేరుతో వేలాది ఎకరాలు అక్రమంగా కాజేసిన

Published: Fri,May 11, 2012 12:52 AM

తెలంగాణ గళంలో కాషాయ గరళం!

బీజేపీ గురించి ఈ తరం నాయకుల్లో చాలామంది కంటే డా. దాసోజుశ్రావణ్‌కే ఎక్కువగా తెలుసు. టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరోలో క్రియాశీలంగా ఉన్న ఈ య

Published: Fri,April 27, 2012 12:21 AM

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగవ్యవస్థ

ఉద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పదునెక్కిస్తా యి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఉన్నట్టుండి తమ పెద్దలందరి

Published: Fri,April 13, 2012 12:29 AM

తెలంగాణకు కొత్త ఫేస్‌బుక్ కావాలి!

మిమ్మల్ని మీరు దహించుకోకండి. 2014 వరకు ఆగండి, అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను కాల్చిపారేయవచ్చు’. ఇది తెలంగాణ విద్యార్థులకు

Published: Fri,April 6, 2012 12:11 AM

బస్తర్ బిడ్డలకు బాసటగా నిలబడదాం!

తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల అగ్గి ఎందుకు రాజుకుందో కానీ అదిప్పుడు అందరినీ కలచివేస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట ఎవ రో ఒకరు ఆత్మహత్యకు ఆ

Published: Thu,March 29, 2012 11:02 PM

ఆ ‘ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!

వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు.

Published: Thu,March 8, 2012 11:57 PM

ఈ విరామం ఇక చాలు...

చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను గుర్తు చేస్తోంది కాంగ్రెస్ వైఖరి. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక కూడ

Published: Fri,February 17, 2012 01:40 AM

అధ్యక్షా ! మన్నించండి...

శాసనసభ స్పీకర్ ఎవరు? ఎవరైనా నాదెండ్ల మనోహర్ అనే చెపుతారు. అది నిజమే! కానీ శాసన సభలో గందరగోళం గమనిస్తున్న వారికి అలా అనిపించడం ల

Published: Fri,February 10, 2012 12:03 AM

అవినీతి ఆచార్యులు

హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసిన ఖులీ కుతుబ్ షా పేరున ఆయన చనిపోయి నాలుగు శతాబ్దాలు దాటినా ఒక్క స్మారక చిహ్నం కూడా లేదు. కానీ బ

Published: Fri,February 3, 2012 01:37 AM

కోస్తాలో కుల ‘కరివేకాపులు’!

కోస్తా జిల్లాల్లో రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం సందర్భంగా తెలంగాణ సమాజం స్పందించి న తీరు అభినందనీయం.

Published: Thu,January 19, 2012 11:25 PM

తెలంగాణలో పత్తి గత్తర!

సంక్రాంతిని రైతుల పండుగ అంటారు. కొత ్తపంటలతో రైతుల లోగి ళ్ళు కళకళలాడినప్పుడు చేసుకునే పండుగ అది. సంక్రాంతి సందర్భంగా సీమాంధ్రలో జర

Published: Thu,January 12, 2012 11:35 PM

విజయం కాదు.. వైఫల్యం!

రా జకీయాలు రణరంగం కంటే ప్రమాదకరం అంటారు చర్చిల్. చర్చి ల్ రాజకీయ అభివూపాయలతో మనకు ఏకాభివూపాయం ఉన్నా ,లేకున్నా బ్రిటీష్ పాలకుడిగా ఆ

Published: Fri,January 6, 2012 12:02 AM

మనుషులా? మృగాలా!?

ఆంధ్రవూపదేశ్ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎంత సౌమ్యుడుగా కనిపిస్తారో అంతటి రాజకీయ చతురుడు. ప్రజల ఒత్తిడో, తెలంగాణ సాధన లక్ష్యమో

Published: Fri,December 30, 2011 12:44 AM

బాబు వెడలె రభసకు..

శనీశ్వరుడి మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. నేను అలాంటివేమీ నమ్మను గానీ నమ్మిన వారి విశ్వాసాలు గౌరవిస్తాను. శని చాలా ప్రభావశీలి అన

Published: Thu,December 22, 2011 11:29 PM

మౌపమే మారణాయుధం!

మీరెప్పుడైనా జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్‌కు వెళ్ళారా? హైదరాబాద్‌లో ఉండే వారు మినహా చాలా మందికి అదేమిటో తెలియకపోవచ్చు. సరిగ

Published: Fri,December 9, 2011 12:13 AM

‘రాజ’ద్రోహానికి రెండేళ్ళు!

కావూరి సాంబశివరావును తెలంగాణ కు విలన్ అని చాలామంది అనుకుంటారు. కానీ తెలంగాణ నేతల గుణగణాలు ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవని అన

Published: Thu,December 1, 2011 11:50 PM

తెలంగాణ తొలిపొద్దు..

ఇంట్నట్ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పే జీకి తీసుకెళ్తుంది

Published: Fri,November 25, 2011 12:00 AM

ఇద్దరూ దోచింది తెలంగాణనే!

నవంబర్ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. తెలంగాణను ఆంధ్రవూపదేశ్‌లో కలిపింది నవంబర్ ఒకటి అయి తే, ఆంధ్రవూపదేశ్ నుంచి తెలం

Published: Thu,November 17, 2011 11:58 PM

పెనం వేడయ్యేదాకా వంట ’చెరుకు’ ను కాపాడాలి..!!

దాదాపు ఆరు నెలల క్రితం ‘టీ న్యూస్’ ఛానల్ లో ఉద్యమ తీరు తెన్నుల మీద ఒక చర్చ జరిగింది. నాతోపాటు ఆ చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితి ఫైర్

Published: Thu,November 10, 2011 11:06 PM

నాయకులకు ఇది పరీక్షా సమయం!

తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చలేమని ఢిల్లీ పెద్దలకు అర్థమయిపోయింది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై ఏదో ఒక ప్రకటన రావొచ్చనీ అంటున్నారు.

Published: Thu,October 27, 2011 11:46 PM

విద్రోహ పార్టీలకు బుద్ధి చెప్పాలె

దీపావళిలోగా తెలంగాణ పై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పిన కాకమ్మ కబుర్లు నమ్మిన వాళ్లకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దీపావళి

Published: Sun,October 23, 2011 01:38 PM

కాంగ్రెస్ లక్ష్యంగానే కార్యాచరణ

ప్రభుత్వోద్యోగులు భద్ర జీవులని చాలామంది అనుకుంటారు. ఉద్యో గం ఉంటే కడుపులో చల్ల కదలకుంటా పనిచేసుకోవచ్చని, నెలతిరిగే సరికి జీతం వస్త

Published: Mon,October 10, 2011 11:22 PM

కాలం వంతెన పై కవాతు..!

మీకు కోదాటి సుధీర్ గురించి చెప్పాలి. ప్రస్తుతం కెనడా రాజధాని ఒట్టా వాలో నివసిస్తోన్న సుధీర్ కొన్నేళ్లుగా తెలంగాణ కోసం తపస్సు చే

Published: Mon,September 26, 2011 11:06 PM

ఇపుడొక కొత్త ఆయుధం కావాలి..!

ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబోతోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంల

Published: Mon,September 19, 2011 11:09 PM

రజాకార్లు వస్తున్నరు..జర భద్రం..!

మనలో చాలా మందిమి రజాకార్ల గురించి వినడమే తప్ప చూడలేదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలంతా నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి భూస్వామ్

Published: Tue,September 13, 2011 12:05 AM

సమ్మె దెబ్బకు దిమ్మ తిరగాలి..

అమెరికాలో బోస్టన్ నగరంలో వెంకట్ మారోజు అనే మిత్రుడున్నాడు. అంతనొక వీర తెలంగాణవాది. వెంకట్ సొంతూరు వరంగల్ జిల్లా జనగా మ. ఉస్మానియా

Published: Tue,September 6, 2011 12:11 AM

వో సుబహ్ కభీ థో ఆయేగీ...!?

దాదాపు నూటా పదిహేనేళ్ల క్రితం ఒక ఆదివాసీ యువకుడు అప్పటి బ్రిటీష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాడు. అప్పటికి సరిగ్గా ఇరవైయ్యేళ్లు కూడ

Published: Sun,October 23, 2011 01:52 PM

పౌర సమాజం.. పజలు.. ప్రజాస్వామ్యం!

పొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు అనుకున్నట్టుగానే జరిగింది. భారత పార్లమెంటు అసాధారణ రీతిలో బాబూరావు హజారే అలియాస్ అన్నా హజ

Published: Mon,August 22, 2011 11:18 PM

అన్నా ..అవినీతి..మనం

పెద్ద పెద్ద త్యాగాలతో పనిలేకుండానే వారం రోజుల్లో విప్లవం తేవచ్చన్న సంగతి అన్నా హజారే చెప్పేదాకా మన దేశంలో ఎవరికీ తెలియలేదు. ఔను! అ

Published: Tue,August 16, 2011 05:32 PM

తెలంగాణకు ఇంక తెల్లారనే లేదు..!

పొ. ఘంటా చక్రపాణి (సామాజిక పరిశోధకులు) భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడా

Published: Tue,August 2, 2011 03:33 PM

నాటి దోషి-నేటి ద్రోహులు

వర్తమానం కంటే చరిత్రే చాలా సార్లు ఘనంగా కనిపిస్తుంది. చరిత్రలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠాలు ఉంటాయి. అందుకే భవిష్యత్ గురించి ఆలో

Published: Thu,July 28, 2011 07:32 PM

బలిదానం తప్ప మరి దారే లేదా?

బొంబాయిలో ఉండే సంగమేశ్వర్‌రావు గారికి తెలంగాణ అంటే పంచ ప్రాణా లు. అతను ఇంజనీర్‌గా వృత్తిరీత్యా అక్కడున్నాడు గానీ, ఆయన ప్రతిక్షణం త

Published: Tue,July 19, 2011 04:25 AM

తెగేదాకా లాగడమే మేలు..!

-ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు ఇప్పుడు ప్రజలతో కలిసి నడవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, పార్టీలది. రాజీనామా చేసిన వాళ్లను ము

Published: Wed,July 27, 2011 09:15 PM

వారు సరిహద్దులు గీస్తున్నారు..

ప్రజాస్వామికంగా, రాజ్యాంగబద్ధంగా మనం ఈ రాష్ట్రపు సరిహద్దులు పునర్‌నిర్దేశించమని అడిగితే భారత ప్రభుత్వం మనపైకి సరిహద్దులలో ఉండాల్సి

Published: Wed,July 27, 2011 09:27 PM

ఉమ్మడిగా ఉద్యమిద్దాం

పొ. ఘంటాచక్షికపాణి (సామాజిక పరిశోధకులు) ‘ఘంటా’ పథం పాలకవర్గంలో ఉన్న ఒక ప్రతినిధి రాజీనామా చేయడమంటే బాధ్యత నుంచి పారిపోవడం

Published: Wed,July 27, 2011 09:21 PM

మన తరం మార్గదర్శి

ప్రొ. ఘంటా చక్రపాణి సామాజిక పరిశోధకులు ఎంతోమంది మనుషులు, జీవితంలో ఎన్నో మార్గాల్లో నడుస్తారు. అవసరాన్ని బట్టి, అననుకూల పరిస్థి

Featured Articles